25 డిసెం, 2008

మన 'సంత' బ్లాగర్సే '

ఈ రోజు మంచి రోజు మరుపురానిది . మధురమైనది ప్రేమ సుమం ఉదయించిన రోజు.ఇదేదో christmes సందర్భంగా నే పాడు కుంటున్న పాట కాదండి,మన stallanta ఈ రోజు బ్లాగేర్సే బ్లాగేర్స్.ఇక్కడ పేర్లు రాయడం మొదలెడితే ప్లేస్ చాలదు. తెలుగు బ్లాగేర్స్ లో దిగ్గజలంతా అక్కడే{అంటే నేను కూడా ఉన్నానని గమనించ గలరు}.పుస్తకాల సంత లో మహా సందడి గా కనిపించిన స్టాల్ ఈ తెలుగు దే అని గర్వం గా చెప్పుకోవచ్చు.ఒక పక్క నిరంతరం గా వస్తున్న సందర్సకులకి సమాధానం చెపుతూ గల గల మాట్లాడుకోవడం జరిగింది.నే వెళ్ళేటప్పటికే విరజాజుల పరిమళాలు వెదజల్లుతూ విరజాజి గారు , తల పంకిస్తూ తాడేపల్లి గారు ,సందర్శకులతో శ్రీధర్ గారు బిజీ గా కని పించారు.ఇంతలొ మనసులో మాట అంటు సుజాత గారు విచ్చేసారు. ముందు కొంచెం ముభావం గా వున్నా కొంత అలవాటు పడ్డాక బోల్డు సందడి చేసారు. ఈ సందర్భం గా జరిగిన సందడిలో సందర్భాన్ని బట్టి రెండు titels నేను రిజర్వు చేసుకున్నా తర్వాత వాటి గురించి రాయడానికి. అవి ''పూర్ణం తినేసిన పూర్ణిమ'',''పరిగెత్తిన పద్మనాభం (గారు)''(ఫోటో కి అడ్డం గా లెండి )నాలుగు గంటలూ నాలుగు నిమిషాల్లా అయిపోయాయి.స్వాతి గారి సందడి చక్రవర్తి అలజడి అదో పెద్ద టీవీ సీరియల్ అవుతుంది.ఆఖర్న అరుణ గారు స్టాల్ కి అడ్డం గా ఎవరో ఆడమనిషి ఫోటో కి అడ్డంగా వస్తుంటే'' నువ్వు మనిషివా వా?బ్లాగర్ వా?''అని అడుగుతుంటే నేను రెచ్చి పోయి ఎన్నాళ్ళనుంచి సాగుతోంది ఈ యవ్వారం?అంటుంటే అందరం పగలబడి నవ్వుకుంటుంటే , నాకి తెలుగు వస్తది లేదు అంటు వెళ్లి పోయింది మేం బతికి పోయాం.జ్ఞాన ప్రసూనా గారిచ్చిన పూర్ణం బూరలు. జ్యోతి గారు తెచ్చిన సున్నున్దలనబడే రవ్వ లడ్డులు రమణి గారు వచేటప్పటికే ప్రమదావనం సభ్యులు వెళ్లి తెచ్చిన మిరపకాయ బజ్జీలు, చక్రవర్తి దంపతులు పంచిన పులిహోర వాయనం,మిగత బ్లాగేర్స్ చేసిన సందడి రాయాలంటే ముందింత తిని తీరికగా మళ్ళి రాయాలి. ఫోటోలకోసం సుజాత గారి బ్లాగ్ లోనో, జ్యోతి గారి బ్లాగలోనో, శ్రీధర్ గారు ఉందనే ఉన్నారు ఎవరో ఒకరు ఎపుడో అపుడు తియరా తలో ఫోటో ఆటో ఇటో.అందాకా ఇది చదువుకుని మిగతాది వూహించుకుని , ఫోటోస్ లో చూసి రానందుకు కన్నీళ్ళు రాల్చి , నడుము వాల్చా గలరు. సెలవు నమస్కారం చాల చక్కటి విషయాలు చెప్పా ఇప్పటికే.

