నేనేదో మనసులో భావాలకి , దైనందిన జీవితం లో ఎదురైనా వ్యక్తుల్ని కలిపి కదా రూపం లో రాసుకుంటూ ., జీవితం లో తారస పడిన పాత్రలని యధా తదం గా బ్లాగ్ లోకి ఎక్కిస్తూ , మనసులో బాధని కక్కేస్తూ బ్లాగ్ లో సేద తీరు తున్నా అప్పుడప్పుడు ..అంటే యిది నా అవుట్ లెట్ గానే భావించా యిన్నాళ్ళు .కాని నే రాసిన కధల్ని చాలా సీరియెస్ గా ఫాలో అవుతూ తర్వాత ఏమవుతోందో అంటూ నా కంటే ఎక్కువ ఆత్రుత పడే అభిమానులు వున్నారని మొన్నే తెలిసింది .చాల రోజులనుంచి వొక ఆమె యాహూ లో ఆడ్ రిక్వెస్ట్ పంపితే పట్టించు కోలేదు .ఆమె నా కధ లో పాత్రలు , నేను ఏ ఏ కధలలో సుధ పేరు వాడానో వగైరా రాసాక నమ్మకం కుదిరి ఆడ్ చేసుకున్నా .దానికి ఆమె ధన్య వాదాలు తెలుపుతూ మీ సెల్ నెంబర్ యిస్తే వొకసారి నా అభిమానం తెలుపు కుంటా అంటే మీ నంబర్ యియ్యండి ముందు నేనే చేసి కన్ఫిరం చేసుకుంటా అంటే తన నంబర్ యిచ్చింది .చెయ్య గానే ఆమె గొంతులో చెప్పలేని ఉద్విగ్నత
''రవిగారు మీ'' అనుక్షణికం'' లో సుధా ,''ఆమె మారదు'' లో సుధా వోకరేనా ?అలా అయితే ఆమె మీకు వేరే వురి లో ట్రన్స్ఫెర్ అయినప్పుడు పరిచయం కదా ? ఇప్పుడున్న సుధ మీకు వాకింగ్ కి వెళ్లి నప్పుడు వాన పడి నప్పుడు వొకే షెల్టర్ కింద నిల బడి నప్పుడు పరిచయం కదా ? యిద్దరు వోకరే ఎలా అవుతారు ? నేను ఆస్ట్రేలియా లో పని చేస్తునప్పుడు మా రూం మేట్ యింకో తెలుగమ్మాయి ఈ విషయం లో బెట్ లు కూడా కట్టు కున్నాం'' . అంటూ గుక్క తిప్పు కోకుండా మాట్లాడుతుంటే ఆమె మాటల ప్రవాహానికి అడ్డు కట్ట వేస్తూ
యిప్పుడు ఇండియా లో ఎక్కడ వున్నారు అన్నా
.హైదరాబాద్ లో మీరో అంది
'' నాదిభి అదే వున్నది '' అన్నా . ఆమె ఆనందానికి అవధులు లేవు అబ్బ అయితే మనం అనుకుంటే త్వరలోనే కలవొచ్చు అంది
.అనుకోకుండా కూడా కలవొచ్చు బ్లాగు లో అన్నా .
మీకు కలవడం యిష్టం లేదనుకుంటా సారీ .అయినా మీ సుధ మీకు ఆడవాళ్లంటే భయ పడేలా చేసేసిన్దనుకుంటా పోనీ లెండి అంది .
అయ్యో అదేం కాదండి నా కు అంత తీరు బడి వుండదు ,మీరు మరీ అంత ఉత్సాహ పడు తున్నారు కాబట్టి శనివారం మా ఆఫీసు కి రండి యిక్కడే కలుద్దాం అని అడ్రెస్స్ చెప్పా .ఆమె అన్న టైం కిఆఫీసు లో నా రూం డోర్ నాక్ చేసి మే ఐ కం ఇన్ అంటూ నిల బడింది . వొక పాతికేళ్ళ పెళ్లి కాని లావు కాని సన్నం కాని కానీ అమ్మాయి నవ్వు మొహం తో ఐ అం మహా యు కేన్ కాల్ మే లక్కీ అంటూ చేతులు ముందుకు సాచింది .
ఐ రియల్లీ డోన్ట్ నో హావు లక్కీ ఐ అం అంటూ చేతులు కలిపడా పిసికాడా అన్న సందేహాస్పదం లో వదిలేసా .
