12 జూన్, 2010

అనుక్షణికం (ఆఖరి భాగం )

తాత్కాలికం గా సుధ ప్రేమ మత్తులో పడి గంటలు గంటలు సెల్ లో మాట్లాడుకున్నప్పుడు నాకు తెలీని ఇంకో విషయం ఏంటంటే వొక్క టికెట్ పై రెండు చిత్రాలు చూపిస్తున్నా అని . అదెలాగంటే నేను తన తో మాట్లాడే ప్రతీ మాట తరణి కి పూస గుచ్చి నట్టు చెప్పేది .బహుశా పెళ్లి అయినా కూడా తన వెనక ఇంకా మగాళ్ళు పడుతున్నారు సుమా అని గొప్పలు చెప్పుకోడానికి తను చెప్పుకుని ఉండొచ్చు గాని నా జీవితం లో అవి పెను మార్పులకి నాంది వాచకం అవుతాయని ఆమెకి అప్పుడుతెలీక పోవచ్చు .నా మాటలు అభిప్రాయాలూ సుధ ద్వార తెలుసుకున్న తరణి పరువు కోసం ప్రాకులాడే మనిషినని తేలిక గానే గ్రహించింది .అయితేతరణి విచ్చల విడి మనస్తత్వం , ఎలాగైనా సరే డబ్బు సంపాయించడం , విలాసవంత మైన జీవితం గడపడం .రేపు కు లేదు గారంటీ కాబట్టి గతం లో అనుభవించిన కష్టాలని మరచి పోయేలా వర్తమానం లో స్వర్గ సుఖాలు అనుభవించి భవిస్యత్తు కోసం బెంగ పెట్టుకోకుండా ఉండడమే తరణి జీవన విధానం . కోవ లోనే పరిచయం అయిన వాడే ఇన్స్పెక్టర్ రంగనాథ్ .అతనికి ఇంకా పెళ్లి కాలేదు .కాని చాలా విలాస పురుషుడు .తరణి కి ముందే చెప్పాడు తను రాముడు కాదు కృష్ణుడు అని.తనకి రాముడైనా క్రిశ్నుడైనా తన అవసరాలు తీర్చే దేవుడైతే అదే చాలని అంది . ఆండర్ స్టాండింగ్ లో ఇద్దరు పరిధులు దాట దానికి ఎంతో టైం పట్టలేదు . వొక సారి పరిధి దాటేసాక చనువు అధికారం పెరిగి పోతాయి కాబట్టి అదే చనువు తో వొక సారి మీ కజిన్ సుధ ఇంటికి తీసుకేలోచ్చు గా ?అని ఆడి గేసాడు రంగనాథ్ . ఎందుకు కన్నె పిల్లలు అయిపోయాక పెళ్లి అయిన వాళ్ళు కావలసి వచ్చిందా తరణి గట్టి గానే అడిగింది .నీ కుళ్ళు పొనిచ్చు కున్నావు కాదు ఆమె వేరే ఆయన తో ప్రేమాయణం సాగిస్తోంది కదా ఎలా వుంటుందో అన్న కుతూహలమే అంటే వొక సారి సుధ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసింది . సందు ఇస్తే చొచ్చుకు పోదామనుకునే రంగనాథ్ తరణి కి తెలీకుండా రెండు మూడు సార్లు సుధ ఇంటికి వెళ్ళాడు . విషయం సుధ కూడా తరణి కి చెప్పక పోవడాన్ని అంగీకారం గా భావించుకుని వొక సారి మద్యాన్నం సుధ వోక్కత్తే వునప్పుడు వచ్చి మీ అందం నన్ను పిచ్చి వాణ్ణి చేస్తోంది తప్పు చేసి తన్నులు తిన్నా పరవాలేదని పిస్తోంది అంటూ అసభ్యం గా ప్రవర్తించ బోతే ఏం బాబు ఇప్పటికే ఎవరో అమ్మాయిని ప్రేమ పేరు తో మోసం చేసి పెళ్ళిచేసుకోకుండా తప్పించుకుని తిరుగు తుంటే ఆమె టీ వి కెక్కి నీ పరువు బజార్న పడయ్యేడం నువ్వు సస్పెన్షన్ లో వుండడం చాలా లేదా మళ్ళి నేను కూడా రంగం లోకి దిగాల అంది సుధ . ఎంటే పెద్ద పతివ్రతా లా మాట్లాడు తున్నావ్ ? నీ పై ఇంటి వాడితో జరుపుతున్న రంకు పురాణం బి బి సి లో కూడా చుపెడుతున్నారు అని విన గానే ఉగ్ర కాలి లా మారిన సుధ చీపురు తిరగేసి వాణ్ణి చితక కొట్టి పంపేసింది .వాడు నీ అంతు చూస్తానే అంటూ వెళ్లి పోయాడు .
