5 మార్చి, 2011

మా మ్యూజిక్ లో ఫ్రాడ్ ప్రోగ్రాం


రోజు రాత్రి పదిన్నర కి మా మ్యూజిక్ చానల్ లో సినిసందడి అని వొక ప్రోగ్రాం వస్తుంది .అందులో యవరిదన్న సినిమా ఎక్టార్ ఫోటో సగం దాక చూపించి ఎవరో కని బెట్టి 5664427 కాల్ చేసి పాతికవేలు గెలవండి అంటూ లైవ్ లో వొక అమ్మాయి వొళ్ళంతా కనబడేలా చిన్న డ్రెస్ వేసుకుని ఎంకరింగ్ చేస్తూ వుంటుంది .ఆ ఫోటో చూస్తే సినిమా పరిజ్ఞానం లేని వాడు కూడా టక్కున చెప్పెసేలా వుంటుంది . ఆ అమ్మాయి ''మీకు కోరిక లేదా ?(డబ్బులు గెలవాలని ఆవిడ భావం అనుకుంటా ) చూసాక కూడా చెయ్యాలని పించటం లేదా ?యింకేంటి ఆలస్యం వెంటనే మీ సెల్ ఎత్తి కొట్టండి అంటూ వగలు పోతూ ముందుకి వెనక్కి పక్కకి తిరుగుతూ విక్షకుల్ని ఉత్సాహ పరుస్తూ కమాన్ కమాన్ అంటూ ఉదర గొడుతూ వుంటుంది . ఎవరన్న బకరా సొంగ కార్చుకుని కొడితే పోయేదేమీ లేదు సెల్లు ఖర్చు తప్ప అనుకుంటూ ఆ నంబర్ కి కొట్ట గానే ,స్వామి రా రా అంటూ ఆడ గొంతు సిని సందడి కి స్వాగతం మీరు నాకు అడుగు దూరం లోనే వున్నారు ఫోన్ కట్ చెయ్య కండి నేను మీది ఎప్పుడన్నా తీసుకుంటాను యింకో పదినిమిశాల్లోనో ?లేదా నెక్స్ట్ నిమిషం లోనో ?తొందర పడి కట్ చేస్తే పాతిక వేలు పోయినట్టే ఏమో ఎవరికి తెలుసు , నేను మిమ్మల్ని నిరుత్సాహ పరచను తప్పకుండా తీసుకుంటా అంటుంటే మన బకరా సొంగ కార్చుకుంటూ టీ వి లో ఆ అర్ద నగ్న ఏంకర్ ని చూస్తూ ఉంటాడు . యి లోపు ఆమె వొక కాల్ తీసుకుంటుంది ఆ ఫోటో లో వున్నది బాలకృష్ణ అని అందరికి తెలుస్తూనే వుంటుంది అయినా గాని ఆ కాలర్ ప్రకాశ్రాజ్ అనో వెంకటేష్ అనో చెపుతాడు . సారీ అంటూ ఆ కాలర్ పేరు ని పది సార్లు ఉచ్చరిస్తూ అయ్యో కొద్దిలో పాతిక వేలు మిస్ అయ్యారు యిప్పుడు దాని విలువ పదిహేను వేలు ఎందుకంటె సమయం గడుస్తున్న కొద్ది ఆ అమౌంట్ తగ్గి పోతూ వెయ్యి రూపాయలకి పడి పోతూ వుంటుంది .టైమర్ పెట్టి యి లోపు కాల్ కన్నెక్ట్ అయ్యి సరైన సమాధానం చెప్పే వాళ్ళకే ఆ నగదు .ఆ అమౌంట్ మూడు వేల లోపు పడే దాక వాళ్ళ వాళ్ళే స్టూడియో లోంచి చేసి సురేష్ , విజయవాడ , రమేష్ , కరీంనగర్ అంటూ వొకరే చేసి అన్ని తప్పు అన్సర్స్ చెబుతుంటారు . అంత గట్టి గా వొకరే అని ఎలాచెప్పా గలం అంటే అదే వాయస్సు అదే మాడ్యు లేషన్ కాబట్టి .