19 ఫిబ్ర, 2010

సగమే నెగ్గిన లీడర్


నిన్న లీడర్ ప్రేమిఎర్ షో కి వెళ్ళడం జరిగింది .శేకర్ కమ్ముల తన ప్రేమ పందాన్ని పక్కన పెట్టి సందేశాత్మకం గా వెళినట్టు గా కని పిస్తోంది .మొదటి సగం బాగా ఎక్కడా బోర్ కొట్ట కుండా తీస్తే రెండో సగం నిడివి ఎక్కువవ్వడం , సందేశాలు ఎక్కువ సరుకు తక్కువ అనట్టు గా తయారయ్యింది . సినిమా కాన్సెప్ట్ అవినీతి ని నిర్మూలించడానికి సి .ఏం అవడానికి హీరో అవినీతి పద్దతి లోనే డబ్బులు ఏం ఎల్ ఏ లకి పంచి సి ఏం అవడం అతని కజిన్ మళ్ళి డబ్బులు పంచి తను సి ఏం అవుదామనుకోడం ఆఖర్న అవినీతి డబ్బును ఏ సి బి దాడుల ద్వార బయటకు తీసి లక్ష కోట్లు దాక పోగు చేసి పీపుల్స్ ఫండ్ తాయారు చేసి ప్రజలకి ఏదన్నా చేద్దామనుకునే టైం కి రాజ కీయ సంక్షోబం వచ్చి ఎలెక్షన్ కి వెళితే హీరో విజయం సాధించడం తో కధ ముగుస్తుంది .దేశం లో బ్లాక్ మనీ చాల ములుగు తోంది దాన్ని బయటకు తీసి ప్రజలకి ఖర్చు పెడితే దేశం బాగు పడుతుందన్నది స్టొరీ లైన్ .మద్యలో తన పదవి కాపాడు కోవడం కోసం ఎక్కువ మంది ఏం ఎల్ ఏ ల సపోర్ట్ వున్నా వొక వర్గ నాయకుడి కూతుర్ని ప్రేమ లో పడేసి (ఇది మోసమే గా) తన పదవి నిలబెట్టుకుంటాడు .యిలా కధంతా పదవిని నిలబెట్టు కోడానికి వేసే ఎత్తులు , కారం చెడు దహన సంఘటన , ఎవరి సత్తా బట్టి వాళ్ళకి వృత్తులు నిర్ణయించడం జరిగిందని , అందులో పుట్టిన వాడు వేరే వృత్తులు పదవులు చేస్తా అంటే కుదరదని పెద్దాయన (కోట) చేత చెప్పించడం వివాదానికి ఆస్కారం వుంది .ఇందులో ఐటెం సాంగ్(?)లో ప్రముఖ ఏంకర్ ఉదయ భాను నర్తించి చీరలలో కాకుండా వలువలు తగ్గిస్తే తను ఎలాఉంటానో చూపింది .కామెడి ఎక్కడా లేదు కనీసం చిరు మంద హాసానికి కుడా .స్పీకర్ స్తానం లో వ్యక్తీ కూర్చోండి ప్లీజ్ సిడవును అనప్పుడు మాత్రం కొద్ది మంది నవ్వారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ని గుర్తు తెచ్చు కుని .అయితే రాణ దగ్గుపాటి నటన మాత్రం బావుంది ఎక్కడా కొత్త వాడన్న బెరుకు కన బడ లేదు .వాచకం విగ్రహం వెనక దన్నువున్నా కారణం గా పది కాలాలు సిని జగత్తు లో వెలగచ్చు . అయితే డాన్స్ లు చూసే అవకాశం యీ సినిమాలో రాలేదు . ఎక్కడ స్టెప్స్ లేవు .ఓవర్ అల్ గా కాలక్షేపం బటాని గా మిగిలి పోతుంది అది వేరే సినిమాలు లేక పోవడం బట్టి .

