1 నవం, 2009

పిడతకంది పప్పు

మొన్ననే కాకినాడ లో చుట్టాల పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది మా అమ్మ గారి నిర్భంధం వల్ల.చుట్టూ పక్కల వున్న ద్రాక్షారామం , కోటిపల్లి , సామర్లకోట లో ప్రసిద్ధ శివాలయాల దర్సనం అయిపోయాక ఇంకా సమయం వుండడం తో వొకసారి చినప్పుడు సెలవలకి వెళ్లి గడిపిన మా అమ్మమ్మ గారి ఇంటిని చూడాలని పించింది ,చాల ఏళ్ళ క్రితమే మా అమ్మమ్మగారు పోయిన కొత్తల్లోనే ఆ ఇల్లు అమ్మేసారు .అది సూర్యారావుపేట లో దయల్బాగ్ స్టోర్స్ వీధి లో వుండేది .ఆ యింటి తో చినప్పటి జ్ఞాపకాలు చాలా వున్నాయి .
ఎదురుగుండా డాక్టర్ నారాయణ మూర్తి గారి ఇల్లు .అప్పట్లోనే అయన పేరున్న డాక్టర్ ,వాళ్ల అమ్మాయి , అబ్బాయి నా యీడు వాళ్లే రెడ్ కాన్వెంటు లో చదువుతూ వుండేవారు ,అప్పట్లో కాకినాడలో రెడ్ కాన్వెంటు , బ్లూ కాన్వెంటు ప్రసిద్ది చెందిన స్కూళ్ళు .వాళ్ళు పుట్టపర్తి సాయిబాబా భక్తులు . ప్రతి గురువారం వాళ్ళింట్లో భజనలు చేసి ప్రసాదం పంచేవాళ్ళు .సెలవలకి వెళ్ళినప్పుడు నేను భజనలకి వెళ్ళే వాణ్ణి , వొకసారి (ఆ వయసులోనే) వాళ్ల అమ్మాయిని ఇంప్రెస్స్ చేసేద్దామని నేను పాడతా అంటూ వొక పిలుపులో పిలిచితే అంటూ వెంకటేశ్వర భక్తీ గీతం అందుకుంటే వాళ్ల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడి ఏమి అనలేక భజన అయిపోయాక సాయిబాబా భజనలో వేరే పాటలు పాడాకుడదని చెప్పారు ,ఆ ఇల్లు ఇప్పటికి అదే shape లో వుంది పాతకాలపు వాసనలతో .ఆ విధి లో అప్పట్లో వాల్లోక్కరికే కార్ వుండేది . దాన్ని స్టార్ట్ చెయ్యాలంటే ముందు జెడ్ shape రాడ్ తో తిప్పేవారు .మా ఇంటి పక్కనే భానుడి గారి ఇల్లు వుండేది ఇప్పుడది మొండి గోడలతో వుండి పోయింది .దాన్ని చూసే మా అమ్మమ్మ గారి ఇల్లు గుర్తు పట్టా . ఇప్పుడు అక్కడ క్యారియర్ ఏ సి షో రూం వచ్చేసింది వొకప్పుడు పిల్లలం అంతా అక్కడే నూతి గట్టు దగ్గర , జామి చెట్ల కింద ఆడుకుంటూ వుండే వాళ్ళం . సాయంత్రం ఆరు దాటగానే వీధి బయటకు వచ్చి ఎదురు చూసే వాళ్ళం పిడత కందిపప్పు మూడు చక్రాల బండి కోసం .దూరం నుంచి గుడ్డి దీపం పెట్టుకుని బండి ని రెండు చక్రాల మీద తోసుకుంటూ వచ్చే ఆ ముసలి అబ్బి కోసం .పది పైసలకే బోల్డు ఇచ్చేవాడు .ఆ రుచి ఎప్పటికి మర్చి పోలేను , ఆ బండిని అతను గాంధి నగరం పార్క్ దాక తోసుకుని వెళ్లి అక్కడే అమ్ముకునే వాడు .నేనెప్పుడు కాకినాడ వెళ్ళిన గాంధీనగరం పార్క్ దగ్గర పిడత కంది పప్పు మిస్ అవ్వను .కార్ ని పార్క్ దగ్గరే ఆపించేసి డ్రైవర్ ని నేను వాక్ చేసి వస్తా నువ్వు బయట వుండని వెళ్లి చుట్టూ తిరిగి చుస్తే ఎక్కడ బండి కనబడ లేదు ,నిరాశగా కార్ ఎక్కుతూ యధాలాపం గా డ్రైవర్ ని అడిగా ఇక్కడ పిడతకంది పప్పు ఎక్కడ దొరుకుతుందని .అదేదో విదేశి కంది పప్పేమో సారూ అడుగుతున్నారు రిస్క్ ఎందుకని సుపెర్మర్కేట్ లో దొరకచ్చేమో బాబయ్య అంటూ నీళ్ళు నములు తున్నాడు .ఇంతలొ నా కావలసిన బండి కని పించగానే కార్ ఆపమని బండి దగ్గర కెళ్ళి పిడత కందిపప్పు కట్టమన్న నా కేసి ఎగా దిగా చూసి అటుకుల బటనీల పప్పేనా బాబయ్య అని అడుగుతున్నా బండివాన్ని అవునని తలూపి ,ఇప్పుడు ఆ పేరు ఎవరు వాడటం లేదా అన్నా ,వొకప్పుడు అటుకుల మద్యలో పిడత వేడి వేడి ధీ పెట్టి బుడ్డి దీపం వెలుగు లో అమ్మే వాడండి మా అయ్యా ఇప్పుడు అవన్నీ మారి పోయి యి బళ్ళు వచ్చేసయండి ఆయీ .అంటూ రెండు పొట్లాలు నా చేతి లో పెడితే డ్రైవర్ కి వొకటి ఇచ్చి నేనొకటి తీసుకుని తింటే అదే రుచి , అదే జ్ఞాపకం . బండి లో వున్న ఎఫ్ ఏం రేడియో నుంచి గుర్తు కొస్తున్నాయి గుర్తు కొస్తున్నాయి అంటూ వస్తున్న పాట యద్రుచ్చికమో ,బగవద్విదితమో గాని నా చుట్టూ అప్పుడు అప్పటి బాల్య స్నేహితులు , ఎదురింటి నుంచి ఆసక్తి గా గమనిస్తున్న డాక్టర్ గారి అమ్మాయి వల్లి కళ్ళ ముందు మెదిలి , కళ్ళ నుంచి ఆనంద భాష్పాలో ?అసృధారలో జల జల రాలుతుంటే కారం ఎక్కువయ్యిందా బాబయ్య అంటూ అడుగుతున్నా బండి వాడి పిలుపుతో యి లోకం లోకి వచ్చి ఇంకో రెండు పొట్లాలు అమ్మకి కూడా కట్టించుకుని భారం గా కార్ లో అడుగు పెట్ట గౌతమి కి టైం అవుతోందని .

