మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
9 మే, 2010
అనుక్షణికం (రెండో భాగం )
కాఫీ తో మొదలైన అనుభంధం వాళ్ళింట్లో డిన్నర్ చేసే అంత గా ఎదగడానికి ఎంతో టైం పట్ట లేదు . దానికి సుధ చొరవ కొంత , నా వొంటరి తనం కొంత అని చెప్పుకోవచ్చేమో.తనలో భావోద్వేగాల పాలు ఎక్కువే .ఎన్నాళ్ళో తనలో దాచుకున్న వేదన బయటకు చెప్పుకోవడానికి వొక తోడు కావలి , అప్యాయం గా పలకరించే వొక గొంతు కావాలి .అన్నిటికంటే
ముఖ్యం గా తన బాధ వినే వొక శ్రోత కావాలి .భర్త సంపాదన యావ లో పడి సుదూర తీరాలకి వెళ్లి పోవడం ఆమె కి సుతారము ఇష్టం లేదు .వొక వెన్నెల రాత్రి మేడ మీద భర్త వొడిలో తల పెట్టుకుని మంద్ర స్తాయిలో వినిపించే ముకేష్ పాటలు వింటూ ,భర్త కళ్ళల్లోంచి కనిపించే ఆ నిండు జాబిలిని ఆస్వాదిస్తూ ఆనందించాలని తనకి వుండేది .ఆమె భర్త ఆ సమయం లో కూడా దుబాయి వెళితే యి ongc లో సంపాయించే దానికి పది ఇంతలు ఎలా సంపాయిన్చోచ్చో చెప్పుకొస్తూ పోతుంటే ,ఆ నిసి రాతిరి నిశ్శబ్దం లో కళ్ళలోంచి కారిన కన్నీళ్ళు తుడవడానికి ఇన్నాళ్ళకి వొక తోడు , వొక నేస్తం వస్తాడని నేనెప్పుడు అనుకోలేదు అనేది . ఆ క్షణం లో భుజం తట్టి వోదార్చడం లో నాలో ఏ దురుద్దేశం లేక పోయినప్పటికీ అది భవిస్యత్తు లో విడదీయరాని భంధం (ఆమె దృష్టిలో) అయిపోతుందని నేనప్పుడు అనుకోలేదు .రోజు ఆఫీసు కి వెళ్ళాక వొక గంట పని చూసుకుని ఆమె కి ఫోన్ చెయ్యాలి ఇంకో గంట ఆమె తో మాట్లాడాలి .మళ్ళి లంచ్ టైం లో ఆమె ప్యాక్ చేసిన బాక్స్ లో పదార్దాలని వర్ణిస్తూ ఆమె చేతి వంటని మెచ్చుకుంటూ (నిజం గానే)ఆమె తో మాట్లాడుతూ , మద్య మద్యలో యి ఆనందం కేవలం కొంత కాలమే గా అంటూ ఆమె ఏడుస్తుంటే వోదారుస్తూ , సాయంత్రం ఆఫీసు అయిపోగానే మళ్ళి మేడ మీద కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ (అదే శ్రోత గా వింటూ), మళ్ళి డిన్నర్ వాళ్ళింట్లోనే . నాకే మొహమాటం వేసి నెలకి సరపడ సరుకులు కోనేయ్యడం మొదలెట్టా .మొదట్లో ఆమె అబ్యంతరం పెట్టినా , నన్ను పరాయి వాడు గా అనుకుంటే తేనులే అన్న పాపానికి , తర్వాత నెల నుంచి సరుకుల లిస్టు చేతిలో పెట్టేది .అందులో మగవాళ్ళకి సంభందం లేనివి కూడా ఉండేవి అది వేరే విషయం .అదంతా నా మీద వోచ్చేసిన పోస్సేసివే నెస్ తో చేసేదో లేక నన్ను వుపయోగించుకునేదో?ఇప్పటికి నాకు అర్ధం కాలేదు .వోకో సారి నా వొళ్ళో తల పెట్టుకుని ఎడ్చేసేది రేపు నువ్వు వెళ్లి పొతే ఎలా అంటూ , ఆమె కోసం శని ఆది వారాలు మా వూరు వెళ్ళడం తగ్గించాను ఆఫీసు లో పని వత్తిడి అని ఇంట్లో చెప్పి . ఏంటి ఈ మద్య ఎప్పుడు చూసినా మీ సెల్ బిజీ అని వస్తోంది అని కుటుంబ సబ్యులు అడుగు తుంటే గిల్టీ గా అనిపించడం మొదలేడుతోంది .