17 సెప్టెం, 2011

అవధూతలు వుంటారు

మొన్న ఏదో పని మీద అమలాపురం వెళ్ళవలసి వచ్చింది .ఎప్పటి నుంచో మా సీనియర్ సహచరుడు వొక ఆయన అక్కడికి వెళ్లి నప్పుడు వీలుంటే దగ్గరలో ఐనవల్లి దగ్గర మూలపోలం అని వొక వూరు వుంది అక్కడ వెంకన్నబాబు అని వొక స్వామి వున్నారు మనిషిని చూడగానే మనసులో వున్నది చెప్పేస్తారు .మీరనుకున్తున్నది అవుతుందో లేదో కూడా చెప్పేస్తారు .ప్రయత్నించండి అన్నారు .యిది చెప్పి కూడా నాలుగేళ్ళ పైన అయిపొయింది .మేము వెళ్ళిన పని తొందరగా అయిపోవడం తో ఆ పని అవడం లో సహకరించిన పెద్ద మనిషిని యధాలాపం గా అడిగా మూలపోలం ఎక్కడో తెలుసా అని పెద్ద ఆశలు ఏవి పెట్టుకోకుండా . ఎందుకంటె అంతకు ముందే మా కార్ డ్రైవర్ ని అడిగితె తెల్ల మొహం వేసాడు .వెంటనే ఆయన సార్ నేనెప్పుడో యిరవై రెండేళ్ళ క్రితం వెళ్ళా మీకభ్యంతరం లేక పొతే నేను వస్తా అంటే మా ఫ్యామిలీ తో పాటే ఆయన కూడా డ్రైవర్ కి దారి చూపిస్తూ మద్యలో కనుక్కుంటూ చివరికి మద్యాన్నం మూడు గంటలకి వారింటికి చేరు కున్నాము .శనివారం , ఆదివారం ,మంగళవారం మాత్రమె ఆయన స్వామి ఆవాహన పొంది పూజా పీటం లో ఆహుతుల మనసులో ప్రశ్నలకి సమాధానం చెపుతారు . ఆ రోజు మంగళవారం అవడం తో అప్పటికే హాల్ నిండా వొక యాభై మంది దాక కుర్చుని వున్నారు .నా విసిటింగ్ కార్డు పంపడం తో కొంతసేపటి తర్వాత మా కుటుంబాన్ని ప్రత్యేకం గా వేరే గదిలో కూర్చో బెట్టారు .అక్కడ గొప్పతనం మన హోదా దీ కాదు వేంకటేశుని అనుగ్రహమే అని తర్వాత నాకు అర్ధంఅయ్యింది .ఆ గది లోకి కూడా యింకో మూడు నాలుగు కుటుంబాలు (చుట్టుపక్కల గ్రామాల్లో ప్రముఖులు )వచ్చి చేరాయి .అక్కడ గదిలో గోడలకి వేలాడదిసిన స్వామి ఫోటోల పక్కన పసుపుబట్టలతో వున్న యియన ఫోటోలు కూడా కని పిస్తే మా శ్రీమతి ఉండబట్టలేక ఏంటో వీళ్ళంతా దేవుడి తో సమానం గా ఫోటోలు పెట్టేసుకుంటారు వీళ్ళు కూడా దేవుడంతా గొప్ప వాళ్ళని అనుకుంటారా అని మెల్లగా అంది .టైం అప్పటి కే అయిదయింది . అయన బయటకు రాలేదు . నా కేమో రాజముండ్రి వెళ్లి గౌతమి పట్టుకోవాలి ట్రైన్ మిస్సవుతుందేమో అని భయం .చివరికి అయిదు ఇరవైకి పొట్టి గా చామన చాయ కలర్ తో పసుపు బట్టలతో సాధారణ వ్యక్తీ లా అనిపించే వ్యక్తీ వచ్చారు .అందరు ఆయన కి నమస్కరించి ఆశ్వేర్వచనం పొందు తుంటే నన్ను నేను పరిచయం చేసుకుని ఎప్పటి నుంచో రావాలనుకుంటే యిప్పటికి కుదిరిందని చెప్పా . దానికి ఆయన చిరునవ్వుతో స్వామి అనుకున్నప్పుడే అనుసంధానం చేస్తారు మీరు లోపల పూజా మందిరం లో ప్రశ్నకి సమాధానం విని వెళ్ళండి అన్నారు .యింక ఏమైతే అది కాని ట్రైన్ మిస్ అయితే మిస్ అవని విని వెళదామని ఆగాము . అక్కడ పూజ మందిరం లో వెంకటేశ్వర విగ్రహం అమ వారి విగ్రహాలు చక్క గా దండలతో అలంకరించ బడి వున్నాయి .అక్కడి వాత వరణం లో కూడా ఏదో శక్తి వున్న అనుభూతి కల్గింది.ముందుగా మమ్మల్ని పూజా మందిరం లోకి పిలచి తీర్దం యిచ్చారు . వెనకే మిగతా వాళ్ళు కూడా వచ్చి చేరారు . కొద్ది సేపటికే ఆ గది ఇరుకు గా మారి చిన్నప్పటి తోపులాటకి సిద్దం గా మారింది .యింకా హాల్ లో జనం మేమెప్పుడు బయట కోస్తామా వాళ్ళు దూరోచ్చని చూస్తున్నారు .