వుద్యోగం ,ఇల్లు ,ఇల్లాలు అనుకుంటూ బతికా మొన్నటి దాకా . ఎప్పటి కి అలానే ఉంటుందని నమ్మకం గా వుండే వాణ్ణి . ప్రభుత్వం లో ప్రజలకి బాగా అవసరం పడే హోదా లో వున్న వుద్యోగం అవడం చేత రోజు ఎంతో మంది అపరిచితులు కలుస్తున్తారు. ఫోన్ లో మాట్లాడుతూ వున్తారు. ఆ రోజు ఆఫీసు కి వెళ్ళిన పది నిమిషాలకే వొక తీయని స్వరం నా హృదయాన్ని తాకింది . ఎంతో చనువు గా ఎప్పటి నుంచో పరిచయం వున్నా దానిలా పేరు పెట్టి మాట్లాడేస్తూ మనిద్దరం సివిల్స్ లో బాచ్ మేట్స్ , ఆ చనువు తోనే నాకి పని కావాలి చేసి పెట్టు అనడం తో చక చక చేసేసాను . మర్నాడు థాంక్స్ గివింగ్ ఫోన్ ఆ మర్నాడు సెల్ ఫోన్ నంబర్స్ మార్పిడి . అప్పటి నుంచి ఆమె ఎస్ ఏం ఎస్ సందేశాలు . ముందు కేళ్లాలా వద్దా ?అని నా లో సందేహాలు .. మనకి ఏ దురుద్దేశం లేనప్పుడు స్పందిస్తే పోయేదేముంది పది పైసలు తప్ప అని కొన్ని మీటలు సెల్ లోవి నొక్కి పారేసాను . వొక అర్ద రాత్రి వాళ్ళ శ్రీమతి పడుకుందని నిర్దారించు కున్నాక . దూరం గా తీతువు పిట్ట అరిచింది రాబోయే ఉప ద్రవానికి సూచనా గా . రాత్రంతా యిరు పక్కల సందేశాలు పోతూనే వున్నాయి భాగ స్వాముల గురక సాక్షిగా . నాలుగు రోజులు సెల్ వదల కుండా ఆఫీసు లో మాట్లాడం తో నలుగురికి కుడా అనుమానం వచ్చి ఫైల్స్ పెట్టేసి ముసి ముసి గా నవ్వుకుంటూ పోతున్నారు . యిది వరకు రోజుల్లో అయితే అలాగాని పెట్టేసి వెళ్లి పొతే క్విక్ డిస్పోసల్ నా సిద్దాంతం . అంటూ అప్పటి కప్పుడు అందులో విషయాన్ని డీలర్ తో డిస్కస్ చేసి ప్రభుత్వా సమయాన్ని వృధా చెయ్య కూడదు అంటూ ఫైల్ మీద ఆర్డర్స్ పాస్ చేసిన వ్యక్తీని. , యిప్పుడు ఎవరన్నా ఫైల్ పెట్టి యింకా అక్కడే వుంటే వెంటనే విసుగు కుంటూ నన్ను ఫైల్ క్షున్నం గా చదువు కొనిండి అంటూ పంపేస్తున్నాను ''యింక నిన్ను చూడ కుండా వుండడం నా వల్ల కాదు , నేనిప్పుడే మీ ఆఫీసు కి వస్తున్నా వేడి గాఏదన్నా సిద్దం గా ఉంచు తాగి పోతా'' అంటూ ఆమె చొరవ గా అనేసి సెల్ పెట్టేసింది . నా గుండెల్లో రైళ్ళు పరిగెదుతున్నయి. అసలు ఆమె ఎలా వుంటుందో ?నా బాచ్ లో అసలు ఆడ వాళ్ళే లేరు .యీమె ఎవర్ని చూసి ఎవరనుకుని యింత చొరవ తీసుకుంటోందో ?యిలా ఆలోచనల తో సతమవుతూ వుంటే ప్యూను తలుపు తీసుకుని విసిటింగ్ కార్డు పెట్టేసి వెళ్లి పోయాడు . నళిని నాయక్ , డిప్యూటీ కమీషనర్ అంటూ డిపార్టుమెంటు పేరు అడ్రెస్స్ రాసి వున్ది. గుండె వేగం గా కొట్టుకుంటూ వుంటే బెల్ కొట్టి రమ్మను అన్నా . డోర్ నాక్ చేసి మే అయి కమిన్ ?అంటూ ముగ్ద మనోహరం గా వున్నా వొక ముగ్ద చిరునవ్వుతో నిల బడి వుంది . అప్రయత్నం గా నేను కుర్చీ లోంచి లేచి నిలబడి ముందుకు వంగి చెయ్యి అందిస్తూ ప్లీజ్ అన్నా'ఆమె కూడా నమస్కారం అంటూ తిరస్కర లక్షణాలు చూపించ కుండా సుతి మెత్త గా నా చెయ్యి పట్టుకుంది . కళ్ళు కళ్ళు కలిసాయి. మౌనం రాజ్యం ఏలింది .పరోక్షం లో ప్రవాహం లా సాగిన మాటలు ప్రత్యక్షం లోఆనకట్ట లో బందీ అయిన నది లా అయిపోయాయి . నేనే ఐస్ ని బ్రేక్ చేస్తూ నేను మీరనుకుంటున్న వ్యక్తీ ని కాదనుకుంటా
, నా సీనియర్ వొకరు నా పేరు తోనే వుంటారు బహుసా నా పేరు చూసి అతననుకొని పొర బడి వుంటారు అన్నాడు.
