28 డిసెం, 2008

బాలానందం స్మృతులు.

మా చినప్పుడు ఆదివారం రెండు నుంచి మూడు దాక బాలానందం చిన్న పిల్లల కార్యక్రమం వచ్చేది.రేడియో అక్కయ్య గా అప్పట్లో తురగ జానకి రాణి గారు నిర్వహించే వారు.అంతకు ముందు చాలాకాలం పాటు ఆంధ్ర బాలానందం సంఘం స్థాపించిన న్యాపతి రాఘవరావు దంపతులు నిర్వహించేవారు.అప్పట్లో ఆ కార్యక్రం లో పాల్గొనడం స్కూల్ లో మంచి గుర్తింపు తెచ్చి పెట్టేది.ప్రతి ఆదివారం విధి గా వెళ్ళడం ఒక పాటో.,కవితో, జోకో, ఎమిలేకపోతే ఒక ఉత్తరమో చదవడం జరిగేది.అప్పట్లో మేం విజయనగర కాలనీ లో ఉండడం తో 121 బస్ ఎక్కితే air దగ్గర స్టాప్. రోజు 12 గంటలకి అక్కడ చేరుకుని రేడియో అక్కయ్య సహాయకుల దగ్గర మా ప్రతిభ నిరూపించుకుని ఒక్క ఛాన్స్ కొట్టేవాళ్ళం.అలా రేగులేర్ గా వచ్చి ప్రతిభ గల వారికీ నాటకాల్లో ఛాన్స్ ఇచ్చే వారు.అప్పట్లో నేను, ఫణి సుందర్, సుబ్రమన్యెస్వరి,శ్రీనివాస మూర్తి మరికొంతమంది రేగులేర్ గా నాటకాల్లో వేసేవాల్లము.అప్పట్లో జరిగిన కొన్ని తమాషా సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి.రావూరి భరద్వాజ గారు కొన్నాళ్ళు రేడియో అన్నయ్య గా పనిచేసారు.అయన తన సహాయకుల మీద నమ్మకం తో సెలక్షన్ వాళ్ళ మీద వదిలేసేవారు. ఆ కార్యక్రమం అంతా సాధారణం గా లైవ్.ఒకబ్బాయి అజేయ హిందూ సంఘటనం ఆ జన్మాంతం మన లక్ష్యం అంటు పాడుతున్నాడు లైవ్ లో.అంతే రేడియో అనయ్య గుండె ఆగినంత పని అయ్యింది ఎందుకంటె అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వాళ్ళ పాట అప్పట్లో దాని మీద నిషిద్దం వుంది.వెంటనే ఆయన తమ్ముడికి జేజేలు చెప్పంద్ర అంటు నోరు ముసేసాడు అయన గాని ఆ పిల్లవాడు అయన చెయ్యి కొరికి మరీ నన్నాపకు నే పాడుతా అంటు రెచ్చి పోతున్నాడు. ఇదంతా లైవ్ లో వచ్చేస్తుంటే అయన అదికాదమ్మా ఇంక మిగత వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి గా టైం అయి పోతోంది జేజేలు జేజేలు అంటు గట్టి గా తప్పట్లు కొట్టి పక్కకి లాక్కుపోయారు.ఇంకోసారి నే పాడదామని వెళితే ఈ వారానికి ఉత్తరం చదువు అంటు వుత్తరం ఇచ్చారు. నేను ఇంటికి వెళ్లి న వెంటనే మా పేరెంట్స్ ని ఎలా పాడను ఎలా చేసనంటూ విసిగించే వాణ్ణి మొదట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ గా వినేవారు . ప్రతి వారం అంటే పనులు మానుకుని కష్టం కాబట్టి ఆ బావుంది అనేవారు వినకుండానే.ఆ ఉత్తరం చదివిన రోజు నే ఇంటికి వెళ్లి ఎలా పాడను అంటే అద్బుతం రా బాగా పాడావ్ అని మా అమ్మ గారు అంటుంటే అప్పుడు అర్ధం అయ్యింది వాళ్ళు వినటం లేదని. అప్పట్లో leotolstayi రాసిన tomsayer ధారావాహికం గా వచ్చేది అందులో ఫణి సుందర్ మంచి పేరు తెచ్చుకున్నాడు అది రికారేదే ప్రోగ్రమ్మే కాబట్టి తప్పు వొప్పులు సరిదిద్దుకునే అవకాశం వుండేది.ఒక సారి leonardo davency నాటకాన్ని రికార్డింగ్ టైం లేక లైవ్ లో వేస్తున్నాము . అందులో మెయిన్ పాత్ర నాదే. ఇది గాలిగుమ్మటం బొమ్మ దానికి రూపకల్పన చేస్తున్నాను అని నేనంటే ఇది నిజంగా గాలి లో విచ్చు కుంతుందా అని తర్వాత పాత్రధారి అనాలి దాని బదులు గా ఇది గాలిలో చచ్చి పోతుందా అని చదివేసాడు, వెంటనే నేను తేరుకుని గాలిలో చచ్చిపోకుండా కాపాడే సాధనం అని లేని డైలాగ్ చదివి గట్టేకించాను.ఇప్పట్లో గాయకుడి గా ప్రసిద్ది చెందిన రామాచారి మాతో పాటు పాడిన వాడె బాలానందం లో.
అప్పట్లో పిల్లలో creativity ని వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వుండేవి, అంతే గాని boddudani పిల్లల చేత డాన్స్ బేబీ డాన్స్ అంటు ద్వందర్దల పాటలకి టీవీ లో డాన్స్ లు అప్పట్లో లేవు అదృష్ట వశాత్తు.

