1 ఆగ, 2010

మేసేజ్ పెట్టే మంటలు

http://us.123rf.com/400wm/400/400/iofoto/iofoto0809/iofoto080900249/3569585-asian-business-man-standing-looking-at-cell-phone-messages.jpg

మొన్న రాహుల్ మహాజన్ ని ముచ్చట పడి స్వయంవరం లో పెళ్ళిచేసుకున్న రెండో భార్య మీడియా ముందుకొచ్చి , రాహుల్ తనని రాచి రంపాన పెడుతున్నాడని , జుట్టు పట్టుకుని యిడ్చి మరి కొడుతున్నాడని , అలాగే ఎక్కడెక్కడ కొట్టాడో మొహమాటం లేకుండా టీ వి వాళ్ళకి చూపించడం తో వాళ్ళు పండగ చేసుకుని రోజంతా చూపించి టిఆర్ పీ రేటింగ్ పెంచుకున్నారు .ఇంతకీ ఎందుకు కొట్టాడు రా అంటే రాహుల్ పడుకున్న టైం లో డింపి (భార్య)సెల్ లో మే సే జ్ లు చూసుకుంటుంటే రాహుల్ దిగ్గున లేచి ఎవరి దగ్గరనుంచే ఆ రహస్య సందేశాలు అని అడిగితె గబుక్కున ఆమె తన సెల్ దాచు కోవడం తో మరింత అనుమానం వచ్చి లాక్కో పొతే ఆమె విరక్కోట్టితే తిక్క దొబ్బి ఎక్కడ పడితే అక్కడ కొట్టేసాడని సమాచారం . అది విని తొక్కలా మే సే జ్ కి ఇంత ఆర్భాటమా మరీ అతి గాడు అనుకుని ఆ విషయం అక్కడతో వదిలేసాను .
ఈ రోజు ఫ్రెండ్ షిప్ డే అని అందరికి విడి విడి గా పంపే తీరుబడి లేక అందరికి కలిపి వొకే సందేశాన్ని పంపేసా పొద్దున్నే అదే టైం కి మా పాలవాడు తుమ్ముతూ పాకెట్స్ పెడుతున్నా ,నా ఎడం కన్ను అదురు తున్నా,పక్కింటి పిల్లి గుమ్మం ముందు ఎదురైనాపాలకోసమే అనుకున్నా గాని , జరగా బోయే ప్రమాదానికి దానిని సూచిక గా పరిగణించకుండా సెండ్ బటన్ నోక్కేసా .కాఫీ తాగి వాకింగ్ కి బయలుదేరా.పావుగంట లో సెల్ మోగింది .
''గుండెల్లో ప్రేమ వుంటే ఎదురు గా వునప్పుడు చెప్పాలి గాని , యి సందేశం లోనే చెప్పాలా రవి నీ మే సే జి నేను బాత్ రూం లో వునప్పుడు వస్తే మా అయన చూసాడు , బయటకు రాగానే సూట్ కేసు సద్దుకుంటూ వాడితోనే కాపరం చెయ్యవే నేనెందుకు బాబు ని తీసుకుని వేరే వెళ్లి పోతాను అంటూ రాద్దాంతం .సవర దీసేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది . అసలే మా అయన ఏ చిన్న వంక దొరుకుతుందా దీన్ని వదిలేసి పోదామని చూసే రకం . ఆయనా నువ్వు సరదాగా మాట్లడతావే గాని చొరవ తీసుకునే మనిషివి కాదు గా'' అంటూ వొక స్నేహితురాలి దగ్గర నుంచి ఫోను.
ఇదేంట్రా బాబు గోల అనుకుంటూ మరో నాలుగడుగులు వెసానో లేదో మళ్ళి ఇంకో స్నేహితురాలి నుంచి ఫోన్ .
''రవి నీ సందేశం ద్వారా నా జ్ఞాపకాలలో శిధిల మై పోయిన నా స్నేహితున్ని గుర్తు చేసి నాకు యి ఫ్రెండ్ షిప్ డే నాడు ఆనందం కలగా చేద్దామని నువ్వు అనుకుంటే మా ఆయన దాన్ని చదివి ఎంటే నీ అపరిచిత (అతనెవరు ) స్నేహితున్ని మరచి పోయాను మీరు ,బాబే నా సర్వస్వం నన్ను నమ్మండి యి క్షణం నుంచి మీ పాద దాసిని అని అప్పుడు బొంకావ్ ? మళ్ళి వీడేమో నీకు ఆ రహస్య స్నేహితుడే ప్రపంచం అన్న సందేశం పంపాడు నన్ను నువ్వు వీ పి ని చేస్తున్నావు కదే'' అంటూ రాహుల్ మహాజన్ టైపు లో రెచ్చి పోయాడుట .