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సినిమా ఇంకా మెదటి షో మోర్నింగ్ ప్రదర్శన కూడా పూర్తయి ఉండదు...ఇంతలోనే మీరు నిన్న సినిమా చూసేసి ఇలా పొద్దు పొద్దునే సినిమా అలా ఉంది..ఇలా ఉంది అని బాకా ఊదటం ఎంత వరకు సమంజసం అంటారు?

Unknown చెప్పారు...

అజ్ఞాత అరచేతి ని అడ్డు బెట్టి సూర్య కాంతి ని ఆపలేరు .నేను యి పూట రాయడం మానేసినంత మాత్రాన హిట్ అయ్యే సినిమా ఫట్టు అవదు ఫట్టు అయ్యే సినిమా హిట్టు అవ్వదు .వున్నది వునట్టు రాస్తే మన బ్లాగ్ మిత్రులు ఎక్కువ గా ఆశలు పెట్టుకోకుండా వెళ్ళడం చేత కొంచెమైనా ఊరట పొందుతారని రాసా .

budugu చెప్పారు...

kathaMtaa raayaDaM tappE. aMtE kaani sinimaa elaa uMdO raayaDaM tappelaa avutuMdi.

శ్రీనివాస్ చెప్పారు...

బొంగెం కాదు పెద్ద పెద్ద వెబ్సైట్లు రాయగా లెండి రవి గారు రాస్తే వచ్చిందా?

శరత్ కాలమ్ చెప్పారు...

కథ అంతా చెప్పేయడం మంచి పద్దతి కాదండీ. వేరే ఎక్కడా చెప్పడం లేదా అంటే నేనేం చెప్పలేను. అందువల్ల మీ సమీక్ష కూడా సగమే నెగ్గింది!

శ్రీనివాస్ చెప్పారు...

శరత్కాగాడా సారీ శరత్ కాలం గారు చెప్పారు కనుక తప్పే

శరత్ కాలమ్ చెప్పారు...

@ శ్రీనివాస్
మలక్కాడ అదే మలక్కాగడా పోయి శరత్కాగడా వచ్చిందేంటీ ;)

సుజాత వేల్పూరి చెప్పారు...

రవి గారు, మీ రివ్యూలు సింపుల్ గా బాగా ఉంటున్నాయి గానీ మీరు కొంచెం అచ్చు తప్పులు లేకుండా చూసుకో కూడదూ!

తెలుగులో రాయడానికి ఏ సాఫ్ట్ వేర్ వాడుతున్నారు?

కామెడీ లేదా? అయితే నేను చూడను!

అజ్ఞాత గారికి మీ జవాబు బావుంది.ఎందుకంటే చాలా మందికి తమ రివ్యూల మీద సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయనే భ్రమలున్నాయని ఈ మధ్యనే ఒక మిత్రుడి వల్ల తెల్సింది.

మీ రివ్యూ చాలా చక్కగా ఉంది! ఇలాగే మంచి రివ్యూలు రాసి మా డబ్బులు కాపాడండి!

Unknown చెప్పారు...

సుజాత గారు నేను మొన్నటి దాక గూగుల్ transliterate వాడె వాణ్ణి
అందులో చేసిన మార్పుల వాళ్ళ బరహ కి షిఫ్ట్ అయ్యా అయితే ఇంకా అది
అలవాటు పడక అచ్చు తప్పులు దోల్లు తున్నాయి .
రివ్యూ కరి మింగిన వెలగ పండు లా వుండాలని నా అభిమతం .అదే నా ప్రయత్నం .

కాగడా చెప్పారు...

శరత్తులూ మలక్కులూ శ్రీనివాసులూ నా కాగడాతో ఆడుకుంటే నేనొప్పుకోను గాక ఒప్పుకోను.ఏదైనా జరగరానిది జరిగితే అవతల వర్గం వారికి నేను జవాబు చెప్పుకోవాలా వద్దా.