మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
11 మార్చి, 2011
వైద్యో ఆంధ్రో తెలంగానో హరి
జైతెలంగాణ ఉద్యమ సెగలు మన దైనందిన జీవితాల్లో యెంత ప్రభావితం చూపిస్తున్నాయో చెప్పే సంఘటన యిది .నా స్నేహితుడికి హైదరాబాద్ శివార్లలో పెద్ద హాస్పిటల్ వుంది . సూర్యాపేట లో బాల్యం గడిచినా ఉస్మానియా లో మెడిసిన్ చేసి చాలా ఏళ్ళ నుంచే హాస్పిటల్ కట్టి విజయవంతం గా నడిపిస్తూ కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు .లంచ్ నాలిగింటికి , డిన్నర్ రాత్రి పన్నేడింటికి చేసే అంత బిజీ గా ఉండేవాడు .మొన్నెప్పుడో ఫోన్ చేసినప్పుడు రాత్రి పదింటికే డిన్నర్ చేస్తున్నా అంటే అదేంటి అని ఆశ్చర్యం వెలిబుచ్చా .
''అంతా కే సి ఆర్ ఎఫ్ఫెక్ట్ హైదరాబాద్ లో అన్ని బిజినేస్సులు పదేళ్ళ వెనక స్తితికి చేరుకున్నాయి ''.
రియల్ ఎస్టేట్ ,సినిమాలు , సాఫ్ట్వేర్ బిజినేస్సులంటే నమోచ్చేమో గాని విద్య , వైద్యం ఎప్పుడు నిత్య రక్తం పిచ్చ పైకం గా వుంటుంది గా అడిగా .
అది మొన్నటి వరకే బాబు యీ కే సి ఆర్ పుణ్యమా అని ప్రతి వ్యాపారం లోను ఆంధ్ర తెలంగాణా ఫీలింగ్ చొచ్చుకు పోయింది .నేను హాస్పిటల్ పెట్టిన ఏరియా లో ఎక్కువ ఆంధ్ర వాళ్ళు వుంటారు కాబట్టి నేను తెలంగాణా అయినా కూడా ఆ యాస రాకుండా ఆంధ్ర పద్దతిలో ఏవండి బాగున్నారా ?యిప్పుడు ఎలా వుంది ఆరోగ్యం ?మందులు వాడుతున్నారా ?కంగారు పడకండి , నయం అయిపోతుంది అంటూ పలకరించడం తో యిక్కడి ప్రజలంతా తమ హాస్పిటల్ అన్న భావం తో వచ్చే వారు .మొన్న నిజామాబాద్ నుంచి వొక హొపే లెస్స్ కేసు ని తీసుకొని వచ్చి చేర్చుకోమంటే ముందే చెప్పాను అతని రెండు కిడ్నీలు పాడయ్యయని బీపి , పల్సు రేటు కూడా బాగా తక్కువ గా వున్నాయని బతికే అవకాశాలు తక్కువే అయినా ప్రయత్నిస్తామంటే సరే అన్నారు ,డయాలసిస్ చేసినప్పటికీ వేరే అవయవాలు పాడై పోవడం వల్ల రెండు రోజులకే అతను చని పోయాడు .బిల్లు కట్ట మంటే జై తెలంగాణా ఈ అందరోడు కావాలనే మనోడికి సరైన వైద్యం యివ్వక చంపెసాడని అద్దాలు , ఫర్నిచర్ పగల గొట్టి నష్ట పరిహారం యివ్వమని గొడవ చేస్తే గొడవ చెయ్యడానికి వచ్చిన నాయకులకి నేను తెలంగాణా అని నిరూపించుకుని ఆ పైన పార్టీ ఫండ్ గా లక్షా రూపాయలు సమర్పించుకుని బయట పడ్డా .యిది కాదు పద్దతని యిక నుంచి మన యాస లోనే షురూ చెద్దా మని అప్పుడే అడ్మిట్ అయిన పేషంటు భంధువు ఏంటి సార్ మా వాడి పరిస్తితి ?అంటే అరె ఏమున్నది తమ్మి నువ్వు పరేషాన్ గాకు ,బె ఫికర్ వుండు , మా ఖోశిస్ మే చేస్తాం పైనా గాయనుండు అంటూ రెండు రోజులు సంఝాయిన్చినాక ఆ పేషంటు కాస్త హరి మన్నాడు .
అదేంటి సార్ అలా చని పోయాడు మా వాడు అంటూ గొల్లు మన్నాడు .నేను వోదార్పు మాటలు చెబుదామని అరె ఏం చేస్తాం భయి నువ్వు మస్తు గా పైసల్ ఖర్చు పెట్టినావ్ మేము భి మస్తుగా ట్రీట్మెంట్ యిచ్చినం , పెద్ద వయసాయే పోయిండు గిప్పుడు మొన్న సునామీలో యెంత మంది తన్డురుస్తూ గా ఉన్నోళ్ళు పోయిన్రు ?ఏం చెప్పలేం తమ్మి వోకో సారి గట్లా అయితిన్దన్నట్టు అన్నానో లేదో మళ్ళి అద్దాలు ఫర్నిచర్ ద్వంసం చేస్తూ ఆంధ్ర వాళ్ళ అంతు చూడ టానికే వీడిక్కడ హాస్పిటల్ కట్టడురా ఆంధ్ర వాలే వుపర్ భాగో అంటూ వీడు ఆంధ్రా వాళ్ళకి ట్రీట్మెంట్ యివ్వడం లో నిర్లక్ష్యం చూపిస్తున్నడంటూ మొదలెట్టారు . ఆ దెబ్బకి ఆంధ్రా వాళ్ళు భయ పడి రావడం మానేశారు .నిజామాబాద్ పేషంటు పోయిన దగ్గరనుంచి తెలంగాణా వాళ్ళు తగ్గించారు .ఆ దెబ్బకి నన్నేవరన్న ఆంధ్రానా ?తెలంగానానా అంటే నేను మాత్రం పక్కా హైదరా బాదిని . మీ మిలీనియం మార్చులు ,నిరవధిక దీక్షలుయివన్నీ ఏ కరీంనగర్ లోనో , నిజమా బాద్ లోనో చేసుకోండి గాని యిన్నాళ్ళు తేడాలు లేకుండా స్నేహితుల్లా వున్న హైదేరాబాదిలని యి రొచ్చులోకి లాగి వాళ్ళ మద్య విద్వేశాల్ని రెచ్చ గొట్టి హైదరాబాద్ ని నాలుగు వందల ఏళ్ళ వెనక్కి తీసుకు పోకండి అని ఆవేదన తో ముగించాడు .
అతను చెప్పింది నిజమే అనిపించింది ,యిన్నాళ్ళు ఆఫీసులో పక్క వాడు ఆంధ్రానా ? తెలంగాణా నా అన్న ఆలోచన ఎవరికి వుండేది కాదు యిప్పుడు మనకి తెలీకుండానే ఆ ఆలోచన వచ్చేస్తోంది ,యి విధ్వంసం నే పద్యం లో కనీసం యిక నుంచైనా భాగ్యనగరానికి మినహాయింపు యిచ్చేసి మిగతా ఏరియా లో ఉద్యమం కోన సాగించొచ్చు .హైదరాబాద్ లో ప్రజలు ఆంధ్రానా ?తెలంగాణా నా ?హైద్రాబాదినా ఏంకావాల నుకున్టున్నారో ? వొక ప్లేబిసైటు (నిష్పాక్ష పాత ఎన్నిక )పెడితే నిజం బయట పడుతుంది కదా ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
"యిన్నాళ్ళు ఆఫీసులో పక్క వాడు ఆంధ్రానా ? తెలంగాణా నా అన్న ఆలోచన ఎవరికి వుండేది కాదు యిప్పుడు మనకి తెలీకుండానే ఆ ఆలోచన వచ్చేస్తోంది"
ఇది మాత్రం నిజం
మీ ఫ్రెండ్ పరిస్థితిని తలచుకుంటే ఈ జనాల మూర్ఖత్వానికి (దాన్ని అనువుగా మార్చుకుంటున్న నాయకుల దందాలకి) నవ్వాలో ఏడవాలో అర్ధం కావటం లేదు.
మీరు చెప్పింది నిజమే. పక్కవాడు పాకిస్తానీ అయినా పరవాలేదు గానీ తెలంగాణా వాడో / ఆంధ్రా వాడో అయితే అనీజీగా ఫీలయ్యే రోజు వచ్చేసింది.
Great... ఆ రోజు వచ్చేసింది కదా. ఇక తిష్టలేసి పెట్టే బేడె సర్దుకుని బయల్దేరండ్రా. అద్గదిగో రాజమండ్రి రైలుకూతెట్టింది. బెజవాడ బస్సెళ్ళిపోతాంది మరి.
అయ్యయ్యో మిస్సయిపోయిందా మరి నెక్స్ట్ బండొచ్చేదాకా జర బద్రంగుండున్రి బై.
ఎక్కడికి భే పొయ్యేది, హైదరాబాద్ నీ అబ్బ జాగీరా? ఇందాకట్నుంచి చూస్తున్నా, అన్ని బ్లాగుల్లోనూ కొంచెం పెంటేసి పోతా ఉన్నావ్. మంచిగా చెప్తే వినేలా లేవే.
మూస్కొని పో నీ అంకమ్మ.
కుమార్ వీడి తల్లి కంట్లో హుసేన్సాగర్ డ్రైనేజి నీళ్ళు వస్తున్నాయాన్ని కవితాపెంట అన్నిచోట్ల పెడుతున్నాడు.
చూస్తున్నాను మిత్రమా, (మీరెవరో కానీ, అజ్ఞాత ఐడి లెందుకు, ధైర్యంగా మీ పేరు పెట్టుకునే రాయొచ్చు కదా). మనాడి వెనకాల పడ్డా మంచి మాటల్తో కానీ, ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నడు. వస్తాడులే మళ్ళీ.
ఓ అభ్యర్థన మిత్రమా "వీడి తల్లి" అంటూ తప్పు అర్ధాలిచ్చే పద ప్రయొగాలని అవాయిడ్ చెయ్య ప్రార్ధన. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ.
@తెలుగు,
Nice telangana slang...
కామెంట్‌ను పోస్ట్ చేయండి