25 జన, 2009

అరుంధతి సినిమాలో లోపాలు


ఈ రోజే అరుంధతి సినిమా చూడడం జరిగింది.ఇప్పటికే సమిక్షలలో సినిమాని ఆకాశానికి ఎత్తెయ్యడం వల్ల హై expectations తో చూడడం తో కొంత అసంతృప్తి కి లోనవడం జరిగింది. అందుకే ఇంక సమిక్షించకుండా నేను కని పెట్టిన లోపాలే రాస్తాను. మొట్టమొదటి పెద్ద లోపం ఏంటంటే జేజమ్మ ఎముకలతో చేసిన కత్తి లాంటి ఆయుధం పని చెయ్యాలంటే ,ఆ పశుపతి ప్రేతాత్మ ఎవరినైనా అవహించినప్పుడే పని చేస్తుందని ఆ ఆయుధం ఇస్తునప్పుడే అఘోరి (లేదా ఆ ఋషి) చెపుతాడు. కానీ క్లైమాక్స్ లో అరుంధతి ఆ ప్రేతాత్మ నే పొడిచినట్టు చూపుతారు.అలాగే పశుపతి కొంత సేపు వేరే మనుషుల మిద అవహిస్తూ మాట్లాడి, మళ్ళి నాశనం అయిపోయిన తన పాత రూపం లో ఎలా వస్తాడో?అలాగే పకిర్ ని ప్రేతాత్మ చంపేసినట్టు గా నీళ్ళలో ములిగి పోయినట్టు గా చూపించి మళ్ళి బతికోచినట్టు గా చూపిస్తారు.
ఒక సీన్ లో 9999 నెంబర్ కార్ రైల్ గేటు దగ్గర పట్టాల మీద ఇరుక్కు పొఇ రైల్ డీ కొట్టాక మండి పోయి నట్టు గా చూపించారు మళ్ళి నెక్స్ట్ సీన్ లో అదే కార్, no తో సహా అదే ,అరుంధతి ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్తునట్టు చూపిస్తారు.ఇంకో లోపం ఏంటంటే అరుంధతి ఆయుధం గా మారడం కోసం చని పోయే సీన్ లో వున్నా ముసలి అఘోరి కి అప్పటికే 70 ఏళ్ళు ,రెండో అరుంధతి మళ్ళి పుట్టి అదే రూపం లో రావడానికి 80 ఏళ్ళు పట్టినట్టు గా కధలో అర్ధం అవుతుంది అంటే ఆ ముసలాయన వయసు 150 అనుకోవాలా?ఈ సినిమా రెండు ప్రేతాత్మ ల పగ గా చెప్పుకోవచ్చు.50 కోట్లు దాక వసూల్ చేయొచ్చు అంటున్నారు ?అంత సీన్ నాకైతే కనబడలె . ఆ రోజుల్లోనే పాపం విటలచార్య ఇంత కంటే మంచి మాయల మరాటి సినిమాలు తీసినా మీడియా exposure అప్పట్లో లేదు కాబట్టి వసువుల్లలొ వెనక బడి వుండొచ్చు.కలదన్నవి కలవో ? లేవో?గాని వాటి పేరు చెప్పుకుని బాగు పడిన వారి లిస్టు లో యండమూరి తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డే (నిర్మాత) అని చెప్పుకోవచ్చు.

9 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

రవి గారూ.......
సినిమా అంతేనే మాయా ప్రపంచం. లేనిది వున్నట్టుగా చూపించి మన దగ్గర డబ్బులు నొక్కేస్తారు. లేకపోతే ఎక్కడయినా ప్రేమించు కున్నవాళ్ళు రోడ్డెక్కి గంతులేస్తారా? ఒకే ఒక్కడు వందమందిని పట్టుకుని కొట్టేస్తాడా? అందుకే సినిమాలో తప్పులు వెతకడం అనవసరమని నా అభిప్రాయం. ఏమంటారు?

Chari Dingari చెప్పారు...

అఘోరా లు చిరకాలం జీవిస్తారు ....కావాలంటే నేను దేవుడిని చూడండి

Unknown చెప్పారు...

రవి గారూ
మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజం. ఈ సినమా లో అనేక లోపాలున్నాయి. రెండు సంవత్సరాలుగా నిర్మించిన ఈ చిత్రంలో మరి అలాంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదో?

Kathi Mahesh Kumar చెప్పారు...

వీటిని లోపాలు కాదు.Goof-ups (గూఫులు) అంటారు. ఆస్కార్ అవార్డులొచ్చిన చిత్రాల్లోకూడా ఇలాంటి గూఫులు తప్పలేదని పోయిన సంవత్సరం ఒక పెద్ద వ్యాసమే వచ్చినట్లు గుర్తు.

Unknown చెప్పారు...

thx madhu.,hari,kalam, and katty for expressing your opinion.

chetan sharma చెప్పారు...

నాకు అనుష్క నటన అంత నచ్చలా. దాని మొహంలో రౌద్రం పలకదు. దాని కన్నా చిన్న పిల్ల బాగా చేసింది. జేజెమ్మ ఫోటో చూసి తన గతం గుర్తు వచ్చిన తర్వాత కూడా బేల తనంగా నటించేటట్టు చేసాడు దర్శకుడు. అసలు తను పుట్టింది పశుపతి ఆత్మను చంపడం కోసమే కదా. అలాంటప్పుడు తెలీనంత వరకు బేలతనం ఓ కే. కాని తనెవరో తెలిసిన తర్వాత రౌద్రం గా నటించాలీ. దర్శకుడు అక్కడే పప్పులో కాలేసాడు. చివరివరకూ భయ పడుతూనే నటించింది. అదే పెద్ద తప్పు. అసలు అనుష్క మొహమే ఏదో నీరసంగా కనబడుతుంది. అప్పుడే ఎవడి పక్కలోంచో లేచి వచ్చినట్టు. అనుష్క నీరస నటనను సౌండ్, ఫోటోగ్రఫి, విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కవర్ చేసాయి. అందర్లోకి బాగా నటించింది సూద్ పసుపతిగా. టోటల్ గా ఓ కే.

Unknown చెప్పారు...

@అప్పుడే ఎవడి పక్కలోంచో లేచి వచ్చినట్టు.

కాగడా శర్మ గారూ మాట అనే ముందు కొంచెం ఆలోచించండి.

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
మనోహర్ చెనికల చెప్పారు...

http://newjings.blogspot.com/2009/02/blog-post_11.html

naa abhipraayalanu ee blog lO chUDanDi.(along with "nenu devudini")