2 మార్చి, 2012

కలిసి పోదాం

  

    ఏంటి మీ సుధ గురించి ఈ మద్య ఏమి రాయటం లేదని బ్లాగ్ అభిమానులు చాల మంది మెయిల్స్ లో ఫోన్ ద్వారా అడుగు తుంటే చాల ఆనందం వేసింది .వొక పాత్ర కి యింత మంది అభిమానులా అని ?అయితే రామాయణం పొడిగిస్తే విషాదం అయినట్టే సుధ కధ పొడిగిస్తే కూడా అలాగే అనిపిస్తోంది . అయితే విషాదం ఎవరికి ?తనకి పూర్తీ స్వేచ్ఛనిచ్చి ప్రమాదపు అంచుల;పైకి నెట్టిన భర్తకా ? రెండేళ్ళ నుంచి అభిమానం తో పాటు అనుమానం పెంచుకుని గోడ మీద పిల్లి లాగ వుంటూ ఎటు దూకాలో తేలిక సందిగ్దావస్తలో వున్నకదా నాయకుడి కా   ?నిన్న గాక మొన్న వచ్చి అన్ని ముగించుకుని గుంభనం గా వాళ్ళ వూరు వెళ్లి పోయి సెల్ లో సొల్లు కబుర్లు చెబుతూ నిరంతరం ఆమె చెవిలో జోరీగ లాగ తయారయిన రమేష్ కా ?కలిసి భోజనానికి వెళదామని తను వొక్కడే వాళ్ళింటికి వెళ్లి భోజనం తో పాటు షడ్ర  సోపేతమైన రుచులన్నీ ఆరగించి ఆమె చేతులు కలకద్దుకుని భావోద్వ్గానికి గురైన మిత్రుడు వెంకట్ కా ? ఏమో కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి .ఆలోచిస్తూ కధ రాస్తున్న నాకు సెల్ మోగడం తో ఆలోచనా భంగం అయి హలో అన్నా
నేను సుధ కజిన్ .హరిణి ని  ఏంటి బావున్నారా ?యింకా  సెల్ లో సొల్లు కబుర్లేనా ? మున్డుకేమన్న వెళ్ళరా ?అంటోంది .
ఎవరి తో ? నీతోనా ? అన్నా కావాలనే
అబ్బో నాతొ అయితే అంత టైం పట్టదు లెండి .సుధ గురించి మాట్లాడు తున్నా ?
సుధ సంగతి మనకెందుకు గాని మన సంగతి చెప్పు ఎప్పుడు ముందు కేల్డం ?
అబ్బో మంచి జోరు మీద ఉన్నారే ?అక్క తో  అయ్యాక చెప్పండి అప్పుడు చూద్దాం అంతవరకూ మీరు శుద్ద వేస్ట్ , ఎవరన్న రెండేళ్ళు యింత ఇంటిమేట్ గా పరిచయం పెట్టుకుని  మడి కట్టుకుని కూర్చుంటే ఏమను కోవాలి ?
మీ అక్కకి  ఎయిడ్స్  అనుకోవాలి అన్నా కోపం గా అంతే తను ఫోన్ పెట్టేసింది.
