7 ఏప్రి, 2009

అందరు రాసే కధలివిలే

అందమైన లోకమని రంగురంగులున్తాయని అందరు అంటుంటే కామోసు అనుకుంటూ ఒక అందమైన అమ్మాయి శ్రీనగర్ కాలనీ రోడ్ల మీద తన బండి మీద దూసుకు పోతూ వుంటుంది .బ్లాగ్ చేసుకో ,ఆనందం పంచుకో అన్న బోర్డు పట్టుకుని అక్కడ దగ్గర్లో వున్న పార్క్ లో కొంత మంది ఆడామగా కూర్చుని వుంటే ,తన వృత్తి రీత్యా పని కొస్తుంది కదా అని లోపలికి వెళ్లి వాళ్ళని పరిచయం చేసుకుంటుంది .అందులో విభిన్న రకల మనస్తత్వాలు వున్న వివ్విధ రకాల మనుషులు బ్లాగ్ చేసుకుని బతుకు ఏ విధం గా బాగు చేసు కొవచ్చో చర్చించు కుంటూ టే , తను కూడా స్పూర్తి పొంది వెనక ముందు ఆలోచించక దభేల్న బ్లాగ్ లోకం లోకి తన కుడి కన్ను అదురు తున్నా పట్టించు కోకుండా దుకేసిన్డి .ఆ నిర్ణయం తన జీవితం లో పెను మార్పులు తీసుకు వస్తుందని ఆ క్షణం లో ఆమె కి తెలిదు .సరదాగా మాట్లదేసుకుని ఎప్పుడేప్పుడు బ్లాగ్ లో ఎవరికి తెలీని కధలు రాసేసి తన లో లావా లా పొంగుతున్న రచనా పటిమని , కసిని జనాలకి రుచి చూపించి వారి ప్రసంసలు యెంత వేగిరం పొందల అన్న ఆదుర్దాలో ఎవరు రాయడానికి సాహసించని టాపిక్ మీద చక్కటి కదా రాసేసిన్డి . ఇంక తాంబూలాలు ఇచ్చేసా తన్నుకు చావండని .ఇంతలొ ఒక చిలిపి కృష్ణుడు ఆ కధకి సినిమాల్లో కనిపించిన రెండు సంఘటనలు ఉదాహరణ గా చూపిస్తూ కామెంట్ రాస్తాడు .అంతే ఆక్షణం కోసమే ఎదురు చూస్తున్న వైరి వర్గం ఛి ఛి ఆడవాళ్లు బ్లాగ్ లోకం లో అర్దరాత్రి రాసుకునే స్వతంత్రం లేకుండా పోయింది . ఏవిటి ఈ బూతు వ్యాక్యనాలు?అంటు నీతి ని కూడా బూతు లా బుతద్దం లో చూపించి వారిని బెదర గొట్టే ప్రయత్నం చేస్తారు . దీంతో బ్లాగ్ లోకం మూడు గా చీలి పాయి మిత్ర పక్షం , వైరి పక్షం , కృష్ణ పక్షం గా చీలి పోతుంది .మిత్ర పక్షం లో ధూమ్ లు రౌడీ లు , కాగడాలు వీర విహారం చేస్తూ వైరి వర్గాన్ని బెంబేలు ఎత్తిస్తూ వుంటారు . అప్పుడు ఒక కోవర్ట్ ని వైరి వర్గం మిత్ర పక్షం లో జోరబెడతారు .ధూమ్ , కాగడా ఎవరో కని పెడితే మూసేసిన కంపని తెరుచుకోడానికి వలయు గొప్ప ఐడియా ఇస్తామని . దాంతో కోవర్ట్ మిత్రుడిలా ఆమె పంచన జేరి గుడచర్యం మొదలెడతాడు .
ఇంతలొ ఒక అతను తనే కాగడా అంటు ఆమెకి మెయిల్ పంపిస్తాడు . ఆమె కూడా తనే ధూమ్ అంటు ఆట పట్టిస్తూ మెయిల్ పంపుతుంది . ఇద్దరు అదే పార్క్ లో కలుసు కోవాలని నిర్ణయించుకుని బయలుదేరతారు . పార్క్ కి చేరగానే దూరం నుంచే ధూమ్ అంటూ అతనూ కాగడా అంటూ ఆమె పరిగెత్తుకు వచ్చి దగ్గర్లో ఆగి పోయి ఆయాసం తీర్చుకుంటూ వుంటారు .ఇదంతా దూరం నుంచి కోవర్ట్ షూట్ చేసి తన బ్లాగ్ లో కనిపెట్టేసా ధూమ్ , కాగడా ఎవరో కని పెట్టేసా , youtube లో వాళ్ళ కలయికని అప్లోడ్ చేసేసా అంటు వేపరీతమైన ప్రచారం చేస్తాడు . దాంతో బ్లాగ్ లోకం లో కలకలం .ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటూ జనాలు , ఈ duplicate ధూమ్ , కాగడా ఎవర్రా అని అసలైన వాళ్ళు ఆత్రం గా ఎదురు చూస్తూ వుంటారు .కోవర్ట్ నిజం గా అప్లోడ్ చేసే టైం కి అతని వెనక నుంచి రెండు చేతులు వచ్చి అతని బ్లాగ్ ని డిలీట్ చేసేస్తాయి .తర్వాత కదా ఏమి జరిగి వుంటుందో వుహిస్తూ మీ అందరు తలో చెయ్యి వేసి రాస్తే ఇది అందరు రాసే కదా అవుతుంది మరి . మీదే ఆలస్యం .ఆలస్యం అమృతం విషం . నిదానమే ప్రధానము .

