''మీ రోగం తగ్గిందా?మీ వైరస్ పోయిందా?చాలా కాలం పాటు మీరు బ్లాగ్ లో ఏమి రాయక పొతే పోయారేమో ?అనుకున్నాం (బ్లాగ్ లోంచి అనుకుంటా )''మొన్నొక రోజు ఆఫీసు లో ఏదో మీటింగ్ లో వుంటే వొక బ్లాగ్ అభిమాని ఫోన్ . అబ్బే అంతా వొకే నో ప్రోబ్లం , య య అంతకంటే స్టాఫ్ ముందు ఏమి మాట్లాడ లేక పోయా . అయి విల్ కాల్ యు బ్యాక్ అనడం తప్ప . అంటే ఆమె లా ఆలోచిస్తూ'' పాపం కాలాల ఎనకాల రవిగారు వుండేవారు . కాల గర్భం లో కలిసిపోయారు . అందుకే ఆయన కలం మూగ బోయింది '' అనుకునే అందరికి తెలియ పరచడం కోసమన్నా కొంచెం తీరక తీసుకుని బ్లాగ్ బండిని ముందుకు నడిపించాలని యిలా ఈరోజు ముందుకు వచ్చా .
బ్లాగ్ లో భాగోతాలు తెలుసుకునే సమయం చిక్కటం లేదో లేక అంతకు మించిన భాగోతాలలో ములిగి పోయానో నాకే తెలిటం లెదు. లేక వోకరిది ప్రేమ .'వేరొకరిది మోసం ఆ పైన విరహం యెంత సేపు యివే కధలు అందరి వ్యధలు .
మనకోసమే కన్నీరు నింపే ప్రియురాలు అనుకుంటే మనీ కోసమే పన్నీరు కురిపించే జవరాలు ,కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మనం యిచ్చే వరాలు వాటి పర్యవసానాలు , అసలు ఎందుకు ఈ వ్యసనాలు ?హాయ్ గా ఆసనాలు వేసుకుంటూ గుండె నిండా గాలి పీల్చుకుని గుండె ధైర్యం తో బతకక . బ్లాగ్ లో వొక యోగి అద్యాత్మికత తో ఆనందం పొందుతూ వొక్కసారి గా విరహ గీతాలు పాడుకుంటూ పాడు వాడు అయిపోగా లేంది నేను కాసేపు సుధ నుంచి బయట పడి వేరే వ్యధల్ని రాయలేనా?.
ఏమో రాయలేనేమో ?ప్రతి రచయితకి బుర్రలో కొన్ని పాత్రలు ఎప్పటికి స్తిర నివాసం ఏర్పరుచుకుని వాటి చుట్టూ పరిబ్రమింప చేసుకుంటాయి . అందుకే బూజు పట్టిన సుధని బయటకు తియ్యడమా లేక నా కంప్యూటర్ కి పట్టిన బూజు ని అలాగే వదిలేయ్యడమా ?అలా సాగి పోతున్న నాలోనా, ఇదేంటి యిలా కొత్త ఆలోచన, మనసే నాది మాటే నీది ఇదేం మాయో?
సిగ్నల్ పడడం తో కార్ కి బ్రేక్ పడింది నా ఆలోచనల తో పాటూ . యేవో రెండు కళ్ళు నన్ను తిక్షణం గా చూస్తునట్టు మనసు చెపితే తల పక్కకి పెట్టి చూసా . కార్ పక్కన ఆగిన బైక్ వెనకాల ఆమె నాకేసి చూస్తూ వొక చిరునవ్వు కూడా పడేసింది . నాకు నవ్వాలో నవ్వ కూడదో అర్ధం కాని స్తితిలో నవ్వి నవ్వనట్టు వొక నవ్వు పడేసా . అంటే తన సెల్ లో వొక ఫోటో తీసేసుకుని వెళ్లి పొయిన్ది. క్రేజీ అనుకుంటూ నేను కూడా రయ్యిమని దూసుకు పోయా . సుధా వాళ్ళ యింటి ముందు నుంచి పోతుంటే ,చత్త కుండీ చూడగానే ఆగి పోయే మున్సిపల్ బండి లా నా కార్ ఆగి పొయిన్ది. సరే చాల కాలం అయ్యిందని వాళ్ళింటికి వెళ్లి బెల్ కోట్టా . ఆశ్చర్యం మొట్ట మొదటి సారి యింట్లో వొంటరి గా దర్శనం యిచ్చింది ఎవరు లేకుండా . పలకరింపులు అయ్యయో లేదో బాత్ రూం లోంచి ఫ్లష్ లాగిన శబ్దం .
తట్టుకోలేకా ఎవరు అన్నా ?
అబ్బా నీకింకా ఈ బుద్ది పోలేదా ?రమేష్ అన్నయ్య మా వారి స్నేహితుడు . రెండు రోజులు ఈ ఊర్లో పని వుంటే వచ్చాడు .
అన్నయ్యా ?స్నేహితుడా ?మీ వారు వున్నప్పుడు అన్నయ్యా లేనప్పుడు స్నేహితుడా?
ఎహే నోర్ముసుకో నాకు మూడ్ వునప్పుడు స్నేహితుడు లేనప్పుడు అన్నయ్య . అయినా నీ లాగ సిగ్నల్ దగ్గర అమ్మాయిల్ని చూసుకుంటూ సొంగ కార్చుకునే రకం మాత్రం కాదులే .
నేను సిగ్నల్ దగ్గర సొంగ కార్చు కోవడం ఏంటి?