21 కామెంట్‌లు:

satya చెప్పారు...

అది పిడత కింద పప్పు కదండీ?

అజ్ఞాత చెప్పారు...

can sing other gods' in puttaparthi sai bhajan, no objections in kakinada area.

మరువం ఉష చెప్పారు...

నేననుకోవటం మీరు యెంతమందికి సరైనపదం తెలుసా అని పరీక్షించటానికి ఇలా శీర్షిక మార్చి పెట్టారేమోనని.
పిడత (చిన్న మట్టి పాత్ర) లో నిప్పులు పోసి [చెంబు ఇస్త్రీ కి వాడినట్లుగా] అది మరమరాలు [అటుకులు వాడతారేమో చూడలేదు] పోసిన వెడల్పాటి బుట్ట మీద పెట్టి, వేపిన వేరుసెనగపప్పు, బజ్జీలు, ఉల్లిపాయ ముక్కలవీ వేసి, కారం, నిమ్మరసం కలిపి చేస్తారు కదా? మేము ఇప్పటికీ ఇంట్లో చేసుకుంటూనేవుంటాం. మీరన్నట్లుగా బళ్ళ మీద తిని మాత్రం చాలా ఏళ్ళే అయింది. ఇలాగే బజ్జీల బళ్ళు, మొక్కజొన్న పొత్తుల బళ్ళు, జామకాయల గంపలోళ్ళు. అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లో పాల కోవ అమ్మే ఇల్లు, పూల వాళ్ళు.... వేటికవే ఓ ప్రత్యేకమైన జ్ఞాపకాలు. ద్రాక్షారామం ఇంకా జీర్ణావస్థ లో వుందేమో. పది సం. క్రితమే చూస్తే బాధనిపించింది. కాకినాడ కాజా కూడా తీసుకువెళ్ళారా మరి? ఆ ప్రాంతాల్లో తిరిగినపుడూ పంటి ఎక్కటం మరొక విశేషం.