మౌనం గా కూర్చుని ఆలోచిస్తే నా కే అనిపించింది ,తనతో యింత కాలం ఆ తప్పు చెయ్య కుండా వుండ డానికి ముఖ్య  కారణం నాలో ఆమె మీద పెంచుకున్న ప్రేమా?లేక అమెకేమన్న వుంటే నా కంటూ కుంటాయన్న భయమా ?లేక పట్టు బడి బయట పడితే పరువు పోతుందనా ?అడ్డమైన వెధవలు వచ్చి ఆరగించిన ఎంగిలి విందు నా కేందుకనా ?సుధ నే అడిగితె పోలే అనుకుంటూ తన నెంబర్ కి ఫోన్ చేశా .యధా విధి గా బిజీ టోన్,విసుగొచ్చింది నేనిక్కడ తన గురించే ఆలోచిస్తూ బాధ పడుతుంటే  ఆమె హాయ్ గా కొత్త ప్రియుడి తో యిక యికలు పక పకలు.నాకు లేని ప్రశాంత త తనకెందుకు అనుకుంటూ   అలా  ఆపకుండా కొడుతూనే పోయా..వొకప్పుడు నా రింగు కోసమే ఆమె సెల్లు అనట్టు వుండేది,  అలా వొక వంద మిస్సేడ్ కాల్స్ అయ్యాక రింగ్ అయ్యింది .ఫోన్ ఎత్తడం తోటే'' నీ కస్సలు   వోపిక లేదా ?అన్ని మిస్సేడ్ కాల్స్ చేస్తే చెవి లో వొకటే రోద .ఏంటి చెప్పు ''
ఎవరితో యింత సేపు ? నా  రెగ్యులర్ ప్రశ్న
.ఈ ప్రశ్న నువ్వు అడగడం మానేసి నప్పుడే  మళ్లీ మనమధ్య  సయోధ్య .
 గంట పైగా నీసమయాన్ని  వెచ్చించే అంత గొప్ప వ్యక్తీ ఎవరో తెలుసు కుందామని
మా ఆయనకి లేని ఆత్రం నీకెందుకు గాని యింకేంటి ?
ఎవరో చెప్పలేదు ?
నాకు తెలిదు
వోహో యి మద్య తెలీని వాళ్ళు చేసినా  గంటల కొద్ది ఆస్కు వేసుకోవడమే గాని వాళ్ళెవరో తెలిదన్న మాట ?
నాకు తెలిదు .
పోనీ వాడు యింత సేపు ఏమి మాట్లాడాడు ?
నాకు తెలిదు
నాలో ఆవేశం కట్టలు తెంచు కుంటోంది ఈ మద్య సుధ కని పెట్టిన కొత్త  పద్దతి యిది . తనకి ఏదన్నా ముక్య మైన కాల్ మద్య లో నే చేస్తే నాకు తెలిదు అంటూ విసిగించి మనం కోపం తో కట్ చెయ్య గానే  మల్లి యధా విధి గా వాళ్లతో సంభాషణ కోన సాగించడం . అయితే హనుమంతుడి ముందు కుప్పి గెంతులు పని కి రావు కాబట్టి నేను ఏ మాత్రం అసహనానికి గురి కాకుండా యింకేంటి అంటూ సంభాషణ కోన సాగించ దానికి ప్రయత్నిస్తున గాని'' యింకేం లెవ్ , వొరేయ్ నాని నీకు  అన్నం లోకి ఏం వందమన్నావ్ ?అంటూ అక్కడ లేని వాళ్లతో కూడా సంభాసిస్తున్నట్టు నటన  నేను ఫోన్ పెట్టేసి రెండు నిమిషాల్లో మళ్లీ చెయ్య గానే యధా విధి గా ఎంగేజ్ , అప్పుడు యి నాని గాడు మళ్లీ స్కూల్ కి వెళ్లి పోతాడన్న మాట .ఎప్పటికి కొత్త వొక వింత పాత వొక రోత .కొత్త వాళ్ళు ఆమె జీవితం లోకి ప్రవేశిస్తున్న కొద్ది మా మద్య మాట్లాడుకునే సమయం తగ్గి పోతోంది .వొకప్పుడు రోజుకు కనీసం మూడు గంటలకి తక్కువ కాకుండా మాట్లాడుకునే మా మద్య యిప్పుడు గట్టిగా పది నిమిషాలు కూడా వుండటం లేదు .యింతలో నా సెల్ లో సంక్చిప్త సందేశం వస్తే ఓపెన్ చేశా .
