27 ఫిబ్ర, 2010

ఇలా అయితే ఎలా?


గత మూడు రోజులు గా గోవా లో official మీటింగ్స్ వుండడం తో వెళ్ళడం జరిగింది .గోవా లో మీటింగ్స్ పెట్టేదే బీరు ,బీచు కోసం కాబట్టి సాయంత్రం ఎయిర్ పోర్ట్ వెనకాలే వున్నా బోలంగోట్ బీచ్ కి వెళ్ళా .అక్కడ ఇసక లోనే టేబుల్ వేసేసి మందు మాకు సరఫరా చేసేస్తున్నారు .మేము వెళ్ళే టప్పటికి అక్కడంతా స్టూడెంట్స్ (ఆడ , మగ )చేత బీరు గ్లాసు ,నోట సిగరెట్టూ పీక ,వొంటి మీద తడిసిపోయిన చిన్న గుడ్డ ముక్క .వాళ్ళు వొక చోట నిలకడ గా కూర్చో వటం లేదు. ఇసకలో వోకల్ల భుజాల మీద వోకల్లు చేతులు వేసుకుంటూ దూరం గా ఇసకలో మేట వేసిన పడవ వెనక్కి పోయి వస్తున్నారు . వెళ్లి నప్పుడు వున్న combination వచేటప్పుడు వుండడం లేదు .యిలాగంటలు గంటలు గడిచి పోతున్నా ఎవరు వెళ్ళడం లేదు అక్కడి నుంచి (నాతొ సహా అది వేరే విషయం ) .నా పక్క టేబుల్ దగ్గర వొక భర్త , భార్య వాళ్ళ ఇద్దరు పిల్లలు కూర్చున్నారు .భర్త మొదటి బీరు మొదలెట్టే టప్పటికి అక్కడ తడిసిన అమ్మాయిల్ని వొర చూపులు చుస్తునవాడు కాస్త రెండో బీర్ కొట్ట గానే ,వాళ్ళ ఆవిడా ఏదో అడుగు తున్నా గాని చ చ అవతలకి పో అంటూ ఆ కాలేజీ పిల్లలు పడవ వెనకకి వెళ్ళే దాక చూస్తూ , వాళ్ళు వచ్చేదాకా టెన్షన్ పడి పోతూ బీర్లు ఏర్లు అయి ప్రవహింప చేస్తున్నాడు .ఇక్కడ యి స్టూడెంట్స్ పరిస్తితి అంతే పోటీలు పడి మరి తాగేస్తున్నారు . అందులో వొక అమ్మాయి అబ్బాయి అవుటయి పోయి కుర్చీ లోంచి ఇసకలోకి జారి పోయి అలాగే పడుకున్నారు .అప్పటికే సమయం రాత్రి పదిన్నర ,ఇప్పుడు ఆ స్టూడెంట్స్ పడవ దాక కూడా వెళ్ళడం మానుకుని వొక రాధా ఇద్దరు కృష్ణులు సినిమా అక్కడే చూపిస్తున్నారు .ఇదంతా పక్క టేబుల్ బీర్భల్ తో పాటు వాళ్ళ ఆవిడా కుడా చూస్తోంది .అంతే బీర్బల్ లో ఆవేశం పొంగు కొచ్చి స్టూడెంట్స్ మద్య లోకి వెళ్లి ఏంటి యి పబ్లిక్ న్యూ సెన్స్ ?నేనిప్పుడే కాప్స్ ని పిలుస్తా అంటూ రెచ్చి పోతున్నాడు . అంత వరకు తుళ్ళుతూ కేరింతల లో ములిగి పోయిన స్టూడెంట్స్ కాస్త నీరు గారి పోయారు .వాళ్ళంతా కూడా దేశం లోనే తల మానికం గా చెప్పుకునే బిట్స్ (పిలాని) గోవా స్టూడెంట్స్ ట .అంటా హాస్టల్ లో వుండి చదువు కుంటున్న వారె . వార్డెన్ తో బజార్ కి వెళ్తున్నామని చెప్పి ఇలా బీచ్ కి దొబ్బు కొచ్చారు . అంతా పదకొండు లోపు వెళ్లి పోయి వార్డెన్ రాత్రి అట్టేన్దేన్స్ తీసుకునే టైం కి వెళ్లి పోవాలి . యి లోపు బీర్భల్ రెచ్చి పోతున్నాడు .ఇంక నేను రంగం లోకి దిగ వలసిన సమయం ఆసన్న మయిందని నిర్ణయించేసుకుని ఆయన్ని సముదాయించి ,స్టూడెంట్స్ తో వొకటే అన్నా'' మీ మందు మీకు విందు చెయ్యాలి గాని , వేరే వాడికి విందు చెయ్య కూడదని '' తప్పు అయిపోయింది సార్ ఇప్పటికే ఇద్దరు అవుటయి పోయి , హాస్టల్ కి లేట్ అయిపోయి టెన్షన్ పడుతుంటే యి గొడవ వొకటి మద్యలో అని బాధ పడుతూ వాల్లిదర్నీ మోసుకుంటూ టాక్సీ లు చేసుకుని వెళ్లి పోయారు .
యి మొత్తం ఎపిసోడ్ లో నే గమనించినది ఏంటంటే అంత వరకు తల్లి దండ్రుల క్రమ శిక్షణ లో బుద్ది గా చదువుకుని బిట్స్ లో సీటు సంపాయించిన యి మేధావులు , వొక్క సారి స్వేఛ్చ లభించడం తో బుడ్లు పట్టుకుని ఇసకల్లో పొర్లు తున్నారు .యిదే పద్దతి విట్స్ (వెల్లూరు) లో కూడా వుందని తెలిసింది .మెరిట్ లో సీట్ సంపాయించుకున్న తమ పిల్లల భవిస్యత్తు కు యింక ఏ ధోకా లేదని వాళ్ళు అడిగినంత డబ్బు పంపుతూ బ్రమలో కాలం గడుపుతున్న తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు కాలేజీ నుంచి బయటకు వచ్చే టైం కి మత్తు కి బానిసలుగా ,వెన్నెముక కోల్పోయిన యువత గా బయటకొస్తే ఎలా?కాలం తెచ్చిన మార్పు లో మేధావి తనం తో బాటు విచ్చల విడి తనం కూడా పెన వేసుకుని వుండి పోయిందని సరి పెట్టు కోవాలేమో?

