15 మే, 2009

నడక లో నా అనుభూతులు


పొద్దున్నే బద్దకాన్ని వదిలించుకుని ఆరోగ్యం కోసం కొందరు , ప్రక్రుతి అందాల్ని ఆస్వాదించడానికి కొందరు ,ఆ వంకన బయట కొచ్చి ఇంట్లో మాట్లాడుకోలేని సెల్ ఫ్రెండ్స్ తో సొల్లు కబుర్లకి కొందరు , బతకడం కోసమే నడవడానికి కొందరు ఇలా రక రకాల వ్యక్తులు తారస పడుతుంటారు మార్నింగ్ వాక్ లో .పొద్దున్నే బ్రిడ్జి ముందు సైకిల్ ఆపుకుని తన వుపిరిని అ బుడగల్లో వూది దారాలతో గుత్తులు గా తాయారు చేసుకుని అమ్ము కో డానికి సిద్ద పడే ఆ బక్క బలూన్ అబ్బాయి ఎన్ని బుడగలు అమ్ముకుంటే జేవన పోరాటం లో ఆ రోజుకి సరి పడ సంపా యించ గలుగు తాడో ?అనుకుంటూ ముందుకు సాగి పోతుంటే .దూరం గా నా వైపే నడుచు కుంటూ వచ్చే ఆ అందమైన అమ్మాయి ,ఒక చేతి లో కుక్కని పట్టు కున్న గొలుసు ,ఇంకో చేతి లో చెవి దగ్గర పట్టు కున్న సెల్ , ఆమె కుక్క ప్రక్రుతి పిలుపు కోసం బయటకోచ్చిందా లేక సెల్ మాట్లాడుకోడానికి ఆ వంక నా బయట కొచ్చిందా?ఏమో వొర కంట చూసే ఆమెని దాటు కుంటూ ముందుకి పొతే బ్రిడ్జి కింద నుంచి అదే టైం కి దుసుకుంటూ పోయే ap express ఎంతొ మంది ఆశల్ని మోసుకుంటూ మరి కొందరి ఆప్తుల్ని విడ దీస్తూ ,నాకు టాటా చెపుతూ వెళ్లి పోతూ వుంటుంది .బ్రిడ్జి దిగ గానే ఒక తండ్రి కూతురు నడిపే టిఫిన్ బండి అక్కడే వేడి వేడి గా పూరిలు తినేసి ఆకు కూరలు అమ్ముకోడానికి తన సైకిల్ మీద హుషారు గా వెళ్లి పోయే కుర్రవాడు .బతుకు పోరాటం లో ప్రతి వాడు పొద్దున్నే తమ వంతూ పోరాటానికి సిద్ద పడుతుంటే , ఆ బ్రిడ్జి పక్క నా ఫుట్ పాత్ మీద రాత్రి తాగిన మందు దిగక అదే ఎండలో పడుకునే ఆ బవిరి గడ్డం విగత జీవి .ఆ పూరిల బండి పక్కనే రోజూ ఆవురావురు మంటూ తినే ముష్టి దాన్ని చూసి మొదటి రోజు నేను ఆ బండి వాడికి ఆమె డబ్బులు ఎంతయ్యిందో చెప్పు ఇచ్చేస్తా అంటే లేదు బాబు నేను రోజు వూరికే ఆమెకి టిఫిన్ పెడతా అంటే అతని దాతృత్వం ముందు నా అహం కారం చిన్న బోయింది .ఆ బండి వరకు వెళ్లి రిటర్న్ అయి పోతా రోజూ .రిటర్న్ లో రోడ్ పక్క నే వున్న అమ్మవారి గుడిలో ఆ టైం కే పూజ చేసే అర్చకుడు,నమస్కరించి ముందుకు వెళితే ముగ్గు వేస్తూ నవ్వుతు చూసే కోడల్ని ఏంటే ఎంతసేపు రోడ్ మీద నీ ముగ్గు ముచట్లు అంటు అరిచే అత్తగారు కంగారు పడుతూ లోపలికి పారి పోయే ఆ కోడలు .ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే జీవితాంతం తిన వలసిన తిండి ని తొందర పడి ముందే తినేసి దాని వల్ల వచ్చిన వుబకాయం తద్వారా పెళ్ళికాని వైనం తో అది తగ్గించు కోడానికి ఆ పార్క్ చుట్టూ ప్రదక్షిణాలు చేసే ఆ లావు పాప , ఆమె కి రక్షణగా ఎప్పుడు మీద పడి కరిచేద్దమా అని చూసే వూర కుక్క లాంటి పెంపుడు కుక్క , అది ఎవర్ని కరవ కుండ దాని మెడకి ఒక dome , దాటుకుని వెళుతుంటే అప్పుడే మంచి నీళ్ళు విప్పటానికి వచ్చే మీసాల వాటర్ వర్క్స్ వుద్యోగి ,వీ ల్లన్దర్నీ దాటుకుని ఇంటికి చేరగానే పెరట్లో నా కోసం ఎదురు చూసే మొక్కలు ,వాటి మద్య నేను ఆ రోజు కి పుడ్చవలసిన పంది కొక్కు బొక్కలు వెరసి నా నడకలో మిగిల్చిన అనుభూతులు .

