11 జన, 2009

దక్షిణాది లోనే బెస్ట్ .

గత అయిదు రోజులుగా అస్సాం ఆఫీసు పని మిద వెళ్ళడం తో అక్కడ శక్తి pithala లో ముఖ్యమైన కామక్య ఆలయం దర్శించడానికి వెళ్ళడం జరిగింది.అంతకు ముందు రోజే మేము బస చేసిన ప్రాంతానికి దగ్గర లోనే సైకిల్ బాంబు పేలి ముగ్గురు చని పోయారు.అందు చేత రష్ తక్కువ వుంటుందిలే అన్న ఉద్దేశం తో ఉదయం 7 గంటలకి వెళితే అప్పటికే జనరల్ క్యూఁ కొండవీటి చేంతాడంత వుంది.మా కాబ్ డ్రైవర్ ని అదేంటి అస్సాం లో వాళ్ళకి బాంబు భయం లేదా ?బాంబు పేలినా ఛా అవతలకి పో అంటు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంటే వాడు సర్ ఇంట్లో వున్నా చచ్చే టైం వస్తే ఎవడు ఆపలేడు, అది కాక నిత్యం బాంబులు పేలితే పనులాపుకుని చస్తారా?అన్నాడు . ఆలోచన విధానం లో మారుతున్న భారతం నాకు కని పించింది.చావుకి భయ పడేది లేదు ,మనం ఉన్నంతవరకు అది మన దరి చేరదు. అది వచ్చినప్పుడు మనం ఎలాగు వుండం.ఇంతకీ అసలు విషయానికి వస్తే ఆ గుడిలో కూడా మూడు రకల క్యూఁ లు కని పిస్తాయి. జనరల్ , ఆర్మీ వాళ్ళకోసం ఇంకోటి, 100 రూపాయిల ది మరొకటి.మనకి దక్షిణాది లో గుళ్ళల్లో అమ్మవారంటే నల్లటి నిండైన విగ్రహం కళ కలడుతూ చూడడం అలవాటు.మనం గంట రెండు గంటలు వంద రూపాయిల క్యూఁ లో నిలబడి తీరా లోపలికి వెళితే అక్కడ చిన్న గుప్పెడు సైజు లో అమ్మవారి విగ్రహం దానిమీద పూల దండలతో మరింత చిన్నరుపమ్ కని పిస్తుంది.అక్కడ నుంచి ఇంకొంచెం లోపలకి మెట్లు దిగి కిందకి వెళితే చీకట్లో దండలతో అలంకరించిన గోయ్యలాంటి ప్రదేశం నీళ్ళు వురుతూ కని పిస్తుంది, అక్కడఅమ్మ వారి యోని భాగం పడిందని స్టల పురాణం. దక్ష యజ్నం లో శివుడికి జరిగిన అవమానానికి సతీ దేవి ఆత్మాహుతి చేసుకుంటే శివుడు ఆమె శవాన్ని భుజం మీద వేసుకుని శివతాండవం చేస్తూ ప్రళయ రుద్రం చేస్తుంటాడు. ఆ ప్రళయం ఆగి పోవడానికి విష్ణువు సుదర్శన చక్రం తో అమ్మ వారి శరీరాన్ని ఖండించడం జరుగుతుంది. అవి మొత్తం 51 bhagaలు గా విడి పోయి దేశం లో వివిధ ప్రాంతాలలో పడి పోయి శక్తి pitalu గా రూపాంతరం చెందాయి. అందులో యోని భాగం అస్సాం లో gauhaty లో పడిందని ప్రతీతి.అక్కడ నేను గమనించింది ఏంటంటే కార్ పార్కింగ్ దగ్గరనుంచే పూజారులు ఎదురు పడి బేరం కుదుర్చు కుంటారు. వాళ్ళే వెళ్లి వంద రూపాయల టికెట్స్ తెచ్చి , గుళ్ళో మన టర్న్ వచ్చే టైం కి లోపలికి వచ్చి అస్సామీ లేదా బెంగాలీ యాస లో సంస్క్ర్తుతం లో కామక్య దేవి కి వందనం అని చెప్పిస్తారు.ఇలా ప్రతి భక్తు డికి kanisam మూడు నిముషాలు తీసుకున్నా వంద మంది ని క్లియర్ చెయ్యడానికే అయిదు గంటలు సమయం పట్టేస్తున్డి.అక్కడ కూడా మన తిరుపతి లో లా గబ గబ లాగేస్తే మొత్తం రోజు అంతా వేచి చూసే వాళ్ళని కూడా మూడు గంటల లో ముగించేయోచ్చు. కానీ వాళ్ళ మీదే బతుకుతున్న వందలాది పూజారుల కుటుంబాలు,వీధిన పడతాయి.అంతే కాదు ఆ ఆలయ ఆవరణ లోనే మేక పిల్లల్ని, పావురాలని బలి ఇస్తుంటారు.ఇవన్ని చూసాక మన దక్షిణాది గుళ్ళలోనే కళ కళ లాడే దేవత మూర్తులు కొలువు తీరి వున్నారని గర్వం గా చెప్పుకో వచ్చు.వైష్ణవ దేవి గుళ్ళో కూడా ఇలా చిన్న గానే వుంటాయి. కాబట్టి మొదటి సారి నార్త్ లో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకి వెళ్ళే వాళ్ళు ఇవి దృష్టి లో పెట్టుకుంటే అంత డిసప్పాయింట్ అవ్వరు.

