19 మార్చి, 2011

దొంగల ముఠా దెబ్బకు ఠా


అయిదురోజుల్లో సినిమా తీస్తున్నా అని యిచ్చిన ప్రచారాన్ని డబ్బుగా మార్చుకునే ప్రయత్నమే రాంగోపాల్ వర్మ దొంగల ముఠా .సినిమా లో కధ స్రిప్ట్ లేకపోతె అయిదు గంటల్లో కూడా సినిమా చుట్టేయొచ్చు.వొక పాడుపడిన రిసార్ట్ లో బందీగా ఉంచిన దొంగల ముఠా , కార్ దారిలో చెడిపోతే ఆ రిసార్ట్ లో మెకానిక్ ఎవరన్న దొరికే(?) దాకా రెస్ట్ తీసుకోవడానికి వచ్చిన భార్య భర్త ,మధ్యలో అక్కడికి వచ్చే ఆ ముఠా డాన్ ,వీళ్ళని పట్టుకోడానికి డాన్ అనుచరుల్లా వచ్చే వొక లేడీ పొలిసు ఆమె అసిస్తంటూ.యివే పాత్రలు .
.ఆఖర్న కిడ్నాపర్స్ చేర నుంచి బిజినెస్స్ మాన్ విడుదల . బ్యాక్ రౌండ్ మ్యూజిక్ కర్ణ పేయం గా వుంది . వర్మ కి యింకా దెయ్యాల పిచ్చ వదిలినట్టు లేదు .వెన్కంతా దెయ్యాల సినిమా లో మ్యూజిక్ ముందేమో దొంగల సీనులు .ఈ సినిమాలో ప్రేక్షకులకి నచ్చేది సినిమా నిడివి .గంటన్నర లోపే అయిపోతుంది .అసలు అంత సేపు పాత్రధారులు వొక గదిలోంచి యింకో గదిలోకి పరిగెత్తడమే .రవితేజ మొదటి సగం తన మార్కు నటనని అనుచుకున్నా రెండో హాఫ్ కి నార్మల్ గా వచ్చేసాడు .కెమెరా యెంత సేపు ఛార్మి టైటు జీన్స్ ముందు వెనక చూపించడమే సరి పోయింది .చీప్ గా అద్దెకు వచ్చాయని ఏకంగా అయిదు కెమెరాల్లో వివిధ భంగిమల్లో తీసాడట .ఈ సినిమా టీ వి లో వచ్చినా అంత సేపు చూడటం కష్టమే . సునీల్ కి వొక్క డైలాగు లేదు .బ్రహ్మి కి నవ్వించడానికి పెద్దగా అవకాశం రాలేదు .మంచు లక్ష్మి నటన బానే వున్నా వాచకం లో ఆంగ్లి సైజుడు తెలుగు తప్పటం లేదు .ఈ సినిమాలో నటనకి పెద్దగా ఎవరికి అవకాశం లేదు .జనాల్ని వెర్రి వాళ్ళని చేసి డబ్బులు దొబ్బుదామనుకున్న వర్మ గాంగే అసలైన దొంగల ముఠా.

