నీ ప్రేమ వొక భూటకం
నీ భుక్తి కోసం నువ్వాడిన వొక నాటకం
ఆదాయం ఆపగానే ముసుగు తీసేశావు
అనుక్షణం విసుగుని ప్రదర్శించావు
పొమ్మన లేక పొగ బెట్టావు
నేను ఉక్కిరి బిక్కిరి అయ్యి నిష్క్రమించగానే
కొత్త వనరుల్ని అన్వేషించి వల వేసావు .
నా స్థానంలో యింకో ప్రేమ పిపాసిని భందిన్చావు .
అసలు ఎందుకు కలిసావు ?నన్నెందుకు నలిపేసావు ?
నా కంటే ముందే నీ చేతిలో బలి అయిపోయారని తెలిసినా
నేను అలా కానేమో అనుకున్నా .
నీ తిరస్కారానికి వక్రభాష్యం చెప్పుకుని
లేని ప్రేమని ఉందనుకుని బ్రమించుకుని
పిచ్చి పట్టిన బ్రమరం లా
విషం నింపుకున్న పుష్పం లో తేటి కోసం వేట కి వచ్చి
నీ విషపు కోరల ధాటికి విల విలలాడి నీ వేటు కి గురి అయ్యి
రెక్కలు తెగి దిక్కులు తోచక శూన్యం లోకి పయనిస్తున్నా.
మొగలి పువ్వుల పరిమళం నీ ప్రేమ అనుకున్నా
దాని వెనక కాల నాగు కాటు ని కూడా హాలాహలం లా
మింగొచ్చు అనుకున్నా .
విషం తలకేక్కాక గాని తెలిలేదు నువ్వు వొక విష వనిత అని.
నీ ప్రేమ నీకొక వ్యాపారం
దానికి మీ యింట్లో వాళ్ళ సహకారం
నీ కలల కి అదే సాకారం
బలి అయిన వాడి కంట్లో మాత్రం కారం .
మధ్యలోనే తెలుసుకుని బయటపడడం
దేవుడిచ్చిన వరం .