1 మే, 2010

అనుక్షణికం


రైలు వేగంగా గమ్యం వైపు సాగి పోతోంది .నా ఆలోచనల లాగే .ఇన్నాలకి మళ్ళి కుటుంబం తో గడిపే అవకాశం సొంత ప్రాంతానికి బదిలీ అవడం తో .యి సంవత్సర కాలం లో ఎన్నోనేమరేసుకునే మధురాను భూతులు .కొన్ని మరచిపోలేని పీడ కలలు .సుధ ఎమ్చేస్తూ వుంటుందో ?తను గుర్తు వచినప్పుడల్లా గుండె జల్లు మంటుంది .యి పాటికి నా పోర్షన్ లో అద్దెకు వచ్చిన భార్య భర్త తో చెలిమి కలిపేసే వుంటుంది .నా ఆలోచనలు వొక సంవత్సరం వెనక్కి వెళ్లి పోయాయి .
నేను అప్పుడే promotion మీద బదిలీ పై వచ్చి రెస్ట్ హుసే లో వుంటూ ,ఇంటి వేటలో పడిన రోజులు .ఫ్యామిలీ ని తెచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ,ఆఫీసు ఇచ్చే వసతి ని ఇంకో కొలీగ్ కి వదిలేసి నేను అద్దె ఇంటి వేటలో పడ్డా . ఆ వూళ్ళో పోష్ ఏరియా లో వొక అందమైన ఇంట్లో పై పోర్షన్ అద్దెకుందని తెలిసి వెళ్ల, అందం ఆకర్షణ మిళితమైన వొక ఆమె ఎదురు పడి నా వివరాలు తెలుసుకుని అద్దేకివ్వడానికి వోప్పుకుంది . నా వుద్యోగపు హోదా చూసి అన్ని విధాల భవిష్యత్తులో ఉపయోగ పడతానని వోప్పుకుందన్న విషయం ఆ క్షణం లో నాకు తెలీదు .మంచి రోజు చూసి షిఫ్ట్ అవుతానంటే నా రాసి ఏంటి అని అడిగింది .కర్కాటకం అని చెపితే . అరె నాది అదే రాసి ఆ రాసి వాళ్ళకి ఎల్లుండి నుంచి మంచి రోజులు వస్తున్నాయి సో మీరు ఎల్లుండే వచ్చెయ్యండి అంటే అయ్యో ఆ మంచిరోజున యి చెడ్డ వాదేన్డుకండి అన్నా ఆమె reaction చూద్దామని .మీరెలాంటి చెడ్డ పనులు చెయ్యకుండా చూసే బాద్యత నాది అంటూ చిలిపి గా నవ్వింది .
ఇంతకీ మా గార్డియన్ పేరేంటో? అడిగా. సుధా ఐ mean సుధా కుమార్ అంటూ తనకి కుడా పెళ్లి అయిపోయిందని అన్యాపదేశం గా చెప్పింది .నే పై పోర్షన్ లోకి వచ్చిన దగ్గరనుండి నా పనేదో చూసుకుని ఆఫీసు కి పోవడం రాత్రెప్పుడో రావడం శని, ఆది వారాల్లో ఇంటికి వెళ్ళిపోవడం తో మా మద్య పరిచయం పెరిగే అవకాశం లేక పోయింది కరెంటు పోయే ఆ క్షణం వరకు . ఆ రోజు రాత్రి ఎనిమిది ప్రాంతం లో కరెంటు పోయి చాల సేపటి వరకు రాలేదు .నేను ఆరుబయట సిట్ట అవుట్ లో కూర్చుని బీరు పారాయణం చెస్తున్నా. ఇంతలో మెట్లు ఎక్కు తున్న శబ్దం అవడం తో బీరకాయని టవల్ వేసి కప్పేసి కుర్చీ కిందకి తోసేసా, ఆ చీకట్లో ఎవరో ఆడ ఆకారం వస్తునట్టు గా అర్ధం అయ్యి ఎవరది అనే లోపే
సారీ అండీ డిస్త్రుబ్ చేశాను ఇంట్లో కాండెల్ కూడా లేదు , బాబు tution నుంచి ఇంకా రాలేదు , వోక్కదాన్ని భయమేసి అంటూ ఆర్యోక్తి గా ఆగి పోయింది ,భలేవారే కూర్చోండి అంటూ కుర్చీ తెచ్చి వేసా .మీ హబ్బి ఇంకా రాలేదా అన్న ఏదో మాట్లాడాలి కాబట్టి .
