11 డిసెం, 2011

ఏ సెల్లు పలికినా


మరి యింత బిజీ అయిపొయింది జీవితం .మనసులో భావాలకి అక్షర రూపం యివ్వలేనంతగా?అసలు పని వత్తిడి లో అందమైన భావాలకి అవకాశం ఎక్కడ ?వుద్యోగం లో కొన్ని ముఖ్య మైన పోస్ట్స్ చేస్తునప్పుడు మనకంటూప్రైవేటు సమయంవుండదు .కార్ లో డ్రైవ్ చేస్తూ కూడా యియర్ ఫోన్ లో మాట్లాడుతూ ఆదేశాలు యిస్తూ వుండాలి .ఏవి నిరుడు కురిసిన హిమసముహాలు అని పిస్తూ వుంటుంది .అప్పట్లో మన మనసుని ఆహ్లాద పరిచిన స్నేహితుల గొంతు సెల్ లో వినిపించినా యిది వరకులా మాట్లాడే అవకాశం ఉండక ముక్త సరిగా మాట్లాడి నేను మళ్ళి చెయ్యనా అంటుంటే ఆ కోయిల యింకొక మనసుని రంజింప చెయ్య దానికి ఎగురు కుంటూ వెళ్లి పోదా ?ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు గుర్తు కొస్తున్నాయి .ఈ తెలుగు బ్లాగర్స్ దినోత్సవం సందర్భంగా కొంత సమయం కేటాయించి నిద్ర బోతున్న నా బ్లాగులో నా మనసులో భావాలూ రాసి కొత్త చలనం తీసుకోద్దామనే యి ప్రయత్నం .నేను యింతకు ముందు రాసుకున్న నిన్నటి నా నువ్వు లో లా సమయం కేటాయించా లేక పోవడం తో మనసులో భావాల్ని ప్రేరేపించ గలిగే స్నేహితులు వసంత కోకిలలు అయిపోయారు .సరే యింక ఆఫీసు విషయానికి వస్తే అదేంటో నా రూం లోకి రాగానే మా స్టాఫ్ సెల్ల్స్ మోగుతూ వుంటాయి .నేను ఫైల్ లోంచి తల ఎత్త కుండానే గమనిస్తూ వుంటా వాళ్ళ ప్రతిక్రియల్ని .ఎంతైనా సెల్లాలజి లో నిష్ణాతున్ని కదా .వాళ్ళ హావ భావ విన్యాసాల తో అవతలి పక్క మాట్లాడు తున్నది యింటి వాళ్ళా ?పక్కింటి వాళ్ళా ?స్నేహితులా ?కాంట్రాక్తర్లా అన్నది తెలుస్తూనే వుంటుంది .మొన్నొక సారి నలుగురు స్టాఫ్ (యిద్దరు ఆడ యిద్దరు మగ )నా రూం లో వాళ్ళ వాళ్ళ ఫైల్స్ తీసుకుని నిల బడ్డారు .అందులో వోకతని సెల్ వచ్చిన రెండు నిమిషాలకే మోగితే అన్నా యితని సెల్ మోగకుండా నా రూం లోంచి వెళ్ళిన నాడు మొత్తం ఆఫీసు అందరికి గ్రాండ్ మినర్వాలో లంచ్ యిస్తానని .అంతే కాకుండా యింకో పెళ్లి కాని అమ్మాయి ఫైల్స్ తో నిలబడి వుంటే అన్నా ఎప్పుడు కూడా తన సెల్ నా రూం కి వచ్చినప్పుడు మోగలేదు అని అభినందించా ( మోగ వలసిన ఈ అమ్మాయి సెల్ ఫోన్ ఎప్పుడు మూగ బోయి వుంటుంది ,అని మనసులో అనుకుంటూ ),మిగతా ముగ్గురు వెళ్లి పోయారు ఆమె ఫైల్స్ చూస్తుంటే ఆమె అసహనం గా కదలుతుంటే అడిగా ఎనీ ప్రోబ్లం ?