మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
23 మార్చి, 2009
ఉత్తాన్న పతనాలు
జీవితం సాఫీగా సాగి పోవాలనే అందరికి వుంటుంది .అలా''చల్ల గా సాగును జీవితము ''అని పాడుకునే అదృష్టం మాత్రం చాల కొద్ది మందికే వుంటుంది.నా దృష్టిలో జీవితం లో స్లో అండ్ స్టాడి గా ఎదుగుతూ ఒక స్తాయిలో వుండి పోయినవాళ్ళే అదృష్టవంతులు .ఒక్కసారి గా వుప్పేనల ఎదిగి మళ్ళి ధబేలున పడి న వాళ్ళని చుస్తే జాలి తో పాటు భయం కూడా వేస్తుంది.
మొన్న telugupeople.కం లో సత్యం రాజు బ్రదర్స్ వాళ్లకిచ్చిన ప్రత్యేకమైన సెల్ లో వంట వండుకోడం మొదలెట్టారని రాస్తూ అంతకు ముందు క్రిమినల్స్ సెల్ లో వుంచినప్పుడు రాత్రుళ్ళు పందికొక్కులు ఎలకలు వాళ్ళ మీదనుంచి పాకి పోతూ వుండేవని చదివినప్పుడు అదే అని పించింది . ఆరు నెలల క్రితం వరకు హంస తూలిక తల్పాలమీద airconditioned గదుల్లో దోమలు కూడా దూరకుండా హాయి గా నిదురించిన వారికీ ఇప్పుడు తిందామంటే సరైన తిండి లేదు , పడుకుందామంటే కటిక నెల మీద దుప్పటి కప్పుకుని పందికొక్కుల్ని , ఎలకల్ని కాసుకుంటూ నిద్రపట్టని నిసిరత్రులు గడుపుతూ ఇలా ఎన్నాళ్ళో కూడా తెలీకుండా బతుకుతూ వుంటే ఒకే వ్యక్తీ జీవితం లో ఉత్తాన పతనాలు . అలాగే నిన్న నే మరణించిన జేడ్గుడి జీవితం . ఎక్కడో slums లో పుట్టి రియాల్టీ షో ద్వార పాపులర్ అయ్యి తిండి కి కూడా సరిగా నోచుకోని ఆమె ఒక్కసారి గా యెంతో ధనవంతు రాలయ్యి ఇండియా లో కూడా పాపులర్ అయ్యి ఇక్కడ కలోర్స్ ఛానల్ లో realty షో లో పాల్గొంటూ మధ్యలోనే సెర్వికాల్ కాన్సర్ వాళ్ళ స్వద్వేశానికి వెళ్లి పోయి , తన చావును కూడా టీవీ వాళ్ళకి అమ్ముకుని ఆ డబ్బుని పిల్లకి ఇచ్చి వెళ్లి పోయింది.మాతృదేవోభవ లో మాధవి లా mothers డే రోజే వెళ్లి పోయింది.అందుకే నాకని పిస్తూ వుంటుంది ఒక్కసారి గా limelight లోకి వచ్చి తారాజువ్వలా వినిలాకాసం లోకి దూసుకు పోయి వెనువెంటనే రాలి పోయే కన్నా ,lowprofile లో బాద్యతలన్ని తీరేదాకా బతికి వీడ్కోలు తీసుకోవడమే బెట్టేరేమో అని పిస్తుంది. కాకి లా కలకాలం బతికే కన్నా హంస లా ఆరు నెలలు మిన్న అన్న సూత్రం వీళ్ళని చుస్తే తప్పేమో అని పిస్తుంది.ఒక్కసారి గా మనకున్న పుణ్య ఫలాన్ని మండిన్చేసి రాత్రి కి రాత్రి కుబెరులాయి పోయి ఆ పైన పడిపోయే కన్నా ఆ పుణ్య ఫలాన్నే కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అని పాడుకుంటూ జీవితం సాఫీగా గడిపెయ్యడమే బెటర్ లేక పొతే ఇంధనం మొత్తం ఒకేసారి వాడేస్తే skylab లా సముద్రం లో పడడమే గతి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్‌లు:
చాలా కరెక్ట్! సత్యం రాజు గారి జైలు జీవితం విషయాలు చదువుతుంటే నిజంగానే జాలి తో పటు భయం కూడా కలుగుతుంది. ఎలాంటి మనషికి ఎలాంటి పరిస్థితి!
ఒక్క రోజులో జీవితం తారు మారైపోయింది... ఇంత కాలం చేసినదంతా కొట్టుకుపోయింది!
యవ్వారం తిరగ బడితే అంటే అండి సత్యం రాజు గారాయినా ,,, ఇంకెవరయినా ..
ఉత్తాన్నపతనాలు = ఉత్థానపతనాలు
అంతవరకు దిద్దగలను. కానీ ఇక్కడ అలా చాలా కనిపిస్తున్నాయి.
Enti saaru? meeru meerenaa? Inta serious postaa?????
But a good one .. refreshingly different!
100% కరెక్టు. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి బీరు తాగటం మంచిదని మా బామ్మ ఎప్పుడో చెప్పింది.
తాడేపల్లి గారు నా తెలుగు కి తెగులేక్కువే అని గ్రహించాను కానీ భావ ప్రాధాన్యమే తప్ప బాష ప్రాదాన్యం కాదని సద్దుకు పోతున్నా .రౌడీ గారు నా ఇమేజ్ చట్రం నుంచి బయట పడి కొత్త పాత్రలూ వేద్దామన్న తాపత్రయం తో ఈ ప్రయత్నం .శర్మ గారు మీ చినప్పుడు మీ బామ్మ గారు ''బాబు ఏడ్చాడు కొంచెం kingfisher పట్టమని వాళ్ళ అమ్మతో చెప్పు '' అని వుంటారేమో అని పించింది మీ కామెంట్ చూసాక .
కామెంట్‌ను పోస్ట్ చేయండి