15 ఫిబ్ర, 2009

మొగుణ్ణి కొట్టే మగువ (మందు కొట్టినప్పుడే)


ఈ రోజు పేపర్ లో న్యూస్ చూసాక ఇది రాయాలని పించింది.నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోకి మార్టిన్ అనే యువకుడు తన చిన్న పిల్లాన్ని చంకలో పెట్టుకుని ప్రాణ భయం తో ఇన్స్పెక్టర్ దగ్గరికి పరుగు పరుగున వచ్చి రక్షించండి , రక్షించండి అంటు వచ్చాడట. అయన వెనకే అతని భార్య సోనియా బాస్టర్డ్ ఐ విల్ కిక్ యు ఆన్ యువర్ అస్ , use లెస్ ఫెలో ఫీట్ ఫర్ nothing ఫెలో కాంట్ డో ఎనీ తింగ్ అంటు ఇన్స్పెక్టర్ ముందే చితకా బడడం మొదలెట్టిందట. దానికి ఇన్స్పెక్టర్ అడ్డు చెప్ప బోతే నిన్ను కూడా తంతా నా కొడకా అంటు తూలి పోతూ చిందులు వేస్తోందట, ఇంతకీ విషయం ఏంటా అని అరా తీస్తే ఆ మగువకి మూడ్ వస్తే ముందు గా ఫుటూ గా మందు కొట్టేసి ఆ ఫై భర్త ని అమ్మ నా బూతులు తిట్టి ఆ ఫై దాడికి తెగ బడుతుందట.పోలీస్ లు మళ్ళి యద విధి గా ఆవిడకి మజ్జిగ తాగించి తెలివి లోకి వచ్చాక రాజి కుదిరించి పంపారు.ఆ సందర్భంగా ఇన్స్పెక్టర్ వొక సలహా చెప్పాడట భర్త కి నీ భార్య కి తాగడం ఎలాగు అలవాటైంది కాబట్టి బ్లాగడం కూడా అలవాటు చేసేస్తే మందు కొట్టినప్పుడు నీ జోలికి రాకుండా ఏ'' కాగడా షర్మి'' అనో నచ్చని వాళ్ళను తన బ్లాగ్ లో తిట్టుకుంటూ శేష జీవితం గడిపెస్తుందని.ఇదేదో సరదాకి రాస్తున్నా అనుకునేరు మీకు అనుమానం పోవాలంటే ఈ రోజు హైదరాబాద్ ఈనాడు లోకల్ ఎడిషన్ చదివి ఇంట్లో ఆడవాళ్ళకి మందు కనబడకుండా జాగర్త పడగలరు.

8 వ్యాఖ్యలు:

కాగడా శర్మ చెప్పారు...

రవి గారు, ఇద్దరు కలిసి మందు కొడితే సరి. ఆ పైన చంకలో పిల్లాడికి కూడా ఉగ్గుపాల బదులు మందే పట్టిస్తే అన్ని సమస్యలూ ఫటా ఫట్.

మీరు అసలు కోణం వదిలేసారు. ఆ మహిళా ఎంత అసంతృప్తి తో ఉందొ అర్థం చేసుకున్నారా. స్త్రీని పరిపూర్ణం గా తృప్తి పరిస్తే బానిసలా బంధింప బడుతుందని వాత్సాయనుడు ఏనాడో చెప్పాడు. కామ శాస్త్రం తెలియకపోతే, పెళ్ళాన్ని పూర్తిగా సంతృప్తి పరచలేక పొతే ఇలాగే ఉంటుంది.

సదరు మహిళ ధైర్యం కలది గనుక తాగి మొగుణ్ణి కొట్టింది. ఆ పని చెయ్యలేని కోట్లాది సగటు మహిళలు మొగుణ్ణి మానసికం గా హింస పెడుతూ, తమ అసహనాన్ని చూపిస్తారు. ఇది చాలా కుటుంబాల్లో ఉన్నదే. ధైర్య వంతులు ఇలా చేస్తారు. కుహనా సంస్కార ముసుగులో బతికే వాళ్లు, సూటి పోటి మాటలతో, అవునంటే కాదని, కాదంటే అవునని, మన బ్లాగర్ల లాగా వాదనలు పెట్టుకుని కసి తీర్చుకుంటారు. ఇది ఇంటింటి రామాయణమే.

ఆ మహిళ ను మెచ్చుకుంటున్నాను. మొగుడి అసమర్థతకు జాలి పడుతున్నాను. అతనికి కామ కళ ట్రెయినింగు అవసరం.

krishna rao jallipalli చెప్పారు...

మగాళ్ళలో కొంత మంది తాగి పెళ్ళాలని వీర బాదుడు బాదుతుంటారు అదేదో తమ తమ జన్మహక్కు అయినట్టు. కాకపోతే ఈ కేసులో రివర్స్ అయ్యింది. అందుకే అది వార్త అయ్యింది. నిజం చెప్పాలంటే.. ఈమె చేసింది తప్పేమీ కాదు. వీరబాదుడు బాదడం లొ తాగడంలో మగాళ్ళకి ఎన్ని హక్కులు ఉన్నాయో ఆడాల్లకీ అన్ని హక్కులు ఉన్నాయి. ఇక తాగడం బాదడం తప్పు అంటారా?? అప్పడు అది ఇద్దరకి వర్తిస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

ఆ పిచ్చి మొగుడు పోలీసు స్టేషనుకు కాకుండా ఏ శ్రీ రామ సేన కార్యాలయానికో వెళ్లి వుంటే అతని సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికి వుండేది. ఇట్లాంటి ఆడవాళ్ళు ఎక్కడ దొరుకుతారా వాళ్ళని చితకబాది భారత సంస్కృతిని ఎట్లా కాపాడదామా అని వాళ్లు కాచుకుని కూచున్నారు.

అజ్ఞాత చెప్పారు...

@కాగడా శర్మ: 'కాగడ" పత్రిక చూసారా? చదివారా? ఆ కాగడ శర్మ గారి గురించి వివరాలేమైనా తెలుసా? వారి పేరు పెట్టుకున్నారు కదా? మీరు వారి అభిమానులా?

ISP Administrator చెప్పారు...

ఇదేమీ గొప్పకాదులే. ఆడదానికి మగవాడ్ని రేప్ చేసే ధైర్యం వస్తేనే గొప్ప.

---మార్తాండ

కాగడా శర్మ చెప్పారు...

అజ్ఞాత గారు, కాగడా పత్రిక చూసాను, చదివాను. నేను ఆయన అభిమానినే. ఆయన వివరాలు నాకన్నా బాగా జల్లిపల్లి కృష్ణా రావు గారికి తెలుసు. ఇంతకూ ముందు, కాగడా శర్మ గారి గూర్చి నాకు తెలియని విషయాలు చాలా చెప్పారు. చూడండి. లేదా ఆయన్ని అడగండి.

...Padmarpita... చెప్పారు...

ఏదో చెత్త పనిచేసి ఉంటాడు
అందుకే మత్తుగా తాగి
చిత్తుగా కొట్టింది...

Malakpet Rowdy చెప్పారు...

కొంపదీసి ఆ మార్టిన్ అసలు పేరు రాజీవ్ కాదు కదా? ఇది ఒక వేళ 1980 కేసు లేటుగా పబ్లిష్ అయ్యిందేమో?