19 మే, 2011

రొటీనే బెస్ట్

రొటీన్ లైఫ్ కి భిన్నం గా నాలుగు రోజులు బయటకి వెళ్ళినప్పుడే రొటీన్ లైఫ్ గొప్ప తనం తెలుస్తుంది .వారం రోజులపాటు ట్రైనింగ్ ప్రోగ్రాం కి నామినేట్ చెయ్యడం తో లక్నో రావలసి వచ్చింది .విశాల మైన ప్రాంగణం లో వూరి చివర తోటల మద్య అందం గా నిర్మితమైన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ .మువ్వన్నెల జెండా రెప రెప లాడుతూ ఆహ్వానం పలుకుతుంది .సివిల్ సర్వీసు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి సవుకర్యాలు అద్బుతం గా వుంటాయి .ఎసి రూం ,టీవి ,ఇంటర్నెట్ సవుకర్యం తో కంప్యూటర్ ,సాయంత్రం ఊరులోకి వెళ్ళాలంటే ఎసి బస్సు ,వేళకి మంచి భోజన సదుపాయాలు ,కొత్త అల్లుణ్ణి చూసుకునట్టు గా మేపుతారు . యివ్వన్ని ఎందుకు చెపుతునానంటే యిన్ని సదుపాయాలు వున్నా, ఆఫీసు పని వత్తిడి లేక పోయినా రెండు రోజులు పోగానే యింటి ద్యాస మొదలవుతుంది .పొద్దున్నే వాకింగ్ కి వెళ్తుంటే మామిడి చెట్ల మీద కూర్చుని ప్రశాంతం గా రాగాలు పలుకుతూ కోయిల ,దాని పాటకి అనుగుణం గా పురి విప్పి నాట్యం ఆడే నెమళ్ళు,మంద్రం గా నా సెల్ ఫోన్ లో నే రికార్డు చేసుకున్న నాకిష్టమైన పాటలు వింటూ రెండు రోజులు బానే గడిచి పోయాయి .దేశం మొత్తం మీదనుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారులు ప్రతి వాడు చెవి కి సెల్ ఆనించి ఆదేశాలు యివ్వడమే గాని ఆస్వాదించే వాళ్ళే కనబడలేదు .నాకు రెండు రోజులు ఆస్వాదించే టప్పటికి హైదరాబాద్ లో నా ఇల్లు నావాళ్ళు ,స్నేహితులు , ఆ రణగొణ ధ్వనుల ట్రాఫ్ఫిక్ లో కార్ డ్రైవింగ్ ,యివన్నీ గుర్తు కొచ్చాయి .మూడో రోజు వాకింగ్ కి అంతవరకు అంత అందం గా వినిపించిన కోయిల కంఠం చెవికోసిన మేక అరుపు లా వినిపించింది .నాట్య మయూరి కాస్త దారికి అడ్డం వచ్చే అడ్డ గాడిదలా కనిపించింది .నేనెప్పుడు సెల్ లో మ్యూజిక్ ఆన్ చేసినా వూరు మారినా మనిషి మారునా పాటే రాసాగింది .యింక వొక్క రోజు ఎలాగో గడిపేస్తే ఈ ట్రైనింగ్ అయిపోయి ఆది వారం హైదరాబాద్ చేరుకోవచ్చు .అలసి పోయిన గజ ఈత గాడు కను చూపు మేరలో వొడ్డు కని పిస్తే లేని శక్తి ని పుంజుకుని వడ్డు కి యీదే విధం గా ఈ అరణ్య వాసాన్ని ముగించే కార్య క్రమం లో వున్నా .ఈ ట్రిప్ లో నాకు అర్ధం అయ్యిందేంటంటే మన రొటీన్ జీవితమే అన్ని విధాల బెస్ట్ , ఊరికే విసుకున్టాము గాని నాలుగు రోజులు బయటకు వచినప్పుడే దాని విలువ తెలుస్తుంది .కొత్తొక వింత పాత వొక రోత కొంతకాలమే మళ్ళి మన పాతే మనకు నచ్చుతుంది .నిజ జీవితం లో కూడా కుటుంబ వ్యవస్థ తో విసుగు పుట్టి న చపల చిత్తుడికి ప్రియురాలి కంఠం సెల్ ఫోన్ లో కోయిల పాట లాగే వినిపించినా కొన్ని రోజులు పోగానే గార్ధబ స్వరం లా వినిపిస్తుంది {అప్పటికే రెండు నెలలుగా నెలకి అయిదు వేలు సెల్ బిల్లు రావడం వల్ల }ఆ తర్వతా ఆమె చేసినా బ్రహ్మ నందం స్టైల్లో హలో హలో ఏంటో సిగ్నల్ కట్ అయిపోతోంది అంటూ పెట్టేయ్యడమే జరుగు తుంది .ఏతా వాతా నే చెప్పేదేమంటే రోజు ఆప సోపాలు పడుతూ వుద్యోగం లేదా యింటి పనులు చేసుకునే వాళ్ళు ఛి ఛి వేదవ రొటీన్ జీవితం విసుగొస్తోంది అనుకోకుండా దాన్ని ఆస్వాదిస్తూ చేసుకోవడమే ఉత్తమం .నువ్వు చెప్పే దాక తెలిదు మరి అనుకోకండి . వొంటరి గా నా గదిలో కుర్చునప్పుడు నా మనసులో యిప్పుడు వచ్చిన భావాలకి అక్షర రూపమే గాని ఎవరి అనుభ వాలు వాళ్ళవి .హమయ్య యిప్పుడు గుండెల్లో బెంగ తీరింది .

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Hello bhava kavi garu ravi garu bagunnara??routine best

అజ్ఞాత చెప్పారు...

Inta philosophic ga mee training visheshalu Mariyu jeevita satyanni. Yerchi kurchina matalato matte panchukunnaduku chala santosham!!!!Pellichesukuni,illuchuskuni,traffic lo car naduukuni anii Padukuntene Uttamam!!!!
OpenID 
పేరు/URL
అజ్ఞాత
మీ వ్యాఖ్యను ప్రచురించండిప్రివ్యూ