11 కామెంట్‌లు:

Shiva Bandaru చెప్పారు...

funny

కొత్త పాళీ చెప్పారు...

సంతోషం అండీ.
మీ రచనలో అచ్చు తప్పులు చాలా వస్తున్నాయి, సరిచూడగలరు.

సుజాత వేల్పూరి చెప్పారు...

మొత్తానికి మీరు రిజిస్టర్ చేసుకున్న రెండు టైటిల్సూ ఇప్పుడే వాడేశారా? ఆ ఫొటోలు మాత్రం పెట్టలేదు నేను! అందరం ఫొటోలు తీశాం గాబట్టి మరి కొన్ని ఫొటోలు శ్రీధర్ గారి బ్లాగులో వస్తాయని ఊహించీ ముందుగా ఇంటికొచ్చి జస్ట్ కొన్ని ఫొటోలు రుచి చూపించానంతే!

తాడేపల్లి గారి మాటలు నిజంగా మంత్రాలే! కట్టుబడి పోయాను నేనైతే!

అజ్ఞాత చెప్పారు...

రవిగారూ ఫొటోలన్నీ చూసాకే ఇటొచ్చా
"పూర్ణిమ తిన్న పూర్ణాలా " పాపం మీకొక్కటీ పెట్టలేదా
అదేకదూ మీబాధ

Kathi Mahesh Kumar చెప్పారు...

I was there to witness all that..hahaha

Padmarpita చెప్పారు...

రవిగారు......మీరు రవ్వలడ్డు, పూర్ణాలు, పులిహోర తిన్నారని తెలిసి నోరూర్చడం తప్ప ఏమి చేయగలను చెప్పండి. ఈసారి నేను కూడా ఏదో ఒక వంటతో రెడీ.......సరేనా!

Unknown చెప్పారు...

శివ గారు నవ్వినందుకు thx.నా పాళి పాతదైనా, బ్లాగ్ లోకం లో కొత్తే అందుకే అచ్చు తప్పుల వల్ల తిప్పలు కొత్త పాళి గారు. అచ్చే తప్ప తప్పులు రాకుండా ప్రయత్నిస్తా.సుజాత గారు రుచి బానే వుంది ఇంక పదార్దాలు వడ్డించి విందు చెయ్యండి.లలితా గారు పుర్నాల ఆఖరి చూపు కూడా దక్క కుండా తినేసారు పూర్ణిమ.కత్తి గారు బ్లాగ్ లోనే కత్తి , మిగతా అప్పుడు వింటూనే వుంటారు జనాల సుత్తి.

జ్యోతి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

జ్యోతి బనే జ్వాల అంటే ఇదేనేమో?మనసు లో అంతా బ్లాగర్స్ అని , పుస్తకాల సంత లో బ్లాగేర్స్ అని రెండు విధాల అర్ధం వచ్చేలా రాసానే తప్ప అందులో మీరు వెతుకుతున్న అర్ధాలు లేవని గ్రహించ గలరు. ఇంక రెండో విషయం మీరు రవ్వ లడ్డులు అని ఇచ్చి వెళ్లి పోయాక దాని మీద చాలా చర్చ జరిగింది.అవి రవ్వలడ్డులైతే గరుకు గా వుండాలి గాని మెత్తగా వుండడం వల్ల సున్నున్దలేమో అని కాదు తెల్ల సున్నుందలని కొంత మంది ప్రమదావనం సభ్యులు అవి రవ్వలడ్డుకు అక్క సున్నుండ కి చెల్లి అని తీర్మానించారు. దానికి ఏం పేరు పెట్టిన రుచి అమోఘం గా వుందని అందరూ లొట్ట లేస్తూ లాగించారు. ఆ సందర్భంగా నేను అల రాయవలసి వచ్చిందే గాని పాక శాస్త్ర ప్రావిన్యురాలైన మీ విజ్ఞత ని సందేహించే సాహసం మాత్రం ఎవరు చెయ్యలేరని నేను నమ్మకం గా చెప్పగలను.

Ramani Rao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

రమణి గారు మీరు ఆవేశం లో నా వివరణ చూడ కుండానే పోస్ట్ చేసి నట్టు ఉన్నారు.మీ రోక్కసారి బ్లాగర్స్ దిగి వచ్చిన వేళ లో నా వివరణ , ఇంతకుముందే ఈ పోస్ట్ కి ఇచ్చిన వివరణ చదివితే మీ దురభి ప్రాయం పాటా పంచలవుతున్డి. సంత అంటే సందడి గా వుండే జన సమూహం అన్న వుద్దేశంతో వాడిందే గాని మిరనుకున్తునట్టు ఏవిటి ఈ సంత గోల అన్న ఉద్దేశం మాత్రం కాదు.ఇంక అన్ని విషయాల్లో మీరే పెద్దవారని గ్రూప్ ఫోటో చూసిన ఎవరికైనా అర్ధం అవుతుంది కాబట్టి మీరు చెప్ప గలిగేంత పెద్దవారే అందు లో సందేహం లేదు. మనం, మనం అన్ని నన్నుకూడా మీతో కలుపుకోవడం అన్యాయం .ఆ రోజు నేను నాలుగు గంటలకే వచ్చి వుడతా భక్తీ గా కొంత మదికైన చెప్పగలిగాను. ముఖ్యం గా ఆ ఫిల్మ్ డైరెక్టర్ తో మేమంతా ఇక్కడ ఎవరి ఉద్యోగాల్లో వారు లబ్ద ప్రతిస్టులై ఉండి కూడా కేవలం తెలుగు వాడకం కంప్యూటర్ లో పెంపొందించడం కోసం ఉచితం గా లభ్యమయ్యే సాఫ్ట్వేర్ గురించి ప్రచారం చేస్తున్నాము అంటే అయన అయ్యో సర్ నేనింకా ఇదేదో కొత్త సాఫ్ట్వేర్ అమ్ముకునే స్టాల్ అని భ్రమ పడ్డాను ,తప్పకుండ మా సర్కిల్ లో కూడా ప్రచారం చేస్తానన్నారు. ఇలా నేను సైతం ఏదో ఉడత భక్తి గా కొంత చేశాను. మీరు ఆ రోజు మరీ ఎనిమిది గంటలకి వచ్చి ఫోటో సెషన్ లో పాల్గొని అందర్నీ ఆ గాట కి కట్టడం మాత్రం అన్యాయం.ఇంక మిరపకాయ బజ్జీల టాపిక్ మొదలెట్టింది మీ పోస్ట్ లోనే గమనించ గలరు.రాసింది సరిగా అర్ధం చేసుకుంటే వాళ్ళ శ్రమని అర్ధం చేసుకోకుండా అన్న పదం వాడె వారు కాదేమో. వాళ్ళ శ్రమ గుర్తించ బట్టే ఒకరోజన్న దుర్వాసుల పద్మనాభం గార్ని వాళ్ళ ఇంటి దాక దిమ్పానన్న తృప్తి వుంది నాకు. ఆఖరి మాట బ్లాగర్స్ అందరు రాబట్టే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని చేపోచ్చు వచ్చిన వాళ్ళు అందరు డెమో లు ఇవ్వ వలసిన అవసరం లేదు వాళ్ళ ఉనికితో అ ప్రాంతాన్ని శోబిస్తే చాలు.ఇంక నా భాష లో బ్లాగ్గేర్స్ అన్నారు కరెక్ట్ స్పెల్లింగ్ ఇంగ్లీష్ లో కొడితే అలాగే blogspot లో తర్జుమా అవుతోంది సో నా తప్పు కానీ దాన్ని నాది గా అభిప్రాయ పడకండి.