తను ఇక్కడ వుండరండి దుబాయి లో పని చేస్తారు .మూడు నెలలకి వొక సారి వచ్చి పదిహేను రోజులు ఉండి వెళ్లి పోతారు . మీరు వచ్చే ముందు రోజే వెళ్లి పోయారు అంటూ మాటలు మొదలెట్టింది .అదేంటి మీరొక్కరే వుంటార బాబు తో నే గమనించ నే లేదు అన్నా. మా అన్నయ్య వాళ్ళు పక్క వీధి లోనే వుంటారు రెండు రోజులకోసారి వస్తూనే వుంటారు అంది .
మీకు జాతకాలు చూడడం వచ్చా అన్నా . ఏదో నండి కొంచెం ప్రవేశం ఉంది . కర్కాటక రాసి వాళ్ళకి ఇప్పుడు చాల మంచి కాలం , వాళ్ళ జీవితం లోకి యి సమయం లో ప్రవేశించే వ్యక్తులు గొప్ప ప్రభావాన్ని చూపుతారు అంది .
నేను వెంటనే మనిద్దరిది కర్కటకమే కాబట్టి నా మీద మీ ప్రభావం ఉంటుందా లేక మీ మీద నా ప్రభావం ఉంటుందా ఆనేసా , ఆంతా బీరు మహిమ నేరం నాది కాదు బీరుది అంటూ మనసుకి సర్ది చెపుతూ , ఏమో నండి ఆ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి అంది
ఆ సమాధానం తో నా లో ధైర్యం మరింత పెల్లుబికిమీరున్న చోట చీకట్లో కూడా కాండెల్ అవసరం పడదు , వెన్నెల్లో పాల రాయి లా మెరుస్తుంటారు అన్నానో లేదో గేటు చప్పుడయ్యింది , మా అబ్బాయి వచ్చి నట్టు వున్నా డండి నే వస్తా అంటూ వెళ్లి పోయింది . నాకు చాలా గిల్టి గా అనిపించి రాత్రంతా నిద్ర కూడా పట్ట లేదు అనవసరం గా బీరు ప్రభావానికి లోనయి పెళ్ళయిన ఆవిడ భయం పోగొట్టు కోడానికి వస్తే పాల రాయి చందమామ అంటూ చీకటే నయం రా బాబు అనుకుంటూ వెళ్లి పోయేలా చేసానేమో?లేదా వాళ్ళ అబ్బాయి రాకుండా వుంటే తను కూడా ఇంకోలా ప్రతి స్పందిన్చేదేమో ?ఏమైనా నేను తొందర పడ్డ ఇన్నాల నుంచి రాముడు మంచి బాలుడు లా వున్నా నాలో రావణ కోణం బయట పెట్టేసానేమో అనుకుంటూ యెప్ప టికో నిద్ర లోకి జారా .కాలింగ్ బెల్ మోగితే లెచా, చూస్తే ఎదురు గా సుధ కాఫీ కప్పు తో ప్రత్యక్షం .ఏంటండి రాత్రంతా నిద్ర పోలేదా?యి రోజునుంచి నేనే మీ మీద ప్రభావం చూపించాలని డిసైడ్ అయ్యి మొదట కాఫీ తో మొదలెడ దామని తెచ్చా అంటూ అందించింది . వోహో రకమే అనుకుంటూ కాఫీ అందుకున్తునప్పుడు ఆమె చేతి వెళ్ళు తగల్చడం యాదృచ్చికం అని మాత్రం అనుకోలేదు . అంతవరకూ వున్నా గిల్ట్ భావం పోయి ఇప్పుడు కొత్త ఆలోచనలు ముసురు కుంటున్నాయి .కొన్ని క్షణాలకి ముందు వొక భావం ఇప్పుడు మళ్ళి వేరే భావం .అనుక్షణికం మనసులో అప్పటి కాల మాన పరిస్తితుల బట్టి మనసులో కలిగే విభిన్న కొనాలని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ కదా గమనం .
excuse మీ యి ట్రైన్ హైదరాబాద్ ఎప్పుడు వేలుతుందండి అంటూ ఎదురు బెర్త్ లో వున్న అందమైన అమ్మాయి పిలుపుతో ఆలోచనల నుంచి బయటకొచ్చి చుట్టూ చూస్తే ఆ ఫస్ట్ ఏ సి కంపార్ట్మెంట్ లో మే మిద్దరమే ఉన్నామన్న విషయం భోధ పడింది .యి క్షణం సుధ మాయం అయి పోయి ఈ అపరిచిత ఆమె స్తానం ఆక్రమించింది . కరెక్ట్ టైం కి వెళితే రేపు పొద్దున్న ఎనిమిదికి , హైదరాబాద్ లో మీరేక్కడకి వెళ్ళాలి ?మొదటి ప్రశ్న కే అంత చొరవ పనికి రాదన్న మనసుని డామినేట్ చేస్తూ అడిగేసా .