''దరి చేరని తీరాలని  వదిలి దరినే వున్న చెలి తో సుడిగుండం లో మునగడమే సుఖం ''
''అయితే మునుగు'' అని సమాధానం కొట్టా
మరి ఎందుకు ఆలస్యం రండి ఈ చెలి మీకోసం మున్గడానికి సిద్దం అటునుంచి స్పందన .
యిది ఎవరో నన్ను ముంచడానికి వేస్తున్న యెత్తు గడ గా భావించి నేను మళ్లీ స్పందించ కుండా ఊరుకున్నా .
రెండు రోజుల తర్వాత అదే నెంబర్ నుంచి మళ్లీ  మెసేజ్  సార్ నేను మీ డివిజన్ లో ఫలానా చోట మీ అండర్ లోనే పని చెస్తున్నా, నా పేరు లక్ష్మి . యిలా అప్పుడప్పుడు  మంచి మంచి సందేశాలు వునప్పుడు  మీకు పంపితే అబ్యాన్తరమా ?
కచ్చితం గా అబ్యాన్తరమే సంక్షిప్త సమాచారం కంటే సమగ్ర సంభాషణ అంటేనే నాకిష్టం అని స్పందించి ఊరుకున్నా
డ్యూటీ లో వునప్పుడు , యింట్లో మా వారు వునప్పుడు అది సాద్యం కాదు గదా సార్  ఆమె సమాధానం .
అంటే ఈ రెండు కానప్పుడు మాట్లాడ తా అనే గా దానర్దం .ఏంటో వొక ద్వారము మూసు కొనిన  వేరే ద్వారం తెరుచుకొనును .ఆమె ఆప్పటి నుంచి రోజు కి కనీసం మూడు నాలుగు సందేహాస్పద సందేశాలు పంపుతూనే వుంది . నేను కూడా కొన్నిటికి మాత్రం స్పందించి మరి రెచ్చి పోకుండా సంయమనం పాటిస్తున్నా .యిలా వొక వారం రోజులు గడిచిన తర్వాత రాత్రి పదకొండు గంటలకి నిద్ర పోతున్నారా ?అంటూ కొత్త స్నేహితురాలి నుంచి సందేశం .
అదేంటి ఈ టైం లో అనుకుంటూ'' వద్దంటారా ?'' అని కొట్టా . అది కాదు మా హబ్బి పడుకున్నారు మీతో కొంచెం సేపు చాట దామని అని మొదలెటింది రాత్రి పన్నెండు ముప్పై దాక సందేశాలు మార్చుకున్నాక జి యెన్ అండ్ ఎస్ డి దాక పాకాయి . నాకో సందేహం కలిగింది అసలు ఈ లక్ష్మి అన్న క్యారెక్టర్ ఉందా ?లేక సుధ తన నుంచి డైవర్ట్ చెయ్యడానికి తన స్నేహితురాలిని ఈ పాత్రలో ప్రవేశ పెట్టిందా ?అంతే పొద్దునే ఆమె డ్యూటీ టైం ఏంటో కనుక్కుని అదే యూనిట్  కి ఇన్స్పెక్షన్ మిష తో వెళ్ళా .అక్కడ స్టాఫ్ లో అందరు పరిచయం చేసుకుంటుంటే తెల్ల గా సన్నగా చూడ గానే పరవాలేదని పించే వొక యిరవై ఎనిమిది ఏళ్ళ అమ్మాయి కళ్ళ తోనే నవ్వుతూ నా పేరు లక్ష్మి సార్  ఫలానా పని చూస్తాను అంది . దాని మీదే బోల్డు ప్రశ్నలు సందిస్తుంటే వాళ్ళ సూపర్ వయిజార్ సమాధానాలు చెప్ప  బోతే నే వారించా ఆమె ని చేప్ప నిండి  సిస్టమ్స్ వాడేది వాళ్లే కదా యెంత లోతూ గా తెలుసో తెలుసు కుంటా అంటూ ఆమె ని ప్రోత్స హించా .మద్య మద్య లో ఆమె మున్గుర్లు సవరించుకుంటూ చేతులు ఊపుతూ తనకి తెలిసిందంతా నాకు చెపుతూ వుంటే నేను కుర్చీ లో కుర్చుని ఆమె కి తెలీకుండా యింక ఆపెహే అని ఎస్ ఏం ఎస్ పంపా . అంత సేపు గంగా ప్రవాహం లా మాట్లాడుతున్న ఆమె కుయి కుయి మని శబ్దం రాగానే తన సెల్ చూసుకుని కష్టం మీద నవ్వాపుకుని అంతే సార్ అని ఆపేసింది . నేను ఇన్స్పెక్షన్ ముగిస్తూ యు శుడ్ రైజ్  తు మై ఎక్ష్పెక్ టేషన్  అంటూ ఆమె కేసి చూసా సరే సర్ అంటూ అంతా తలూపారు .కార్ లో వెళుతూనే ఆమె కి రింగ్ చేశా .
