24 జన, 2012

మళ్ళి మొదలయ్యింది

 
  మొన్న వొక మిత్రుడు ఫోన్ చేసి నువ్వు రాసే కధ లోని పాత్రలన్నీ నా నిజ జీవితం లోకి నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి .నువ్వు రాసినట్టే నా జీవితం లోకివొక రాధ వచ్చి వలపులు పంచి లతలాగా అల్లుకు పోతూ వుంటే యింకో రాజు రావడం తో నా పాదుకు నీళ్ళు పొయ్యడం మానేసింది . మళ్ళి నా లతలు చిగురించి నా పాదు అల్లుకునేలా మంచి ముగింపు నివ్వు నీ కధకి ప్లీజ్ అంటూ అభ్యర్ధించాడు .
        నాకు నమ్మ బుద్ది కాలేదు.చినప్పుడేప్పుడో చూసిన కల్పన  సినిమా లో అనుకుంటా అల్లు రామలింగయ్య కధలు రాసుకుంటుంటే అతని ముందు పాత్రలు ప్రత్యక్షమయ్యి అతని తో వాదనకి దిగుతుంటాయి . అలాగా నేనేదో ఊహించి కధ రాస్తే అచ్చు అలాగే వేరే వూళ్ళో వున్న స్నేహితుడికి అవడం ఆశ్చర్యం అయినా అతని తృప్తి కోసం అలా ముగిసింది కధ కి ముగింపు గా మళ్ళి మొదలయ్యింది రాస్తున్నా . మరి యిది రాసాక వాళ్ళిద్దరి మద్యసయోధ్య కుదిరి  మోడు చిగురిస్తే మంచిదే .
       సుధ నెంబర్ తీసేసాక కష్టం మీద రెండు రోజులు గడిపా . దానికే నాకు రెండేళ్ళు అయినట్టు గా  అనిపించింది .తను ఈ రెండు రోజుల్లో ఎప్పు డన్నా ఫోన్ చెయ్యక పోతుందా అని ఆశిస్తూ ప్రతి అడ్డమైన అపరిచిత నంబర్ల ఫోన్లు ఎత్తే వాణ్ణి .వొక అమ్మాయి గొంతు సుధ లాగే వుంది .
ఏమండీ మీతో నేను రెండు నిమిషాలు మాట్లాడొచ్చా ?అడుగుతోంది .
రెండేళ్ళు మాట్లాడుకున్నాం యింకో రెండు నిమిషాలే గా కానీయ్యండి అన్నా 
మీకు ఎప్పుడన్నా అర్జెంటు గా డబ్బులు అవసరం పడి  చేతిలో డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు ?
మీ దగ్గరే తీసుకుంటా. రుణాను బందం తో మీరే పత్ని గా వస్తారని ,
క్షమించండి సార్ నేను ఐ సి ఐ సి ఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా మీకేమన్నా లోఅన్ కావాలేమో అని  ఫోన్ చేశా అంది .నేను ఐ సి అని ఫోన్ పెట్టేసా . ఈ అమ్మాయి పిచ్చి లో పడి ఎవరు ఫోన్ చేసినాఆమె నేమో అని పిస్తోంది . అయినా నా పిచ్చి గాని కొత్త అనుభందాల గుభాలిమ్పుల్ని ఆస్వాదించే ఈ సమయం లో మోడు వారిన పందిరి ఎందుకు గుర్తుకు వస్తుంది .తీగకు పందిరి కావలె గాని తెలుసా నువ్వే పందిరని ?
కార్ యింటి వైపు సాగుతోంది , యిది వరకు రోజుల్లో వాళ్ళింటి వైపు సాగేది .
చీకటి లో కారు చీకటి లో కాలమనే పడవలో లోకమనే యేరు లో ఏ దరికో ? ఏ భువికో ?
యింతలో సెల్ మోగడం తోతీసా .వొక్క సారి వెయ్యి తంత్రువులు మోగినట్టు గా
ఏంటి బంగారం ?మర్చి పోయావా ?ఏంటి రెండు రోజులనుంచి ఫోన్ లేదు ?ఊర్లో లేవా ?
ఏ గొంతు కోసం నేను పరితపించానో,ఏ గొంతు వేరే వాళ్ళకి కూడా స్పందిస్తోందని బాధ పడి వదిలేసుకున్దామని నిర్ణయించు కున్నానో , ఏ గొంతు స్వరం తో రెండేళ్ళు గా గంటలు గంటలు శృతి కల్పిశృతి తప్పానో అదే గొంతు నాకు నిదట్లో కూడా జోల పాడె గొంతు యిక శాశ్వతం గా నాకు మూగ బోయిన్దనుకున్నా ఆ గొంతు పలకరించిన ఆనందం లో నా గొంతు మూగ బోయింది .కళ్ళలో ఆనందా శ్రువులు , మాట రాని మౌనం .
 ఎంట్రా కోపం వచ్చిందా ?ఏంటోరా  అందర్నీ ప్రేమించే తత్త్వం నాది . ఎవర్ని నొప్పించ లేను , వొక్క సారి రాకూడదా కాఫీ తాగి వెళొచ్చు చూసి  కూడా ఎన్నో ఏళ్ళు  అయినట్టు వుంది తన ధోరణి లో తను చెప్పుకుంటూ పోతోంది .
