
ఇప్పుడే రావణ్ సినిమా చూసి బతికి బట్ట కట్టి వచ్చా .మణిరత్నం సగం సినిమా అయ్యాక గుండె పోటు వచ్చినదంటే రాదా మరి ?రశేష్ చూసి ఉంటాడు .రామాయణాన్ని ఆధునీకరించి జనాల మీదకి వోదులుదామన్న ప్రయత్నమే యి సినిమా .సినిమా మొదలవ్వడమే రావణ్ (అభిషేక్ బచ్చన్ )సీతని (ఐశ్వర్య )పడవలో కిడ్నాప్ చెయ్యడం తో మొదలవుతుంది .ఎందుకు కిడ్నాప్ చేస్తున్నడన్నది ఇంటర్వల్ కి కూడా తెలీదు .ఇంటర్వల్ వరకు సీతాన్వేషణలో ఆమె భర్త ఎస్పీ (విక్రం )పోలీసులని వెంటేసుకుని అడవుల్లో గాలించడమే సరి పోతుంది .టూకీగా కధ చెప్పుకోవాలంటే రావణ్ చెల్లి (ప్రియమణి)ప్రేమించిన వాడితో పెళ్లి జరగ బోతుంటే ,రాబిన్హుడ్ లా వున్న వాడిని దోచి తన వాళ్ళకి పెట్టె రావణ్ ని అర్రెస్ట్ చెయ్యడానికి వస్తే పెళ్ళికొడుకు పారి పోతాడు పొలిసు వాళ్ళు ప్రియమణి ని స్టేషన్ కి తీసుకెళ్ళి పెళ్లి చెడిపోయింది గాని శోభనం కాదని మానభంగం చేస్తారు .ఆమె ఆత్మా హత్య చేసుకుంటుంది . దాంతో కక్ష గట్టిన రావణ్ ఎస్ పీ భార్యని కిడ్నాప్ చేసి తన దగ్గర పెట్టుకుంటాడు .సీత మొదట్లో అపార్దం చేసుకున్న తన కిడ్నాప్ వెనక కధ విని ,అడవిలో మనుషులు రావణ్ కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్దం అని తెలుసుకుని అతని మీద సదభిప్రాయం తోనే వుంటుంది .హనుమంతుడి లాంటి గోవిందా సాయం తో మొత్తానికి రావణ్ స్తావరం కని పెడతాడు ఎస్ పీ . అయితే సంధి కోసం రావణ్ తమ్ముడు ఎస్ పీ దగ్గరకి వెళితే మోస పూరితం గా అతన్ని చంపేస్తాడు .దాంతోప్రతీకారం తో ఎస్ పీ అడవిలో బస చేసిన గుడారాలని పోలీసులని రావణ్ పేల్చే స్తాడు . ఎస్ పీ ని చంపే అవకాసం వచ్చినా కూడా వదిలేసి నీ భార్య బంగారం దాని మొహం చూస్తే నిన్ను చంప బుద్ది అవడం లేదు . నాలో మృగం విజ్రుభించి ఆమెని ఏమీ చెయ్య కుండా తీసుకు వెళ్లి పో అని పంపేస్తాడు .హమయ్య సినిమా అయ్యింది రా బాబు అనుకుంటే ట్రైన్ లో వెళుతూ ఎస్ పీ ఆ రావణ్ పద్నాలుగు రోజులు ఉంచుకుని నిన్ను ఏమి చెయ్య లేదా?అని అడుగుతాడు . లేదు చెయ్య లేదు అతను చాల మంచి వాడు అయినా నా మొహం చూస్తేనే అర్ధం అవటం లేదా ఏమి జరగ లేదని ?అంటుంది . దానికి బదులు గా ఎస్ పీ లేదు నువ్వు అబద్దం చెపుతున్నావ్ నాకు అతను ప్రాణ బిక్ష పెట్టినప్పుడు ఆ పద్నాలుగు రోజులు ఎన్ని విధాల ఆనందం పొందినది చెప్పేసాడు అంటే ఆమె చైన్ లాగి రైల్ దిగి పోయి అడవిలో అతన్ని వెత్తుకుంటూ వెళ్లి చచ్చినాడ మా ఆయనికి ఏం చెప్పి చచ్చావురా మనిద్దరికీ రంకు అంట గడుతున్నాడు అని అడుగుతుంది .నేనేం చెప్పాను నువ్వు బంగారం నాలో మృగం బయటకొచ్చి తప్పు జరిగేలోపు పట్టుకు పోరా బాబు అన్నా అంటాడు .ఆ స్టేజి లో ఆమె రావణ్ తో సెటిల్ అయిపోతున్దనట్టు గా హావ భావ విన్యాసాలు పలికిస్తుంది సో ఇదన్న మాట మోడరన్ రామాయణం అనుకుంటూ జనాలు సీట్ లోంచి లేచే లోపు వెనక నుంచి ఎస్ పీ పొలిసు బలగాలతో వచ్చి రావణ్ మీద తుపాకీ ఎక్కు బెడతాడు . నహీ అంటూ సీత వచ్చి రావణ్ గుండెలకి అడ్డం గా తన గుండెలు పెడుతుంది ,గుండు దూసుకు వస్తుంటే రావణ్ సీత తలని వత్తేసి గుండు తన గుండెల్లో దూసుకు పోయేలా చూసుకుంటాడు .కొండ మీద నుంచి జారి పోతూ హిందీ మగధీర లా ఆమె కేసి వేళ్ళు జాపితే ఆమె కూడా కాజల్ లాగ వెళ్ళు చాపుతుంది కళ్ళలో నీళ్ళు కుక్కుకుని .జనాలు బుర్రలు గోకుకుంటూ భారం గా బయటకు అడుగులు వేసారు .
యి సినిమా తియ్యడానికి వొకటిన్నర సంవత్సరాలు పట్టిందంటే పట్టదా మరి రామాయణ విష వృక్షం ఆయే మరి .చినప్పుడు మా స్నేహితుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తో రిలీజ్ అయిన ప్రతీ సినిమాకి పోతూ వుండే వాడు బాగున్నా బాగోలేక పోయినా . వొక రోజు వుండ బట్ట లేక ఏంటి యిలా ప్రతి సినిమా ఎందుకు చూస్తారంటే వాడిచ్చిన సమాధానం బావున్న సినిమా ఎందుకు బావుందో చూస్తారట , బావోని సినిమా ఎందుకు బావోలేదో చూస్తారట సో అంత సినిమా పిచ్చి వుంటే తప్ప యి సినిమాకి పోవడం సాహసమే యి కధ కూడా నేను కూడా కొద్దో గొప్పో రచయితా లాంటి వాణ్ణి కాబట్టి సినిమాలో గ్రోలి రాసింది గాని యింత అరటి పండు వలిచి పెట్టినట్టు మాత్రం కధనం లేదని ప్రేక్షకులు గమనించ ప్రార్ధన .