అయితే విషయం నాకు చెప్పక పోవడం సుధ చేసిన తప్పు .ఇది జరిగిన రెండో రోజే నాకు అపరిచిత ఆడ ఆమె నుంచి సెల్ రావడం మొదలయ్యింది ఇది కొను అది కొను అని .ఇప్పుడు తెలిసిన భయంకరమైన నిజం ఏంటంటే నన్ను అప్పుడు అలా ఫొటోస్ చూపించి ఫోన్ లో కోర్కెల చిట్టా విప్పి నన్ను వీపీ అప్పారావు ని చేసింది మరెవరో కాదు తరణి అని .తనని అలా ప్రోత్సహించి డబ్బులు వసూలు చేయ్యిన్చిన్డి ఇన్స్పెక్టర్ రంగనాథ్ .మనిద్దరం ఇప్పటి యి విలాసన జీవితం వివాహానంతరం కూడా కోన సాగించాలంటే నువ్వు నే చెప్పినట్టు విని అతనిని ఫోన్ లో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపయిన్చావలసిందే అని హుకుం జారి చేసాడు . డబ్బుకంటే కూడా ముఖ్యం గా పెళ్లి చేసుకుంటాడన్న ఆనందం తరణి చేత అలా పురీ గోల్పించింది . అయితే తరణి పెళ్ళిచేసుకుంటావా ?చస్తావ ?అని ఇన్స్పెక్టర్ ని నా ట్రాన్స్ఫర్ అయిన రోజే నిర్భందిస్తే ఇంకొక్క లక్ష రూపాయలు అతని దగ్గర వసూల్ చెయ్యి అప్పుడు చేసుకుంటా అనడం తో ఆమె ట్రైన్ లో నన్ను ఫాలో చేసింది. అయితే నేనెప్పుడు తరణి గురించి సుధా ద్వార వినడమే గాని ప్రత్యక్షం గా చూడక పోవడం తో నేను కనిపెట్ట లేదు .అయితే సుధా వాళ్ళ అయన దుబాయి ఉద్యోగానికి వెళుతూ తన రహస్య స్నేహితురాలికి సుధా మీద వొక కన్నేసి ఎప్పటి కప్పుడు ఇక్కడ జరుగుతున్నా విషయాలని తనకి చేర వెయ్య మనడం తో ఆమె కొంచెం చిలువలు పలువలు
కూడా చేర్చి చెప్పడం తో నా మీద కక్ష పెట్టుకున్న సుధ భర్త , తరణి బ్లాక్మెయిల్ వ్యవహారం కూడా తెలుసుకుని ఆమె ని చంపడానికి దుబాయ్ లోనే'' సుపారి '' చెల్లించాడు .హత్య నేరం నా మీద పడేలా ఎత్తుగడ వేసాడు.
సస్పెన్షన్ లో వున్న ఇన్స్పెక్టర్ రంగనాథ్ డీ ఐ జి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయిని గుట్టు చప్పుడు కాకుండా విడిపించుకు వస్తానని అందుకు ప్రతి ఫలం గా తనని విధుల్లోకి చేర్చుకోమని ప్రాధేయపడి వాళ్ళ అమ్మాయిని తీసుకు వచ్చి అప్ప చెపుతాడు ,ఆమె పల్లి వాడ్ని ప్రేమించి ఆర్య సమాజం లో పెళ్లి ఎర్పా టూలు చేసుకుంటుండగా తరణి హత్య నేరం మీద పల్లీ వాణ్ణి అర్రెస్ట్ చేస్తారు , వాడు డబ్బుకు ఆశ పడీ పల్లిలలో విషాన్ని కలిపి కూపే లోంచి బయటకు వచ్చిన తరణి కి అమ్ముతాడు , పల్లిలంటే తరణి కి ప్రాణం రాత్రైనా పగలైన పల్లి అంటే ఎప్పుడు రెడీ అంటుందని తెలిసే దుబాయి సుపారి వాడు ఆమెని చంపడానికి పల్లి వాణ్ణి ఎంచు కుంటాడు.
