
మా దగ్గర వున్నా అతి ముఖ్యమైనది నీ దగ్గర లేదు అని రజని సహాయకులు హేళన చేస్తే రోబో అదేంటి నాకు కావలి అంటూ రజని ని అడిగితె అవే ఫీలింగ్స్ అంటాడు రజని . సినిమా ఆఖర్న రోబో అదే సహాయకులతో మీ దగ్గర వున్నది నాకు రావడం వల్లే యిన్ని అనర్దాలు జరి గాయి మానవులందరికీ ఈ కుళ్ళు , ద్వేషం , అసూయా వంటి రెడ్ చిప్ లేకుండా వుంటే ప్రపంచం లో శాంతి ఉండేదని సందేశాత్మకం గా శంకర్ ముగించడం బావుంది .పిల్లలకి పెద్దలకి నచ్చే చిత్రమని ఘంటా పదం గా చెప్పొచ్చు . మా పిల్లలు మళ్ళి దసరా సెలవల్లో రెండో సారికి రెడీ అవుతున్నారు . రెండో రోజు సినిమా టికెట్ కే మన పరపతి వాడవలసి వచ్చింది ఇంకా దసరా సెలవల్లో ఇంకెంత డిమాండ్ వుంటుందో యి సినిమాకి .ప్రపంచం మొత్తం మీద రెండు వేల దియేటర్స్ కి పైగా విడుదలయ్యి మొదటి పది రోజులు అన్ని షో లకి టికెట్స్ బుక్ అయి పోయినప్పుడు కళానిధి మారన్ ఖర్చు పెట్టిన నూట నలభై కోట్లు వారం రోజుల్లోనే వచ్చేసి మిగత అంతా లాభమే .
ఇంకా నష్ట పోయింది ఎవర్రా అంటే అభిషేక్ బచ్చనే ఎందుకంటె పెళ్లి అయ్యాక ఐశ్వర్య అభిషేక్ కి కూడా అన్ని ముద్దులు పెట్టి వుండదు రజనికి పెట్టినన్ని . అందుకేనేమో రోబో పెద్ద హార్డింగ్ అమితాభ్ ఇంటిముందు ముంబై లో పెడితే రాత్రి కి రాత్రి తియ్యిన్ చేసాడుట బిగ్ బీ . మొత్తానికి ప్రపంచ సుందరి పెళ్లి అయ్యాక అత్త వారింట్లో రోబో కాదని నిరూపించింది యి సినిమాలో అందాలూ ఆరబొసి .జయ భాధురి కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఉండొచ్చు అది వేరే విషయం .
8 కామెంట్‌లు:
good
- www.vinuvinipinchu.blogspot.com
రోబో అదేంటి నాకు కావలి అంటూ రజని ని అడిగితె అవే ఫీలింగ్స్ అంటాడు రజని
----------------
ఇదొక్క సీన్ చాలు, కంటతడి పెట్టించింది. :((
మహిళాలోకాన్ని సెంటిమెంటు బాగా ఆకట్టుకుంది.
ఫైట్లు ఇంటిల్లిపాదిని కొట్టుకునేలా చేసాయి.
Your review is so nice.
అజ్ఞాత కి ,అజ్నాతికి , మోహన్ రాంప్రసాద్ గారికి ధన్యవాదాలు .
patale kaastha nirasaparisayikadhu
ఆరు కోట్లు తీసుకున్నాక ముద్దులు పెట్టక పొతే ఎలా ?
చూసేశానోచ్ ........
>>ఇంకా నష్ట పోయింది ఎవర్రా అంటే అభిషేక్ బచ్చనే ఎందుకంటె పెళ్లి అయ్యాక ఐశ్వర్య అభిషేక్ కి కూడా అన్ని ముద్దులు పెట్టి వుండదు రజనికి పెట్టినన్ని .
Funny :).
కామెంట్‌ను పోస్ట్ చేయండి