6 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

అంతేనా? ఇంకా "పడవ వెనకాల ఏదేదో ఊహించుకోకండి, టాయ్ లెట్స్ ఉన్నాయ్" అని చెప్పి ఫినిషింగ్ టచ్ ఇస్తారనుకున్నానే?

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మా ఉల్లో ఇంజినీరింగు కాలేజి వున్నప్పుడు పిల్లలు ఇలానే ప్రవర్తించారు విచ్చలవిడిగా. అది చూసేటప్పుడు మన పిల్లలు కుడా బయట ఇలానే వుమ్దబోతున్నారా అనిపి౦చి౦ది. వాళ్లకు మనమీద, మన కష్టం మీద రెస్పెక్ట్ వుంటేనే ఇలాంటివి జరగవు. ఆ కాలేజి మా తోటపల్లి డాం ముంపులో పది విశాఖ పోయింది. వ్యాపారస్తులు, అద్దేకిల్లిచ్చేవారు బాగా బాధపడ్డారు.

Unknown చెప్పారు...

అలా అనుమానం వచ్చే నేను కుడా పడవ వెనకాలకి వెళ్ళిన విషయం రాయలేదు
అక్కడ బీర్ ఎక్కువ గా తాగిన వాళ్ళు టెన్షన్ ని ease చేసుకోవడం కనిపించినది మాత్రం వాస్తవం
ఏంటో భరద్వాజ్ మీరు మందు కొట్టారు కాబట్టి మిగత విషయాల మీద శ్రద్ద పెట్ట గలుగు తారనుకుంట
వర్మ గారు ఏ కాలేజీ చూసినా అంతే అన్న మాట . .

కాగడా చెప్పారు...

నా హైవే ఎప్పుడ్తొస్తుందో కూడా చూసి ఇలా ఐతే ఎలాగో చెప్పండి
http://kaagadaa.blogspot.com/

Unknown చెప్పారు...

అయ్యో మలక్ ముద్ర రాక్షసం . మీరు మందు కొట్టరు కాబట్టి అని రాయ బోయి
వొక్క దీర్గం ఎక్కువయ్యి వ్యతిరేకార్దం వచ్చేసింది .యి సందర్భంగా rediff చాట్ లో
వొక సారి మీరు పిచ్చమ్మ ని ఉద్దేశించి మీకేంటండి '' పబ్లిక్ ఫేమౌస్ '' అని కొట్ట బోయి
పబ్లిక్ లో ఎల్ ఎగర గొట్టడం గుర్తొచ్చింది . పాపము సమించు గాక .

Raghav చెప్పారు...

Public fameout looo L pooyindaaa..

hahaha suparu...malak gaaru edooo manchi balaudanukunnaa..

amma dongaa (yamagola cinemaa loo Ali expression..)