రవిగారు నేనెంత గా మీ బ్లాగ్ అభిమానినో చెపితే ఆశ్చర్య పోతారు .వొక రోజు ఆస్ట్రేలియా లో నే పని చేస్తున్నప్పుడు రాత్రి డ్యూటీ ముగించుకుని ట్రైన్ లో వస్తూ ఐఫోన్ లో బ్లాగ్స్ చూస్తునప్పుడు మీ'' అతనెవరు ''? చూడటం మొదటి భాగం మొదలెట్టి మూడు భాగాలు చదవగానే గమ్యం వచ్చేసినప్పటికి యింటికి వెళ్లి కాఫీ పెట్టుకుని ఉదయం ఐదుకి మిగతా భాగాలూ చదివి మీరు రాసిన శైలి నచ్చి అనుక్షణికం , వొక విటుడి ఆత్మ కదా ,యింతకీ వునట్టా ?లేనట్టా ? యిలా ఆది నుంచి తుది దాక అన్ని చదివేసా .అప్పటికే మద్యానం వొంటి గంట అయ్యింది , అప్పటికి మళ్లీ మూడు గంటలకి డ్యూటీ కి వెళ్ళాలని గుర్తుకు వచ్చి పరి గెత్తా అంటూ చెపితే నిజం గానే నోరు వెల్ల బెట్టడం నా వంతు అయ్యింది .నిజం గానే ఆమె నేనేప్పుడేప్పుడో రాసిన పెద్దాపురం లో దయ్యాల నుంచి ,సుధ వాళ్ళింటికి వెళితే తను సెల్ మాట్లాడుతూ నన్ను పట్టించు కోకుండా కిచెన్ లోకి పోయి మాట్లాడుతూ గడిపిన వైనాల్ని చెపుతుంటే తను నిజ్హం గా యెంత ఇన్వోల్వే అయ్యి ఫాలో అవుతోందో అర్ధం అయ్యింది .కించిత్తు ఆనందం కూడా కలిగింది .నిజం గా బ్లాగ్ లో రాసే కధల్ని పాత్రలతో సహా గుర్తు పెట్టుకుని ఆస్వాదించే పాఠకులు ఉంటారా ? అంటే ఉంటారని నిరూపించే నిలువెత్తు సాక్ష్యం ఆ మహా
''.అయితే రవిగారు నాదో రిక్వెస్ట్ మీ సుధని నాకు పరిచయం చేస్తారా ?'' బుల్లెట్ లా దుసుకోచ్చినా ఆ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు .తను వప్పుకోదండి ఇప్పటికే మా కధని బహిర్గతం చేసినందుకు నా మీద పికల దాక కోపం మీద వుంది . యిలా గ్లోబులో వున్నా బ్లాగర్లు అందరు వంతు ల వారి గా వచ్చి సుధని చూస్తాం అంటూ వస్తే మే మిద్దరం మ్యుజియం లో ఉండాల్సిందే అన్నా .
తను మొఖం చిన్న బుచ్చుకుంది .సారీ అండి మీ ప్రైవసీ ని భగ్నం చేస్తూ నే దూరడం తప్పే . నే చాలా ఆశతో వచ్హా ఎప్పటికన్నా సుధ గార్ని కలవాలి ఆమెతో మాట్లాడాలి ఇట్స్ వొకే నా బాడ్ లక్ అంటుంటే జాలి వేసి ఉండండి నే సుధ తో మాట్లాడి ఆమె వప్పుకుంటే అపుడు కలుద్దాం అంటూ నా ప్రైవేటు రూం కి పోయి సెల్ లో మాట్లాడి బయటకు వచ్చా .మీరు నిజం గా హృదయం తో చదివారు అందుకే కధ లోని పాత్రలు నడిచి వచ్చేస్తున్నాయి . వొక్క సుదే కాదు , మిత్రుడు వెంకట్ కూడా మీతో మాట్లాడ తనన్నాడు కాన్ఫరెన్స్ కాల్ లో అంటూ నా బ్లాక్ బెర్రీ లో వాళ్ళిద్దరి నంబర్ లు కలిపి తన సెల్ నెంబర్ కూడా కలిపా . యింక అంతే ఆమె థాంక్ యు సుధ గారు థాంక్ యు వెంకట్ గారు , అయినా మీరిద్దరూ రవిగార్ని అలా మోసగించడం తగునా ?