ఇంతకూ ముందు అలా అనిపించేది కాదు .ఏ భందమన్న మొదట్లో ఉన్నంత ఉదృతి రాను రాను వుండదేమో .అందులోను ఆ రోజు మధ్యాన్నం సెల్ లో మాట్లాడుతూ ఆమె మాటల మద్యలో ''ఆల్ రోడ్స్ లీడ్స్ టు రూం '' అంది . నేను అక్కడకి అది'' రోం'' అని సవరించ బోతే ఆధునిక యుగం లో తను చెప్పిందే కరెక్ట్ అనడం తో తాళం తప్పుతోందని హెచ్చరించా .తన పెళ్లి అయినప్పుడే అపశ్రుతి వచ్చేసిందని ఇప్పుడు కొత్త గా తాళం తప్పేది ఏమి వుందని వాదించింది .ఆ సాయంత్రం నేను కావాలనే ఇంటికి వెళ్ళకుండా యెక్క డో బార్ లో కూర్చుని అర్దరాత్రి ఇంటికి చేరా , సెల్ లో నూట మూడు మిస్సేడ్ కాల్స్ అన్ని సుధవే అని వేరే చెప్పక్కరలేద్దు . అంత రాత్రి గేటు తియ్య గానే వొక్క ఉదుటున వచ్చి ఎమైపోయావు ఇక్కడ యెంత కంగారు పడుతున్నానో తెలుసా అంటూ గట్టి గా హత్తుకుని బ్జోరున ఏడ్చేసింది , ఆమె ఆప్యాయతకి ఆ క్షణం కరిగి పోయా . అంత రాత్రి కూడా మేడ మీద నా రూం కి భోజనం తీసుకు వచ్చి , నేను కూడా నీ కోసమే తినకుండా కూర్చున్నా అంటూ కొసరి కొసరి వడ్డించింది .నాకు కూడా ఆ ప్రేమకి కళ్ళల్లో నీళ్ళు ఆగ లేదు .ఏ జన్మ భంధమో ,ఎక్కడో ఎవరికో ముడి వేసి పెడతాడు ఏ ముడిని ఎందుకో విడ దీసి పోతాడు ఆ భగవంతుడు అన్నా.అంతే విడదీయడానికి వాడెవడు నీ తీపి గురుతులు చాలు నాకు అంటూ అమాంతం ఆమె నా మీద పడి పోయింది .నా చేతులు ఆమె చుట్టూ పెన వేసుకు పోయాయి . ఇంకొక్క క్షణం లో అగ్ని పర్వతం బద్దలయ్యే వుండేది ఆ సెల్ లో ఇంటినుంచి ఆ మెసేజ్ రాకపోయి వుంటే .
'' యెంత దూరమో మరి అంత చేరువో
శారీరకం గా మనిద్దరం దూరం గా ఉండొచ్చు గాని
మానసికం గా ప్రతీ రాత్రి నా చెంతనే నువ్వు
నీ అర్ధాంగికి చాలు నీ చిరు నవ్వు గుడ్ నైట్ ''
అది చూడగానే విజ్ఞత మేలుకుంది , చేతులు విడి వడ్డాయి .చూడు సుధ మనం ఇంత వరకూ ఏ తప్పు చెయ్య లేదు కాబట్టే ఇంత అర్దరాత్రి కూడా నువ్వు వచ్చి భోజనం పెట్ట గలుగు తున్నావు . అదే తప్పు చేసిన మరు క్షణం రేపొద్దున్న కాఫీ కూడా తేలేవు . మీ అబ్బాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేవు . శాశ్వత మైన అమలిన అనుభూతులు కావాలో , జీవిత చరమాంకం లో అయ్యో ఆ రోజు అలా చెయ్య కుండా ఉండాల్సింది అనుకునే యి క్షణికమైన ఆనందం కావాలో నువ్వే తేల్చుకో అన్నా .
వెంటనే తన కళ్ళలో అశ్రు ధారలు '' నా జీవితం లో ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం కల్గిన మగాన్ని చూస్తానని అనుకోను అంటూ నా పాదాల్ని చుంబించి వెళ్లి పోయింది .
