
పొద్దున్నే బద్దకాన్ని వదిలించుకుని ఆరోగ్యం కోసం కొందరు , ప్రక్రుతి అందాల్ని ఆస్వాదించడానికి కొందరు ,ఆ వంకన బయట కొచ్చి ఇంట్లో మాట్లాడుకోలేని సెల్ ఫ్రెండ్స్ తో సొల్లు కబుర్లకి కొందరు , బతకడం కోసమే నడవడానికి కొందరు ఇలా రక రకాల వ్యక్తులు తారస పడుతుంటారు మార్నింగ్ వాక్ లో .పొద్దున్నే బ్రిడ్జి ముందు సైకిల్ ఆపుకుని తన వుపిరిని అ బుడగల్లో వూది దారాలతో గుత్తులు గా తాయారు చేసుకుని అమ్ము కో డానికి సిద్ద పడే ఆ బక్క బలూన్ అబ్బాయి ఎన్ని బుడగలు అమ్ముకుంటే జేవన పోరాటం లో ఆ రోజుకి సరి పడ సంపా యించ గలుగు తాడో ?అనుకుంటూ ముందుకు సాగి పోతుంటే .దూరం గా నా వైపే నడుచు కుంటూ వచ్చే ఆ అందమైన అమ్మాయి ,ఒక చేతి లో కుక్కని పట్టు కున్న గొలుసు ,ఇంకో చేతి లో చెవి దగ్గర పట్టు కున్న సెల్ , ఆమె కుక్క ప్రక్రుతి పిలుపు కోసం బయటకోచ్చిందా లేక సెల్ మాట్లాడుకోడానికి ఆ వంక నా బయట కొచ్చిందా?ఏమో వొర కంట చూసే ఆమెని దాటు కుంటూ ముందుకి పొతే బ్రిడ్జి కింద నుంచి అదే టైం కి దుసుకుంటూ పోయే ap express ఎంతొ మంది ఆశల్ని మోసుకుంటూ మరి కొందరి ఆప్తుల్ని విడ దీస్తూ ,నాకు టాటా చెపుతూ వెళ్లి పోతూ వుంటుంది .బ్రిడ్జి దిగ గానే ఒక తండ్రి కూతురు నడిపే టిఫిన్ బండి అక్కడే వేడి వేడి గా పూరిలు తినేసి ఆకు కూరలు అమ్ముకోడానికి తన సైకిల్ మీద హుషారు గా వెళ్లి పోయే కుర్రవాడు .బతుకు పోరాటం లో ప్రతి వాడు పొద్దున్నే తమ వంతూ పోరాటానికి సిద్ద పడుతుంటే , ఆ బ్రిడ్జి పక్క నా ఫుట్ పాత్ మీద రాత్రి తాగిన మందు దిగక అదే ఎండలో పడుకునే ఆ బవిరి గడ్డం విగత జీవి .ఆ పూరిల బండి పక్కనే రోజూ ఆవురావురు మంటూ తినే ముష్టి దాన్ని చూసి మొదటి రోజు నేను ఆ బండి వాడికి ఆమె డబ్బులు ఎంతయ్యిందో చెప్పు ఇచ్చేస్తా అంటే లేదు బాబు నేను రోజు వూరికే ఆమెకి టిఫిన్ పెడతా అంటే అతని దాతృత్వం ముందు నా అహం కారం చిన్న బోయింది .ఆ బండి వరకు వెళ్లి రిటర్న్ అయి పోతా రోజూ .రిటర్న్ లో రోడ్ పక్క నే వున్న అమ్మవారి గుడిలో ఆ టైం కే పూజ చేసే అర్చకుడు,నమస్కరించి ముందుకు వెళితే ముగ్గు వేస్తూ నవ్వుతు చూసే కోడల్ని ఏంటే ఎంతసేపు రోడ్ మీద నీ ముగ్గు ముచట్లు అంటు అరిచే అత్తగారు కంగారు పడుతూ లోపలికి పారి పోయే ఆ కోడలు .ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే జీవితాంతం తిన వలసిన తిండి ని తొందర పడి ముందే తినేసి దాని వల్ల వచ్చిన వుబకాయం తద్వారా పెళ్ళికాని వైనం తో అది తగ్గించు కోడానికి ఆ పార్క్ చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఆ లావు పాప , ఆమె కి రక్షణగా ఎప్పుడు మీద పడి కరిచేద్దమా అని చూసే వూర కుక్క లాంటి పెంపుడు కుక్క , అది ఎవర్ని కరవ కుండ దాని మెడకి ఒక dome , దాటుకుని వెళుతుంటే అప్పుడే మంచి నీళ్ళు విప్పటానికి వచ్చే మీసాల వాటర్ వర్క్స్ వుద్యోగి ,వీ ల్లన్దర్నీ దాటుకుని ఇంటికి చేరగానే పెరట్లో నా కోసం ఎదురు చూసే మొక్కలు ,వాటి మద్య నేను ఆ రోజు కి పుడ్చవలసిన పంది కొక్కు బొక్కలు వెరసి నా నడకలో మిగిల్చిన అనుభూతులు .