స్నేహానికి అర్ధం యిదేనా ? ఈ ప్రశ్నకి యిద్దరు ఖంగు తిన్నారు . సుధ ఏమి మాట్లాడ లేదు వెంకట్ తేరుకుని కొన్ని బలహీన మైన క్షణాల్లో అలా అనుకోకుండా జరిగి పోయింది లక్కీ గారు అదేం పంచ వర్ష ప్రణాళికలో బాగం మాత్రం కాదు అంటూ సద్దాడు .అమ్మ వీడి సమయ స్పూర్తి తగలెయ్య అసాద్యుడు అనుకున్నా మనసులో. . ఈమె నా తరఫున వఖల్త పుచ్చుకునట్టు గా యిద్దర్నీ ఉతికి ఆరేస్తుంటే వెంకట్ వొక్కడే సమాధానం చెపుతున్నాడు సుధ మాత్రం మౌనం గా వింటూ అప్పుడప్పుడు ఉ ఉ అంటూ వుండి పోయింది .అదేంటి సుధా గారు మీరేమి మాట్లాడరే మీకు కొత్త ఫ్రెండ్స్ వస్తే పాత వార్ని పట్టించుకోరట గా అంటుంటే అబ్బే అదేం లేదండి ఆంతా ఆయన అపోహ అంటూ కొట్టి పారేసింది .అయ్యో సుధా గారు మిమ్మల్ని చూడాలని వుండి మీకు అబ్యంతరం లేక పొతే రవిగారు నన్ను లంచ్ కి బయటకు తీసు కేల్తున్నారు మీరు జాయిన్ అవచ్చు గా అంది .నా గొంతు లో పచ్చి వెలక్కాయ పడింది ఆమె ఎమనుకుంటుందో అని .నాకు షాక్ యిస్తూ ఆమె సరే వొకే మనం కే ఎఫ్ సి లో కలుద్దాం మీరిద్దరూ మా యింటికి వచ్చి హార్న్ కొడితే నే కిందకి వచ్చేస్తా అని చెప్పడం తో ఆఫీసు నుంచి నా కార్ లో ఆమె యింటికి బయలు దేరాం .కార్ లో మహా నా పక్కనే కూర్చోడం నన్ను మరింత యిబ్బంది కి గురి చేసింది . నేను ఆమె యింటికి వచ్చే ముందే సెల్ కొట్టడం తో తను ముందే కిందకి వచ్చింది . ఆమెని చూడగానే మహా ముందు సీట్ లోంచి వెనక్కి మార బోతే నేనే వారించా వద్దండి యిప్పుడు వాళ్ళింట్లో వాళ్ళు ఎవరన్న చూస్తే యిబ్బంది అని .
.కే ఎఫ్ సి లో''మహా'' ఆపకుండా మళ్లీ ''రవిగారు నిన్నటి నా నువ్వు కవిత మిమ్మల్ని వుద్దేసించే రాసారు తెలుసా? తను ఊహించి నట్టే అతని తర్వాత వచ్చిన వెంకట్ , రమేష్ లు మీకు క్లోజ్ అయిపోయి తనని శూన్యం లోకి నెట్టేశారు '
'అంటుంటే ''ఏవండి నేనెవర్ని బాధ పెట్టను , ఎవర్ని నా జీవితం లోకి ఆహ్వా నించను , వచ్చినా కాదనను , మన జీవితం లోకి ఎప్పుడెప్పుడు ఎవరెవరు రావాలో వాళ్ళని ఆ దేవుడే పంపిస్తాడు సో వస్తారు వచ్చేటి వాళ్ళు పోతారు పోయేటి వాళ్ళు ఆడించు వాడెవ్వ దైనా ఆడాలి ఈ కీలు బొమ్మా '' సుధ సమాధానం .
''ఈ వాళ నా జీవితం లో మరిచి పోలేని రోజు నే అభిమానించే బ్లాగర్ అయన లవ్వరు యిద్దరి తో లంచ్ , ఆస్ట్రేలియా లో నే కధ చదివి నప్పుడు యిలా మీతో కలిసి నా ఆనందాన్ని పంచు కుంటూ లంచ్ చేస్తానని కలలో కుడా అనుకోలేదు '' మహా సమాధానం .