10 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ చెప్పారు...

mundu nenu ye pakshamo cheppandi

Sujata చెప్పారు...

???? బ్లాగు పోరాటాలా ? ఎవరికి నష్టం ? పోనీ లాభం ? అస్సలు అర్ధం కాట్లేదండీ !

శరత్ 'కాలం' చెప్పారు...

ఎప్పటినుండో అడుగుదామనుకుంటున్నాను. మీ ప్రొఫయిల్ ఫోటో అర్ధం కాకుండా గజిబిజిగా వుంది. ఆ పిక్ మీద కూడా ఏదయినా విదేశీ హస్తం పడిందా?

రవిగారు చెప్పారు...

అది ఒక సినిమా dheater . స్క్రీన్ మీద అయ్యగారి క్లోజ్ అప్ సినిమాలో . నేను ఎంటర్ అవగానే ఆనందం తో ఒక అమ్మాయి popcorn తెచ్చుకుంటూ సీట్ దగ్గరకి వెళుతూ వుంటుంది , శ్రద్దగా అబ్బాయిని కాకుండా అమ్మాయిని గమనించండి శరత్ అర్ధం అవుతుంది గజిబిజి లేకుండా .

శరత్ 'కాలం' చెప్పారు...

ఓ. అది సినిమా హాలా! మీరు ఏ గోడ ప్రక్కనో నక్కారేమో అని ఇప్పటిదాకా అనుకుంటున్నా!

రవిగారు చెప్పారు...

గోడలు దూకడమే గాని , గోడపక్క నక్కే అలవాటు లేదండి శరత్ ('...

శరత్ 'కాలం' చెప్పారు...

నా ఉద్దేశ్యం కూడా అదే. గోడ దూకేముందు తగిన సమయం కోసం ఎదురుచూడాలి కదా. అందుకే నక్కివుంటారనుకున్నా.

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

ఏమిటో ఈ మాయ!

కాగడా శర్మ చెప్పారు...

నా శైలిలో తరువాతి కథ చూడండి కాగడాలో.

కాగడా శర్మ చెప్పారు...

thanks friends. with due respects to the public sentiment i have deleted andaroo raase kathalivile second part from kagada.