ఆ గొప్ప తనం ఆ టైం లో మెసేజ్ పంపిన అర్ధాంగిది గాని నా దేలా అవుతుంది . ఆక్షణం అలా అనిపించింది ఇంకో క్షణం మరోలాఅనిపిస్తుంది . అప్పుడు తప్పు జరగ లేదని ఇంకోసారి జరగదని హామీ ఇవ్వలేనని సుదకి నేను చెప్పలేక పోయా .అనుక్షణికం మనసు మాట వింటుందని గుడ్డి గా నమ్మడమే నే చేసిన పొరపాటు అదే నా గ్రహ పాటు .సుధ తనకి డైమండ్ నెక్లస్ కొనమని అడిగే చనువు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఆ శని వారం ఏం జరిగిందో తెలుసుకోవాలి అందుకు శనివారం దాక ఆగాలి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
11 కామెంట్‌లు:
అబ్బో, ఇదొక పెద్ద సుస్పెన్సు. శనివారం దాక ఆగటానికి.
ఏమిటో ఈ మద పిచ్చి అక్రమార్కుల కథలు.ఇంత మంచి టాలెంట్ ఉంది మీకు, ప్రవీణ్ లాగ ఇలాంటి కథల రాస్తారెందుకో అర్థం కాదు.తనంటే కథ రాయటం చేత కాదు కాబట్టి, వేరే టాపిక్ ఎంచుకోలేడు. మీకేంటి ?
ఎవరు ఏది రాయాలో చెప్పడానికి మీరెవరు?
మీకు నచ్చినట్టు రాస్తే మంచి వాళ్ళు లేకపొతే మదమెక్కిన వాళ్ళా??
అబ్బా నేనెవరో తెలీదా.నేన్రా బ్లాగు తాటకిని.ఎవడైనా సరే నేన్ చెప్పినట్టే రాసి చావాలి.లేదా కూడలి నించి వెలేయిస్తా
బ్లాగు తాటకి నీ పేరడీ బ్లాగుకి ఇదే పేరు పెడతా
అజ్ఞాత సమకాలిన సమాజం లో జరుగుతున్న
విషయాలని సునిశితం గా గమనించినప్పుడు
రచయిత గా ప్రసవ వేదన పడుతూ రాసేవే ఇలాంటి కదలు .
యి రోజుల్లో ఎంతో మంది ఆడవాళ్ళూ తమ భావాల్ని పంచుకోడానికి
నమ్మకమైన శ్రోత కోసం చకోర పక్షుల లా ఎదురు చూస్తున్నారు ,
భర్తే ఆ శ్రోత అయితే పర్వాలేదు అదే వేరే వాళ్ళయితే
ఇలాంటి కంచికి చేరని కధలే ఎక్కువ .ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే
యి కధ వొక ప్రముఖ బ్లాగర్ స్వీయ అనుభవాన్ని నాకు చెపితే
ఆయన అనుమతి తో కొంత కాల్పనీకత జోడించి రాస్తున్నదే యి అనుక్షణికం .
ఏమిటో, ఈ కాలం ఆడాళ్ళు ఇలాగే ఉన్నారు అంటారా రవిగారు ? మీరు మరీ భయ పెట్టేస్తున్నారు. మీరు రాసే ప్రతిదీ, ఎవరో బ్లాగర్ స్వీయ అనుభవమే అంటారు.కొంప దీసి మన శరత్ బాబా ?
రాఘవ, అంత ఆవేశం ఒద్దు బాసూ. నేను ఎవర్నీ మదమెక్కిన వారు అనలా..ఇలాంటి 'అక్రమ' కథలెందుకు ఎప్పుడూ, ఇంత టాలెంట్ ఉంది, మంచి టాపిక్స్ మీద రాయొచ్చు కదా అన్నా అంతే. నేనెవరో అనేసుకుని నువ్వు ఆవేశా పాడి పోయినట్టు ఉన్నావు. శాంతించు.ఏది రాయాలో నేను చెప్పట్లా ? కేవలం నా సలహా లేదా బాధ మాత్రమే, రవి గారి టాలెంట్ నాకిష్టం, కానీ ఎప్పుడూ అవే అక్రమ సంబంధాల కథలంటే, అవి ప్రవీణ్ లాంటి వారు రాయాల్సిన కథలు ( టాలెంట్ లేని వారు ) అని నా ఉద్దేశం.
అజ్ఞాత గారూ,
ఈ కధ ప్రవీణ్ రాయడు గాక రాయడు - కధలో వదిన పాత్ర లేదు కదా :))
@Anonymous
ok ok cool leave it boss :)
Ok, moral of the story is "Don't take your wife for granted ;)"
ఎంటో ఎవరు ఎ బూతు మాటాడినా మా ప్రనా ని లెంప కాయ కోట్టి మరి లాగుతున్నారు...కొన్ని జివితాలంతే...ప్చ్
ఈ కధకి ప్రవీణ్ అయితే ఎం పేరు పెట్టే వాడో
కామెంట్‌ను పోస్ట్ చేయండి