మొదట్లో పొర బడిన మాట వాస్తవమే గాని తర్వాత మీ మాటలు , మీ సబ్యత నను కట్టి పడేసాయి . పరిచయం అయిన పదినిమిశాలకే మళ్లీ మనం ఏకాంతం లో ఎప్పుడు కలుస్తున్నాం?అని అడిగే మగ మృగాలు వున్న సమాజం లో మీరు తులసి మొక్క లా కని పించారు . అందుకే మీ కభ్యంతరం లేక పొతే యిది కోన సాగించాలని అనుకుంటున్నాను .
నా మౌనాన్ని అంగీకారం గా భావించుకుని , వేడి వేడి కాఫీ ని లాగించేసుకుని ,వెళుతూ వెళుతూ మత్తైన ,గమ్మత్తైన చిరునవ్వుని విసిరేసుకుని అప్పటికి సెలవు తీసుకుంది . అప్పటి నుంచి నా జీవతం మొత్తం మారి పోయింది
.'' రేపు నా పుట్టిన రోజు ,మీకు మాత్రమే లంచ్ మా గెస్ట్ హౌస్ లో ,ఏ వంకలు పెట్టకుండా మీ కార్ ని మీరే డ్రైవ్ చేస్తూ వచ్చెయ్యండి అడ్రెస్స్ ఎస్ ఏం ఎస్ చేస్తున్నా''అంటూ నన్ను మాట్లాడ నీయకుండా సెల్ పెట్టేసింది.
మర్నాడు శనివారం కావడం తో రిలాటివేలీ ఫ్రీ . అయినా యిప్పుడు అవసరమా?ప్రశాంతం గా సాగిపోతున్న జీవితం లో అడుసు తొక్కనేలా?కాలు కడగ నేలా ?అదేంటి ఈ ఆలోచన?భోజనానికి గా వెళ్ళేది?అక్రమంగా ఆలోచన ఎందుకు? తన ప్రమేయం లేకుండా తప్పు చేసే ప్రసక్తే లేదు . సో నన్ను నేను పరీక్షించు కోవడం కోసమన్నా వెళ్లి తీరాలి. అనుకుంటూ కారు తీశాను . అడ్రెస్స్ కని పెట్టడం పెద్ద కష్టం కాలేదు . జూబ్లీహిల్స్ లో లోపలకి దూరం గా విసిరేసినట్టు జనసంచారానికి సంభంధం లేనట్లుగా వుంది. గేట్ ముందు కు వచ్చి హార్న్ కొడదామనుకునే లోపు ఆమె నే గేట్ తీస్తూ స్వాగతం పలుకుతోంది. మా వాచ్మాన్ ని వాడి పెళ్ళాం తో సహా సినిమా చూసి హోటల్ లో భోజనం చేసి రమన్నా , సో రాత్రి వరకు మనల్ని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు రండి అంటూ చనువు గా చెయ్యి పట్టుకుని లోపలకి తీసుకుని వెళ్లి డోర్ వేసేసింది.
''ఈ సారీ లో నే ఎలా వున్నాను?''
''వేసుకోనట్టే వున్నారు'' అప్రయత్నం గా మనసులో మాట బయటకి వచ్చేసి నాలుక కరుచు కున్నా . అబ్బో మీలో ఈ కోణం కూడా ఉందా?ఎప్పుడు పరిధి దాటి మాట్లాడక పొతే ''పనికి '' రారు అనుకున్నా ఆమె విసురుగా యిచ్చిన ఆ రియాక్షన్ కి ఏమనాలో తేలిక మీ రేమన్న'' పనికి ఆహార పధకం ''పెట్టారా కొంపతీసి?అన్నా. అబ్బో మాటకారి రండి మీ ఆకలి తీర్చాలి కొసరి కొసరి వడ్డిస్తూ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకి దారి తీసింది.