ఫోన్ లో సార్ సార్ అంటూ మాట్లాడకు పక్క వాళ్ళకి తెలుస్తుంది  ఐ అం ఇమ్ప్రేస్సేడ్ అన్నా . దేనికి ? నా వర్కింగ్ నాలెడ్జ్ చూసా అంది .అవును దానికే అన్నా కావాలని . నాకు తెలుసు ఆమె ఏమి ఆసిస్తోందో . దానికి మాత్రమె నా మళ్లీ ఆమె రెట్టించి అడుగు తోంది .అంతకు మించి చూడటానికి అక్కడ  ఏమి అవకాశం వుంది కనక అన్నా నవ్వుని ఆపుకుంటూ . ఆమె మౌనం గా వుండి పోయింది .అబ్బ దేని దేనికి యెంత ఇంప్రెస్స్ అయ్యానో తర్వాత వివరం గా చెపు తా గాని నీకు సుధ అనే    చుట్టం గాని స్నేహితు రాలు గానీ వున్నారా ? అనుకోకుండా వచ్చిన ఆ ప్రశ్నకి ఆమె ఆలోచించి ఎవరు లేరే అంటుంది అనుకుంటే అవును ఉంది మా కజిన్ తనకి ఈ మద్యనే వంట్లో బావుండడం లేదని కూడా చెప్పింది దేనికి ?
ఆమె ఎలా వుంటుంది ?నా గొంతు లో తడి ఆరి పోయింది అప్పటికే
ఆమె నల్ల గా వున్నా కత్తి లా వుంటుంది ఎవరన్న వొక సారి చూస్తె రెండో సారి తల తిప్పి చూడ వలసిందే అయినా ఆమె గురించి మీరెందుకు అడుగు తున్నారు ?
నీకు నా నెంబర్ ఎవరిచ్చారు ?
వుర్కొన్ డి బాస్అఫీషియల్  సెల్ నెంబర్ కుడా తెలీకుండానే వుద్యోగం చేస్తున్నామా ?ఆమె లో గొంతుకు తో అంటోంది . నిజమే అదేమంత కష్టం బయట వాళ్ళు కూడా గూగుల్ చేస్తే దొరికే నెంబర్ అది .
రెగ్యులర్ గా టచ్ లో వుంటావా ఆమె తో ?
అస్సలు ఉండను ఎప్పుడన్నా ఫంక్షన్స్ లో కలుసు కోవడమే , అయినా ఆమె మీకు తెలుసా ?
నడక లో పరిచయం గడప దాకా వెళ్లి పడక  దగ్గర పడక  ఆగి పోయింది
ఛి ఛి మా అక్క అలాంటిది కాదు మీరే ఏదేదో వుహించుకున్తున్నారు . మీ మగాళ్ళంతా యింతే కొంచెం చనువు యిస్తే పడక అంటూ గడప దాటు తారు .నేనో విషయం మీకు ముందే క్లారిఫ్య్ చేద్దామనుకుంటున్నా మీకేమన్నా ఆలాంటి ఆలోచనలు వుంటే  మనం ఇక్కడితో ఆపేద్దాం . వొక మంచి స్నేహితుడి గా వుంటానంటే కలిసి ముందుకు పోదాం తను ప్రవాహం లా చెప్పుకు పోతుంటే నా అహం దెబ్బతింది .
