20 సెప్టెం, 2009

నా బ్లాగ్ సంవత్సరీకం


అబ్బే కంగారు పడకండి నేను పెట్టిన శీర్షిక నాకు తెలుగు సరిగ్గా రాక పెట్టింది కాదు . గత సెప్టెంబర్ లో'' సెప్టెంబర్ మాసం , అక్టోబర్ మాసం''అంటూ పాడుకుంటూ ఎవరో రావాలి అంటూ నా బ్లాగ్ వొక సుముహుర్తన్ని మొదలేట్టేసా .మూడు నెలల లోనే అది వొక మహా సంచలనానికి నాంది వాచకంఅవుతుందని అని ఆ సమయం లో నాకు తెలీదు . మెల్లిగా నాకు తోచింది రాసుకుంటూ ముందుకు సాగుతుంటే చాలా మంది బ్లాగర్లు తమ కామెంట్స్ తో ప్రోత్సహించే వారు .వొక రోజు'' ఈ తెలుగు'' సమావేశాలు ఆదివారం మధ్యానం కేబిఆర్ పార్క్ లో జరుగు తున్నాయని దాన్లో హైదరాబాద్ లో వున్న బ్లాగర్లు అంతా పాల్గొంటారని తెలిసి నేను వెళ్ళడం జరిగింది. అక్కడే ఎందరో మహా మహులు (తాడేపల్లి ,వివేన్ , పద్మనాభం ,కత్తి, జ్యోతి , అరుణ ఇంకొందరు )పరిచయం అయ్యారు .ఇంక సాహిత్య పిపాసకుడనై గ్రోలేయ్యడమే అనుకుంటూ ఇంటి మొఖం పట్టా .ఇంతలోనే జ్యోతి గారు నా బ్లాగ్ కి templetes పెట్టి మెరుగులుదిద్దుతానంటే పాస్ వర్డ్ ఇస్తే దాన్నొక సుందర వనం లా తీర్చి దిద్దారు .ఇది జరిగిన కొన్నాళ్ళకి నెక్లస్ రోడ్ లో పుస్తక ప్రదర్సన లో తెలుగుబ్లాగ్స్ ప్రచారం కోసం (వాస్తవానికి ఈ తెలుగు ప్రచారం కోసం )వొక స్టాల్ కేటాయించారని మన బ్లాగర్లు కుడా వీలు చూసుకుని కొంత సమయం కేటాయిస్తే బావుంటుందని మిత్రులు చెప్పడం తో అంతా కూడ బలుక్కుని వొక సాయంత్రం అక్కడ కలిసాం .అప్పుడే మరి కొంత మంది బ్లాగర్లు (రమణి , నేనులక్ష్మి ,చక్రవర్తి స్వాతి దంపతులు ,సుజాతగారు మరికొంత మంది )ముఖాముఖి పరిచయం అయ్యారు .అక్కడే జ్ఞాన ప్రసూనా గారు బూర్లు , జ్యోతి గారు రవ్వ లడ్డులు తెచ్చి అందరికి ఇచ్చారు .నేను ఇంటికి రాగానే అందరికన్నా ముందు యి విషయాల్ని బ్లాగ్ లో పెట్టాలని ''మన సంత బ్లాగర్స్ ''http://ravigaru.blogspot.com/2008/12/blog-post_25.హ్త్మ్ల్ అంటూ రాసేసా.
అందులో జ్యోతి గారు తెచ్చినవి లడ్డులా ? సున్నున్దలా అని వాదాలు సరదాగా జరగడం తో అవికూడా రాసా. అంతే అంతవరకు ఆహ వోహో లో తప్ప సరదాకి కుడా వుహు లు చూడని సదరు బ్లాగర్ బయన్కరమైన కామెంట్ రాసారు (యి మద్యనే సదరు బ్లాగర్ నా బ్లాగ్ లో రాసిన కామెంట్స్ అన్నికుడా డిలీట్ చేసుకున్నారని ఇప్పుడే గ్రహించా)దానికి నేను ఎంతొ వినమ్రంగా వివరణ ఇచ్ఛా కుడా . ఇంతలొ మరో ప్రమదావనం సభ్యురాలు మాది సంత అంటావా అన్నా ఆయీ అంటూ మీదకి వచ్చారు కామెంట్ రూపం లో వారికీ కుడా వివరణ ఇవ్వడం జరిగింది .అక్కడితో యి సమస్య సద్దు మనిగిందని అనుకున్నా గాని నివురు గప్పిన నిప్పులా అవకాశం కోసం చూస్తున్నారని అప్పుడే తేలి లేదు .ఇంతలొ అరుణ గారు ''ఎవరికి తెలియని కధలివిలేhttp://arunam.blogspot.com/2009/01/blog-post_8969.htm '' అంటూ బోల్డు గా శృంగార సంబందమైన సబ్జెక్టు మీద తన బ్లాగ్ లో రాసారు . దానికి నేను రెండు సినిమా సంఘటనలు ఉదహరిస్తూ వారిని అభినందిస్తూ రాస్తే ఆమె కామెంట్ ని ప్రచురించ కుండా రవిగారు మీరు రాసిన సంఘటనలు ఎబ్బెట్టు గా అని పించి ప్రచురించలేదు అంటూ వివరణ ఇచ్చారు , దానికి ప్రతి గా నేను జనాలు అపార్ధం చేసుకోకూడదని నా బ్లాగ్ లోనే'' అరుణగారు తొలగించిన నా కామెంట్స్ అంటూ రాసా''(http://ravigaru.blogspot.com/2009/01/blog-post_15.హ్త్మ్ల్) , అంతే అవకాశం కోసం ఎదురు చూస్తున్న సదరు బ్లాగర్ మీరు రాసింది ఆస్సిలమే , అందుకే ఆడవాళ్ళూ స్వేచ్ఛా గా రాయలేక పోతున్నారు అని కామేంటారు దానికి కుడా నేను వివరణ ఇచ్ఛా . యి సంధర్బం లో మరువం ఉష గారు తన కామెంట్ ద్వారా నన్ను సమర్దించడం నాకు మానసిక బలాన్ని ఇచ్చింది.ఇంతలొహతా ట్టు గా నా బ్లాగ్ రూపు రేఖలు మారి పోయి (templetes ని లేపెయ్యడం తో )అప్సరస లా వుండే బ్లాగ్ కోతి లా తయారయ్యింది .