డి ఐ జి వాళ్ళ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరిన సందర్భం లో నగరం లో ప్రముఖులకి డిన్నర్ ఏర్పాటు చేసాడు పొలిసు బాస్ దానికి నాకు కూడా ఆహ్వానం అందడం తో నేనూ వెళ్ళా. అందరి చేతుల్లోను గ్లాసులు మత్తు గా వుంది వాతావరణం. ఇంకో ఐ పీ ఎస్ ఆఫీసర్ అంటున్నాడు డి ఐ జి తో షార్ వొక్క దెబ్బ తో రెండు పిట్టల్ని పడ గొట్టారు ఆ పల్లిల వాణ్ణి యి హత్య నేరం లో యిరికించడం ద్వారా వాణ్ణి అడ్డు తొలగించుకోవడం తో పాటు మీ అమ్మాయికి వాడి మీద అసహ్యం వేసి మీరు తెచ్చిన సంభందమే చేసుకుంటా అనే స్తితి కి తీసుకు వచ్చారు , మీరు చాల గ్రేట్ షార్ అంటున్నాడు .కొంత సేపటికి ఆ ఇన్స్పెక్టర్ రంగనాథ్ వచ్చి డి ఐ జి కి సల్యుట్ చేసి అయన కటాక్ష విక్షనాలకై ఎదురు చూస్తూ నిల బడ్డాడు . అరగంట తర్వాత ఆయన కరుణించి ఓకే రంగనాథ్ గుడ్ జాబ్ అని ముక్తసరి గా వురుకున్న్నాడు ,దానికి వెంటనే రంగనాథ్ సార్ నన్ను డ్యూటీ లోకి తీసుకోండి సార్ హంతకుణ్ణి పట్టు కున్నాగా అంటే డి ఐ జి కోపం గా చూడు మిస్టర్ అసలు హంతకుడివి నువ్వే అని నాకు మాత్రమె తెలుసు ఆ రోజు ఆ అమ్మాయి ని ట్రైన్ దగ్గరుండి ఎక్కించి సైనైడ్ కలిపిన వాటర్ బాటిల్ ఇచ్చిన సంగతి బయట పెడితే వుద్యోగం కాదు వురి వస్తుంది కాబట్టి నోరుమూసుకుని కుక్కిన పెను లా పడీ వుండు అంటుంటే విని అవాక్కవడం నా వంతయ్యింది .అంటే ఇన్స్పెక్టర్ దృష్టిలో పల్లిల వాడు హంతకుడు డి ఐ జి ద్రుస్తిల్లో హంతకుడు ఇన్స్పెక్టర్ .మనసులో ఆనుకున్నా ఆ పోస్టుమార్టం చేసిన డాక్టర్ రెండు లక్షలు దొబ్బితే దోబ్బాడు గాని ఆ రాత్రి తరణి నిద్ర పొతున్నా అనుకుని నా వజ్రపు ఉంగరం లాగ డానికి ప్రయత్నిస్తుంటే నే చెయ్యి గట్టి గా విదిలించడం తో వజ్రం వూడి ఆమె నోట్లోకి వెళ్ళిపోయి పేగులు కోసేయ్యడం తో రక్త స్రావం అయ్యి చని పోయిందన్న విషయం ఎప్పటికి మా ఇద్దరి మధ్యే వుండి పోతుంది,ఏమన్నా గాని యి క్షణం ఆనందం గా వుందని మరు క్షణం అలాగే ఉంటుందని ఎప్పటికి అనుకోలేము అనుక్షణికం జీవితం ఆటు పోటులకి గురి అవుతూనే వుంటుంది .తాత్కాలిక మైన సుఖాలకోసం ప్రాకులాడితే దైవం అస్తమాను సాయం చేస్తుందని మాత్రం అనుకోకు నాయన చిద్విలాసం గా నవ్వుతు తెలుగు యోగి నా కేసి చూస్తూ అంటున్నాడు .ఏమో స్వామి మంచి పాత్ర ఇమ్మని అడగడమే మనం చెయ్యగలిగినది అంటూ పాత్రలోని మధురాసాన్ని గ్లాసులోకి వంపుకుంటూ అన్నా .ఇంతలో యోగి సెల్ రింగ్ అవుతోంది దాన్ని టేబుల్ మీద పెట్టి అయన బాత్ రూం లోకి వెళ్ళడం తో నేను ఆ సెల్ కేసి చూసి నోరు వెల్ల బెట్టా .తరణి కాలింగ్ అని వస్తోంది అంటే యోగి కి ఆత్మలు కుడా సెల్ చేస్తాయా ?

8 వ్యాఖ్యలు:

Malakpet Rowdy చెప్పారు...

The final two episodes have been rushed up. Looks like you didnt have time.

తెలుగుయోగి చెప్పారు...

తరణికి నాకు ఉన్న పరిచయాన్ని ఇలా బ్లాగుల్లో రాసి నా పరువు బజార్న పడేసినందుకు నా భక్తులకి బాధ కలిగించినందుకు మీకూ రంజితకీ ఉన్న పరిచయం గురించి నేనూ ఒక కధ రాయబోతున్నానోచ్

రవిగారు చెప్పారు...

అవును భరద్వాజ్ సమయా భావం వాళ్ళ కదా గమనం లో తేడా వచ్చింది , గమనించాను ,
తెలుగు యోగి ,''తరణి ''మీ ఆశ్రమం లోనే అజ్నాత గా జీవితం వెళ్ళ గడుపుతోందని ,
ఆమె చనిపోయిన్దనుకుని ఇచ్చిన ఇన్సూరెన్స్ సొమ్ముతో మీ ఆశ్రమం లో
ఇంకో అంతస్తు లేచిందన్న చేదు నిజం నేనింకా బయట పెట్టలేదు గా ?

శ్రీనివాస్ చెప్పారు...

పొన్నూరు ఎస్సై రంగానాద్ గురించేనా ??

రవిగారు చెప్పారు...

అమ్మో శ్రీనివాస్ ఇలా పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి కని పెట్టేస్తే ఎలా?
ఇంకా నయం మిగాతా పాత్రల్ని కని పెట్ట లేదు .

milky చెప్పారు...

Hi Ravi Garu nenu Nina moning nunchi me blog no chadhuvuthunanu naku oka Chinna dought ANdi .ikada anushanikam Sudha and park Sudha okkarena naku konchem clarify chayandi plssss

milky చెప్పారు...

Asalu me stories chala bagunay andi real ga nenu chusanu but naku me andharila story create chayatem radhu anduka andhari blog stories chaduvuthanu simply super Ravi Garu

రవిగారు చెప్పారు...

మిల్కీ మీకు నా కధలు నచ్చి నందుకు థాంక్స్ .
నిత్య జీవితం లో ఎదురైనా అనుభవాలనే కధలు గా మార్చడం నా కలవాటు .
అనుక్షణికం లో సుధా కి , పార్క్ కధ లో సుధా కి దగ్గరి పోలికలు వున్నా
యిద్దరు వేరే .అనుక్షణికం లో సుధా ధీ నిస్వార్దమైన ప్రేమ అయితే ,
పార్క్ కధ లో సుధా ఎదుటి వాడి బలహినతని ప్రేమ పేరు తో
డబ్బు రూపం లో మార్చుకునే టైపు .