నేను జనవరి ఫస్ట్ న పుట్టడం తో నా బర్త్ డే ని ప్రపంచం మొత్తం జరుపు కుంటారు .అది వేరే విషయం .నాకు చాలా ఏళ్ళనుంచి కొత్త సంవత్సరం వచ్చే కొన్ని నిమిషాల ముందే (11.50)పూజా మందిరం లో కూర్చుని మొదటి యిరవై నిమిషాల సమయం దైవ ప్రార్ధన లో గడపడం అలవాటు .ఈ సారి కూడా అదే పద్దతి పాటించా .పార్టిలకి వెళ్ళినా కొత్త సంవత్సరం రావడానికి అరగంట ముందే యింటికి వచ్చేస్తా .పొద్దున్న లేచాక అందరికి సంక్షిప్త సమాచారాలు పంపడానికే గంట అవుతుంది .ఇంట్లోనే లంచ్ చేసి బిగ్ సినిమా లో గలివర్ ట్రావేల్స్ త్రీ డీ సినిమాకి కుటుంబ సమేతం గా వెళ్ళాము .టికెట్స్ కి 666 కాక మళ్ళి త్రీ డీ కల్లజోడుకి మనిషికి రెండు వందలు (డిపాజిట్ ). వెళ్ళే టప్పుడు కళ్ళ జోడు యిస్తే రెండు వందలు యిస్తాడు .చినప్పుడు గలివర్ ట్రావాల్స్ కధలు చదివి ఆ అద్బుతపు ప్రపంచాన్ని మనో ఫలకం లో ముద్రించుకున్న మనం ఈ తొక్కలా సినిమా గుడ్డెద్దు కళ్ళజోడు తగిలించుకుని చూస్తే మాత్రం నిరాస చెందడం ఖాయం .ఎక్కడా వొక చిన్న ఎఫెక్ట్ కూడా లేదు . ఈ మాత్రం దానికి త్రీ డీ యందుకో మరి?వెయ్యి రూపాయలు దోబ్బించు కున్నాక తెలిసిన నగ్న సత్యం ఏంటంటే యే భాషలో సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం ?ప్రతి సినిమానీ జేబుకి చిల్లు పెట్టుట ఖాయం . సాయంత్రం యింటికొచ్చి గుడికేలితే అదృష్ట వశాత్తు అస్సలు రద్దీ లేదు . అంతా పొద్దున్నే వచ్చేసినట్టు వున్నారు . ప్రశాంతం గా స్వామి దర్సనం చేసుకుని హోటల్ కి డిన్నర్ కి వెళితే అక్కడ రష్ చూస్తే మతి పోయింది . పేరు నమోదు చేసుకుని గంట వెయిట్ చేసాక గాని మన టర్న్ రాలేదు . పాపం గేటు దగ్గర తెల్ల డ్రెస్సు వేసుకుని టోపీ పెట్టుకుని మీసాలు చుట్టుకుని వెళ్ళే వాళ్ళకి వంగి వంగి సలాములు కొడుతున్నా అతనికి పది రూపాయలు యిచ్చిన వాళ్ళు లేరు .ఏమన్నా అతనికి వెళ్ళే టప్పుడు భారీగా యిద్దమనుకుని అయిపోయాక చూస్తే వాల్లేట్ పార్కింగ్ డ్రైవర్ తప్ప అతను కనబడ లేదు ,ప్రాప్తా ను సారమే ఏదన్నా వస్తుందేమో?మొత్తానికి మొదటి రోజు బానే గడిచింది .అయితే అంత గంట సేపు కస్టపడి సంక్షిప్త సందేశాలు పంపితే దానిలో నాల్గవ వంతు మంది మాత్రమె ధన్య వాదాలు తెలిపారు .సమయా భావం వల్లే అని భావిస్తున్నా ఎందుకంటె వాళ్ళు నిర్లక్ష్యం చేసే స్తాయి లో మాత్రం లేనన్నది నిర్వి వాదాంసం . రేపు స్పందిస్తే ఖర్చు కలిసోస్తుందన్న పొదుపు చింతనా కూడా అయి ఉండొచ్చు .
పుట్టిన రోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ?
9 కామెంట్‌లు:
Oh Belated Happy Birthday & Happy New Year రవిగారు.
Happy new year......
Wish you a happy birthday!
belated Birthday wishes & a very happy new year అండి. అయ్యో నేనింకా ఆశపడుతున్నా "గలివర్ ట్రావేల్స్ "
చూడక్కర్లేదంటారా?
ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు.నేడు రాష్ట్రంలో మన జీవిత ప్రయాణమే కడు భారంగా తయారయింది,ఇక గలీవర్‍గారి ప్రయాణాలేం చూస్తాం. :)
belated happy birth day and happy new year
అమ్మో, బ్లాగరలలో చాలామంది జనవరి ఫస్టునే పుట్టినట్లున్నారు! ఒకరోజు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు!
అది సరే మేము ఇవాళ్టికి టికెట్స్ కూడా కొనేసుకున్నామే గలివర్ ట్రావెల్స్ కి! ఎలా మరి?
పుట్టిన రోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ?....చక్కని ప్రశ్నే గానీ జవాబు ఎంతమంది వెదుక్కుంటారంటారు?
"నా జన్మదినమిది, శుభాకాంక్షలు చెప్పండహో" అన్న మీ పోస్ట్ వుద్దేశ్యం బావుంది. మీరు ఎన్.డి.తివారి అంతటి గొప్పవారు కావాలని ఆశిస్తున్నాను.
ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే నిన్నా మొన్న పంపిన చాలా మెసేజీలు గాల్లో కలిసిపోయాయి. కొన్ని మెసేజిలు చేరనే లేదు. కాబట్టి మరి కొంత మంది పంపిన మెసేజిలు బహుశా మీకు చేరకపోయి వుండొచ్చు.
రాముగారి పోస్ట్ చూసి ఆయనకీ తోడూ గా నేను వున్నానహో
అని గుర్తు చేసుకోవడం కోసం రాసింది ఈ పోస్ట్ ,అసలు యింత మంది స్పందిస్తారని కూడా అనుకోలేదు
శుభాకాంక్షలు తెలిపిన వేణు శ్రీకాంత్ ,పద్మార్పిత ,తృష్ణ , విజయమోహన్ ,భాను ,సుజాత , అజ్ఞాత .జీవని గార్లకి
పేరు పేరు నా ధన్యవాదాలు .
సుజాత గారు మీరేలగు టికెట్స్ కోనేసుకున్నారు కాబట్టి లొపలకి వెళ్ళగానే మీ కళ్ళజోడు తీసి పక్కన పడేసి హాల్ లో గాంధారి పుత్రులల శ్రద్దగా సినిమా చూస్తూ ఏ క్షణం లో అన్న త్రీ డి ఎఫ్ఫెక్ట్ రాక పోతుందా అని చూసే ఆశా జీవులను చూసి ఆనందించండి .`
అజ్ఞాత సదుద్దేశం లో లేని దురుద్దేశాన్ని కని పెట్టి కామెంట్ పెట్టినందుకు ,యెన్ డి తివారి అంత దీర్గాయుస్సుతో
మరెంతో యిది తో మరెంతో అది తో వర్ధిల్లమని దీవించిన మీ కొంటె మనసుకు జోహార్లు .
జీవని గారు నిజమే నాకు తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పినప్పుడు అర్ధం అయ్యింది అవి బౌన్సు అయ్యాయని .
కామెంట్‌ను పోస్ట్ చేయండి