16 సెప్టెం, 2013

నీ ప్రేమ వొక వ్యాపారం


 

 
నీ ప్రేమ వొక భూటకం
నీ భుక్తి కోసం నువ్వాడిన  వొక నాటకం
ఆదాయం ఆపగానే ముసుగు తీసేశావు
అనుక్షణం విసుగుని ప్రదర్శించావు
పొమ్మన లేక పొగ బెట్టావు
నేను ఉక్కిరి బిక్కిరి అయ్యి నిష్క్రమించగానే
కొత్త వనరుల్ని అన్వేషించి వల వేసావు .
నా స్థానంలో యింకో ప్రేమ పిపాసిని భందిన్చావు .
అసలు ఎందుకు కలిసావు ?నన్నెందుకు నలిపేసావు ?
నా కంటే ముందే నీ చేతిలో బలి అయిపోయారని తెలిసినా
నేను అలా కానేమో అనుకున్నా .
నీ తిరస్కారానికి వక్రభాష్యం చెప్పుకుని
లేని ప్రేమని ఉందనుకుని బ్రమించుకుని
పిచ్చి పట్టిన బ్రమరం లా
విషం నింపుకున్న  పుష్పం లో తేటి కోసం వేట కి వచ్చి
నీ విషపు కోరల ధాటికి విల విలలాడి నీ వేటు కి గురి అయ్యి
 రెక్కలు తెగి దిక్కులు తోచక శూన్యం లోకి పయనిస్తున్నా.
మొగలి పువ్వుల పరిమళం నీ ప్రేమ అనుకున్నా
దాని వెనక కాల నాగు కాటు ని కూడా  హాలాహలం లా
మింగొచ్చు  అనుకున్నా .
విషం తలకేక్కాక గాని తెలిలేదు నువ్వు వొక విష వనిత అని.
నీ ప్రేమ నీకొక వ్యాపారం
దానికి మీ యింట్లో వాళ్ళ సహకారం
నీ కలల  కి అదే సాకారం
బలి  అయిన వాడి కంట్లో మాత్రం కారం .
మధ్యలోనే తెలుసుకుని బయటపడడం
దేవుడిచ్చిన వరం .


6 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మోహంలో పది మొహం పగలగోట్టుకున్నాక కాని తెలియదు .. దేవుడు ఇచ్చిన వరం ఏమిటో.. :)

బావుందండి . ఆడవాళ్లే కాదు మగవారు కూడా ఇలా వ్రాయగాలరన్నమాట..అదే మోసం గురించి .

Unknown చెప్పారు...

మోహం అయితే మొహం మొత్తాక మర్చిపోగలం .

గుండెల్లో ప్రేమని నింపుకుంటే ఎవరు చెప్పినా మర్చిపోలేం .

వాళ్ళు మాత్రం అన్ని మర్చిపోయి వాళ్ళ జీవితం హాయ్ గా గడిపేస్తూ వుంటారు

యిక్కడ భాధ మాత్రం నిజం గా ప్రేమించిన హృదయానికే .

కాలమనే గాలానికి చిక్కి కొన్నాళ్ళకి వాళ్ళని గుండె లోతుల్లో నిక్షిప్తం చేసుకోవడం తప్ప

మనం చెయ్య గలిగేది ఏమి లేదు వనజ గారు .

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా రాశారు. పదిరోజులు పెన్ను పట్టుకొని కూచొని ప్రయత్నించినా ఇటువంటి కవిత్వం లో ఒక్క లైన్ రాయలేను. సాధారణం గా మోస పోయాను, దగ చేశావు అంట్టూ సోది కథలు రాసే సోదరిమణులు కథలలో వాపోతూంటారు. మీరు స్రీ రచయితలతో పోటిపడుతూ పురుషులు కూడా సానుభూతిని పాఠకులలో రెక్కెతించే విధంగా సోది కవిత్వం రాయగలరని నిరూపించారు. ఎంత సోది కవిత్వం రాస్తే అంత స్రీ పాఠకులను ఆకట్టుకోవచ్చు.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

బాటిళ్ళ కొద్ది ప్రేమలు
ఫోటోలో కానుపించి ముచ్చట గొలిపెన్
బూటకములు ప్రేమాయణ
నాటకములు కామ జనిత నవ పైత్యమ్ముల్

Unknown చెప్పారు...

అజ్ఞాత వొకరి బాధ వేరొకరికి సోద లాగే కనిపిస్తుంది .పది రోజులు పెన్ను పట్టుకోనక్కర లెద్దు ,మీరు మనస్పూర్తిగా ప్రేమించిన అమ్మాయి మరో పదిమందిని కుడా ప్రేమిస్తోందని తెలిసిన మరుక్షణం కవితలు అవే వస్తాయి.
రావు గారు ప్రతి ప్రేమ వెనక అంతర్లినం గా కామం ఉంటుందేమో ?