4 మార్చి, 2010

టెస్ట్ సిగ్నేలే రెచ్చ గోడుతుంటే?


నిన్న మా అబ్బాయి చానెల్స్ మారుస్తుంటే రాజ్ న్యూస్ , టెస్ట్ సిగ్నల్ అని కనిపిస్తే పెట్టాడు . అది కెసిఆర్ తెలంగాణా ఛానల్ అని రెండో నిమిషానికే తెలిసి పోయింది .పూర్తీ గా రెచ్చ గొట్టే దోరణిలో ప్రసారాలు సాగి పోతున్నాయి .మనం పన్నులు కడుతుంటే అన్ద్రోడు అందలం ఎక్కుతుండు , నువ్వు జాగో తమ్మి ఇంకా లేపాలి దుమ్మి ఇలా సాగి పోతోంది .మా ఇంట్లో మేము ఆంధ్రనో తెలంగాణా నో మాకే తెలీదు ఇంకా మా పిల్లల సంగతి ఏమి చెప్పాలి .ఇద్దరం ఇక్కడే పుట్టి పెరిగాం , ఇక్కడే చదువులు ఉద్యోగాలు ,మళ్ళి మా పేరెంట్స్ ఆంధ్ర అయిన ఉద్యోగ రిత్య ఇక్కడే సెటిల్ అయిపోయారు .మా లాగ ఎందరో . ఇంతకీ రాత్రి చుసిన ఆ చానెల్ తిరిగి మా వాడు మద్యాన్నం స్కూల్ నుంచి వచ్చి టీవీ ఆన్ చెయ్య డం తో అదే వస్తోంది .మా వంట ఆమె పిల్లాడికి అన్నం పెడుతూ అదే చూస్తోంది .ఆమె మా ఇంట్లో గత పది ఏళ్ళ గా చేస్తోంది .టీవీ చూసిన పది నిమిషాల్లో ఆమె ముఖ కవళికలు మారి పోయి మా అబ్బాయి తో మీ ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్ లో duplex ఇల్లు కట్టేసుకుని సెటిల్ అయిపోయి మా తెలంగాణా వాళ్ళని అద్దె ఇళ్ళలో ఉంచు తున్నారు అందిట .(మరి ఏడాది క్రితం ఫ్లాట్ కొనుక్కుంటున్నా డబ్బులు సద్ద మంటే లక్ష రూపాయలు వడ్డీ లేని అప్పు ఇచ్చాను ?ఇంకా పైసా కూడా ఇవ్వలేదు ?)మా వాడు కూడా పొండి ఆంటీ గట్ల గిట్ల అనుకుంటూ , పూరి పిట్ల చేస్తా తినటవా అనుకుంటూ మీరు మీ తెలంగాణా. అయిన మేము కుడా తెలంగాణే ఇక్కడే పుట్టాం అని సమాధానం చెప్పి ఎందుకైనా మంచిదని వాళ్ళ ముమ్మి కి messege చేసాడు ఆంటీ తెలంగాణా ఛానల్ చూసి రెచ్చి పోతోందని నువ్వు తొందర గా ఆఫీసు నుంచి రా అని ..ఆమె సరదాకే అన్నా లోపల వున్నా భావాలూ ఎగా దోసుకు వచ్చాయి .యి పది ఏళ్ళలో ఆమె లో యి భావ ప్రకటన మేమెప్పుడు చూడలేదు డబ్బు కావలిసి వచ్చినప్పుడే మాతో మాట్లాడేది .అలాంటిది టెస్ట్ సిగ్నల్ కే మూగాకి మాటొస్తే ఇంక ఫుల్ fledged గా మొదలెడితే ఇంకెన్ని విన్ద్వాన్సాలు రేపుతుందో?ఆఫీసు లో కుడా స్టాఫ్ ఆంద్ర తెలంగాణా లా విడి పోయి వోకరికేసి వొకరు అనుమానం గా చూసుకుంటున్నారు . వొక క్లెర్క్ అయితే మా ఆఫీసు సుపేరేతిన్దేంట్ ని ఎక్కువ నకరాలు చేసినావంటే మీ అన్ద్రోల్ని లేపేస్తం అనేసే దాక . అతనొచ్చి సార్ నన్ను వేరే సెక్షన్ కి త్రాన్సఫెర్ చేసెయ్యండి లేదా వాడినన్న తీసేయ్యందని మొర పెట్టు కున్నాడు .ఇంట బయట చివరికి యి బ్లాగ్ లోకం లో కూడా ఆంధ్ర తెలంగాణా అంటూ కత్తులు దూసుకునే స్తితి కి రప్పించడం వెనక లబ్ది పొందేద్ది ఎవరని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పమంటే ప్రతి వాడికి తెలుసు కొంత మంది పదవులు ఆశిస్తున్న రాజకీయ నాయకులికి,ఆంధ్ర లాయర్ల తో , వ్యాపారస్తులతో పోటి పడలేక ఎలాగన్నా వాళ్ళని తరిమేసి లబ్ది పొందుదమనుకునే స్వార్ద అసమర్దులకి మాత్రమె .తెలంగాణా వచ్చేసినంత మాత్రాన చెప్పులు కుట్టుకునే పోసయ్య , అరటి పళ్ళు అమ్ముకునే యాదగిరి , విస్త్రి చేసుకు బతికే వీరేశం , ఆటో నడుపుకునే బిక్షపతి వీళ్ళ జీవితాల్లో ఏదన్నా మార్పు వస్తుందా?ఏదో అద్బుతాలు జరగ బోతునట్టు రేపటి నుంచి యి తెలంగాణా ఛానల్ లో ఉదర గోడితే జరగ బోయే పరిణామాలకి సంకేతమే మా వంటావిడ లో విప్లవ భావాలు. సాటి తెలంగాననో లేక నిన్నటి తరం ఆంధ్రనో తేల్చుకోలేని మాలాంటి వాళ్ళ మీదే ఇలా అంటే , ''ఎండి కిశ్న నగర్ కి ఏ బస్సు ఎక్కలండి ఆయ్ '' అని అడి గే వాళ్ళ పరిస్తితి వుహించు కోడానికే భయం గా వుంది . కనీసం యి పిల్లల పరిక్షలు అయ్యేదాకా అన్నా ఆ ఛానల్ ని బాన్ చేస్తే బావుణ్ణు .