11 మార్చి, 2011

వైద్యో ఆంధ్రో తెలంగానో హరి


జైతెలంగాణ ఉద్యమ సెగలు మన దైనందిన జీవితాల్లో యెంత ప్రభావితం చూపిస్తున్నాయో చెప్పే సంఘటన యిది .నా స్నేహితుడికి హైదరాబాద్ శివార్లలో పెద్ద హాస్పిటల్ వుంది . సూర్యాపేట లో బాల్యం గడిచినా ఉస్మానియా లో మెడిసిన్ చేసి చాలా ఏళ్ళ నుంచే హాస్పిటల్ కట్టి విజయవంతం గా నడిపిస్తూ కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు .లంచ్ నాలిగింటికి , డిన్నర్ రాత్రి పన్నేడింటికి చేసే అంత బిజీ గా ఉండేవాడు .మొన్నెప్పుడో ఫోన్ చేసినప్పుడు రాత్రి పదింటికే డిన్నర్ చేస్తున్నా అంటే అదేంటి అని ఆశ్చర్యం వెలిబుచ్చా .
''అంతా కే సి ఆర్ ఎఫ్ఫెక్ట్ హైదరాబాద్ లో అన్ని బిజినేస్సులు పదేళ్ళ వెనక స్తితికి చేరుకున్నాయి ''.
రియల్ ఎస్టేట్ ,సినిమాలు , సాఫ్ట్వేర్ బిజినేస్సులంటే నమోచ్చేమో గాని విద్య , వైద్యం ఎప్పుడు నిత్య రక్తం పిచ్చ పైకం గా వుంటుంది గా అడిగా .
అది మొన్నటి వరకే బాబు యీ కే సి ఆర్ పుణ్యమా అని ప్రతి వ్యాపారం లోను ఆంధ్ర తెలంగాణా ఫీలింగ్ చొచ్చుకు పోయింది .నేను హాస్పిటల్ పెట్టిన ఏరియా లో ఎక్కువ ఆంధ్ర వాళ్ళు వుంటారు కాబట్టి నేను తెలంగాణా అయినా కూడా ఆ యాస రాకుండా ఆంధ్ర పద్దతిలో ఏవండి బాగున్నారా ?యిప్పుడు ఎలా వుంది ఆరోగ్యం ?మందులు వాడుతున్నారా ?కంగారు పడకండి , నయం అయిపోతుంది అంటూ పలకరించడం తో యిక్కడి ప్రజలంతా తమ హాస్పిటల్ అన్న భావం తో వచ్చే వారు .మొన్న నిజామాబాద్ నుంచి వొక హొపే లెస్స్ కేసు ని తీసుకొని వచ్చి చేర్చుకోమంటే ముందే చెప్పాను అతని రెండు కిడ్నీలు పాడయ్యయని బీపి , పల్సు రేటు కూడా బాగా తక్కువ గా వున్నాయని బతికే అవకాశాలు తక్కువే అయినా ప్రయత్నిస్తామంటే సరే అన్నారు ,డయాలసిస్ చేసినప్పటికీ వేరే అవయవాలు పాడై పోవడం వల్ల రెండు రోజులకే అతను చని పోయాడు .బిల్లు కట్ట మంటే జై తెలంగాణా ఈ అందరోడు కావాలనే మనోడికి సరైన వైద్యం యివ్వక చంపెసాడని అద్దాలు , ఫర్నిచర్ పగల గొట్టి నష్ట పరిహారం యివ్వమని గొడవ చేస్తే గొడవ చెయ్యడానికి వచ్చిన నాయకులకి నేను తెలంగాణా అని నిరూపించుకుని ఆ పైన పార్టీ ఫండ్ గా లక్షా రూపాయలు సమర్పించుకుని బయట పడ్డా .యిది కాదు పద్దతని యిక నుంచి మన యాస లోనే షురూ చెద్దా మని అప్పుడే అడ్మిట్ అయిన పేషంటు భంధువు ఏంటి సార్ మా వాడి పరిస్తితి ?అంటే అరె ఏమున్నది తమ్మి నువ్వు పరేషాన్ గాకు ,బె ఫికర్ వుండు , మా ఖోశిస్ మే చేస్తాం పైనా గాయనుండు అంటూ రెండు రోజులు సంఝాయిన్చినాక ఆ పేషంటు కాస్త హరి మన్నాడు .
అదేంటి సార్ అలా చని పోయాడు మా వాడు అంటూ గొల్లు మన్నాడు .నేను వోదార్పు మాటలు చెబుదామని అరె ఏం చేస్తాం భయి నువ్వు మస్తు గా పైసల్ ఖర్చు పెట్టినావ్ మేము భి మస్తుగా ట్రీట్మెంట్ యిచ్చినం , పెద్ద వయసాయే పోయిండు గిప్పుడు మొన్న సునామీలో యెంత మంది తన్డురుస్తూ గా ఉన్నోళ్ళు పోయిన్రు ?ఏం చెప్పలేం తమ్మి వోకో సారి గట్లా అయితిన్దన్నట్టు అన్నానో లేదో మళ్ళి అద్దాలు ఫర్నిచర్ ద్వంసం చేస్తూ ఆంధ్ర వాళ్ళ అంతు చూడ టానికే వీడిక్కడ హాస్పిటల్ కట్టడురా ఆంధ్ర వాలే వుపర్ భాగో అంటూ వీడు ఆంధ్రా వాళ్ళకి ట్రీట్మెంట్ యివ్వడం లో నిర్లక్ష్యం చూపిస్తున్నడంటూ మొదలెట్టారు . ఆ దెబ్బకి ఆంధ్రా వాళ్ళు భయ పడి రావడం మానేశారు .నిజామాబాద్ పేషంటు పోయిన దగ్గరనుంచి తెలంగాణా వాళ్ళు తగ్గించారు .ఆ దెబ్బకి నన్నేవరన్న ఆంధ్రానా ?తెలంగానానా అంటే నేను మాత్రం పక్కా హైదరా బాదిని . మీ మిలీనియం మార్చులు ,నిరవధిక దీక్షలుయివన్నీ ఏ కరీంనగర్ లోనో , నిజమా బాద్ లోనో చేసుకోండి గాని యిన్నాళ్ళు తేడాలు లేకుండా స్నేహితుల్లా వున్న హైదేరాబాదిలని యి రొచ్చులోకి లాగి వాళ్ళ మద్య విద్వేశాల్ని రెచ్చ గొట్టి హైదరాబాద్ ని నాలుగు వందల ఏళ్ళ వెనక్కి తీసుకు పోకండి అని ఆవేదన తో ముగించాడు .
అతను చెప్పింది నిజమే అనిపించింది ,యిన్నాళ్ళు ఆఫీసులో పక్క వాడు ఆంధ్రానా ? తెలంగాణా నా అన్న ఆలోచన ఎవరికి వుండేది కాదు యిప్పుడు మనకి తెలీకుండానే ఆ ఆలోచన వచ్చేస్తోంది ,యి విధ్వంసం నే పద్యం లో కనీసం యిక నుంచైనా భాగ్యనగరానికి మినహాయింపు యిచ్చేసి మిగతా ఏరియా లో ఉద్యమం కోన సాగించొచ్చు .హైదరాబాద్ లో ప్రజలు ఆంధ్రానా ?తెలంగాణా నా ?హైద్రాబాదినా ఏంకావాల నుకున్టున్నారో ? వొక ప్లేబిసైటు (నిష్పాక్ష పాత ఎన్నిక )పెడితే నిజం బయట పడుతుంది కదా ?