చచ్చానురా దేవుడా తుమ్ము తమ్ముడి లా హెచ్చ రించినా పెడ చెవి న పెట్టి నోక్కేసినందుకు అనుభవించాల్సిందే .అయినా ఆలోచనా తరం గాల్లో ఆయన ఎప్పుడో చెప్పారు ఆదివారం తర్వాత రక్షణ ఉండదని చిక్కులు తప్పవని ప్రమాదాలు ఏదో రూపం లో రావచ్చని ను అంతా బుస అనుకుంటూ నవ్వుకున్నా , ఇప్పుడు తెలుస్తోంది గ్రహచారం నా శీలానికే ఎసరు పెడుతోందని . ఇంతలో మళ్ళి ఫోను చేతులు వణుకుతుంటే ఎత్తి చూసా హత విధి మా శ్రీమతి కి చెల్లెలి వరస చుట్టం కం స్నేహితురాలు .హీన స్వరం తో భయం గా హలో అంటూ మళ్ళి గొంతు సవరించుకుని మేక పోతూ గంభిరాన్ని గొంతులో తెచ్చుకుని హలో చెప్పండి అన్నా అంతే ఆతర్వాత ఏమి విన్నా నో పూర్తీ గా గుర్తు లేదు .
'' ఎంటండి యిది మిమ్మల్ని యిలా అనుకోలేదు భందుత్వం తో కూడిన స్నేహం కదా అని నాలుగయిదు సార్లు మీ ఆఫీసు లో మీ చాంబర్ కొచ్చి టీ తాగినంత మాత్రాన అంత చనువు తీసుకుని ఆ సందేశం పంపుతారా ?మా ఆయన చూసుంటే? మా అబ్బాయి గట్టి గా ఆ సందేశాన్ని చదువు తుంటే పై ప్రాణాలు పైనే పోయాయి .మా అత్తా గారు గట్టి గా విష్ను సహస్ర నామం చదువు కొడం తో ఎవరికి విన పడ లేదు పక్క నే వున్నా నాకు తప్ప .వెంటనే కోపం వచ్చి అక్కకి ఫార్ వార్డ్ చేద్దామనుకున్నా కాని ఎక్కడో ఏదో మూల మీ మీద ప్రేమో అభిమానమో వుండడం తో ఆగి పోయా , యి ఫోన్ కూడా బాత్ రూం లోకి వచ్చి మాట్లాడుతున్నా రేపు సోమ వారం మీ చాంబర్ కి వచ్చి అప్పుడు చెపుతా బాయ్'' అంటూ పెట్టేసింది .
అంతే తన దాక వస్తే గాని తత్వం బోద పడదు .ఆ సందేశం మా శ్రీమతి కి తను ఫార్వర్డ్ చేసి వుంటే ?
'' ప్రబుత్వ వున్నతాది కారి రాసలీలలు సొంత భార్యే మీడియా కి రుజువులతో సహా వెల్లడించిన వైనం '' ట్టిట్టడై ట్టిట్టడై అంటూ టీ వి నైను లో హెడ్ లైన్స్ లో న్యూస్
మాస్టారు కొంచెం చూసి నడవండి వొకాయన పక్కకి జరపక పొతే ఎదురు గా దున్న పోతూ అమ్మో వుహే ఇంత భయం కరం గా వుంటే ?అంటే'' మంటలు రేపే సందేశం రాజా ఈ తుంటరి తనము నీకెలా ?'' అని మార్చి పాడు కోవలసిన రోజులన్న మాట , ఇంతకీ నేను పంపిన సందేశం యదా తధం గా ఇక్కడ ఇస్తున్నా దాంట్లోని తప్పొప్పులు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా . గ్రహాలూ తమ పని తాము చేసుకు పోతుంటాయి చట్టం లాగే .
'' to the world you may be just one person, but to one person you may be the world --- happy f ship day ''

11 వ్యాఖ్యలు:

Shiva Bandaru చెప్పారు...