దాంతో ''కుళ్ళుమోతు కోతి '' అన్న నా పోస్ట్ లో ఎవరో templetes మార్చి వుండడం చేతా నా బ్లాగ్ రూపు రేఖలు మారి వుంటాయని అనుమానం వ్యక్తం చేశా .అంతే అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్టు గా సదరు బ్లాగర్ ప్రమదావనం లో వాడికి , వాడి బ్లాగ్ కి పాడి కట్టాలి , దానికి మన మహిళలంతా నడుం కట్టాలి అంటూ వాళ్ళని వుసి గోలిపితే వాళ్ళలో వున్న కొంత మంది హితులు యి విషయాన్నీ మనకి చేర వేసారు దాంతో'' ప్రమదావనం లో చర్చించ వలసినంత అవసరమా? ''http://ravigaru.blogspot.com/2009/01/blog-post_29.హ్త్మ్ల్ అంటూ నేను పోస్ట్ రాసాను .ఎప్పటినుంచో సదరు బ్లాగర్ మీద కోపం తో వున్న కొంతమంది dhoommachara ,కాగడా రూపం లో వాళ్ళ కోపాన్ని వెళ్ళ గక్కారు .అదే సమయం లో బ్లాగ్స్ లోకి ప్రవేశించిన మలకపేట రౌడీ (మిత్రుడు భరద్వాజ్ )నిస్పక్సపాతం గా తనదైన శైలి లో కామెంట్స్ రాస్తూ కెలకడం మొదలెట్టాడు .ఇప్పుడు పరిస్తితి నా చెయ్యి దాటి పోయి ఎక్కడికో వెళ్లి పోయింది .ఇందులో ఇశన్ మాత్రం నా ప్రమేయం గాని , ప్రోద్బలం గాని ఏమి లెవ్ .ఇక అక్కడినుంచి కాగడ నేనని , ధూం నేనని ప్రచారం మొదలైతే ''దేవి కరుణించుము '' అంటూ పోస్ట్ రాసి నేను కాదు మొర్రో అని మొత్తు కోవలసి వచ్చింది .
అసలు బ్లాగింగు కి వచ్చిన వుద్దేశం మనసులో భావాలకి అక్షర రూపం ఇచ్చుకుందామని వస్తే వేరే వాళ్ళ మనస్సులో భావాలకి వ్యంగ రచనలు రాయవలసిన పరిస్తితి దాపురించింది .కాలాంతరమున బ్లాగర్లు నిజం గ్రహించడం తో అంతా చప్ప బడి కాగడ , ధూం కూడా యాదృచ్చికం గా మరుగున పడి ,నేనుకూడా కోతుల్ని మానేసి పందికొక్కుల మీద , నా నడకల మీద రాసుకుంటూ మెల్లిగా ట్రాక్ లో పడి ''వొక విటుడి ఆత్మ కధ ''http://ravigaru.blogspot.com/2009/04/blog-post_13.హ్త్మ్ల్ రాసా.నేను ట్రాక్ లో పడ్డా గాని, అప్పట్లో నేను'' కూడలి లో కాక హోటల్'' పెట్టిన కొత్తలో ప్రోత్సహించిన ఎంతొ మంది బ్లాగ్మిత్రులు వొక సుజాతగారు ,ఉషగారు , నాకు బ్లాగ్ పెట్టడానికి స్పూర్తి అయిన నిషిగంధ గారు ,ఉమాశంకర్ ,ఇంక ఎందరో మళ్ళి నా బ్లాగ్ లో దర్సన భాగ్యం కలగ చెయ్యలేదు .పైన చెప్పిన గొడవల్లో వారి వర్గం , వీరి వర్గం , వైరి వర్గం గా విడగొట్టి బ్లాగ్ లోకాన్ని మూడు ముక్కలు గా చెయ్యడం తో స్వేచ్చగా బ్లాగరులు చదివి తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటం గా పెట్టె పరిస్తితి మృగ్యం. వాళ్ళు మాత్రం ఇంకా ట్రాక్ లో పడినట్టు గా లేదు. ..నేను ఏ వర్గానికి చెందకుండా అందరి వాడులా బ్లాగ్ లోకం లో రాసుకు పోవడమే ద్యేయం గా పెట్టుకున్నా .యి సంవత్సరీకం సందర్భంగా పాత ద్వేషాలకి పిండ ప్రదానం గావించి (నా బ్లాగ్ ని పాడి కట్టించి నట్టు గా భావించి ) యదావిధిగా కూడలి లోనా త్రి స్టార్ హోటల్ కి విచ్చేసి మా చే వండి వడ్డించ బడిన పోస్ట్స్ లో మీకు నచ్చినవి గ్రహించి , నచ్చనివి త్యజించి ,మా సాహితి దేవతలను తరింప జేయ ప్రార్దన . యి సందర్బంగా దస గాయత్రి మంత్రం జపిస్తూ సర్వె జనా సుఖినో భవంతు . అనట్టు టిప్స్ రూపం లో మీ కామెంట్స్ పడెయ్యడం మాత్రం మరువకండే.

