మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
15 అక్టో, 2009
నడక లో మరో లాభం
నడక లో ఆరోగ్యం తో పాటు మరి కొన్ని లాభాలు వున్నాయని యి రోజే తెలుసు కున్నా .యి రోజు రోజు టైం కన్నా కొంచెం ఆలస్యం గా నడకకి బయలు దేరా .ఎప్పుడు వెళ్ళే రూటే . బ్రిడ్జి ఎక్కటానికి కొంచెం ముందే కార్ లోంచి వొక ఆమె నన్ను చూసి చేతులు వుపుతోంది , గతంలో యిలాగే వొక ఆమె వుపితే నేను వుపా ఆమె కార్ ఆపి నా దగ్గర గా వస్తుంటే మీరు అన బోతున్నా ఇంతలొ నా వెనక నుంచి ఇంకో అతను వచ్చి ఏంటి ఇంత లేట్ అనుకుంటూ ఇద్దరు అదే కార్ లో నా కళ్ళ ముందే దుమ్ము లేపుకుంటూ వెళ్లి పోవడం గుర్తు కు రావడం తో వెనక ఎవరన్నా వున్నారేమో చూసుకుంటే ఎవరు లేరు . అయితే నడకలో నా ముందు వెళ్ళే వాళ్ళు వాళ్ళలో వాళ్లే ఏదో మాట్లాడేసుకుంటూ చేతులు గాలిలో వుపేస్తూ , మళ్ళి నవ్వుకుంటూ వెళ్ళే వాళ్ళు వొకరిద్దరు ఎదురవుతూ వుంటారు . మానసిక వత్తిడి బాగా ఎక్కువై పోయి చెప్పుకోడానికి ఎవరు లేక పొతే ఇలాంటి పరిస్తితి వస్తుందని మా డాక్టర్ ఫ్రెండ్ చెప్పాడు . అయితే ఇది మరింత ముదిరి పోయి కార్ లో వెళ్ళే ఆడ మగ కుడా గాల్లో చేతులు కాళ్ళు వుపుకుంటూ వెళ్ళే అంత అయిపోయిందని ఆమెని చూసి నవ్వుకుంటూ ముందుకి వెళ్లి పోయా ఏమి వూప కుండా . ఆమె అయినా గాని ఆపకుండా వుపుతూ టక్కున నా దగ్గరకి వచ్చి బ్రేక్ వేసింది .తీరా చుస్తే ఏడేళ్ళ క్రితం నా స్నేహితురాలు తారక .వొక్క సారి గా అన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఎక్కడ సంభాషణ మొదలెట్టాలో ఆలోచించే అంతలోనే మీ సెల్ నెంబర్ చెప్పండి నే చేస్తా ప్రస్తుతం మా అమ్మాయిని దింపి నేను ఆఫీసు కి వెళ్లి పోయే హడ విడిలో వున్నా అంటే ఇచ్ఛా . తర్వాత తనే చేసింది కొంచెం సేపటికి .
రోజు తను ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళే టైం నేను నడకలో ఫుట్ పాత్ మీద నడుస్తూ కని పించే టైం వొకటే నట .గత నేల్లాలుగా చూస్తూ ట్రాఫిక్ మద్యలో ఆపి పిలవలేక వెళ్లి పోతోంది . యి రోజు నాకు కొంచెం లేట్ అయ్యి బ్రిడ్జి మొదట్లోనే కనబడటం తో పట్టు కో గలిగినది .అంటే యిలా మనకి తెలీకుండా చాల మందే observe చేస్తారన్న మాట . యి రోజు ఇతను ఇంకా రాలేదేమిటో అని మన కోసం చమ్మ గిల్లు నయనమ్ములు కూడా వుండు నేమో అని కాస్త ఎక్కువగానే వూహించుకుని మర్నాడు పొద్దున్నే లేవడానికి స్పూర్తి పొందనన్న మాట .ఆమె ఏడేళ్ళ క్రితం గవర్నమంట్ జాబ్ వదిలేసి సాఫ్ట్వేర్ కి జంప్ అయ్యి బెంగుళూరు వెళ్ళడమే తెలుసు తర్వాత టచ్ లో లేను . ఇప్పుడు నడక పుణ్యమా అని మళ్ళి ఇన్నాళ్ళకి .సో నే చేపోచ్చేదేంటంటే పార్కులు ,ఇళ్ళలోనూ నడవడం మానేసి చక్క గా footpath ల మీద పొద్దున్నే నడిస్తే ఇలా తప్పి పోఇన స్నేహితులు దొరికే అవకాశం కూడా వుండును . కాబట్టి పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం ఫుట్ పాత్ కు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
13 కామెంట్‌లు:
గొప్పోళ్ళే.... తప్పి పోయిన స్నేహితులను కనిపెట్టటమేమో... మీరు చెప్పింది చేస్తే ఆ దుమ్ము ధూళి కి కూసిన్ని రోజు లలో తప్ప కుండా ఎలర్జీస్ మాత్రం కనపడతాయి. :-)
రవిగారు....లాభం అని సగమే చెప్పినట్టున్నారు!!!:)
తారకలు కలిస్తే ఫరవాలేదు. "తాటకి" కనిపిస్తేనే ఇబ్బంది :))
పోన్లేండీ మీకు తెలిసిన తారకే కనపడింది :) చూసారా నడకలో సదుపాయం. ఇక్కడ కూడా అంతే ఒక సమయానికి వెళ్తే కొందరు, మరొక సమయానికి మరి కొందరు [కాకపోతే అయిదు మైళ్ళకి ఒకరో ఇద్దరో...] కలుస్తారు.