12 వ్యాఖ్యలు:

Malakpet Rowdy చెప్పారు...

Cool!!!!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

"లేదు బాబు నేను రోజు వూరికే ఆమెకి టిఫిన్ పెడతా అంటే అతని దాతృత్వం ముందు నా అహం కారం చిన్న బోయింది ."
అహంకారమని ఎందుకనుకోవాలి,మంచి చేయడానికి మీ మనసు కూడా స్పందించింది కదా! కాకపోతే మనకన్నా చాలా ముందున్నారాయన మానవత్వంలో...

సుజాత చెప్పారు...

బాగుంది."అదే టైముకు దూసుకుపోయే AP ఎక్స్ ప్రెస్.....!ఇంత లేటా వాక్ కి!ఇంకా ముందే లేచి వెళ్ళి చూడండి, తెల తెలవారుతూ ఉండగా, ఆకాశంలో రవి ఇంకా నిద్ర లేవకముందే .

"ఇంటికి చేరగానే పెరట్లో నా కోసం ఎదురు చూసే మొక్కలు ,వాటి మద్య నేను ఆ రోజు కి పుడ్చవలసిన పంది కొక్కు బొక్కలు."

వీటికోసమైనా మీరు ఇంకా పెందలాడే లేవాల్సిందే!::)

అజ్ఞాత చెప్పారు...

బాగుంది రవిగారూ, మంచి టపా. ఇన్ని అబ్జర్వ్ చేస్తారా మీరు నడకలో?

పరిమళం చెప్పారు...

రవి గారూ ! బావుందండీ మీ ఉదయ వ్యాహ్యాళి .....నేను చెప్పాలనుకున్నది విజయ మోహన్ గారు చెప్పేశారు ...అదే నా మాట కూడా ..

ఉష చెప్పారు...

మీ నడకలో తారసపడ్డవారంతా గుర్తుకొచ్చే సరికి కాస్త దిగులుగావుందండి. నా గంట పరుగులో నాకు కనిపించేవి వాహనాలు, నావంటి ఒకరిద్దరు, చెట్లు,పక్షులు, బన్నీలు. ఆ చిత్రం కూడా కొంచం అటుఇటుగా ఏమీ మారదు. నిన్ననే విన్నాను న్యూయార్క్ లో కూడా ఒక శ్రీలంక తమిళుడు దబ్బులకి ఇబ్బంది పడే విద్యార్ధులకి అలాగే ఉచితంగా దోశలు వేసి ఇస్టాడని. అలాగే పెరట్లోని కాయలు అమ్మేవారిని ఈ దేశంలో కూడా చూసాను. చిలమకూరు విజయమోహన్ గారితో ఏకీభవిస్తున్నాను ఆ విషయమై.

