17 డిసెం, 2010

నాగవల్లి వి నక్క వాతలే



చంద్రముఖి పులి ని చూసి నాగవల్లి నక్క వాతలు పెట్టుకునట్టు గా వుంది సినిమా చూసాక . స్వేక్వేల్స్ అచ్చిరావని మరో సారి నిరూపించ బడింది .చంద్రముఖి సినిమా తర్వాత ఏమవుతుందన్న ఆసక్తి కలగ జేస్తే నాగ వల్లి లో అంతా ఉహించ తగ్గదే .చంద్ర ముఖి ప్రియుణ్ణి రాజు చంపే కదే సగం సినిమా .అది ఎలాగు చంద్రముఖి లో చెప్పెసిందే దాన్నే ఇందులో వివరం గా చూపించారు .మిగతా కధ చంద్రముఖి నూట ముప్పై ఏళ్ళుగా గుహలలో బతికి వున్న ఆ రాజుని వొక అమ్మాయి మీద ఆవహిన్చి చంపెయ్యడమే .పాత సినిమాలో కధ లోని సన్నీ వేశాలని కధ గమనం లో తేడా రాకుండా వాడుకున్న విధానం మెచ్చుకో తగ్గదే . ఉదాహరణకి చంద్రముఖి సినిమాలో ఆఖర్న ముప్పై అడుగుల పాము వెళ్లి పోతూ కధ ముగిస్తే ఈ సినిమాలో అదే పాము వొక ఇంట్లోకి వెళుతూ కధ మొదలవుతుంది .మొదటి సగం బానే వున్నా మిగతా సగం ఆసక్తి రేపదు . క్లైమక్ష్ లో నూట ముప్పై ఏళ్ళ రాజు ముసలి పాత్రలో వెంకటేష్ చేసిన నృత్యం బఫూన్ లా వుండి అపహాస్యం పాలయ్యింది . జనాలు నవ్వుకున్నారు . అలాగే కధ సీరియస్ గా అవుతునప్పుడు వందనాలు అంటూ వెంకటేష్ ని ఉద్దేశించి శరత్బాబు కుటుంబ సబ్యులు పాడే పాట కూడా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది . చంద్రముఖి సినిమాలో హాస్యం , మంచి పాటలు యి సినిమాలో మిస్ అయ్యాయి .చంద్రముఖి లో మంచం ఎత్తే సీన్ లాగే ఈ సినిమాలో కూడా మంచం వరకు వచ్చి నా చంద్రముఖి ఆవహించిన ఆమె శాండలేర్ ని యెగిరి పట్టుకుని లాగి వెంకటేష్ మీద విసరడం ప్రేక్షకులు ఊహించని సన్నీ వేశం .వోవర్ ఆల్ గా చంద్రముఖి సినిమా ఆద్యంతం ఆసక్తి ని రేపి ప్రేక్షకులకి వినోదాన్ని యిస్తే నాగవల్లి ఆద్యంతం ప్రేడిక్తబుల్ గా వుండి కొండక చోట విసుగుని తెప్పిస్తుంది . చంద్రముఖి నాగలోకం అయితే నాగ వల్లి నక్క సో నక్క కి నాగ లోకాని కి వున్న తేడా వుంది .వోపిక వుంటే వొక సారి మోహ మాట పడొచ్చు .అవురా అవురా నో హౌల హౌలా నో తేల్చుకోడానికి .

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

రివ్యూ బాగుందండి.

శరత్ కాలమ్ చెప్పారు...

ఆయన గారు ఆ సినిమాలో ఔరా ఔరా అంటూ వుంటే జనాలు పోరా, ఇక పోరా అని అంటున్నారని ఎక్కడో చదివాను.

ఇందు చెప్పారు...

అయ్యొ! కథ చెప్పేసారుగా!:( నేను ఇవాళ చూద్దామనుకున్నా! హ్మ్! ఐతే సినిమా ఏం బాలేదన్నమాట!