12 కామెంట్‌లు:

Bhardwaj Velamakanni చెప్పారు...

Congratulations!

మరువం ఉష చెప్పారు...

Congrats, రవిగారు!

As per your complaint, check out నడక లో నా అనుభూతులు, యండమూరి అరుదైన photo

If not commneting is your benchmark for the above, would you suggest to me that I say the same to you then? :)

Tell me one that is not suffered from lack of time. And often times hard to remember all in this blogsphere where each day there is flood of new arrivals.

Good luck with blogging and have productive time spent over next many more years.

కాగడా చెప్పారు...

రవిగారు,
మీ పొస్టులొ రాసినట్టు నాకైతె ఎవరిమీదా కొపం లెదు. వారెమన్నా నాకు శత్రువులా. నా ఆస్తి కాజెసారా చెప్పండి. ఎదొ సరదాగా కొన్ని పొష్టులు రాస్తె అవి కొంచం మితిమీరి చర్చనీయాంశాలయ్యాయి. ఈ లొపు కొందరు దొంగ పెర్లతొ నన్ను తీవ్రంగా రెచ్చగొట్టారు. అందరూ తలో చెయ్యీ వెసి తమాషా చూశారు. కాగడా దోషి గా మిగిలాడు. ఇంకోపక్క అందరూ అంతర్లీనంగా రాసెది రాస్తున్నది శ్రుంగారం గురించె. కాదనగలరా. నా పాయింటు ఇప్పటికీ రైటె. అందరి రాతల్లో ముసుగులూ తొలగిస్తె మిగిలెది అదె అని అందరికీ తెలుసు. కాని బాహాటంగా చెప్పెది కాగడా ఒక్కడె. అందుకె మళ్ళీ ఒచ్చా. ఈ సారి నాకు ఎవరితొ గొడవలు అవసరం లెదు. స్నెహమూ అక్కర్లెదు.నా ధొరణి నాది. ఇదంతా లిటరరీ నాసియా అని నాకు తెలుసు. మీరు మామూలుగా రాయండి. ఇక్కడ ఎవరికీ ఎవరి మెప్పులూ అక్కర్లెదు. సెల్ పొన్ నంబర్లు అసలె అక్కర్లెదు. ఒకవెళ ఎవరన్నా ఇస్తానంటె నాకు ఇప్పుడున్న వాళ్ళతొనె తీరిక లెదు. నెను కొత్త వాళ్ళకొసం వయగ్రాలు మింగలెను. :)