మరువం ఉష చెప్పారు...

కంది పప్పు వేయని ఈ అల్పాహారం పేరు, పైన వ్రాయటం మరిచాను - "పిడత కింద పప్పు"

సుజాత వేల్పూరి చెప్పారు...

రవిగారు, పిడత కింది పప్పు---కంది పప్పు--అది typo అయి ఉంటుంది లెండి!Am I right?

ఉషా, భలే వర్ణించారు గా!

uma blog చెప్పారు...

ఏదో సినిమా లో విన్నా పిడత కింద పప్పు అని అప్పుడు అర్థం కాలేదు ఇప్పుదు తెలిసింది ఏంటొ అది అని

Saahitya Abhimaani చెప్పారు...

Very Good Post "Ravigaru". Quite nostalgic. I too suffer from such nostalgia quite often.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

రవిగారికి బాల్యపు తేనెటీగ కుట్టిందహో ! ఇప్పుడల్లా తేరుకోలేరు. ఆనందంలో కింద ను కంది చేసేసారు.
జ్ఞాపకాలు బాగున్నాయి రవిగారు.

sreenika చెప్పారు...

ఆహా
నా చిన్నప్పటి ఊరుని గుర్తుచేసారు.
గుర్తుకొస్తున్నాయి....గుర్తుకొస్తున్నాయి..

Unknown చెప్పారు...

హతోస్మి ఆ రుచిని నెమరేసుకుంటూ కింద కాస్తా కంది అయింది , క్షంతవ్యుడను .సత్య గారు ముందు గా దిద్దినందుకు అభినందనలు .అజ్ఞాత గారు అప్పట్లో మరి డాక్టర్ గారి అమ్మాయి పక్కకి పిలిచి మరి చెప్పింది అలా వేరే గీతాలు పాడ కూడదని ''.పిలుపులో పిలిచితే పలుకు తావట నా పలుకులో కులుకు తావట'' అన్న పదాల్ని వేరే లా అర్ధం చేసుకుందేమో మరి .
ఉష గారు ఏదో నా మీద అభిమానం తో''పరీక్షించడం'' లాంటి పెద్ద పదం వాడేసారు గాని వొక అజ్ఞాని జ్ఞానుల్ని ఎలా పరీక్షించ గలడు ? వొక్క ఈస్ట్ గోదావరి లోనే యి పిడత కింద పప్పు అమ్ముతరేమో?మిగత చోట్ల బజ్జిలని కోసి అందులో వుల్లిపాయ కారం వుప్పు పల్లీలు వేసి అమ్ముతారు అవికూడా చాల బావుంటాయి .ఇంతకీ మనలో మాట పంటి అనిన ఏమి?పడవ అని భావమా ?
సుజాత గారు అది ముద్ర రాక్షసమే మీరెప్పుడు righte
ఉమగారు మీ బెంగుళూరు లో అది దొరకదు కాబట్టి మీకు తేలిపోవడం లో ఆశ్చర్యం లేదు .
శివ గారు ప్రతి వాళ్ళ జీవితాల్లో అనుభూతులు వొకటే , పాత్రలే మారతాయి అనుభూతులు అజారామరం
బ రా రే గారు అదేంటో నా విషయం లో తేనే టీగ బాల్యము , కౌమారము, యవ్వనము వార్ధక్యము లో కూడా వదిలేలా లేదు ప్రతి పరువం లోను కుడుతూనే వుంది .
శ్రీనిక గారు కొంపతీసి ఆ డాక్టర్ గారి అమ్మాయి నేనే అనరు కదా? .

