27 అక్టో, 2010

నూట ఎనిమిది అంబులన్స్ వెనక లాజిక్

అత్యవసర పరిస్తితిలో ప్రాణాలు కాపాడ డానికి ఆపద్భాంధవుడిలా వచ్చే అంబులన్స్ కి ఆ నూట ఎనిమిది నంబర్ కేటాయించడం వెనక వొక అంతర్యం వుంది .అదేంటంటే మీరు పుట్టిన సంవత్సరం (ఆఖరి రెండు అంకెలు ),మీ ప్రస్తుత వయసు లోంచి రెండు సంవత్సరాలు తీసేసి ఆ రెండు కలపగా వచ్చే సంఖ్యే నూట ఎనిమిది .ఉదాహరణకి మీరు పుట్టిన సంవత్సరం 74 , మీ ప్రస్తుత వయసు 36 రెండు కలిపితే 110 అందులోంచి రెండు తీసేస్తే 108 .యిది ఆశ్చర్య కరం గా ఏ వయసు వాళ్ళకైనా వర్తిస్తుంది .మీ వయసు తో ప్రయత్నించండి .ఈ లెక్క ఏ వయసు వారు చేసినా ఆన్సర్ తప్పు రాదు గాని వయసులో తప్పు చేస్తే మాత్రం అదే 108 లో ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచిస్తూ పడుకుంటే , కుటుంబ సబ్యులు మాత్రం వీడు పొతే యెంత వస్తుంది?పోక పొతే యెంత ఖర్చు అవుతుంది ?వీడు ఆయాస పడుతున్నది ఆవేశం తో తప్పు చేశా ?అంటూ లెక్కలు వేసుకుంటూ వుంటారు .ఏ లెక్క అయినా తపచ్చు ఏమో గాని ఈ నూట ఎనిమిది లెక్క ఎప్పుడు తప్పు కాదు .

11 వ్యాఖ్యలు:

Apparao Sastri చెప్పారు...

నిజమే

ఇందు చెప్పారు...

నేను చేసి చూసా. తప్పలేదు :)

అజ్ఞాత చెప్పారు...

You are measuring the age in 2010. So, it will the sum you mentioned will be 110.

In, 2011, the sum will be 111. Then you've to subtract 3 is it, to get your "interesting" number?

అజ్ఞాత చెప్పారు...

Lets say it is 2009. Iam born in 1970. So my age is 39. according to the logic

39+70=109

109-2=107?

Can u pl explain

అజ్ఞాత చెప్పారు...

రవిగారు clean bowled.

అజ్ఞాత చెప్పారు...

Apparao Sastri గారు, ఇందు గారు run out.

నేస్తం చెప్పారు...

అఙ్ఞాత గారు మరి 70 లో పుడితే ఇప్పుడు 40 అవుతుందిగా మీ వయసు ..39 ఎలా అవుతుంది????
రవిగారు నాకు కరెక్టే వచ్చింది

మనసు పలికే చెప్పారు...

రవి గారు, నాక్కూడా కరెక్టే వచ్చింది..:)

రవిగారు చెప్పారు...

అప్పారావు శాస్త్రి గారు , ఇందు ,,నేస్తం ,మనసు పలికే
ఇంతవరకు జీవితం లో తప్పటడుగులు వెయ్యలేదు కాబట్టి
మీ లెక్క తప్పలేదు .అజ్ఞాత జీవితం లో కూడా చాల చోట్లకి అజ్ఞాతం గా
వెళ్ళడం తో అజ్ఞానం లో పడి పోయి లెక్క తప్పారు .
నేను రెండు తీసేయ్య మన్నది యి సంవత్సరం డిసెంబర్ ముప్పై వొకటి వరకే
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడు ముక్కలు (ఆంద్ర , తెలంగాణా , హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం )
అవుతుంది కాబట్టి లెక్క లోంచి మూడు తీసేస్తే నూట ఎనిమిదే వస్తుంది . ఆ తర్వాత సంవత్సరం
రాయలసీమ కూడా విడి పోతుంది కాబట్టి లెక్క లోంచి నాలుగు తీసేస్తే నూట ఎనిమిది వస్తుంది .
అలా మనం విడి పోతూ ముందుకు సాగి పోతూ నూట ఎనిమిది తెచ్చు కోవాలన్న మాట .

అజ్ఞాత చెప్పారు...

if u add ur age to your year of birth u will the current year.
(2010) what is so magical in that ?

అజ్ఞాత చెప్పారు...

మీ సూత్రం 2000 తరవాత పుట్టిన వారికి పనిచేయదండి, ఈ సంవత్సరం కూడా. ఎన్ని ముక్కలయినా, ఏ సంవత్సరమయినా 2000 ముందు పుట్టిన వారికీ, తరవాత పుట్టిన వారికి కుదరదండి. క్షమించండి, మీ జొక్ ని డిస్సెక్ట్ చేసినందుకు.

- రమేష్