మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
22 డిసెం, 2010
పుస్తక ప్రదర్శనలో నా మస్తకం లో కలిగిన ఆలోచనలు
ఈ రోజు అనుకోకుండా నేను ,ఆలోచనా తరంగాలు శర్మ గారు ,మరో అజ్ఞాత ఆడ బ్లాగరు వారి భర్త హైదరాబాద్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్సన సందర్శించడం జరిగింది .అజ్ఞాత ఎందుకంటె ఆమె కి తన పేరు వెల్లడించడం ఇష్టం లేదు కాబట్టి .సాయంత్రం అయుదవుతోన్డి ,వర్కింగ్ డే అవడం తో జనం పల్చ గానే వున్నారు .అప్పుడెప్పుడో రెండేళ్ళ క్రితం వెళ్లి ఆ ఆనందాన్ని బ్లాగ్ లో పంచుకుంటూ రాసిన పోస్టింగ్ ఆ తరవాత కొంతమందికి అది నచ్చక జరిగిన రచ్చ బ్లాగ్ లోకం లో సీనియర్స్ కి విదితమే . అందుకే ఈ సారి ఏమి రాయ కూడా దనుకున్నా.అయితే కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల రాయక తప్పడం లేదు .ఎంటర్ అవుతూనే మన ఈ తెలుగు స్టాల్ కేసి అడుగులు పడ్డాయి .అక్కడ తాడేపల్లి గారు చూడడం తోటే సాదరం గా ఆహ్వానించి నా బ్లాగ్ పేరు అక్కడ డిస్ప్లే లో ఉంచిన (ఆ రోజు విచ్చేసిన బ్లాగర్స్ )లిస్టు లో రాయించారు .నాతొ పాటే వున్నా శర్మ గారిని , అజ్ఞాత బ్లాగర్ ని వారికి , పక్కనే వున్నా భార్గవ రాం కి పరిచయం చేశా.కాసేపు మాట్లాడు కున్నాక వొక సారి తిరిగేసి వస్తాం అని మేము బయలు దేరాం . శర్మ గారు రామకృష్ణా మటం వారి స్తాల్లోంచి కొన్ని ఆద్యాత్మిక పుస్తకాలు , వోశో వారి స్టాల్ నుంచి ది సీక్రెట్ అన్న పుస్తకం కొనుక్కున్నారు .ఆయన పుస్తక పాటనాసక్తి ని అభినందించ లేకుండా ఉండలేను .అలాగే అజ్ఞాత బ్లాగర్ భర్త కుడా మొత్తం నాలుగు వేలు పెట్టి వివిధ పుస్తకాలు తీసుకున్నారు .ఎవరైతే పుస్తకాలు బాగా చదువు తారో వారు తప్పకుండా మంచి వాదా పటిమ కలిగి ఉంటారని వారిరువురు వివిధ సబ్జక్ట్స్ మీద చేసుకున్న చర్చ వలన నాకు అర్ధం అయ్యింది .నేను మాత్రం పిల్లలకి గేమ్స్ సి డి లు తీసుకున్నా .సరే అలా వొక గంట తిరిగి మళ్ళి ఈ తెలుగు స్టాల్ కి వచ్చాము . అప్పటికి దీప్తిధార భాస్కర రావు గారు వేరే ఇంకో లేడీ బ్లాగర్ తో ముచ్చటిస్తూ కని పించారు .నేనే వారి దగ్గరికి వెళ్లి నన్ను శర్మ గారిని పరిచయం చేసుకున్నాక ఏంటి ఈ మద్య ఎక్కువగా రాయడం లేదంటే నేను ఏమి రాసిన అదొక కాంట్రవర్సి అవుతోందని ఇంతకు ముందు రెండేళ్ళ క్రితం యిదే పుస్తక ప్రదర్సానకి వచ్చి రాసిన దాంతో మొదలయిన అగ్గి ఇంకా సెగలు గక్కుతోనే వుందంటే గతం వదిలెయ్యండి యిప్పుడు ఎవరి మానాన వారు రాసుకుంటే మంచిదని సలహా ఇచ్చి ఆ లేడీ బ్లాగర్ పేరు వారి వివరాలు రాసుకోవడం లో నిమగ్నమయ్యారు .