కేర్ హాస్పిటల్ కి అండి రేపొద్దున్న మా అన్నయకి బై పాస్స్ ఆపరేషన్ .
అయ్యో అలాగా రేపు నాకు కార్ వస్తుంది మీకు అభ్యంతరం లేక పొతే డ్రాప్ చేసి వెళ్తా అన్నా .
చాలా థాంక్సండి నాకు హైదరాబాద్ కొత్త ఆటో వాళ్ళు మోసం చేస్తారని భయ పడుతుంటే మీరు ఇలా పరిచయం అవడం నా అదృష్టం . మీరెన్ చేస్తూ వుంటారు? చెప్పాకా ఆమె కళ్ళలో ఆరాధనా భావం నే గమనించక పోలేదు .ఇద్దరం కలిసి నేను తెచ్చుకున్న డిన్నర్ షేర్ చేసుకుంటుంటే తన గురించి అంతా చెప్పింది .ఏం బి ఏ పూర్తీ చేసి ఉద్యోగ అన్వేషణ లో వుందని .మీ అన్నయ్య ఆపరేషన్ అయి పోయాక నన్ను వచ్చి ఆఫీసు లో కలవండి నే చూసుకుంటా అన్నా .
అదేంటి ఇప్పటి దాక కొరుక్కు తినేలా చూస్తున్నారు గా తనే అందో నా మనసు అల్లా విందో నాకు అప్పటికి అర్ధం కాలేదు .
మీరు భలే నవ్విస్తూ మాట్లడతారండి రాత్రంతా మెలుకువ గా ఉండి మరి మీతో మాట్లాడాలని ఉంది అండి అపరిచిత . అంటే గుండెల్లో బాంబు పెకినట్టయ్యింది . అదే డైలాగు అలాంటి రాత్రే సుధ కూడా నాతొ అంది . అంటే సుధ లాగే ఈమె కూడా?అమ్మో ఇంకో సారి చచ్చిన బకరా అవకూడదు అనుకుంటూ లేదండి యి రాత్రి నేను ఏ తప్పు చెయ్య దలచుకోలేదు అనేసాక అర్ధం అయ్యింది యెంత తప్పు గా మాట్లాడానో వెంటనే సద్దుకుని అదేనండి నిద్ర పాడు చేసుకుని బాతా ఖాని కొట్టే తప్పు పని అని సరి దిద్దా .
ఆమె కూడా ఛి ఛి మిమ్మల్ని చూస్తే తప్పు చేసే వారిలా కనబడడం లేదు లెండి (పప్పు ముద్దా పోయి పడుకోరా ఆనా?)అయినా రేపొద్దున్న అన్నయకి కట్టడానికి ఇంకా రెండు లక్షలు కావాలీ ఆన్న ఆలోచనలతో వున్న నాకు నిద్రే పట్టదు, ఇంకా వేరే ఆలోచనలు ఏమి వస్తాయి అని నా మొహం లో ప్రతి స్పందనకి ఆత్రం గా ఎదురు చూస్తోంది ,సుధ పరిచయం కాక పోయి వుంటే నెక్స్ట్ దైలోగు యెంత మాటండి రేపు నాతొ పాటు బ్యాంకు కి వచ్చి ఆ రెండు తీసుకుని ఏదో విధం గా తీర్చుకోండి అని వుండే వాడినేమో , దానికి భిన్నం గా గురక శబ్దం విన బడడం తో సచ్చి నాడా సావు గిరాకి అనుకుంటూ ఆమె నెక్స్ట్ కంపార్ట్మెంట్ కి వెళ్లి పోవడం నాకు నిద్ర నటిస్తుండడం తో తెలుస్తూనే ఉంది . ఇంతలో సుధ నుంచి మెసేజ్
క్షణ క్క్షణం మనిద్దరి మద్య పెరిగి పోతున్న దూరం
అపార్దం చేసుకుని వెళ్లి పోతున్న వైనం
ఇక నుంచి మనసులో మాట రాని మౌనం
ఎప్పటికన్నా తెలుస్తుందా నా గుండెల్లోని ఈ వేదనం
మరెప్పటికీ కనిపించని వోకప్పటి నీకు ప్రియమైన ఈ వదనం .
చదివాక మనసు భారం అయిన మాట నిజమే గాని తనది ప్రేమో?అవకాశ వాదమో తెలుసు కోవాలంటే వేచి చూడాల్సిందే మిగతా బాగం కోసం (ఇంకా వుంది) బేతాళుడు మౌన భంగం అవడం తో తిరిగి చెట్టెక్కాడు .