5 మార్చి, 2011

మా మ్యూజిక్ లో ఫ్రాడ్ ప్రోగ్రాం


రోజు రాత్రి పదిన్నర కి మా మ్యూజిక్ చానల్ లో సినిసందడి అని వొక ప్రోగ్రాం వస్తుంది .అందులో యవరిదన్న సినిమా ఎక్టార్ ఫోటో సగం దాక చూపించి ఎవరో కని బెట్టి 5664427 కాల్ చేసి పాతికవేలు గెలవండి అంటూ లైవ్ లో వొక అమ్మాయి వొళ్ళంతా కనబడేలా చిన్న డ్రెస్ వేసుకుని ఎంకరింగ్ చేస్తూ వుంటుంది .ఆ ఫోటో చూస్తే సినిమా పరిజ్ఞానం లేని వాడు కూడా టక్కున చెప్పెసేలా వుంటుంది . ఆ అమ్మాయి ''మీకు కోరిక లేదా ?(డబ్బులు గెలవాలని ఆవిడ భావం అనుకుంటా ) చూసాక కూడా చెయ్యాలని పించటం లేదా ?యింకేంటి ఆలస్యం వెంటనే మీ సెల్ ఎత్తి కొట్టండి అంటూ వగలు పోతూ ముందుకి వెనక్కి పక్కకి తిరుగుతూ విక్షకుల్ని ఉత్సాహ పరుస్తూ కమాన్ కమాన్ అంటూ ఉదర గొడుతూ వుంటుంది . ఎవరన్న బకరా సొంగ కార్చుకుని కొడితే పోయేదేమీ లేదు సెల్లు ఖర్చు తప్ప అనుకుంటూ ఆ నంబర్ కి కొట్ట గానే ,స్వామి రా రా అంటూ ఆడ గొంతు సిని సందడి కి స్వాగతం మీరు నాకు అడుగు దూరం లోనే వున్నారు ఫోన్ కట్ చెయ్య కండి నేను మీది ఎప్పుడన్నా తీసుకుంటాను యింకో పదినిమిశాల్లోనో ?లేదా నెక్స్ట్ నిమిషం లోనో ?తొందర పడి కట్ చేస్తే పాతిక వేలు పోయినట్టే ఏమో ఎవరికి తెలుసు , నేను మిమ్మల్ని నిరుత్సాహ పరచను తప్పకుండా తీసుకుంటా అంటుంటే మన బకరా సొంగ కార్చుకుంటూ టీ వి లో ఆ అర్ద నగ్న ఏంకర్ ని చూస్తూ ఉంటాడు . యి లోపు ఆమె వొక కాల్ తీసుకుంటుంది ఆ ఫోటో లో వున్నది బాలకృష్ణ అని అందరికి తెలుస్తూనే వుంటుంది అయినా గాని ఆ కాలర్ ప్రకాశ్రాజ్ అనో వెంకటేష్ అనో చెపుతాడు . సారీ అంటూ ఆ కాలర్ పేరు ని పది సార్లు ఉచ్చరిస్తూ అయ్యో కొద్దిలో పాతిక వేలు మిస్ అయ్యారు యిప్పుడు దాని విలువ పదిహేను వేలు ఎందుకంటె సమయం గడుస్తున్న కొద్ది ఆ అమౌంట్ తగ్గి పోతూ వెయ్యి రూపాయలకి పడి పోతూ వుంటుంది .టైమర్ పెట్టి యి లోపు కాల్ కన్నెక్ట్ అయ్యి సరైన సమాధానం చెప్పే వాళ్ళకే ఆ నగదు .ఆ అమౌంట్ మూడు వేల లోపు పడే దాక వాళ్ళ వాళ్ళే స్టూడియో లోంచి చేసి సురేష్ , విజయవాడ , రమేష్ , కరీంనగర్ అంటూ వొకరే చేసి అన్ని తప్పు అన్సర్స్ చెబుతుంటారు . అంత గట్టి గా వొకరే అని ఎలాచెప్పా గలం అంటే అదే వాయస్సు అదే మాడ్యు లేషన్ కాబట్టి .