5 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

:))

Unknown చెప్పారు...

పదేండ్ల నుండి నోరు మెదపని పని మనిషి కూడా భావ ప్రకటన చెసిందంటే మంచి పరిణామమే! చానెళ్ళ చెప్పే వాటిల తప్పులు ఉంటె చెప్పండి. చానెల్ నే విమర్శించడం తగదు.

అజ్ఞాత చెప్పారు...

@ T-langa YdhuDu

Edainaa free gaa vastundanTE ... paDi tinE langaa jaati manadaaye. test signal raakunnaa EDupu Agutundaa?

Suresh చెప్పారు...

తెలంగణా యోధుడు గారూ! దీన్ని, భవ ప్రకటన అనరండీ, నోటి తీట అంటారు. ఆ వొంటామె చెప్పిన వాట్లో టీవీలో సోదే తప్పా తనకు ప్రత్యేకంగా జరిగిన ఇబ్బందేమీ లేదు. పైగా వీళ్ళు చేసిన మేలు కూడా మరిచిందాయే. తనకు జరగని అన్యాయాన్ని మేలుచేసిన వాళ్ళ మీద చూపించడం ఎంత అన్యాయం! దాన్ని భావ ప్రకటన అనటం మరీ విడ్డూరం. మీరు యోధులు కదా, ఇలా అబద్ధాలు చెప్పి ప్రజలని రెచ్చగొట్టడం అవసరమంటారా?

రాయలసీమ యోధుడు చెప్పారు...

mr.ravi gaaru,
recently village lo vinayakudu movie choosaa.appatiki meeru teliyadu.meeru heroine babaya ? mee laaga cinmallo veshaalu dorakatam adrustham.