4 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

ఈ అక్రమ సంబంధాల కధలేంటి సారూ? ఓ మాంచి సస్పెన్స్ కధ రాయచ్చుగా?

Unknown చెప్పారు...

కధ పూర్తీ గా చదవ కుండానే క్రమమో అక్రమామో నిర్ణయించుట పాడియా
ఈ మద్య ఆడవాళ్ళూ కొంత మంది మానవ బలహీనతలను అడ్డు పెట్టుకుని
పరిచయమైనా పది నిమిషాలకే పది వేలు అప్పు ఇవ్వగలరా అన్న సంఘటనలు తారసపడి
ఆ స్పూర్తి తో రాస్తున్నదే ఈ కధ . అదేం ఖర్మో గాని
నేను సస్పెన్స్ థ్రిల్లెర్ రాసినా జనాలు అందులో కుడా బూతు ని చూస్తె ?
సరే మీ కోరి క మేర యి కధ ని సస్పెన్స్ థ్రిల్లెర్ గా మార్చెస్తా

నేస్తం చెప్పారు...

మీరెన్ని అన్నా నాదీ రౌడీ గారి మాటే రవిగారు.. :) .. ప్రపంచం లో ఎన్నో జరుగుతుంటాఅయి.. కాని ఒకే కోణం ని పట్టుకోకూడదు కదా..బహుసా మీ పోస్ట్ లు చాలా ఇటువంటి విషయాన్ని తరుచూ ప్రస్తావించడం వల్ల ఇది కూడా రోటిన్ కధల్లా ఫీల్ అయ్యా మేమో :( కాని.. అలా కధ మార్చేయద్దు.. కంటిన్యుటీ దెబ్బతింటుంది .. ఈ సారికి మీరు అనుకున్నట్లు గానే వ్రాయండి..:)నెక్స్ట్ టైం ఒక డిఫరెంట్ కధ ఆశిస్తున్నా.. సస్పెన్స్ యే అక్కరలేదు.. ఇప్పటివరకు మీరు ఎంచుకోని అంశం మీద వ్రాయగలరు.. :)

శ్రీనివాస్ చెప్పారు...

అయినా అమ్మాయి కనిపించగానే మీకు అంత తొందరేటి గురు గారు