కొత్త పాళీ చెప్పారు...

well done .. especially your observations about the train.

...Padmarpita... చెప్పారు...

రవిగారు... ఈసారి మీరు రూట్ మార్చి నడవండి... క్రొత్త అనుభూతులతో మరో టపా వ్రాయవచ్చు.

srujana చెప్పారు...

బాగున్నాయి మీ నడకలో అనుభూతులు.

రవిగారు చెప్పారు...

మలక్ ఆ టైం లో అంత కూల్ గా వుండ దండి , ..విజయ మోహన్ గారు డబ్బు లేని వాడె దాతృత్వం లో ముందు వుంటాడు డబ్బున్న పిసినారి వాడి కంటే .సుజాత గారు మీరనట్టు రోజూ krishna express టైం కే వెళ్ళాలనుకుంటే ap express టైం కి అవుతోంది .ఈ పంది కొక్కు పుణ్యమా అని రోజూ చదివే ఈనాడు కూడా చదవ లేక పోతున్న ఆఫీసు టైం అయి పోతుందని .అరుణ గారు నేను నడకలోనే అన్ని విషయాలు observe చేస్తే ఇంక జర్నలిస్టులు ప్రతి నిమిషాన్ని observe చేస్తూ వుంటారు .పరిమళం గారు ఈ రూపేణ నా బ్లాగ్ లో పరిమళాలు వెద జల్లినందుకు thx .ఉష గారు పరుగు పెడుతూ ఇలాంటివి గమనించడం కొంచెం కస్తమేనన్డి . అమ్మో రోజూ కి గంట సేపు జాగింగ్ అంటే మీరు ఇలియానా సిస్టర్ అన్న మాట .కొత్త పాళి గారు ఇలాంటి భావాలూ రైల్ లో వెళుతూ మనం అందరం ఎప్పుడో అప్పుడు పొందినవే గా .పద్మర్పిత గారు ఈ సారీ మీ రూట్ లోనే నేను నడిచి ఆ అనుభూతులు తప్పక రాస్తా కొంచెం మీ రూట్ ఏదో చెపితే .సృజన గారు బ్లాగ్ లోకం లోకి కొత్త గా అడుగిడిన మీకు నా నడక నచ్చడం సంతోష దాయకం . అందరికి మనసారా ధన్య వాదాలు .

durgeswara చెప్పారు...

ప్రభాతానకూడా రోజంతా చూసే బాధలూ గాధలేనా?కాస్త పరమాత్మ వైపుకు నడక సాగించటానికి ఉపయోగపడేలా చూసుకోవచ్చుకదా?.
భగవదాలయం లో ప్రదక్షిణలు,ధ్యానమో నామస్మరణ మో చేసుకుంటె రెండందాలా మేలు కదా! వారానికి కొన్నిరోజులిలా చూడండి. మొదట్లో .దాని ప్రభావం రోజంతా మనసుపై ఎలా వుంటుందో డైరీ లో రాసుకోండి. ఒక నెల రికార్డును పరిశీలించుకుని ఏది మేలనిపిస్తే దాన్ని అనుసరించండి.

రవిగారు చెప్పారు...

దుర్గేశ్వర గారు శనివారం , ఆదివారం వాకింగ్ లో గుడి కెళ్ళి ప్రదక్షిణాలు చెయ్యడం ఎలాగు జరుగుతుంది ఎటొచ్చి వాటికీ ప్రచారం అనవసరం అని నా భావన ఎందుకంటె అది బగావంతుడికి , భక్తుడికి మాత్రమే సంభందించిన విషయం ముడో వాళ్ళకి ఆ అనుభందం చెప్పినా అర్ధం కాదు. అది ఒక privileged communication అందుకే వారాంతపు అనుభూతులు ఇందులో పొందు పోరచ లేదు .