అని సార్ అది అది నా సెల్ వైబ్రాటార్ మోడ్ లో వుంటుంది అంది .అదేంటి మీ డెస్క్ లో వున్న మీ సెల్ విబ్రేట్ అయితే మీరిక్కడ ప్రతిస్పందిస్తున్నారు అంటే నా చుడిదార్ కి పోకెట్స్ వున్నాయి సార్ అంటే యింకేలా react కావాలో తేలిక వొకే క్యారీ ఆన్ అనేసి ఫైల్స్ చూడడం లో నిమగ్నం అయిపోయా .కాని నా చెవులు ఆమె మాటల సారాన్ని గ్రహించేస్తున్నాయి ఖర్మ .మీ ఆవిడా వుంటే నాకేంటి వచ్చి తీరుతా మనిద్దరి మద్య వున్నది కేవలం స్నేహమే అని ఆమె కి కూడా తెలీని అంటోంది నేను అవతల ఫోన్ లో ఎవరి తోనో మాట్లాడు తున్నా అనుకుని .యింత పిరికి వాడివి ప్రేమించానని ఎందుకు మబ్య పెట్టావ్ నా మానాన్న నేను పెళ్ళిచేసుకుని హాయ్ గా వుండే దాన్ని గా అంటోంది కళ్ళలో కన్నీటి పొరలు .అప్పుడని పించింది ఏ సెల్లు సొల్లు వినినా ఎమ్మున్డి గర్వ కారణం ప్రతి సెల్లు పర పీడా ప్రేమాని తత్త్వం అని .కావాలనుకున్నది దొరకదు దొరికిన దాన్ని కావాలనుకోడు జీవితం అంతా మరిచికల్ని విచకలా భావించి ఎడారి ఎండలో మృగతృష్ణ లో నీటిని తోడే వృధా ప్రయత్నమే . నిరంతర అన్వేషణ లో ఆఖరి మజిలి ఎక్కడో మరి . ఆమె విషాద ప్రేమ కధ తెలుసుకోవాలనే కుతూహలం వున్నా అధికారపు యినప తెరలు అడ్డు పడి నేను కరెక్ట్ చేసిన డ్రాఫ్ట్ తీసుకుని రండి ఏవన్నా డ వుట్స్ వుంటే అడగండి అన్నా .ఆమె లో మళ్ళి అసహనం మొదలయ్యి యిబ్బంది గా కదులుతూ సారీ సార్ అంటూ ఫైల్ తీసుకుని బయటకి అడుగులు వేసింది .బయట పెద్ద గొంతు తోనే అరుస్తోంది ''నే వచ్చి తిరతా గో టు హెల్ '' అని .ఆ సాయంత్రం రాబోయే ప్రళయానికి సూచిక గా బయట ఉరుములు నా కిటికీ అద్దం లోంచి కని పిస్తున్నాయి .ఆమె కధని ఎప్పటికన్నా తెలుసుకుని రాస్తానేమో ?
http://ravigaru.blogspot.com/2010/12/blog-post.html





4 కామెంట్‌లు:

Disp Name చెప్పారు...

'క్వార్టర్' కాలాతీత దర్శనం !

వెల్కం బెక బేక !

చీర్స్
జిలేబి.

Unknown చెప్పారు...

జిలేబి తో తీయ్యగా స్వాగతం పలికించుకోవడం
కడు ముదావహం .ఇకనుంచి నూతిలో కప్పలా
బెక బెక లాడుతూ వుండి పోక వారానికొక్క సారాన్న
ఈ బ్లాగ్ విశాలా ప్రపంచం లోకి రావడానికి ప్రయత్నిస్తా. .

అజ్ఞాత చెప్పారు...

touching. felt bad - GV

అజ్ఞాత చెప్పారు...

Waiting for that.