చాల కాలం గా బ్లాగ్ లోకం లో , నాలో కూడా ఏదో స్తబ్దత అవరినించిందేమో అని పిస్తోంది. లేదా మనం ఏ కోణం లోంచి చూస్తే అదే కోణం కనబడుతుందో?తెలీదు.నేనెంతో స్పూర్తి పొంది ఒక వేశ్య ఆత్మ కధ కి విటుడి ఆత్మ కధ వుంటే ఎలావుంటుందో నా కవి భావం లోంచి రాస్తే ,ఒక మిత్రురాలు ఫోనే చేసి జనాలంతా మీ ఆత్మ కదేనేమో అంటు న్నారు అంటే నోరెళ్ళ బెట్టడం నా వంతయ్యింది .హరి నామ స్మరణ గురించి రాసే వళ్ళంతా హరి భక్తులు ,వరి నాట్ల గురించి రాసే వాళ్ళంతా రైతులు ,అనుకుంటే ఇంక ఏం చెపుతాను.అ క్షణం లో తదప్యం చెంది మనసు రంజింప చేసే ఏ టాపిక్ మీదన్నా స్పందిద్దామని రాస్తే ఇలా వుహించు కుంటే రాయడం కష్టమే . మొన్నటి దాక కాగడ నా ముసుగు అన్నుకున్నారు వారి అపరాధ పరిశోధనలో నిజం గ్రహించుకునే వుంటారు.కాగడా విసుగు చెంది ముసేసారో లేక అపరాధ పరిశోధకులు తియ్యించారో ? నేతాజీ మరణం లాగ అదో బ్లాగ్ లోకపు మిస్టరీ.
సరే ఇంక పాయింట్ లోకి వస్తే MOTHERS డే అంటు స్పూర్తి పొంది బ్లాగ్ లోకం లో ఎంతొ మంది రాసేసారు.అమ్మని వృద్దాశ్రమం లో వదిలేసిన వాళ్ళు గుర్తు చేసు కోవాలి MOTHERS డే రోజు అమ్మని ,మిగత వాళ్ళకి ఆమ్మ, తను ఒకే వుపిరిని తొమ్మిది నెలలు కలిసి పంచుకున్నామన్న మధుర జ్ఞాపకం వూపిరి పోయే దాక గుర్తు వుండి పోయే విషయమే దాన్ని ఎవరు వ్యాపార ధోరణి లో గుర్తు చెయ్య వలసిన అవసరం లేదేమో? ఇలా అన్ని డేస్ అయి పోయాక PARAMOUR డే , పక్కింటావిడ డే ,ఎదురింటాయన డే ,అంటు మొదలేడతరేమో ఖర్మ , కాదేది దినాలకి అనర్హం .
2 కామెంట్‌లు:
అమ్మను మర్చిపోయామని కాదండీ ! మన అమ్మ జ్ఞాపకాలు, అభిప్రాయాలు బ్లాగ్ మిత్రులతో పంచుకోవడానికో రోజు ...అది అందరూ గుర్తించేరోజు ఐతే బావుంటుందని ...అంతే .....
PARAMOUR డే , పక్కింటావిడ డే ,ఎదురింటాయన డే
____________________________________
LOL Heheheheheeeee
కామెంట్‌ను పోస్ట్ చేయండి