3 వ్యాఖ్యలు:

ఉషారాణి చెప్పారు...

నా అనుభవం కొంచం తేడా. మేము షిర్డీకి వెళ్తూ తులజాపూర్ భవాని మాత ఆలయం కూడా చూసాము. దాదాపుగా 15సం. గడిచిపోయింది కనుక మీ అంత వివరంగా గుర్తుకి రావటం లేదు కాని, ఆ స్థలపురాణం, చరిత్ర ఇవి - శివాజి మహరాజుకి అమ్మవారు చంద్రహాస ఖడ్గాన్ని ప్రసాదించిందిచటేనట. అలాగే ఆలయం నిండా వున్న కందిరీగలు అమ్మవారి దూతలట, మన మనసులో ఏ కుళ్ళూ లేకపోతే మననేమీ చేయవట, లేదంటే కుట్టి భాదిస్తాయట. దేవాలయం బయట స్త్రి, పురుష బేధం లేకుండా అందరం స్నానంచేసి అలాగే తడి బట్టలతో లోనికి ప్రవేశించాం. ప్రసాదాలు పాలకోవ వంటివి. నేను ఆ గుడి, దర్శనం చాలా రోజులు మరిచిపోలేదు. ఇప్పుడు కూడా చిన్న మరుగునపడ్డ స్మృతే కాని మరిచిపోనిదే!

సత్య చెప్పారు...

రవిగారు మీరు రాసింది వాస్తవమే ఉత్తరాదిలో మంచి శిల్పకళ ఉందదు. దేవతా విగ్రహాలు కూదా బొమ్మల కొలువులో బొమ్మలవలే ఉంతాయి. కాని స్థల పురాణం గొప్పది. మీరు చెప్పిన కామాఖ్య ఆలయం ఒకప్పుదు నరకాసురుదు పాలించిన ప్రాగ్జ్యోతిషపురం. ఆ దేవి ఆయన కొలిచిన మాత. అక్కద మొన్నటి వరకూ నరబలి ఉండేది. ఇప్పుడు కూడా ఉందనే చెబుతారు. మీరు చూసిన పావురాలు, మేకలు సాధారణం. దున్నపోతుల బలి ఉంది. మనిషి తనలోని జంతు ప్రవ్రుత్తి ని బలి ఇవ్వలేక మూగ జీవాల ఉసురు తీస్తున్నాడు. కాని అమ్మవారు కోరేది మూగ జీవాల బలి కాదు. అవి కూడా ఆమె బిడ్డలే. మనిషిలోని జంతువును బలి కోరుతుంది. మనిషి అజ్ఞానానికి అంతు లేదు కదూ. శాక్త తంత్రంలోని వామాచార మార్గం వారికి కామాఖ్య ముఖ్య ఆలయం. అక్కద శక్తి మంత్ర జపం శీఘ్ర ఫలదాయకం.

...Padmarpita... చెప్పారు...

రవిగారూ... నేను కూడా మీతో ఏకీభవిస్తున్నానండి. గత ఏడాది మేము వైష్ణోదేవి ఆలయానికి వెలితే నాకు మీలాంటి ఫీలింగ్స్ కలిగాయండి. దేవతలు అంటే దక్షిణాదిలో పెద్ద విగ్రహాలని చూసి బహుశా నాకు అలా అనిపించి వుండవచ్చు. ఏది ఏమైనా మీరన్నట్టు దక్షిణాదిలోనే బెస్ట్.