:)

Sravya Vattikuti చెప్పారు...

అది ఫ్రెండ్షిప్ డే మెసేజ్ లాగ లేదే :)

రవిగారు చెప్పారు...

మీలాగే మా స్నేహితురాళ్ళ ఇంట్లో వాళ్ళు భావించారేమో శ్రావ్య గారు
మన భావనలకి గ్రహాల ప్రభావమే అధికం అంటున్నారు తెలుగుయోగి శర్మ గారు
ఏమైనా అనుభవించడానికి సిద్దమే ఈ రవిగారు

అజ్ఞాత చెప్పారు...

అంతరంగాలు జోస్యం మీకు నిజంగా పనిచేస్తోంది, జ్యోతిష్యం మళ్ళీ నిరూపించబడ్డది.
మీ మొబైల్ మీరు తూర్పు, దక్షిణ, దిశల్లో పెట్టివుంటారు, అందుకే ఈ అనర్థాలు. మీ తలకు వాయువ్యాన పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది.
శుభం భూయత్.

రవిగారు చెప్పారు...

అమ్మో అజ్ఞాత ఇప్పుడే నేను కని పెట్టిన ఇంకో విషయం ఏంటంటే
ఆ ఫోన్ చేసిన ముగ్గురి పేర్లు రా అక్షరం తోనే మొదలవుతున్నాయి
చూస్తుంటే యిదేదో రెఫరల్ కేసు లా తయారయ్యేలా వుందే?

రవిగారు చెప్పారు...

ఇక్కడ వొక చిన్న వివరణ ఇచ్చుకోవడం నా బాద్యత గా భావిస్తున్నా
నేను ఇదేదో శర్మ గారి పాండిత్యాన్ని తక్కువ చేస్తూ
రాసిన వ్యంగాస్త్రం యెంత మాత్రము కాదు
వారికీ లెస మాత్రం అనుమానం వున్నా
నాకు మెయిల్ చేస్తే ఆ ముగ్గురి పేర్లతో సహా సెల్ నెంబర్ కూడా ఇవ్వగలను
తద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు ,అందులో వారి బ్లాగు రెగ్యులర్ గా చదివే వారు కూడా వున్నారు .
వారు రాసినదాన్ని నాకు జరిగిన దానికి అన్వయించుకుని సరి పోల్చుకున్నా
కొస మెరుపు ఏంటంటే మా నలుగురిది కర్కాటక రాశే మరి . .

r చెప్పారు...

ఇటీవల ఆయన హెచ్చరిస్తున్నది కన్యారాశి , కన్యాలగ్నం
వారి గూర్చి. మరి మీరు కర్కాటకరాశి అంటున్నారు ??

శివ చెప్పారు...

రవి! మీ కవనం చాలా బాగున్నది. హాస్య ప్రధానంగా చక్కగా వ్రాశారు.

Malakpet Rowdy చెప్పారు...

ఛా! జోకులెయ్యకండి సార్. ఆ మెసేజ్ మీరు పొరబాటున పిచ్చమ్మకో, చిట్టిచిలకకో, సోబ్నాల్ ఐసీ కో పంపించి ఉంటారు - చూసుకోండి :))

అజ్ఞాత చెప్పారు...

కర్కోటక రాశైనా మీ పేరులో ఆ పది అక్షరాల్లో ఒకటి ఎక్కడ వున్నా అవేఫలితాలుంటాయి. రెండిళ్ళ అవతలే గ్రహ విస్పోటనాలు జరుగుతున్నాయ్ గదండీ. పాకిస్థానులో వరదలు ఎందుకొచ్చాయని అనుకుంటున్నారు? కుజ శని యుద్ధం వల్లనే అని వేరే మీకు మెయిల్ కొట్టి చెప్పాలా? j/k

రవిగారు చెప్పారు...

thank u shiva garu .
malak had i sent to so called pichamma r chitti chilaka i would have been none in the world by now instead of one . you know that .