రాసుకోవడం పూర్తీ అయ్యాక ఆమెని మీ ఫోటో తీసుకుని ప్రచురిస్తే అభ్యంతరమా?అని అడిగితె ఆవిడ మొహమాట పడుతూ అటు యిటు గా తల వుపితే మీరు కూడా కూర్చోండి అంటూ పక్కన వున్న రెండు చైర్లు చూపించారు ,శర్మ గారు కొంచెం మొహమాట పడుతూ అబ్బేయిప్పుడు ఫోటో ఎందుకండి అంటుంటే మీకు ప్రాబ్లం అయితే మీరు పక్కకి రండి అనివినగానే ఇద్దరి ఫోటోలు బ్లాగ్ లో ఉన్నాక యింకా దాపరికం ఏముందండి అంటూ శర్మ గారిని అనడం తో మా ముగ్గురి ని తన నికాన్ కెమెరా లో భందించి ఆ లేడీ బ్లాగర్ తో కేనిగే స్టాల్ కి వడి వడి గా అడుగులు వేస్తూ వెళ్లి పోయారు .నాకు కొంచెం ఆశ్చర్యం గానే అనిపించింది .రోజు తన బ్లాగ్ లో ఈ పుస్తక ప్రదర్సన గురించి కవర్ చేస్తున్న ఆయన అసలు ఆలోచనా తరంగాలు అన్న వొక బ్లాగ్ ఉందా అనట్టు మొహం పెట్టినప్పుడే నాకు సందేహం కలిగింది .ఆయన పెద్దగా మా ఉనికిని పట్టించుకోలేదని ఆయనకీ మా మీదా అంత ఆసక్తి లేదని .నా సందేహం యింటికి రాగానే నిజం అయ్యింది ఆయన రాసిన ఆరవ రోజు విశేషాలు చూసాక , అందులో ఎక్కడా మా ప్రస్తావనే లేదు .ఫోటో తో బహుత్ దూర్ కి బాత్ .లేక బ్లాగ్ లోకం లో కూడా అధిష్టానం అనుమతి అవసరమా ?ఏది ఏమైనా బ్లాగ్ లోకం లో గ్రూపుల ప్రభావం చాలానే వుందని అది వారు రాసే రాతల పైన కూడా పడుతుందని మరొక్క సారి రుజువయ్యింది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్‌లు:
you said it bro!
శర్మ గారు పుస్తకాలు కొని చదువుతారన మాట. కాని వారి బ్లాగులో మాత్రం నేను పుస్తకాలు చదవటం మానేశాను అని గొప్పగా చర్చల సందర్భం లో అనే వారు.
*అప్పటికి దీప్తిధార భాస్కర రావు గారు వేరే ఇంకో లేడీ బ్లాగర్ తో ముచ్చటిస్తూ కని పించారు*
సి.బి.రావు గారికి అధిష్ఠానం అంటే ఇన్నయ గారేనా? ఐతే రావు గారు లేడి బ్లాగర్లని ప్రత్యేక అభిమానం తో రకరకాల స్టాల్స్ చూపిస్తూ సదా మీ సేవలో అని ....
అదే రోజు నేను వచ్చాను. దురదృష్టవశాత్తూ మనం కలవలేక పోయుంటాం.
కెలుకుడు బురిడీ గాళ్ళు చాలా నయం, పవన్ గాడు వాళ్ళకంటే నీచుడు సరదాగా రాసిన ఒకే ఒక్క కామెంట్ ను పట్టుకుని నా పై వ్యక్తిగత దాడికి ప్రయత్నించాడు. మాలిక మలం పెంట ద్వార నా వివరాలు సేకరించి బ్లాగు విషయాలను పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని లాగి వారిని అడ్డుపెట్టుకొని నా బ్లాగు మూయించిన కిరాయి గూండా ఇలాంటి వాళ్ళను సామూహికంగా తోటి తెలుగు బ్లాగర్లు
బహిష్కరించాలి.ఇటువంటి నీచమైన సంప్రదాయాన్ని కలిసి కట్టుగా ఆపాలి
కామెంట్‌ను పోస్ట్ చేయండి