అలా వొక గంట కబుర్లు అయ్యాక మళ్లీ బయలు దేరడానికి కార్ దగ్గరకి వచ్చాం .నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చో గానే నా పక్క సీట్ లో మీరు తనకి ప్రాణ పదం మీరేకుర్చోవాలని మహా , అలా కుదరదు నేను పాత స్నేహితురాలు మీరు ఫ్రెష్ సో మీరే కూర్చోవాలి అంటూ యిద్దరు వంతులు పడుతుంటే వెనక మేము కదిలితే పార్కింగ్ లో పెట్టుకుందాం అని వేచి వుండే యితర కార్స్ చోదకులు వొకటే హార్న్ .అబ్బ మహా మీరు కూర్చోండి , సుధ గారు మీరు వెనక కూర్చోండి అంటూ కార్ ముందుకు పోనిచా .గేర్లు మారుస్తున్నప్పుడు మహా కాళ్ళకి నా చేతులు తగలడం యాద్రుచ్చికమని నేనను కుంటే వెనక కూర్చున్న సుధ మాత్రం అద్దం లోంచి నా మొఖం చూస్తూ ముసి ముసి గా నవ్వుతోంది . మహా మొహం లో భావాలూ చదివే అవకాశం డ్రైవింగ్ చేస్తూ వుండడం వాళ్ళ నాకు రాలేదు .మహనీ తను దిగ వలసిన బస్సు స్టాప్ దాక తీసుకెళ్ళి దింపాక తన ఆనందం తో నిండిన కళ్ళతో మళ్లీ తను వూరు వెళ్లి వచ్చాక మా యిద్దరి తో పాటు నా స్నేహితుడు వెంకట్ .సుధ కొత్త స్నేహితుడు రమేష్ ని కూడా కలిసి మరింత ఆనందానికి గురి అవుతా '' అంటూ వీడ్కోలు తీసుకుంది .
ఆమె అటు వేళ్ళ గానే కార్ లో ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్ రాధ గారికి ధన్య వాదాలు చెప్పా ,''సుధ ఉరఫ్ రాధ గారు మికెలా ధన్య వాదాలు చెప్పాలో కూడా తెలీడం లేదు , అడిగిన వెంటనే ఎంతో రిస్క్ తీసుకుని సుధ పాత్రలో వొదిగి పోయి నా అభిమానికి ఏ మాత్రం అనుమానం రాకుండా అద్బుతం గా నటించారు .నిజానికి సుధ అని ఎవరు లేరని అవి కధ లోని పాత్రలే అని చెప్పి వుంటే ఆమె నమ్మే స్తితిలో లేరు అది గాక ఆమె ఆ కధలో యెంత లీనం అయి పోయారంటే వెంకట్ పాత్రలో నా స్నేహితుడు సత్యనారాయణ ఫోన్ లో మాట్లాడితే ఆమె యిరువుర్ని చీల్చి చెండాడిన విధానం లోనే అర్ధం చేసుకోవచ్చు నా జీవితాన్నే కధ గా రాసానని యెంత గట్టి గా నమ్ముతోందో .వోకో సారి వాస్తవం కన్నా వుహ గొప్ప అనుభూతి ని మిగిలిస్తునప్పుడు అప్రియమైన సత్యాన్ని చెప్పి అవతలి వాళ్ళ ఆనందానికి అడ్డుకట్ట ఎందుకు వేయాలి .?ఆమె ఆనందానికి మీరు దోహద పడినందుకు మిమ్మల్ని మనస్పూర్తి గా అభినందిస్తున్నా ''అన్నా
భలే వారె రవి గారు నేను కూడాఅప్పు డప్పుడు మీ బ్లాగ్ చదవడం , ముందు గా మీరు మీ ఆఫీసు నుంచి సెల్ లో పరిస్తితి వివరించడం తో నా పని సులువయ్యింది , మీరు తెలివి గా మీ స్నేహితున్ని కూడా కన్ఫెరెంసే లోకి తీసుకోవడం తో కధ బాగా రక్తి కట్టింది . నేను కూడా అనుకోకుండా మీ కధ లో భాగం అయినందుకు ఆనందం గా వుంది , యింక ఉంటానండి , బాబు స్కూల్ నుంచి వచ్చే వేళయ్యింది అంటూ తన అపార్ట్మెంట్ దగ్గర దిగి పోయింది .
అక్కడితో కధ అయిపోయిన్దనుకున్నా ఆ క్షణం కాని మరిన్ని మలుపులు తిరుగు తుందని అప్పుడు తేలి లేదు .
(అంటే యిన్నాళ్ళు రాసింది కదేనా ? అలా అని యిప్పుడు కధలు చెపుతున్నావా ?అని అనుమానించే వాళ్ళ కి ఏం చెప్పగలం ?జీవితం లోంచి కధలు పుట్టినా కధే జీవితం కాదని తప్ప .)