మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
7 మార్చి, 2009
ఈ ప్రశ్నకి బదులేది?
నా కేంటో ఈ మద్య celolagy వంట బట్టిన ఫీలింగ్ వచ్చేస్తోంది .ఎదుట వాళ్ళు సెల్ తీయడానికి పట్టిన సమయం ,వాళ్ళు హలో అన్న విధానం ఆ తర్వాత వాళ్ళ మాటల్లో వణికించే హవా భావ విన్యాసాల బట్టి వాళ్ళే పరిస్తితి లో ఉన్నారో కళ్ళ కి కటినట్టు తెలిసి పోతోంది అదేంటో ?మన నెంబర్ చూడగానే 20 సెకండ్స్ లోనే ఎత్తేసి చెప్పండి అనో హాయ్ అనో ఆప్యాయంగా పలకరిస్తే వాళ్ళు ఫ్రీ గా వునట్టు కాసేపు అస్కు వేసుకో అని అర్ధం .కొంచెం టైం తీసుకుని ఫోన్ ఎత్తి చెప్పండి అంటే తొందరగా ముగించమని అర్ధం .ఫోన్ ఎత్తి హలో హలో అంటూ వినపడనట్టు నటిస్తే వాళ్ళ వాళ్ళు ఎవరో పక్కనే వున్నారని తమరు తర్వాత చెయ్యమని అర్ధం . ఫోన్ ఎత్తి బ్రహ్మానందం స్టైల్లో హల్లా , హల్లా ఎవడో యదవలు ఫోన్ చేసి కూడా మాట్లాడరు అంటే ఆ వ్యక్తీ పాత పగలు తిట్ల రూపం లో తీర్చు కుంటున్నట్టు అర్ధం .మనం రింగ్ చెసినా ఎత్తకుండా , తర్వాత మళ్ళి వాళ్ళు చేసి receprocate చెయ్యక పోయిన నువ్వు నోరుముసుకో రా బాబు అని అర్ధం .మీరెంతో ఆవేశం గా బోల్డు మాట్లాడేయ్యాలి అనుకుంటూ చేసి ఇంకేంటి విశేషాలు అని అడిగితె ఏం లెవ్ అని సమాధానం వస్తే నువ్వు ఫోనే పెట్టారా బాబు అని అర్ధం .
ఇంతకీ ఇదంతా రాయడానికి స్పూర్తి ఈ రోజు మద్యానం నాకు కలిగిన అనుభవం .నేను కార్ సేర్విసింగ్ ఇచ్చే షో రూమ్ లో పని చేసే customer కేర్ మేనేజర్ ఒక అమ్మాయి అప్పుడప్పుడు ఫోనే చేసి కార్ ఎలా వుంది ?మళ్ళి సేర్విసింగ్ due ఎప్పుడు లాంటివి చెపుతూ ,నా ద్వార తనకి అవసరమైన (నా ద్వార అంటే ప్రభుత్వ పరంగా అని గమనించ ప్రార్ధన లేనిచో కొంప కోల్లెరగును)సహాయం అడగడం నేను చేసి పెట్టడం తరచూ గా జరుగుతూ వుంటుంది . ఇదంతా సెల్ ద్వారానే గాని ఈ పని కోసం ఆమె పని గట్టుకుని మరి నా దగ్గరకి తన పని మానుకుని ఎప్పుడు రాదు .పని అయిపోయిందని నేను ఫోనే చేసి చెప్పగానే ప్రపంచం లో ఆనందాలన్ని నేనేదో ఆవిడా దోసిట పోసినంత లెవెల్ లో ధన్యవాదాలు చెప్పి ఎప్పటికన్నా మిమ్మల్ని పర్సనల్ గా కలిసి thx చెప్పుకుంటాను సార్ అంటే భలే వారె ఈ చిన్న దానికే మై ఆప కే అభారి హు టైపు ఎందుకండి ?గుర్తు పెట్టుకుని కార్ సేర్విసింగ్ అప్పుడు ఇంటికి మీ వాడు వచ్చి పిక్ అప్ చేసే ఏర్పాటు (ఇది ఎవరు రిక్వెస్ట్ చెసినా చేస్తారు ) చెయ్యండి చాలు అంటూ నే ఫోనే పెట్టేస్తూ వుంటా . మళ్ళి తనకి అవసరం వచినప్పుడు , పండగలకి పబ్బాలకి విష్ చెయ్యడానికి చేస్తూ వుంటుంది . అలాంటిది ఈ రోజు ఆమె కి ఫోనే చేసి మీ పని అయ్యింది అని చెపుదామని ట్రై చేస్తే చాల సేపటికి గాని తియ్యలేదు , అది మొదటి ఝలక్ . రెండు ఎత్తగానే గుడ్ మార్నింగ్ సార్ అనేది అది మిస్సింగ్ . ఫోనే ఎత్తి రొప్పుతూ హలో అంది.నేను ఏంటి ఆఫీసు లో లేరా అన్నా ?లేదు సార్ ఆఫీసు లోనే వున్నా అంటే అదేంటి మరి ఆఫీసు లో రొప్పు తున్నారు అన్నా .