13 వ్యాఖ్యలు:

ఉమాశంకర్ చెప్పారు...

రవి గారు,

మీ పోస్టు చదువుతుంటే నాకు ఇలాంటిదే ఇంకొక సంఘటన గుర్తుకొస్తున్నది.

అప్పట్లో దేష్ కీ నేతా అంటే రాజీవ్ గాంధి యే. ఆయన ప్రధాన మంత్రి గా ఉన్నప్పుదు ఇలానే ఒకానొక AIR కేంద్రం లో ఎవరో ఒకబ్బాయి "గలీ గలీ మే షోర్ హై, రాజీవ్ గాంధీ చోర్ హై" అన్నాడట. ఆ ప్రోగ్రాం డైరక్టరుని పాపం ఇంటికి పంపించేసారట.

అజ్ఞాత చెప్పారు...

అందరూ ఒకసారి ఘట్టిగా రవిగారికి జేజేలు చెప్పండమ్మా
అప్పట్లో చెప్పలేదని...............

రవిగారు చెప్పారు...

ఉమాశంకర్ గారు నిజమే అప్పుడు బోఫోర్స్ కుంభకోణం గొడవలు జరుగుతునప్పుడు ఈ ఘటన జరిగింది.మా అప్పుడు లక్కీ గా రేడియో అన్నయ్య అ కుర్రాడి నోరు మూసెయ్యడం తో బతికి పోయాడు .లలితా గారు మీ జేజేలు రాజముండ్రి నుంచి హేదేరాబాద్ దాక వినిపిస్తున్నాయి.ధన్యవాదాలు.

krishna rao jallipalli చెప్పారు...

ఇందిరా గాంది గారికి ఇష్టమైన emergency time లో కూడా ఇలానే జరిగిందని ఎక్కడో చదివాను. కాకపొతే అది ఒక pre-planned.

అజ్ఞాత చెప్పారు...

Ravi gaaru mee samayaspurti bagundandi......SUBBU

ushaa.raani చెప్పారు...

రవి గారు, కలగన్నానో, కలగన్నానని అనుకున్నానో, లేక నిజంగా వెళ్ళివచ్చానో గాని ఈ బాలానందం గుర్తులు, నే చదివిన ణారయణగూడా మాడపాటి హనుమంత రావు గరల్స్ స్కూల్ సాక్షిగా మాత్రం గోచరిస్తున్నాయి. మేము కొంత కాలానికి నాగార్జునసాగరుకి వెళ్ళిపోయినా బాగా రేడియోకి దగ్గిరగా, అదీ మా అన్నగాడి నస వినపడనంత చేరువగా కూర్చుని వినేవాళ్ళం ఈ బాలానందం కార్యక్రమం. అప్పట్లొ నాకు "పప్పా పాట పాడనా, మమ్మీ మాటాడనా,.." కరతలామలకం, ఇప్పుడు రెండో చరణం గుర్తుకిరావట్లేదు. అలాగే "ఎస్కిమోలా పిల్లలము, ఎంతో దూరం మా దేశం.." పాటాను.