ఆ చేతులు కాళ్ళ వాళ్ల తలకి హెడ్సెట్ పెట్టుకున్నారేమో చూసారా? ఇక్కడ సెల్ ఫోన్/ఐపాడ్ తో వూసులాడుకునేవారు అధికం.
ఆ మధ్య అక్కడకి వచ్చినపుడు ఒకడు నా వెంట పడ్డాడు మీరు అన్నపూర్ణ కదా నేను శకుంతల అన్నయ్యని. మునుపు గౌలిగూడ దగ్గర కలిసాం అంటూ. కాదన్నా వినడే, వదిలించుకున్నాను కానీ, మహా జిడ్డుఘటం.
అక్కడ భావన అన్నట్లే నేను పదీ పదిహేను నిమిషాల కన్నా బయట నడవలేను. ఎలర్జీస్ పోలోమంటూ చేరిపోతాయి.
గుడ్ లక్ విత్ వాక్స్.
ఉష! గౌలిగూడ గల్లికాడ సల్లగా గిల్లినోడ పోకిరీ పోరగాడ ....
పాత తారలు,ప్రస్తుత తారలు
జాగ్రత్త మీ పలుగు పారలు
భావన గారు మీరు హైదరాబాద్ వచ్చి మస్తు రోజులు అయినట్టు వుంది. ఇక్కడ పచ్చికైన ,ఫుట్ పాత్ అయినా వొకటే కాదేది కాలుష్యానికి అనర్హం సో రెండు పక్కలా ఎలర్జీ వునప్పుడు ఫుట్ పాత్ అయితే కొంచెం ఎనర్జీ గా వుంటుందని కవి భావం .
పద్మార్పిత గారు మిగత సగం మికోదిలేసా కవితా రూపం లో రాస్తారని .
మనిషి రోడ్డున పడ్డాక తాటకైనా భరించాలి తారకైనా భరించాలి భరద్వాజ్
ఉష గారు నా నడక లో కనిపించకుండా మురిపించే వాళ్ళు కూడా వుంటారు ''.మామిడికాయ పచ్చడి , అల్లం పచ్చడి '' అంటూ ఎవడో సైకిల్ మీద అరుస్తూ అమ్ముకుంటూ వుంటాడు పక్క విధిలో . వాడి గొంతు వినపడ్డమే గాని ఇంతవరకు చూడడం పడలేదు . అలాగే ''చామంతి పూలూ , బంతి పూలూ గులాబీలు'' అంటూ ఇంకో గొంతు .''నీ అమ్మ కడుపు మాడ నీళ్లు ఆగి పోతాయి తొందర గా పట్టి చావు ఆ పిల్ల వెదవని వదిలేసి '' అంటూ ఎవడో బద్దకిస్టు బాబు రావు గొంతు గుడి అవతల గోడ నుంచి వినిపిస్తూ వుంటుంది రోజు . విల్లనేవ్వరిని ఇంట వరకు చూడ లేదు గాని రోజు వాళ్ళ గొంతు వినడం మాత్రం తద్యం .
ఇంక మీ శకుంతల అన్నయ్య విషయానికి వస్తే అన్నపూర్ణ అతని దగ్గర ఆరు లక్షల అప్పు తీసుకుని పత్తా లేకుండా పొఇన దగ్గరనుంచి ప్రతి ఆడ మనిషిని మీరు అన్నపూర్ణే గా అనడం అలవాటయ్యిందని వేగుల సమాచారం .
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .
మాలకుమార్ గారు యి దీపావళి నుండి మీ''కమ్మటి కలలు'' ''చల్తే చల్తే'' ఏ''పరీక్షలకి ''గురి కాకుండా'' 'సాహితి ''వనం లో నెరవేరాలని మన సారా కోరుకుంటూ ధన్యవాదాలు .
నడకవల్ల చేకూరేలాభాల్లో ఇదొకటన్నమాట ! మరి నేనూ మొదలెడితే నా స్నేహితులు దొరకొచ్చంటారా ? అసలు వాళ్లు హైదరాబాద్ లో లేకపోతేనో ...ఒకవేళ ఉన్నా వారికి కారులేకపోతెనో ...అన్నిటి కంటే ముఖ్యంగా మాఇంటికి దగ్గర్లో బ్రిడ్జ్ లేదండీ :) :)
ముందు హైదరాబాద్ లో వున్న మా సంగతి పట్టించుకోండి
.కారు వుంది , నడకా వుంది చూడాలనే ఆశ తప్పా
కొంచెం మీ ఇల్లెక్కడో చెపితే మీ నడక టైం కి కార్ వేసుకుని
చేతులు వుపుకుంటూ తిరుగుతా, హలో పరిమళం గారు అంటూ
ఎవరు స్పందిస్తారో వారె పరిమళం .
హహహ మాటలకు వెతుక్కొరు కదండి మీరు అందరికి సమాదానం చెప్పారు
@ రవిగారూ :) :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి