25 ఏప్రి, 2009

గెలుపెవరిది?


గెలుపు ఇచ్చే కిక్ తో ఆ గెలుపుకోసం పడ్డ అలసటంతా మర్చిపోవచ్చు .అసలు గెలవము అని ముందే తెలిస్తే ?అందుకే బయట లోకం లో , బ్లాగ్ లోకం లో ప్రతి వారు మాదే గెలుపు , మాదే దీపావళి అంటు రెచ్చి పోతున్నారు.బయట ఇంతలా రెచ్చి పోతున్న వారు ఇంట్లో తలుపువేసుకుని అడుగు పెట్టాక ఇంట్లో వాళ్లతో సంభాషణ ఎలా వుంటుందో వుహత్మకంగా.
ముందుగా తెలుగుదేశం పూర్తీ మెజారిటీ సాధిస్తుంది ,మే 16 నా నిజమైన దీపావళి , నరకాసురిడి సంహారం అయి పోయింది , మహిళలంతా రెండు వేలు అందు కోడానికి సిద్దం గా వుండండి అంటు కెమెరాల ముందు మాట్లాడి చంద్రబాబు తలుపు బోల్టు పెట్టు కుని బాలయ్య తో ఏం బావ తొడలు పుళ్ళు పడేలా కొట్టావ్ , మీసాల రంగు బయట పడేలా ఎండలో తిరిగి తెగ తిప్పెసావ్ ,బండ ముక్కు బక్కాయన అవసరం తీసుకోకుండా ప్రభుత్వాన్ని స్థాపించే మెజారిటీ వస్తుందో, చస్తుందో టెన్షన్ కి bp వస్తోంది ఆ విధం గా మనం మే 16 దాక ముందుకు పోతున్నాం అంటు చెప్పుకుంటూ వుంటాడు.
ఇక కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి సంక్షేమ పదకలే మమ్మల్ని గట్టేక్కించాయి ,మే 16 తర్వాత ఇంటింటికి ఒక అంబులెన్స్, వూరు వురుకి ఒక జల యజ్ఞం ,గడప గడపి కి ఒక ముడుపు పధకాలతో రాజీవంద్ర ప్రదేశ్ అభివృద్ది బాట లో పయనించడం ఖాయం అంటు అనేసి ఇంటి కెళ్ళి తలుపెసు కోగానే అయన భార్య ఇప్పటికే సామానంతా ఇడుపులపాయకి పంపేసి ఇంకా గెలుస్తామని ఏంటండి ఆ ప్రఘల్భాలు అంటుంటే అబ్బ గట్టి గా అరవకే ఆ కాంట్రాక్టర్లు అంతా డబ్బులు వాపస్ అడుగుతారు గెలవం అంటే , ఇప్పటికే ఆంధ్ర గో బ్యాక్ అని అగ్గి రాజేస్తిమి అంటు బైబిల్ పాటించడానికి వుద్యుక్తుదవుతాడు .
నేనే కింగ్ , బావ చక్రవర్తి, తమ్ముడు సామంతుడు అంటూ ప్రజారాజ్యం తరఫున statement కెమెరాల ముందు ఇచ్చేసి తలుపేసుకుని ,ఏరా పవన్ గజాని కి ఒకసారి రెచ్చి పోయి ,పచ్చి బూతులు ప్రసంగించి మూడు kilometers కి ఒకసారి సిక్ అయ్యి హాస్పిటల్ లో జాయిన్ అయి ఏం పికావురా?మనకి డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్న వాళ్ళంతా కనీసం డిపాజిట్ అన్నా రాకపోతే పూర్తి డబ్బులు ఇచ్చేస్తామని అనవసరం గా కమిట్ అయ్యాం ఇప్పుడు చాల మందికే మనం డబ్బులు ఇచ్చేయ్య వలసిన పరిస్తితి కని పిస్తోంది అంటూ బావురు మంటాడు .
ఇంక లోక్సత్తా jp'' ఎన్నికల్లో ధనం మద్యం ఏరులై ప్రవహించింది ప్రజాసామ్యం అపహాస్యం పాలయ్యింది అని కెమెరా ముందు చెప్పి తలుపెసు కోగానే వారి భార్య ఏవండి హాయ్ గా ias ఆఫీసర్ గా ఆనందం గా వుంటుంటే మార్పూ మార్పూ అంటూ లోక్సత్తా పెట్టారు మన తరం లో మీరు కోరుకున్న మార్పు రాదేమో నండి అంటే అలా అనకు కాంతం ఈ ఎనికల్లో మా ఖాతా ఓపెన్ అయ్యింది వెయ్యి kilometerlaki కూడా మొట్ట మొదట వేసేది ఒకే అడుగు చూస్తూ వుండు మార్పు భవిష్యత్తు లో తద్యం అంటారు .
ఇవన్ని ఇలా వుంటే బ్లాగ్ లోకం లో ఒక పెద్దాయన గెలుపు మనదే , నిజమైన దీపావళి బ్లాగ్ లోకం లో ఆడవాళ్ళకి నేడే, కాగడా కడగంటి పోఇన రోజు నేడే , అతని వల్ల భాధ పడని పడుచు ఇంక ఎవరన్నా మిగిలి వుంటే నా దగ్గరకి వచ్చెయ్యండి , నేను చూసుకుంటాను,నేనే వేసుకుంటాను వీర తాడు అంటూ తన binoculer అంతా బ్లాగ్ లోకం మీద పడతుల మీద ఫోకస్ చేసి స్పందన negative గా వున్నా కూడా ఆశ వాహ దృక్పదం తోపదండి ముందుకు పదండి తోసుకు అంటూ అసలు తన వెనక ఎవరన్నా వస్తున్నారా లేదా అన్నది కూడా పట్టించు కోకుండా ముందుకు సాగి పోతూ వుంటాడు .
ఇదంతా పై నుంచి గమనిస్తున్న విధి వికట్ట అట్ట హాసం చేస్తూ వుంటుంది , రేపన్నది ఈ మానవులకి తెలిసి పొతే ఈ రోజే చచ్చి పోతారు తమ భవిష్యత్తు మీద బెంగతో, అందరిది గెలుపైతే మరి వోడేది నేనా ?అను కుంటూ అంతా విధి విలాసం అంటూ గుంభనం గా నవ్వుకుంటూ ముందుంది ముసళ్ళ పండగ అంటూ వెళ్లి పోతుంది .

4 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...

రవి గారు,
పాపం జేపీ గారి భార్య పేరు కాంతం కాదండీ!:))

రవిగారు చెప్పారు...

సుజాతగారు, jp గారి పోర్షన్ రాస్తునప్పుడు నాకు ఎందుకో గుండెపోటు గుమ్మడి ,''నేను ఇంకేతో సేపు బతకను కాంతం,ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న రహస్యం నీకు చెప్పాలి''అంటూ అ రహస్యం చెప్పకుండానే గుటుక్కు mantaa demo అని సూర్యకాంతం అయ్యో అంత మాట anakandy అన్న సన్నీ వేశం బుర్రలోకి వచ్చేసి కాంతం అన్న పదం బాగా సూట్ avutundani వాడేస వారి భార్య పేరు కాంతం కాదన్నది లోక viditame కదా .

Malakpet Rowdy చెప్పారు...

LOLLLLLLL Good one!!!!!

durgeswara చెప్పారు...

mee mail id kaavaalani koraanu pampaledu