2005 లో విడుదలైన "బాల (1945-1959) అపుడపుడు చదువుతుంటాను. ఇది న్యాయపతి రాఘవ దంపతులకి అర్పణగా వచ్చిన రచన. ఇదిగో ఎదురుగా వున్న ఆ సంపుటిలోని "ఎండని ఏడో చేప కథ" పుస్తకం చూస్తూ ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను.

సుజాత చెప్పారు...

బ్లాగర్లూ ఒక్కసారి రవి గారు గారికి జేజేలు చెప్పండమ్మా!

మీరు బాలవినోదంలో వచ్చే కంగారు మావయ్య, వెంగళప్ప గురించి ఇంకో పొస్టులో రాస్తారా మరి?

రాధిక చెప్పారు...

హా హా...జేజేలు చెప్పడం,చప్పట్లు కొట్టడం ఇంక చాలు అనడానికి సూచనగా చేస్తూవుంటాము ఇప్పటికీ :) నేనూ స్కూల్లో చదువుకునేటప్పుడు వార్షికోత్సవంలో శ్రీ రాముని గుడి కట్ట లేడెవడు అడ్డు పెట్ట అంటూ ఒక గేయనృత్యాన్ని చేసాము.తరువాత రెండు గంటలకి పోలీసులు వచ్చారు ఎవరు చేయించారంటూ.అప్పుడే తెలిసింది నాకు నేను చదివేది ఆర్ ఎస్ ఎస్ స్కూల్ అని.పెద్దవాళ్ళు కలగచేసుకోవడంతో పోలీసులు వెళ్ళిపోయారనుకోండి.

కొత్త పాళీ చెప్పారు...

మీ బాల్య స్మృతులకి జేజేలు.
sorry for nitpicking ..
"అప్పట్లో leotolstayi రాసిన tomsayer"???

సుజాత చెప్పారు...

ఉషా రాణి గారు,

అలకనంద పాడిన ఆ పాట్ ఇదిగో..నాకూ మొత్తం గుర్తు లేదు. కానీ వెదుకుతాను లెండి.

పప్పా పాట పాడనా, మమ్మీ మాటాడనా
అన్నా ఆటాడనా చెల్లీ కథ చెప్పనా


1.అమ్మా నాన్నా పల్లవి అన్నా చెల్లీ చరణాలు
నేనే ఈ పాటకు రాగం దీని భావం అనురాగం


2.నా మాటే ఒక పాట నా పలుకే పూల తోటా

ఆపైన గుర్తు లేదు.

అజ్ఞాత చెప్పారు...

cool!

ఉషారాణి చెప్పారు...

సుజాత గారు, అక్కడే అసలు చిక్కు వచ్చిపడిందండీ. నాకూ అంత వరకే గుర్తుంది. కాస్తా త్వరగా వెదికి పెట్టరూ? అగ్గిలో ఆజ్యంలా మీరు పాట గుర్తుకి రావటం లేదన్న బాధని మరీ పెంచేసారు :( తర్వాత వరసలో "తేనె, మూట, కోట" వస్తాయని లీలగా మాత్రం గుర్తుంది.

అజ్ఞాత చెప్పారు...

నీ బాల్యస్మృతికి జేజేలోయ్...... కానీ నన్ను అడక్కుండా రాస్తావా..... నీ బాల్యం గురించి కూడా నాకు చెప్పి నా పర్మిషనూ నా దోస్తానా శిష్యుడు కత్తిగాడి పర్మిషనూ తీసుకోవాలి..... జాగ్రత్తమ్మా సుజాతనొదులుతా ఎక్కువ నకరాల్జేస్తే......

-పుచ్చుపాళి