Padmarpita చెప్పారు...

రవిగారు.....కిందని కంది అన్నారంటే ఏదో మతలబు ఉంది!

నేస్తం చెప్పారు...

పిడత కింద పప్పు అనే పదాన్ని వాడుకలో పిడత కంది పప్పు అంటారు ..కాకినాడ అంతా అలాగే అంటారు... టైపో కాదు ..అంతేనా రవిగారు

Unknown చెప్పారు...

నేస్తం పదుగురాడు మాట పాడీ అయి ధరచేల్లు అని మా కాకినాడ లో అలాగే అంటారు అంటే బావుండదని అలా ఫిక్స్ అయి పోయా , ఇప్పుడు మీలాంటి మిగత కాకినాడ బ్లాగర్లు సపోర్ట్ చేస్తే పిడత కంది పప్పే వ్యవహార నామం గా స్తిర పడి పోతుంది .మాయాబజార్ లో గిల్పం లాగ .

SRRao చెప్పారు...

చాలా ఆలస్యంగా వచ్చినట్లున్నాను. అయినా పిడత కీంద పప్పు ఘుమఘుమలు ఆఘ్రాణిస్తున్నాను. వాటిని పంచి చిన్నప్పటి జ్ఞాపకాలను మీటినందుకు మీకు ధన్యవాదాలు.

లంక శివ రామక్రిష్ణ శాస్త్రి చెప్పారు...

mee pidata kinda pappu chaala ruchi gaa undi ravi, good keep it up. mari konni ruchula kosaram eduruchoostuntamu. Atanevaru, emainadu? malli continue cheyaledemi. chalaa interesting ga undi.

కాగడా చెప్పారు...

రవిగారు కొంచెం నా పిడత కింద పప్పు అనుభవాలు కుడా చదువు కొండి -:

పరిమళం చెప్పారు...

కాకినాడ వాళ్లు ఏం చెప్పినా అదంతా మన మంచికే :)

శిశిర చెప్పారు...

"ఇంతకీ మనలో మాట పంటి అనిన ఏమి?పడవ అని భావమా?"

అది పంటి కాదండి. పంటు. వాడుకలో పంటి అయింది. పడవలాంటిదే కానీ చాలా వెడల్పుగా, బల్లపరపుగా వుంటుంది. (బల్లకట్టు లాగ). బల్లకట్టంటే కోనసీమలో కాలువల మధ్యలో వంతెనలు లేని చోట ఒకవైపు నుండి రెండో వైపుకు రావడానికి వాడతారు. అలాంటిదే పెద్దది పంటు. దీనిమీద ఒకేసారి రెండు, మూడు కార్లను కూడా దాటించవచ్చు. కార్లు, మోటరు సైకిళ్ళు, పశువులు, మనుషులు అన్నిటినీ ఒకేసారి దాటిస్తారు. అంత పెద్దది. గోదావరిని దాటడానికి వాడతారు.

Unknown చెప్పారు...

శిశిర గారు తెలుగు భాషలో ఇంత మంచి పట్టు వున్న మీరు , మీ భావాలూ మీ బ్లాగ్ ద్వారా పంచు కోకుండా మౌనం గా వుండడం బావోలేదు .మీ మనసు తో మాట్లాడుకుంటున్న దే బ్లాగ్ లో రాస్తే కత్తికి సాన పెట్టినట్టు అవుతుంది కదా .అంచేత సాటి కర్కాటక రాసి వాడి గా చెపుతున్నా వెంటనే శిశిరానికి మీ బ్లాగ్ లో చోటివ్వండి .

శిశిర చెప్పారు...

రవి గారూ, మీ ప్రోత్సాహానికీ ధన్యవాదములు. ఇపుడే నా బ్లాగులో మీ వ్యాఖ్య చూశాను. చాలా సంతోషం.

జయ చెప్పారు...

రవి గారు, శిశిర ని ప్రోత్సహించినందుకు, ధైర్యం చెప్పినందుకు మీకు నా అభినందనలు (నేను కూడా మీ సాటి కర్కాటక రాశిగా చెప్తున్నాను)...