ఆమె తన ఐ ఫోన్ లో ఎవరో అమ్మాయి పేస్ బుక్ లో నేను కార్ లో సిగ్నల్ దగ్గర పళ్ళు యికిలిస్తున్న ఫోటో పెదాల నుంచి సొంగ కారు తునట్టు గా వున్నది చూపించింది . ఆ ఫోటో కింద సిగ్నల్ పడినా అమ్మాయిని చూస్తూ ముందుకు పోక ట్రాఫిక్ జాం చేసిన సొంగబాబు అని రాసి వున్ది. దానికి అప్పుడే ముప్పై లైక్స్ . కిందేమో ఇలాంటి ఎదవలు అన్ని చోట్లా వుంటారు . వీళ్ళ కళ్ళకి గుర్రానికి కట్టినట్టు కడితే పక్క చూపులు చూడరు అంటూ కామెంట్స్ .
నాకు నవ్వాలో ఏడవాలో తెలిలేదు . ఆమె అంతట ఆమె నవ్వి నా ఫోటో తీసేసుకుని దానికి చక్కగా సొంగ తగిలించి బైక్ మిద నుంచే పేస్ బుక్ లో పోస్ట్ చేసేసుకుని తమాషా చుస్తొన్ది. అది ట్రేండింగ్ లో చూసేసి సుధా అప్పుడే రెచ్చి పోతోంది . ఏవిటి ఈ విపరీత ధోరణి ?మగాడికి రక్షణ లేకుండా పోతోంది ఆదునిక యుగం లో . యింతలో నా సెల్ మోగింది . ఎవరోఆడ గొంతు .'' నేను ఇన్స్పెక్టర్ రాగిణి మాట్లాడుతున్నా షి టీం కెల్లి నువ్వు జరా నీ కార్ దగ్గరకైతే రా సిగ్నల్ దగ్గర పోరిలకి బీట్ కొడతావ్? అయిదు నిమిషాల్లో రాకుంటే నీ ఆడి యెడ వుంటాదో ఎరుకనా ?''
''ఆడనే వుండక్కా గిప్పుడే వస్తున్నా మస్తు పైసల్ తోని'' అని సెల్ పెట్టేసి నా బాచ్ మేట్ ఎస్పీ శిఫాలి కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పా . ఆమె నవ్వుని ఆపుకుంటూ మా వాళ్ళు చివరికి నిన్ను కూడా వదలటం లేదన్న మాట సరే నువ్వు కార్ దగ్గరికి వెళ్ళు అని అభయం యిచ్చింది . అప్పటికే కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చి'' జల్ది పదివేలు యిచ్చి కేసు లేకుండా చూసుకోరి మాడం కేసు రాస్తే ఖేల్ ఖాతం'' అంటున్నాడు .
యింతలో షకీలా లా వున్న రాగిణి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఎవరో అమ్మాయిని నా కాళ్ళ మీద పడేసి ''సార్ కి మాఫ్ చెయ్యమని అడుగు పెద్ద ఆఫీసర్ ని గిట్లా బద్నాం చేసి ఫోటోలు పెడతావ్ నీ య .''. బూతుని మింగేసి బూట్ల మీదకి తోసింది . నేను ఆమెని ''ఛి ఛి ఎవరీమె ఇదేంటి ?'' అంటూ ఆమె కేసి చూసి షాక్ తిన్నా . ఆమె కొన్ని నిమిషాల క్రితం సిగ్నల్ దగ్గర బైక్ మీద కుర్చుని నవ్వినామే . పేస్ బుక్ లో నా ఫోటో ని పెట్టినామే .
''ఛి ఛి సిగ్గులేదు ఎందుకు చేసావి పని ''. (ప్రేమనగర్ లో నాగేశ్వర రావు స్టైల్లో అడిగా ). ఆమె నన్ను చనువు గా జబ్బ పట్టుకుని పక్కకి తీసుకు వెళ్లి చెవిలో మెల్ల గా'' ఈ పోలీసులే డబ్బులకోసం యిలా చేయిస్తారు . మీరు కుడా గవర్నమంట్ లో పొజిషన్ లో వున్నారు కాబట్టి కధ అడ్డం తిరిగింది . నాకు రెండువేలు బొక్క . వాళ్ళకి యెనిమిది.'' అంటూ చక చకా చీకటిలో కలిసి పొయిన్ది. దూరం గా కానిస్టేబుల్ నా కార్ డోర్ తీసి నిలబడి వున్నాడు . పైనుంచి సుధా వాళ్ళ ఆయన స్నేహితుడు వుర్ఫ్ అన్నయ్య భుజాలు భుజాలు రాసుకుంటూ మేడ పైనుంచి చూస్తున్నారు .
షకీలా ఉరఫ్ రాగిణి మత్తు కళ్ళతో ఎస్పి గారికి చెప్పకండి సార్ మీకు దావత్ యిస్తాను అంటోంది .
కార్ స్టార్ట్ చేసుకుని యింటి ముఖం పట్టాను . సిగ్నల్ రెడ్ చూపిస్తోంది . పక్కన బైక్ ఆగింది . మనసు ఎవరో నన్ను చూసి నవ్వుతునట్టుగా చెబుతోంది . అయినా నా కళ్ళు మాత్రం రెడ్ మీదే గ్రీన్ కోసం ఆత్రం గా. పక్క కార్ వాడిని ఆమె సెల్ లో భందించడం నా దృష్టిని దాటి పోలేదు . రెడ్ సిగ్నల్ నిజం గా రెడ్ సిగ్నల్.
2 కామెంట్‌లు:
Just curious,
Are you in Telangana Govt or Hyderabad Govt?
neither.
కామెంట్‌ను పోస్ట్ చేయండి