నాలో ఈ రెండు రోజులనుంచి దాచుకున్న దుక్కం వెల్లువలా పెల్లుబికి వస్తుంటే ఆపు కోవడం కష్టం అయ్యి పైకే ఏడ్చేసా .ఆడ కైనా మగ కైనా ఔట్లెట్ కన్నీరే అయినప్పుడు ఆపుకోవడం దేనికి ?
ఏంటి బంగారం అంత సెన్సిటివ్  ?టెక్  ఇట్ ఈజీ రా యింట్లో మాట్లాడుకుందాం ఎదురు చూస్తూ ఉంటా సరేనా ?అంటుంటే ఉ అండం తప్ప యింకేమి అనలేక పోయా .తన మీద వున్న కోపం అంతా ప్రేమ పూర్వకం గా ఆమె పలకరించే టప్పటికి గాలికి యెగిరి పోయింది .
వాళ్ళింటికి వెళ్ళే టప్పటికి తను పిల్లలు వున్నారు . వాళ్ళు బెడ్రూం లో హోమేవోర్క్ చేసుకుంటుంటే మేము డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చుని కాఫీ  తాగుతూ వుంటే మునిపటి లాగ  కళ్ళలోకి చూస్తూ అడిగింది . ఈ రెండు రోజులు మాట్లాడకుండా ఎలా వున్నావు ?
     ఏముంది సుధా టైం దొరికితే నీతో మాట్లాడడం, లేకపోతె నీ గురించే మాట్లాడం  ఈ వలయం నుంచి నే బయట పడలేక పోతున్నా ,నీ నంబర్ డిలిట్ చేసేసా కాబట్టి  నా స్నేహితుడి తో నీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ గడిపేసా వాడు విసుకున్నా సరే .
   యింతలా అనుక్షణం  నా గురించి ఆలోచించే వ్యక్తీ నా జీవితం లో ప్రవేశించడం నా అదృష్టం  తన స్పందన యింకా పూర్తీ కానే లేదు తన సెల్ మోగింది .. హా రమేష్ తను వచ్చారు యిద్దరం మాట్లాడుకుంటున్నాం మన మద్య జరిగిన వన్ని చెప్పెసానులే .ఆ అన్నీను తను వత్తి పలుకుతోంది .
    యిదివరకులా నాకు కోపం రావటం లేదు .బాధే సౌక్యమనే  భావన రానిస్తున్ననేమో ? తను నిజం చెప్పేసింది కాబట్టి మోసం చెయ్యటం లేదన్న భావమో ?తను తప్పు చేశా అన్న నిజం చెప్పేస్తే ఆ తప్పు నా లెక్క లో తప్పు కాదేమో ?ఏమో ఆ భావం మొత్తానికి తను ఆ రమేష్ తో నా ముందే  మాట్లాడుతున్నా నేను ఆమె మోములో ఆనందాన్నే గ్రోలుతున్నా  గాని యిది వరకులా నా లో రాక్షసుడు విజ్రుభించటం లేదు . తను కూడా నా మొహం లో ప్రసాంతత ని చూసి  యిరవై నిమిషాలకే వుంటాను రా మళ్లీ మాట్లాడుతా అంటూ సెల్ పెట్టేసి నా కేసి తిరిగి అబ్బో గొప్ప మార్పే మీలో అంటూ మెచ్చు కోలు గా చూస్తోంది .అయినా యింత దూరం  వచ్చే సాక మారక చస్తామా ?ఇప్పుడున్న వాళ్ళు తప్ప మరింక కొత్త వాళ్ళు ఎడ్ అవకుండా దేవుణ్ణి ప్రార్ధించడం తప్ప .మన మనసులోనే బాధ వుంటుంది  చూసే కోణం మార్చుకునప్పుడు  ఆ బాధ అదే పోతుంది .యింతకు ముందు నే వచ్చినప్పుడు రమేష్ తో సెల్ మాట్లాడితే మనసు సహించేది కాదు దాంతో కోపం , బాధ ఉక్రోషం అన్ని కలిగేవి .యిప్పుడు నేను చూసే కోణం మార్చుకుని ఆమె మాట్లాడుతుంటే నేను కుడా లాక్కుని మాట్లాడడం తో నాలో వ్యతిరేక భావం పోయింది .మళ్లీ ఎప్పటిలాగే ఆమె నవ్వుతు మాట్లాడుతోంది .నేనుకూడా ఆమె నుంచి ఏమి ఆశించటం లేదు కాబట్టి మళ్లీ మామూలు పరిస్తితులు మొదలయ్యి మళ్లీ మా యిద్దరి మద్య  అలా మొదలయ్యింది .
        మాటల మద్యలో తను చెప్పింది రమేష్ నేలాఖరకి ఇక్కడకి వచ్చి తన పని అయ్యేదాకా వుండి అప్పుడు పోతాడని . మళ్లీ నా మనసులో అలజడి . ముందుంది నాకు అగ్ని పరీక్ష అప్పుడు కూడా యిలాగే నవ్వుతూ వాళ్ళిద్దర్నీయింట్లో వదిలేసి వీడ్కోలు పలక గలనా ? అంత ఎత్తుకు ఎదిగానా ? లేక తను నాతొ స్నేహం కంటిన్యూ చెయ్యడానికి నే వేసుకున్న ముసుగా?కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి .