మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
7 జూన్, 2010
(అనుక్షణికం ఆరవ బాగం )
వారం రోజుల తర్వాత అసలు హంతకులు దొరకడం తో నన్ను విడిపించి ఐ జి తన కార్ లోనే ఇంటికి దిగబెడుతూ
'' సారీ అండి సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో ఎవిడెన్స్ బట్టి మిమ్మల్ని అర్రెస్ట్ చెయ్య వలసి వచ్చింది , ఆ తెలుగు యోగి సహకారం తో అసలు హంతకుల్ని పట్టుకున్నాం''. అంటుంటే ఆత్రం ఆపుకోలేక ఎవరు? అని అడిగేసా , ఆ పొలిసు అయన మొఖం లో నీకేంటి అంత ఇంటేరేస్ట్టు అన్న భావం గోచరించి టాపిక్ మార్చడం కోసం మీ అమ్మాయి క్షేమంగా ఇంటికి చేరిందా? అని అడిగా .అయన మొఖం యెర్ర గా చేసుకుని మా వేదవలది అరవోడి రహస్యం అందరికి తెలిసేదాక ఇంకా రహస్యమనే అనుకుంటారు అన్నాడు . ఆయోయో వాళ్ళేమి చెప్పలేదండి వాళ్ళ ఆత్రం లో అన్న మాటలు నాకు వినబడి అడిగా అంతే అన్నా . ఓకే మీ దగ్గర రహస్యం ఎందుకు మా మొత్తంపరిశోధన లో చాల విషయాలు తెలిసాయి అందులో మీకు సంభందం వుంది కాబట్టి చెపుతా వినండి అంటూ మొదలెట్టాడు . దాని సారంశం ........
-----------------------------------------------------------------------
వాళ్ళ అమ్మాయి రొజూ కాలేజీ కి లోకల్ ట్రైన్ లో వెళ్ళేది .హాసిని తన పేరు ,తను అందరి కన్నా బిన్నం గా ఆలోచించే అమ్మాయినని తన అపోహ.దానికి తగట్టు గానే ప్రేమ పేరు తో వచ్చే సినిమాలు . అదేంటి టెన్త్ పాస్ అయినా ఇంకా ప్రేమ లో పడలేదా?(అదేదో పేడ లో పడలేదా అని అడిగినట్టు ) వంటి డైలాగులు ఆ సందర్భం లోనే వచ్చిన ''ప్రేమ సింహ '' సినిమా .అందులో హీరో పల్లీలు అమ్ముకుంటూ ట్రైన్ లో పోతుంటే హీరోయిన్ మొదటి చూపులోనే ప్రేమలో పడి పోయి
''సింహ మంటి చిన్నాడో పల్లీలమ్మ వచ్చాడే , సింహ సింహ సింహ అంటూ వెంట పడుతూ వుంటుంది ,దానికి ఆ అంకుల్ హీరో వద్దు అటు చూడొద్దు నా వైపే చూడు పల్లిల వైపు చూసావంటే నోట్లో వేసేసుకొవాలని టెంప్ట్ అయి పోతావు అంటూ పల్లీలు అమ్మేసుకుని ఆ వచ్చిన డబ్బులతో అవిటి చేల్లెలకి జైపూర్ ఫుట్,అమ్మకి గుండె ఆపరేషన్ , తమ్ముడ్ని కలెక్టర్ చెయ్యాలని జీవితాశయం పెట్టుకున్నాడని తెలుసుకుని మరింత ప్రేమ పెంచేసుకుని ఏమన్నా సరే అతన్నే చేసుకుంటా అని తన అన్న కడపరెడ్డన్న కి చెపుతుంది అలా అయితే మన అంతస్తుకు తగట్టు గా కనీసం నెల లోపు పది కోట్లు సంపాయించి చూపిస్తే అలాగే వప్పుకుంటా నంటాడు ,దానికి హీరో పదికోట్లకి నెల ఎందుకు రా పది నిమిషాల్లో పల్లీలు అమ్మి సంపాయిస్తా అంటూ కలర్ వేసిన మీసాన్ని గట్టి గా తిప్పి అదే చేత్తో తోడ మీద కొట్టి ఆ కలర్ మసి తెల్లపంచి మీద కనబడ్డా సరే సింగెల్ షాట్ వొకే అంటూ రాయల సీమ లో వెళ్ళే అన్ని ట్రైన్స్ మీద పడతాడు . అయితే హీరో గతం లో రాయల సీమ లో పెద్ద పేరుమోసిన ఫాక్షనిస్ట్టు కొన్ని కారణాల వాళ్ళ హైదరాబాద్ వచ్చేసి గుట్టు గా పల్లీలు అమ్ముకుని బతుకు తుంటే ఇప్పుడు ప్రేమ పేరు తో బయట పడవలసి వస్తుంది అతని వల్ల ఇంతకూ ముందు లబ్ది పొందిన వాళ్ళు ఈ విషయం తెలుసుకుని వొక ప్రత్యేకమైన రైలు వేసుకుని వెయ్యిమంది వచ్చి పదినిమిషాల్లో పల్లి వోక్కొక్కటి లక్ష రూపాయలకి కొనుక్కుని చక్కా వెళ్లి పోతారు.కదా సుఖంత మవుతుంది.
అది చూసి ఇంస్పిర్ అయిపోయి హాసిని రొజూ తను వెళ్ళే ట్రైన్ లో పల్లిలమ్మే అబ్బాయికి లైన్ వేసి పది రోజుల్లో ఐ లవ్ యు అంటుంది .దానికి పల్లీల వాడు కొండ కి వెంట్రు కేసా వస్తే కొండ పొతే వెంట్రుక అని మనసులో అనుకుని ఐ పెంటా అంటాడు .అదేంటి ఎవరన్న ఐ టూ అంటారు నువ్వేంటి అసహ్యం గా అంది హాసిని .
ఏవండి ఐ టూ అంతే నా ప్రత్యేకత ఏంటి ?నేను వొక కవున్ కిస్కా గొట్టం ఐ త్రీ , ఐ టెట్రా ఐ పెంటా అన్న మాట అనగానే ఫ్లాట్ అయి పోయి ఆర్య సమాజం లో పెళ్ళికి ముహూర్తం పెట్టేసుకుని రెడీ అయిపోతోంది .ఇక్కడ అల్లా అవుతుంటే అక్కడ తరణి హత్య కాబడటానికి వీలు కలిపించిన పరిస్తితులు తెలుసు కోవాలంటే మళ్ళి నేనుఆ ఊరులో వున్నప్పుడు నాకు తెలీకుండా అయిన ఘటనలు తెలుసుకోవాలి అందుకు ఇంకో రెండు రోజులు వోపిక పట్టాలి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
ఈ సస్పెన్స్ లేమిటి తమ జిమ్మడ
కామెంట్‌ను పోస్ట్ చేయండి