8 మే, 2011

100%లవ్ 50% marksమొదటి సగం బావుంది .రెండో సగం సాగింది .ఎప్పుడు మొదటి స్తానం లోనే ఉండాలనుకునే హీరో ,ఊరినుంచి కాలేజీ లో జాయిన్ అయిన హీరో మరదలు మొదట్లో చదువులో వెనక బడినా తర్వాత మొదటి స్తానానికి వచ్చెయ్యడం ,ఆపైన వేరెవరో మొదటి స్తానానికి వస్తే యిద్దరు కుమ్ముక్కై వాణ్ణి ప్రేమ పేరు తో టైం వేస్ట్ చేయించి మళ్ళి మొదటి స్తానం కొట్టేయడం .ఎప్పుడు పార్టీ యివ్వని హీరో ఆ రోజు పార్టీ యిచ్చ్చే సందర్భాన్ని పురస్కరించుకుని మరదలి తో అతని వివాహాన్ని అందరికి తెలియ పరిచడానికి ముందు ,మాట వరసకి మరదలు ''బావ ఆ అజిత్ గాన్నినేను ఎంతో డిస్త్రుబ్ చేస్తే కూడా కేవలం నీకంటే రెండు శాతం తక్కువ తెచ్చుకుని మొదటి స్తానం కోల్పోయాడు లేకుంటే వాడె గ్రేట్ '' అనగానే వుక్రోశానికి పోయి నా గొప్పతనం వల్ల అది రాలేదన్న మాట అంతా నీ గొప్ప తనం వల్లేనా? అజిత్ గాడే గ్రేట్ అన్న మాట మా యింట్లో తిండి తిని వేరే వాణ్ణి పోగుడుతావ గెట్ అవుట్ అంటూ విడి పోతారు .యింక రెండో సగం లో హీరో కంపెనీ నష్టాల బాట లో వుంటే మరదలు తన తెలివి తేటలతో గట్టేక్కించి చివరికి బావని పెళ్లి చేసుకోవడం యిది టూకి గా కధ .
నాగ చైతన్య నటనా పరం గా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు . అయితే ఎంసెట్ లో మొదటి రాంకర్ ప్రైవేటు కాలేజీ లో ఎలా చదువుతాడో సుకుమార్ కే తెలియాలి ?ఐటం సాంగ్ మానియా సుకుమార్ ని వదిలినట్టు లేదు .అయితే ఆ పాటకి జనాల నుంచి స్పందన కూడా బానే వుంది .యింక నాగ చైతన్య తన తాత పాటకి నాన్న పాటకి స్టెప్స్ వెయ్యడం కూడా బానే పండింది .అయితే హీరో చుప్పనాతి వాడి లాగ , అసూయా పరుడు లాగ ప్రొజెక్ట్ చెయ్య బడడం ఎక్కువయ్యింది . ఆఖర్న కూడా యితరుల గొప్పతనం మనస్పూర్తి గా వప్పుకునట్టు చూపించలేదు , ఏదో తాగేసి వప్పుకునట్టు గా చూపించారు . యూత్ ఎలా రిసివ్ చేసుకున్తారన్న దాని మీదే ఈ సినిమా విజయం ఆధార పడి వుంది .