యిద్దరం కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆమె వడ్డించే మిషతో చాలా చోట్ల తాకడం యాదృచ్ఛికమే అనుకోవడం నా శీలానికి శ్రేయస్కరం . ద్రుష్టి పదార్ధాల మీద నిలపడం తో నా ఆకలి తీరుతోంది అదే ఆమె మీద పెడితే ఆకలి పెరుగుతోంది సో తలవంచుకుని లంచ్ అయ్యిందని పించా.
సోఫా మీద తాను దగ్గర గా వచ్చి కూర్చుని నా భుజం మీద తల పెట్టుకుని ఏదో ప్రేమ గా మాట్లాడుతోంది. ఆమె శరీరం లో వంపుసొంపులు నా చేతుల మధ్య ఇమిడి పోయాయి. సభ్యత సంస్కారం నా వేళ్ళని కట్టేశాయి. ఇంతలో నా లో లోపలి మనిషి బయటకు వచ్చాడు. ''ఓ రేయి గొట్టం ఆమె కి ఏ ఇంటరెస్ట్ లేకపోతె నిన్నే ఎందుకు లంచ్ కి పిలుస్తుంది. పైగా వాచ్మాన్ ని పెళ్ళాం తో సహా బయటకు ఎందుకు పంపిస్తుంది. అందాలు బహిర్గతం అయ్యేలా ఆ పలచటి సారీ ఎందుకు కడుతుంది?వడ్డించే అప్పుడు వళ్ళు వంచి మరి ఎందుకు కొసరి కొసరి తినిపిస్తుంది?యిప్పుడుఇంత దగ్గర గా అతుక్కు పోయి కూర్చుంటే ఆమె అసభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తుందో అర్ధం చేసుకోలేని చవట పో కార్యోన్ముకుడవై ముందుకు సాగి పో . పిడికిలి విప్పు . సిగ్గెందు కింకా ముగ్గు లో దిగాక?'' నడుము మీంచి చెయ్యి ఏ దిశగా వెళ్లిందో తెలుసు కునే లోపు ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు అనుకంటూ ఆమె ని ఆక్రమించడమే గుర్తు. ఆమె మాత్రం అదేదో సినిమాలో శృతిహాసన్ లాగ మొఖం లో ఏ మాత్రం హావ భావ విన్యాసాలు లేకుండా కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ వుండింది. అరగంటలో జ్వాలా ఆరిపోవడం బయట వర్షం వురమడం ఓకే సారి జరిగి పోయాయి. నేను తప్పు చేసిన భావం తో లేచి నిలబడ్డా .
ఆమె విసురుగా వెళ్లి బెడ్ రూమ్ తలుపు వేసుకుని బోల్ట్ పెట్టేసుకుంది. వాస్తవం కళ్ళ ముందు నిలిచింది . కర్తవ్యం బోధ పడింది. వెళ్లి తలుపు తట్టి'' ప్లీజు ఐ ఆమ్ సారీ నా ఉద్దేశం అస్సలు అది కాదు ఏదో అలా అనుకోకుండా జరిగి పోయింది . తలుపు తియ్యి ఇంకెప్పుడు యిలా చెయ్యను. '' ప్రార్థిస్తూ అడిగా . అటు పక్క మౌనం ఆ తర్వాత ఏడుపు ''ఛీ కలలో కూడా నువ్వు అందరి మగాళ్ల లాగే అనుకోలేదు. మబ్బులో మల్లె తోట అనుకున్నా . నా అంచనా తప్పైతే ఆత్మహత్య చేసుకోవాలని ముందే అనుకున్నా ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావో అప్పుడే నే చని పోయా, యిప్పుడు కేవలం ఈ కట్టే మాత్రమే చచ్చి పోతుంది. మగాళ్లు కాదురా మీరంతా మదం లోపల దాచుకుని కల్లా బొల్లి మాటలతో మభ్య పెట్టె మృగాళ్లు . ప్రపంచం లో ఆడ మగ మధ్య ప్రేమ లేదు అవసరాలే కలిపి వుంచు తున్నాయి. ఆకలి చూపులు, ఆర్ధిక అవసరాలు యివేరా కట్టి పడేసేవి. ప్రేమలు కానే కాదు దీనికేనా నా భర్త పిల్లని వదిలేసి ఇక్కడకి వచ్చింది?నా కు తగిన శాస్తి అయ్యింది నే పోతా ''
