27 మార్చి, 2009

పందికొక్కు అన్వేషణ


పొద్దున్నే వాకింగ్ నుంచి రాగానే పెరటి లో మొక్కలకి నీళ్ళు పోసి కొత్తగా వచ్చిన మొగ్గల్ని విరిసిన పువ్వుల్ని చూసి ఆస్వాదించడం నా దిన చర్యల్లో ఒక భాగం గత ఆరు నెలల దాక .గత ఆరు నెలలు గా నా వాకింగ్ కి మొక్కలకి నీళ్ళు పోయడానికి మద్యలో కొత్త గా ఇంకో పని వచ్చి చేరింది .అదేంటంటే పందికొక్కు తవ్వేసిన బోరియల్ని పుడ్చు కోవడం.మొదట్లో నాలుగయిదు చిన్న చిన్న బోరియల్ని తవ్వేది .తర్వాత తర్వాత తెలివి మీరి ఒకే బోరియని లోతు గా తవ్వుతూ ఏదో గుప్త నిధి అన్వేశించడానికి ప్రయత్నిస్తోందేమో అని పించేలా ఒకే చోట తవ్వడం చేస్తోంది . రోజు నేను అ బోరియని పెద్ద పెద్ద రాళ్ళతో మూసేసి అది తవ్విన మట్టి తో కప్పెట్టేస్తున్న .అయిన అది పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళి ''అదే వాసనా అదే చోటు'' అని అరుందతి సినిమాలో లా తవ్వుకుంటూ పోవడం . యెంత లోతంటే నేను ఒక పెద్ద ఐరన్ రోడ్ లోపలికి పోనిస్తే ఆ రోడ్ మొత్తం పోతోంది గాని ఎక్కడ అంతం కాన రాలేదు. ఇది కాదు పద్దతని తాగి పడేసిన కూల్ డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్స్ లోపలికి దుర్చేసి హమయ్య రేపు నాకు కాస్త రెస్ట్ అనుకుంటూ మర్నాడు ఆనందం గా walking చేసుకుని పెరటిలోకి వెళితే ఇప్పుడు వేరే చోట అదే బొరియ అదే మట్టి అని నేను అనుకునేలా తవేస్తే నేను ఇసురో మంటూ మళ్ళి ఎప్పటి లగే మౌనం గా మట్టి పుడ్చుకుని కష్ట పడుతుంటే మొక్కలు నా కేసి జాలిగా చూసాయి.
ఇంకో తమాషా ఏంటంటే నా మొక్కలు ఏవి పులు పూయడం మానేసాయి , పొర పాటున ఏదన్నా మొక్క మొగ్గ తొడిగితే మర్నాటికి ఆ మొక్క శవమై కని పిస్తోంది నా తోటలో . అంటే పంది కొక్కు కూకటి వెళ్ళ తో సహా పెకిలించి పారేస్తోన్డి. మొగ్గ తొడగ నంత సేపే దాని జీవితం.ఈ మాత్రం మొగ్గ తోడగని మొక్కలకి జీతం లేని ఈ చాకిరీ అవసరమా అన్నంత నిసృహ నాకు వచ్చేలా చేస్తోంది . దాన్ని పట్టు కోవాలంటే రాత్రి వొంటి గంట నుండి మూడు వరకు పెరట్లో ప్రచారం చెయ్యాలి .ఆ ప్రయత్నమూ ఒక అరగంట చేసే లోపే మా పక్కింటి ఆవిడ వేరే లా వూహించుకుని(?)దబెల్న వాళ్ళ బెడ్ రూమ్ తలుపులు ముసేస్తూ నా కేసి కోర కోర చూసిన చూపు పందికొక్కు చేస్తున్న గాయం కంటే పెద్దదే గాబట్టి ఆ ప్రయత్నం విరమించుకున్నా .ప్రస్తుతం బాధే సౌఖ్యమనే భావన రానీ వోయి అంటు పాడుకుంటూ బొక్కలు మూసుకుంటూ గడుపుతున్నా .ఇప్పుడు నా పరిస్తితి ఎలా తయారయ్యిందంటే ఏ రోజన్నా పొర పాటున ఆ పంది కొక్కు డ్యూటీ యెక్క క పొతే నేనే గొయ్యి తవ్వేసుకుని మళ్ళి పుడ్చేసుకునే అంత .ఈ విరోధి నమ సంవత్సరం నుంచి ఆ పందికొక్కు కి తెలివి తేటలు ఎక్కువయి పోయి తవ్విన మట్టిని రాళ్ళతో సహా బొరియ కి దూరం గా తీసికెళ్ళి పడేస్తోన్డి, అంటే ఈ రోజు నుంచి నా డ్యూటీ పొద్దున్నే బొక్కలు ముయ్యడానికి తట్టలు ఎత్తి దూరం గా పోసిన ఆ మట్టి ని తెచ్చి మరి పూడ్చడం .మొన్న టి కి మొన్న మా బాస్ పొద్దున్నే సెల్ కి చేసి ఎంచేస్తున్నవోయి అంటే అలవాట్లో పొరపాటు గా బొక్కలు పుడుస్తున్న సార్ అనేసా, అంత క్రితం రోజు రాత్రే అయిన finalise చేసిన టెండర్ ఫెయిల్ నాకిచ్చి కొంచెం రూల్ postion చూసి నా నిజాయితీకి తార్కాణం గా ఇది వుందో లేదో చూసి చెప్పండి అని నా చేతిలో పెట్టిన విషయం మర్చి పోయా. అంతే ఆ తర్వాత రోజు నుంచి మా బాస్ చాల ముభావం గా వుంటున్నాడు అసలే మార్చ్ నెల confidential రిపోర్ట్ రాసే టైం ఏం రాస్తాడో ఏమో .ఒక పందికొక్కు మీ జీవితాన్నే మర్చేస్తుందంటే ఇదేనేమో ఖర్మ .