యింతలో ఆయన కళ్ళు మూసుకుని దండం చేత్తో పట్టుకుని తన ఎదురు గా వున్న ఆమెతో ''ఏమి ఆశించి వచ్చావు స్వామి దగ్గరకి ?అనారోగ్యం తో బాధ పడుతున్న నీ కొడుకు ఆరోగ్యం గురుంచి వచ్చావా ?యింకా నలుగురు డాక్టర్లు మారాక తగ్గుతుంది . పూర్వ జన్మ ప్రారబ్దం అనుభవిస్తున్నాడు .సహనం వహించు నే చూసుకుంటా వెళ్లిరా '' అనగానే ఆమె ఆనంద భాస్పాలో కళ్ళ నిళ్లో తెలీని స్తితి లో తుడుచుకుంటూ ముందుకు జరిగింది . ఆమె వెనక వచ్చిన అతనికి నీ వ్యాపార విషయం లో ఆందోళన చెందకు ఆరు నెలల్లో అంతా సద్దుకుంటుందని చెప్పడం జరిగింది .
అలా జనం వోకర్ని వొకరు తోసుకుంటూ ఆయన ముందుకు వస్తుంటే ఆయన వాళ్ళకేసి చూస్తూ మనసులో మాటని చదువుతూ పరిష్కారం చెపుతున్నారు .యింక నా వంతు వచ్చింది .స్వామి శక్తి రూపమా ?విష్ణు రూపమా ?అని ఆలోచిస్తున్నావు (నా బుర్రలో ఈ సందేహం ఎప్పటి నుంచో వుంది స్వామికి శుక్ర వారం అభిషేకం చెయ్యడం లో అర్ధం శక్తి రూపమే అని )ఆది శక్తి శివ శక్తి రెండు నేనే .నీ పూజలు అలాగే కోన సాగించు .నీ మంచి మనసు ,ఇతరులకి సహాయ పడే గుణాన్ని బట్టే నీకు ఉద్యోగం లో మార్పు వచ్చింది .అందులో మంచే జరుగుతుంది . నీకు డిసెంబర్ రెండో వారం లోపు పదోన్నతి వస్తుంది .వెళ్లి రా . అని చెపుతుంటే నా కళ్ళలో ఆనంద భాష్పాలు జల జలా రాలాయి .ఎందుకంటె నేను నోరు తెరచి ఆయనని ఏమి అడగ లేదు . అదికాక యి విషయాలు యిన్కేవరి తోనూ చర్చించలేదు . అందుకే వొక విధమైన ట్రాన్స్ లోకి వెళ్లి పోయి బయటకు వచ్చా . మా శ్రీమతి విషయం లో కూడా నీ దగ్గర మోసపురితం గా వొకడు డబ్బు తీసుకున్నాడు అది నీకు మార్చి లో వస్తుందని చెప్పినప్పుడు ఆశ్చర్య పోవడం ఆమె వంతయ్యింది . ప్రస్తుతం ఆ వివాదం కోర్టు లో నడుస్తూ మా కనుకూలం గా తీర్పు వచ్చింది .ఆయన గురించి మా తో పాటు వచ్చినాయన ద్వార మరిన్ని విషయాలు తెలుసు కున్నాము . ఆయన చాలా ఏళ్ళ క్రితం నుంచే అవధూత లా వ్యవహరిస్తున్నారని బ్రహ్మ చారి లా వుంటూ తన దగ్గరికి వచ్చే వాళ్ళ యితి భాధలు తీరుస్తున్నారని చెప్పాడు .అయితే ఆయన శిష్య గణం కొంత అతి గా వ్యవహరిస్తున్నరేమో అని పించింది .వొక పక్క యియన ప్రశ్న సమాధానం చెపుతూ వుంటే గట్టి గా అరుస్తూ జనాల్ని కంట్రోల్ చెయ్యడం , మాట్లాడడం వంటివి చెయ్యడం జనాలు పళ్ళెం లో వంద అయిదు వందల నోట్లు వెయ్యగానే తీసి బిందె లాంటి హుండీ లో వెయ్యడం వంటివి .అవధూతల దగ్గర శిష్యగణం వారి మహిమల్ని ధన రూపం లోకి మారుస్తూ వుంటారేమో ?
ఈ ట్రిప్ లో నాకర్ధమయ్యింది ఏమిటంటే అవధూతలు అక్కడక్కడ యింకా వున్నారు వాళ్లతో అనుసంధానం అయ్యే సమయం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు .మరి అంతవరకూ మేర నంబర్ కబ్ ఆయే గా అనుకోవడమే .

2 వ్యాఖ్యలు:

sasi చెప్పారు...

ravi గారు, చాలా బాగుంది మీరు వ్రాసింది. మాకు కూడా వెళ్ళాలనుంది.మీరు ఇలాంటి మంచి విషయాలు చేప్పినందుకు చాలా థాంక్స్. శశికళ.

రవిగారు చెప్పారు...

శశికళ గారు ధన్యవాదాలు ,
మబ్బులు విడి వడినప్పుడు
శశి కిరణాలు స్వామి పాదాల్ని తాకినప్పుడు
మీరు తప్పకుండ వెళతారు .
ఆ రోజు త్వరలోనే రావాలని ఆశిస్తున్నా .