యింక అంతే అటు పక్కనుంచి మౌనం. తలుపులు బాదుతున్నా స్పందన లేదు . అటుపక్కకి పోయి కిటికీ తలుపు తోసి చూసి కొయ్య బారి పోయా. ఆమె సీలింగ్ ఫ్యాన్ కి చీర తో ఉరి వేసుకుని వేలాడుతోంది. నాలిక బయటకు వచ్చేసింది కళ్ళు పొడుచుకుని చూస్తున్నట్టు గా వుంది. అంతకు పది నిమిషాల క్రితం రంభ లా కనిపించిన ఆమె యిప్పుడు రాక్షసి లా కనబడుతోంది . నా కక్కుర్తి కి తగిన మూల్యం చెల్లించు కున్నా . యిప్పుడు పోలీసులు, ఎలక్ట్రానిక్ మీడియా. ఆమె రేపుకు ఎన్ని గంటలకి గురి అయ్యింది ఈ మృగాడి తో పాటు యెంత మంది వున్నారు వాళ్ళు ఎలా తప్పించు కున్నారు?వాచ్మాన్ కి సినిమాకి డబ్బులు ఎవరు యిచ్చారు?ఆమె వాళ్ళ భర్త కి షేర్ చేసిన లొకేషన్ అసలు ఇదేనా?లేక ప్రభుత్వాధి కారి గా మదం ఎక్కి ఎప్పుడు వెళ్ళే ఆ ఫైవ్ స్టార్ హోటల్ దా ?ఆమె పాంటీ మీద వున్న ఆ మరకలు ఏంటి?యింతకు ముందు ఈ సారు చేసిన రాసలీలలు బయట పడకుండా ఎలా మేనేజ్ చేశారు?ఇత్యాది ప్రశ్నల తో ప్రతి ఛానల్ నన్ను అమ్మేసు కుంటారు. ఆ వెదవ లోపల మనిషి లోపల నోరుమూసుకుని పడుకోకుండా తగుదునమ్మా అని వచ్చి ఆక్రమించు కోకుండా ఉంటే యెంత బావుణ్ణు?యిప్పుడు పరువు పదవి పరుపు (పడుకోడానికి లెండి)అన్ని పోయాయి.
మళ్ళి తలుపు దడ దడ మోగుతోంది. ఏమండీ , ఏమండీ వాచ్మాన్ వైఫ్ అనుకుంటా? తలుపు తీసి చుస్తే నా శ్రీమతి. అదేంటి ఈ వేళ మీ బాస్ తో బయట లంచ్ అన్నారు ఇంతకీ యింట్లో వండి చ్చాలా వద్దా ? తొమ్మిది అయినా లేవక పొతే లేప వలసివచ్చింది. నా ఆనందానికి అవధులు లెవ్. అంటే యిదంతా ఆ టీవీ లో ఉదర గొట్టే శిరీష ఎఫెక్ట్ అన్నమాట . ఏ ఆడ పిల్ల మాట్లాడినా భయం కోల్పే ఆలోచనలే . పోనిలే బతికించాడు భగవంతుడు ఈ శిరీష ఎఫెక్ట్ మగాళ్ల మీద యింకో సంవత్సరం అన్నా ఉంటుంది అని అనుకుంటూ ఆబ్బె లంచ్ యింట్లోనే మా బాస్ కి వంట్లో బావుండక లంచ్ కేన్సెల్ల్డ్ అని మెసేజీ పెట్టాడు అనుకుంటూ సెల్ తీసుకుని బాత్ రూమ్ లోకి దూరా . ఫస్ట్ మెసేజ్ ఆమె ది . నీ కోసం విందు భోజనం తో వెయిటింగ్ అని .
''మరిన్ని పుట్టిన రోజులు నువ్వు జరుపుకోవాలని ఆశిస్తూ నా లోపలి మనిషిని నమ్మ లేని పరిస్థితులలో విందు కు స్వస్తి . నీ ఊహల లోనే నేను, నీ ఊపిరి మాత్రం కాలేను'' అని పంపేసి వెంటనే డిలీట్ చేసేసి ఫ్లష్ లాగి జనజీవన స్రవంతి లోకి అడుగు పెట్టటానికి బయట కొచ్చా.
1 కామెంట్:
కామెంట్‌ను పోస్ట్ చేయండి