రెండు రోజులు చూస్తే ఎవరన్న చెప్ప గలరు . అయితే యిందులో ఫ్రాడ్ ఏంటి అని సందేహం రావచ్చు . అసలు కధ ఏంటంటే మీకు ఆ నంబర్ కొట్ట గానే తగులుతుంది . వేరే లైవ్ ప్రోగ్రాం లో లాగ ఎంగాజ్ రాదు . తగల గానే ఆడ గొంతుకు తగులు కుని మీరు పెట్టకండి మిమ్మల్నే తీసుకుంటా నెక్స్ట్ మీదే అంటూ వెయిటింగ్ లో అరగంట గంట పెడుతుంది . మీ కాల్ మాత్రం త్రూ అవదు . యింక మీకు విసుగొచ్చి ఫోన్ పెట్టేసి నిద్ర పోతారు .మీ సెల్ లో కుయ్యి కుయ్యి అని (మీది ప్రీ పైడ్ అయితే )మెసేజ్ వస్తే మీ ఆప్తులు ఎవరన్న గుడ్ నైట్ అని సందేశం పంపారేమో అని చూసుకుంటే అమాంతం మీ నిద్ర యెగిరి పోయేలా మూడు వందలు అక్షరాల మూడు వందలు మీ ప్రీ పైడ్ అమౌంట్ లోంచి డెబిట్ అయి కని పిస్తుంది .కుయ్యో మొర్రో అని మీరు మళ్ళి టీ వి ఆన్ చేసి చూస్తే ఆమె యింకా అలాగే కవ్విస్తూ ఏ పవన్ కళ్యాణ్ ఫోటో నో చూపిస్తూ వీళ్ళ అన్నయ్య గారు వొక రాజకీయ పార్టి పెట్టి యి మద్యనే చుట్టేశారు త్వర గా చెయ్యండి అంటూ చెపుతూ వుంటుంది . మీరు కొంచెం ఆమె తొడలు చూడడం మాని కింద స్క్రోల్ అవుతున్న నిభందనలు చూస్తే నిమిషానికి పది రూపాయలు వేచి వున్నా సమయానికి కూడా అంటూ కని పిస్తుంది .యింక ఆ అమౌంట్ రెండు వేలకి రాగానే వాళ్ళ వాళ్ళే కరెక్ట్ అన్స్వర్ చెప్పి ఆ డబ్బు గెల్చు కుంటారు . . యి గంట లో ట్రై చేసిన వందమంది బకరాలు తలో మూడు వందల చొప్పునా ముప్పైవేలు దొబ్బించు కుంటారు . అయితే నా కేలా తెలుసు నేను బకరా అయ్యననే మీ సందేహం అబ్బే అదేమ లేదు నేను మొదటి రెండు కాల్స్ వాయిస్ మాడ్యు లేషన్ చూడగానే కని పెట్టా యిది బకరా చేసే ప్రోగ్రాం అని .ఆ టైం లో పాపం మా కజిన్ వాళ్ళ యింట్లో ఎవరు లేకపోతె మందు కొడుతూ నాకు ఫోన్ చేసాడు . వాడికి యి ప్రోగ్రాం గురించి చెపితే మందు ప్రభావమో ?లేకా ఆ అమ్మాయి కవ్విమ్పో గాని అరగంట సేపు ప్రయత్నించి యింక సెల్ కట్టేసి పడుకో పోతుంటే వాడికి అయిన స్వీయ అనుభవమే యిది . మీ కేమన్న సందేహం వుంటే ఈ రోజే రాత్రే పదిన్నరకి మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఈ ప్రోగ్రాం వీక్షించండి .http://www.youtube.com/watch?v=Puqe7w6_XmY&feature=related

1 కామెంట్‌:

చెప్పారు...

e24 అని ఒక ఛానల్ లో ఇలాగె సోది వచ్చేది. ఒక 3 రోజులు చుస, ఒక్కడయినా సమాధానం సరిగ్గా చెపుతాడా అని. అన్ని చొప్పదండు సమాధానాలు. వాటి మీద కరెక్ట్ ఆడిట్ చేసి చీటింగ్ కేసు పెట్టాలి.