6 వ్యాఖ్యలు:

...Padmarpita... చెప్పారు...

ఈ విరోధి నామ సంవత్సరం ఆ పందికొక్కుగార్ని(మర్యాద ఇవ్వకపోతే కోపం వస్తుందని)
మిమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దని కోరుకుంటున్నాను.లేదంటే వచ్చే ఏడాది పందికొక్కుగారి(బంగారు) విగ్రహం ఒకటి చేయించి మీ ఇంట్లో పెట్టుకోండి.

చైతన్య చెప్పారు...

ఈ విరోధినామ సంవత్సరం నుండి మీ విరోధికి (ఆ పందికోక్కుకి) మీతో విరోధం ముగిసిపోవాలని... అది మీ పెరడు విడిచిపోయి మీ మొక్కలు ఎప్పటిలా నిండుగా పూలతో కళ కళలాడాలని కోరుకుంటున్నాను!

ashok చెప్పారు...

మీకు ఈ నూతన సంవత్సరంలో ఈ సమస్య తొలగి పోవాలని ఆసిస్తూ

Malakpet Rowdy చెప్పారు...

అంత క్రితం రోజు రాత్రే అయిన finalise చేసిన టెండర్ ఫెయిల్ నాకిచ్చి కొంచెం రూల్ postion చూసి నా నిజాయితీకి తార్కాణం గా ఇది వుందో లేదో చూసి చెప్పండి అని నా చేతిలో పెట్టిన విషయం మర్చి పోయా. అంతే ఆ తర్వాత రోజు నుంచి మా బాస్ చాల ముభావం గా వుంటున్నాడు
------------------------------


LOLOLOLOLOLOLOLOLLLLLLLLLLLLLLLL

కాగడా శర్మ చెప్పారు...

రవిగారు, మీ నూతన సంవత్సర పందికొక్కు సందేశం బాగుంది. మీ పందికొక్కు కూడా నేనింతే, మారను గాక మారను అంటున్నట్టుందే. మీకన్నీ ఇటువంటి కేసులే తగులుతున్నాయి. పాపం..మీరు కోతుల్ని ఒదిలేసి పందికొక్కు వెంట పడుతున్నారెంటి? ఇంతకీ, కోతికీ పందికోక్కుకీ గల సంబందమేమిటి? పందికోక్కుకీ పక్కింటి ఆంటీకీ గల రిలేషనేమి? రెండూ ఒకటేనా? లేక వేరు వేరా? కన్సేషనేమైనా ఉందా? అర్థ రాత్రి పెరట్లో పచార్లు చేసేటపుడు, మీ దృష్టి పందికొక్కు మీద ఉండాలి గాని పక్కింటి బెడ్రూం కిటికీ మీద ఎందుకుంది? బెడ్రూమే నిజం పందికొక్కు అబద్దం లా అనిపిస్తోంది నాకు. సదరు పక్కింటి పాపాయమ్మ తలుపు మూయక పాపం ఎం చేస్తుంది- వాళ్ళాయన పక్కనుండగా. Better luck next time. ఈ సారి మీ బాస్ ఫోన్ చేసేసరికి మీరు ఏ స్థితిలో ఉంటారో ఏమో . ఎందుకైనా మంచిది మీ సెల్ ఫోన్ పెరట్లోనే ఉంచండి.

రవిగారు చెప్పారు...

పద్నార్పిత గారు ఈ పందికొక్కు ద్వార మీరు నా బ్లాగ్ లోకి పున ప్రవేశం చెయ్యడం చాల ఆనందం గా వుంది.చైతన్య , అశోక్ మీ వాక్కు ఫలించి ''మామిడి కొమ్మ మళ్ళి మళ్ళి పూయునులే'' అని నే పాదు కునే రోజు రావాలనే నా ఆశ .మలక్ నిజం గా మా బాస్ అయన టెండర్ లో బొక్కలున్నాయని అన్నాననే అనుకుంటున్నాడు ఇప్పటికి .కాగడా గారు నా ద్రుష్టి పక్కింటి కిటికీ మీద వున్నా మనసు మాత్రం పంది కొక్కు మీదే లగ్నం చేశాను కానీ ఆవిడ వేరే లా అనుకున్నారేమో .