అన్నాక గాని అందులో విపరీత అర్ధం ఏమన్నా వుందా లేక నేను అదే భావనతో అన్నానా?ఏమో నాకే తెలీదు .అంటే మెట్లెక్కి దిగా ఇప్పుడే ఖంగారు ఆమె ధ్వని లో ?మీ ఆఫీసు అంతా కిందేగా. ఏంటో నా తొక్కలా ప్రోబింగ్.thank u సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టనేమో అతి కష్టం మీద మాటలు కూడా దీసుకుని అనట్టు గా అంది ఆమె .చూస్తుంటే నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టనేమో మీరేదో బిజీ గా వునట్టు వున్నారు నా గొంతులో వ్యంగామేమో?ఫోనే పెట్టేసా. నా ఆలోచనా విధానం లో తప్పా ?అక్కడ నేను వుహిస్తున్న లాంటి సెన్సిటివ్ విషయం ఏమి వుండక పోయి వుండొచ్చు . మళ్ళి తనే రాత్రి 8 గంటలకి ఫోనే చేసి యధావిధి గా తన ధోరణి లో ధన్యవాదాలు చెప్పుకుంటుంటే నేను వుండ బట్ట లేక ఏంటి మద్యాన్నం మీరు బిజీ నా?(నాలో నిద్ర పోతున్న మగ బుద్ది ఆ ప్రశ్న వెయ్యించిన్డి).తనేం సమాధానం చెపుతుందా అని చెవులు రిక్కరించి వింటున్న .ఇంతలొ బయ్యి మని రైల్ కూత ఫోన్ లో సార్ నేను బయలుదేరుతున్నా ఇంక ఊరి నించి వచ్చాక ఫోన్ చేస్తా కార్ సేర్విసింగ్ కి పంపండి , హ్యాపీ జర్నీ చెప్పరా సార్ అంటుంటే నా ఆలోచనల్ని తుంచి ఓకే బాయ్ హ్యాపీ జర్నీ అంటూ ఫోన్ పెట్టేసా.తను టాపిక్ divert చేసిందా?లేక కొన్ని ప్రశ్నలకి సమాధానాలు వుండవా?నా ప్రశ్నకి సమాధానం అధురా రహ్ గయా.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్‌లు:
రవిగారు, ఎం ఆడాళ్ళు ఆఫీసులో రోప్పడం తప్పా? వాళ్ళకి చీమూ నెత్తురూ ఉండవా ? ఉప్పూ కారం తినడం లేదా ? అయినా అటువంటి సమయంలో మీరు ఫోన్ చేసిందే కాక, మీరే ఆమెకు పెర్మనేంటు సర్వీసింగ్ చేస్తున్నట్లు ఫీలయితే ఎలా?
సర్వీసు అనేది ఎందరికో ఉంటుంది. మీరు కొంచం విశాల భావాలు నేర్చుకోవాలి.
Mahilaa dinotsavam special ilaanto Article vrasinanduku Mahilalantaa kalisi tantaremo choosukondi :))
రవిగారు, పై ఫోటోలో గోడ చాటునుంచి చూస్తున్న వ్యక్తీ మీరేనా? మీ హాబీ బాగుంది. ప్రొసీడ్. TB Rao కి పోటీనా మీరు?
LOL Kagadaa ..
Ravigaru .. ideppatinundi modalu pettaaru?
హత విధి యెంత వక్రీకరణ?నా ఉద్దేశం కార్పొరేట్ ఆఫీసుల్లో స్టాఫ్ ఫీట్ నెస్ కోసం జిం లాంటి ఏర్పాట్లు ఉన్నాయి కదా ఆమె ఏమన్నా పని మానుకుని threadmill చేసుకుంటూ రొప్పుతొన్ద అని కవి భావం . దానికి కాగడా గారు 'వక్ర భాష్యం రాజేశ్వరి 'లా వక్రీకరిస్తే rowdygaru బూతు కింద వర్గీకరించి మహిలదినోత్సవ శుభ సందర్భంగా ఆడవాళ్ళని నా మీదకి వుసి క్గోలుపుట న్యాయమా?
హ్హ అప్పుడెప్పుడో కర్ణాటక లో ఇంజనీరింగు విద్యార్ధిని స్వప్న తో కూడా మీరిలాగే మాట్లాడారు ఫోన్ లో ..( మనం లైఫ్ స్టైల్ లో కల్సుకున్నప్పుడు )
ఉసిగోల్పబడిన ఆడవాళ్ళని మీరు దగ్గరుండి treadmill ఎక్కించి exercise చేయించి రోప్పించండి. ఆయాసం వాళ్లకు . చెమటలు మీకు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి