17 ఆగ, 2011

నిజం గా కరణం మల్లిస్వరేనా ?

http://im.in.com/connect/images/profile/s_profile3/Karnam_Malleswari_65.jpg
నిన్న పొద్దున్నే ఆఫీసు కి వెళ్లి సీట్ లో కూర్చున్నానో లేదో సెల్ మోగింది .ఏదో తెలీని నంబర్ . అప్పటికి యింకా బిజీ కాక పోవడం తో ఎత్తా .అవతలి పక్కనుంచి ఆడ గొంతు .నేను కరణం మల్లిస్వరినండి మీ హెల్ప్ కోసం చేశా అని వినిపించింది .ఇప్పుడున్న సెల్ టెక్నాలజీ లో మగ గొంతు ని కూడా ఆడ గొంతుకు గా మార్చి మాట్లాడించడం సాధ్యమే కాబట్టి నేను మామూలు గా చెప్పండి అన్నా . . నా స్పందనకి ఆశ్చర్య పోయిన ఆమె నేను వోలిమ్పిక్ విజేతనండి అంది .
ఏమో లెండి కాక పొతే నేను బకరా అవ్వడం ఎందుకు , చెప్పండి ఏమి చెయ్యాలి అన్నా .వాళ్ళ తల్లి దండ్రులు యింక కొంత మంది కుటుంబ సబ్యులకి అత్యవసరం గా ఏదో సాయం కావాలంటే వివరాలు తీసుకుని మళ్ళి కొంత సేపటికి పని అయిపోయిందని చెపితే ఆమె చాలా సంతోషం గా మీకు ధన్యవాద్ అంది . అదేంటి మీరు తెలుగమ్మాయి కదా మీ భాష నార్త్ వాసన కొడుతోంది అన్నా . చినప్పటి నుంచి ఢిల్లీ లో శిక్షణ తీసుకోవడం తో తన తెలుగు కు తెగులు వచ్చిందని చెప్పింది .వాళ్ళది ఆముదాల వలసని ప్రస్తుతం ఎఫ్ సి అయి లో పని చేస్తూ ఢిల్లీ లోనే ఉంటున్నానని చెప్పింది .ఆమె మంచి మాటకారి సెల్ లోనే యిద్దరం పావు గంట హస్కు వేసుకున్నాం.వోలిమ్పిక్ మెడల్ తర్వాత అత్యంత ఆనందం పొదింది యీ క్షణమే ,అత్యవసర పరిస్తితులలో నా తల్లి దండ్రుల అవసరాన్ని తీర్చారు . అంటే భలే వారే నేను సైతం వోలిమ్పిక్ విజేత కి సాయ మొకటిని ఆహుతిచ్చా అన్నా . ఈసారి ఢిల్లీ వస్తే మా యింటికొచ్చి మా ఆతిద్యం స్వీకరించండి అంది . నేను కూడా హైదరాబాద్ వస్తే మీ ఆతిద్యం స్వీకరిస్తా అన్నా .దానికామె నవ్వేసి హైదరాబాద్ వస్తే ముందు సుబ్బిరామి రెడ్డి గారు వదలరు అయినా కూడా మీకు ధన్యవాదములు అంటూ ఫోన్ పెట్టేసింది .
యింతకీ ఆమె నిజం గా కరణం మల్లిస్వరేనా ?ఈ రోజు మళ్ళి చేసి చెక్ చేద్దామనుకున్నా గాని వీలు చిక్క లేదు . యింకో సారి ఫోన్ చేసి రాధ గారు వున్నారా అండి అని సెల్ లో అడిగితె లేదండి నేను కరణం మల్లిస్వరినండి అంటే వొకే కాదండి సుధ ని అంటే నే గొంతు లో పచ్చి వెలక్కాయ , చూడాలి ఏమవుతుందో ?

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

babu, nee sonta dabba apamma.aina tamaru ladieski tappa evaraki peddaga help cheyyarankonta..

come on uncle..

అజ్ఞాత చెప్పారు...

blog peru chooste teleedam ledaa..

Bhardwaj Velamakanni చెప్పారు...

పాపం రవిగారు! :))))

అజ్ఞాత చెప్పారు...

కరణంతో కారణం లేకుండా రణం పెట్టుకుంటే తర్వాత రుణం తీరే మార్గం కనపడక చరణం పాడుకుంటూ దారుణంగా బాధపడాలేమో.

Unknown చెప్పారు...

అజ్ఞాత నా సొంత డబ్బా కాకుండా నీ సొంత డబ్బా రాస్తే
వేరే అర్ధం వస్తుంది .లేడీస్ కి హెల్ప్ చేసానని చదివాకే నీలో
ఉక్రోషం పెల్లుబికి వచ్చింది చూసావా.ఆన్కుల్ అని సంభోదిన్చావు కాబట్టి
ఏక వచనం ప్రయోగించ వలసి వచ్చింది .
రెండో అజ్ఞాత మనకి మనం గౌరవం యిచ్చు కోపోతే వేరే వాళ్ళనుంచి ఏమి ఆశిస్తాం ?
భరద్వాజ్ గత పదేళ్ళ నుంచి ఎవరో వొకరు ఎపుడో అపుడు అలా పిచ్చ పిచ్చ గా కలుస్తున్నారు అదేంటో
కొంత మంది మనకి పరిచయం అయిన వెళా విశేషం .యు నో దట్.

Unknown చెప్పారు...

ఆఖరి అజ్ఞాత మీ స్వీయ అనుభవాలు అందరికి ఆపాదిస్తే ఎలా ?
అయినా ,
కరణం నేను రాయడానికి వొక కారణం
ఇలాంటి కామెంట్స్ రావడం దారుణం
పిచ్చి కామెంట్స్ చేస్తే వస్తుంది వ్రణం
బ్లాగ్ తో తీరిపోతుంది మీకు ఋణం