ఏక లింగం చెప్పారు...

మీ బ్లాగు ప్రథమ వర్దంతికి నా శుభాకాంక్షలు.

(హి..హి..వర్దంతికి శుభాకాంక్షలేంటి నా బొంద, అనుకోకండి. ఏదో మీరు సంవత్సరీకం అన్నారని...అంతే..!!)

Unknown చెప్పారు...

భరద్వాజ్ ,కాగడా , ఏకలింగం ధన్యవాదాలు .ఇక ఉష గారు నా ప్రతి పోస్ట్ లోను మీ మరువపు పరిమళాలు ఆశించడం తప్పుకాదేమో ?మీరనట్టు సమయా భావం వొక ప్రతి భంధకం వొప్పుకుంటా . నేను కుడా మీ తోటలోకి వచ్చి ఆ పరిమళాల గుభాలింపులు ఆస్వాదించవచ్చు కరక్టే అదే ప్రశ్న నన్ను అడిగితె నా దగ్గర ఆన్సర్ లేదు .ఇక నుంచి పండగ బంపర్ ఆఫర్ మీరు రాసిన ప్రతి పోస్ట్ కి విధిగా నా కామెంట్ రాస్తా నిర్మొహమాటం గా కాసుకోండి .మీ నిరీక్షణ కి ఆఖరి మజిలి నేనే .
బాబు రాం ఆల్రెడీ ఆడ్ చేసేసుకున్నా దాన్ని మల్లి ఆడ్ చేసుకో అంటే ఏటి చెయ్యను .ఏక లింగం గారు నా పోస్ట్ కి మొదటి కామెంట్ అలాగే వుంటుందనుకున్న .

Malakpet Rowdy చెప్పారు...

నా ప్రతి పోస్ట్ లోను మీ మరువపు పరిమళాలు ఆశించడం తప్పుకాదేమో ?మీరనట్టు సమయా భావం వొక ప్రతి భంధకం వొప్పుకుంటా . నేను కుడా మీ తోటలోకి వచ్చి ఆ పరిమళాల గుభాలింపులు ఆస్వాదించవచ్చు
_______________________________

సారూ! కళాపోషణ కాస్త ఎక్కువయ్యింది :)) మరీ ఇంత డబల్ మీనింగా?? తెలుగు బ్లాగర్లు అమాయకులు సారూ!!

(హమ్మయ్యా! పుల్ల పెట్టేశా!! ఇక మీరు కొట్టుకోవడమూ, నాకు టైంపాసూనూ )

Unknown చెప్పారు...

అమ్మో మలక్ యెంత గిరాకులు లేక పొతే మాత్రం మమ్మల్నే కేలకాల .?మీ కెలుకుడు మేము మరువం ,అలాగని కరువం , ఎవరి మాటలకి వెరవం .డబల్ మీనింగులు ఆడటానికి దాటేసాం గా ఆ పరువం .

భావన చెప్పారు...

good luck "ravi garu" garu.:-)

Padmarpita చెప్పారు...

హమ్మయ్య!!! సంవత్సరీకం అయిపోయిందిగా....
ఇంక పండగే పండగన్నమాట!

Malakpet Rowdy చెప్పారు...

డబల్ మీనింగులు ఆడటానికి దాటేసాం గా ఆ పరువం .
___________________________________

అంటే మీ వయసు 27 కాదా? రీడిఫ్ జనాలకి చెప్పేస్తా ఉండండి :))

కత పవన్ చెప్పారు...

రవిగారు గారు,
best అప్పు luck సార్

పరిమళం చెప్పారు...

రవిగారు , వార్షికోత్సవ శుభాకాంక్షలు !