రెండు రోజులు చూస్తే ఎవరన్న చెప్ప గలరు . అయితే యిందులో ఫ్రాడ్ ఏంటి అని సందేహం రావచ్చు . అసలు కధ ఏంటంటే మీకు ఆ నంబర్ కొట్ట గానే తగులుతుంది . వేరే లైవ్ ప్రోగ్రాం లో లాగ ఎంగాజ్ రాదు . తగల గానే ఆడ గొంతుకు తగులు కుని మీరు పెట్టకండి మిమ్మల్నే తీసుకుంటా నెక్స్ట్ మీదే అంటూ వెయిటింగ్ లో అరగంట గంట పెడుతుంది . మీ కాల్ మాత్రం త్రూ అవదు . యింక మీకు విసుగొచ్చి ఫోన్ పెట్టేసి నిద్ర పోతారు .మీ సెల్ లో కుయ్యి కుయ్యి అని (మీది ప్రీ పైడ్ అయితే )మెసేజ్ వస్తే మీ ఆప్తులు ఎవరన్న గుడ్ నైట్ అని సందేశం పంపారేమో అని చూసుకుంటే అమాంతం మీ నిద్ర యెగిరి పోయేలా మూడు వందలు అక్షరాల మూడు వందలు మీ ప్రీ పైడ్ అమౌంట్ లోంచి డెబిట్ అయి కని పిస్తుంది .కుయ్యో మొర్రో అని మీరు మళ్ళి టీ వి ఆన్ చేసి చూస్తే ఆమె యింకా అలాగే కవ్విస్తూ ఏ పవన్ కళ్యాణ్ ఫోటో నో చూపిస్తూ వీళ్ళ అన్నయ్య గారు వొక రాజకీయ పార్టి పెట్టి యి మద్యనే చుట్టేశారు త్వర గా చెయ్యండి అంటూ చెపుతూ వుంటుంది . మీరు కొంచెం ఆమె తొడలు చూడడం మాని కింద స్క్రోల్ అవుతున్న నిభందనలు చూస్తే నిమిషానికి పది రూపాయలు వేచి వున్నా సమయానికి కూడా అంటూ కని పిస్తుంది .యింక ఆ అమౌంట్ రెండు వేలకి రాగానే వాళ్ళ వాళ్ళే కరెక్ట్ అన్స్వర్ చెప్పి ఆ డబ్బు గెల్చు కుంటారు . . యి గంట లో ట్రై చేసిన వందమంది బకరాలు తలో మూడు వందల చొప్పునా ముప్పైవేలు దొబ్బించు కుంటారు . అయితే నా కేలా తెలుసు నేను బకరా అయ్యననే మీ సందేహం అబ్బే అదేమ లేదు నేను మొదటి రెండు కాల్స్ వాయిస్ మాడ్యు లేషన్ చూడగానే కని పెట్టా యిది బకరా చేసే ప్రోగ్రాం అని .ఆ టైం లో పాపం మా కజిన్ వాళ్ళ యింట్లో ఎవరు లేకపోతె మందు కొడుతూ నాకు ఫోన్ చేసాడు . వాడికి యి ప్రోగ్రాం గురించి చెపితే మందు ప్రభావమో ?లేకా ఆ అమ్మాయి కవ్విమ్పో గాని అరగంట సేపు ప్రయత్నించి యింక సెల్ కట్టేసి పడుకో పోతుంటే వాడికి అయిన స్వీయ అనుభవమే యిది . మీ కేమన్న సందేహం వుంటే ఈ రోజే రాత్రే పదిన్నరకి మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఈ ప్రోగ్రాం వీక్షించండి .http://www.youtube.com/watch?v=Puqe7w6_XmY&feature=related