కొంచెం నోరు ముస్తావా ?తప్పు చేసే పరిస్తితులు వున్నా ఆ తప్పు చెయ్య కుండా బయటకు వచ్చే టప్పుడు కలిగే ఆనందం, బలహీన మైన క్షణం లో కలిగే క్షనికా నందం  కన్నా ఎన్నో రెట్లు మిన్న  అని నమ్మే వ్యక్తులో మొదటి వాణ్ణి నేను . అలాంటిది నన్నే హెచ్చరించే స్తితిలో నువ్వున్నవా ?అసలు ముందు ఎస్ ఏం ఎస్ పంపింది నువ్వా ? నేనా?అయినా మనిద్దరం స్నేహితుల్లా కాక ప్రేమికుల్లా ఎలా ఉండగలం ? మీ యింటికి నేను రాగాలనా ? మా యింటికి నువ్వు వస్తావా ? బయట ఎక్కడన్నా కలవ గలమా ? ఎవరన్నా చూస్తె ఆఫీసు గోడల మీద వాల్ పోస్టర్ పెట్టారా ? సో ఐ అం వేరి క్లియర్ కుదిరితే వొక ఎస్ ఏం ఎస్ వీలయితే రెండు కాల్స్ అంతకు మించి ఆశించడం అవివేకం .
సారీ మా అక్క ని అలా అన్నారని కోపం లో ఏదో వాగా క్షమించండి ఇప్పటికే యిక్కడ ఆంతా ఎవరి తో మాట్లాడు తుందా అని ఆసక్తి గా చూస్తునారు నే ఉండనా ?
సరే గుడ్ లుక్ అంటూ పెట్టేసా ?
నేనే అనవసరం గా ఎక్కువ వుహిస్తున్ననా ?ఈమె నా జీవితం లోకి రావడం యాదృచ్చిక మేనా ?లేక మళ్లీ బకరా అవుతున్న నా ?మర్నాడు పొద్దున్నే సుధ కి కాల్ చేశా ,ఏంట్రా బంగారం ఏంటి సంగతి తన పలక రింపు . ఆమె లో గొప్ప  దనం అదే అంతకు ముందు రోజు గొడవలు పడి బూతులు తిట్టుకున్నా తర్వాత రోజు మొదటి సారి చేసినప్పుడు యిదే ప్రేమతో పలక రిస్తుంది , నేను కూడా అంతే ప్రేమతో స్పందిస్తా  అంతే ఆ తర్వాత రోజులో చాలా సార్లు  బిజీటోన్  రావడం తోటే నా టోన్ మారి పోయి గొడవలతో ముగుస్తుంది .మీ కజిన్ లక్ష్మి నిన్న ఫోన్ చేసింది అన్నా . లక్ష్మి అని నాకు కజిన్స్ ఎవరు లేరే ? మిమ్మల్ని ఎవరో ఆట పట్టిస్తున్నరేమో చూసుకోండి అంది .అప్పుడు వెలిగింది నాకు యిద్దరి కులాలు వేరని .వెంటనే లక్ష్మి కి ఫోనే చేసి అదే విషయం కోపం గా అడిగా .మహాను భావా నాది ప్రేమ వివాహం అందుకే ఇంటర్ కాస్ట్ మేరజే , సుధ  ఆయనకీ మరదలు వరస యింక చాల మీ అనుమానాలు , మా అయన బాత్ రూం నుంచి వస్తున్నారు నే పెట్టేస్తా అంటూ పెట్టేసింది . నాకు ఎక్కడో లింక్ దొరకటం లేదు , మనసు గజి బిజీ గా తయారయ్యింది .వీల్లిద్దరి లో ఎవరు అబద్దం ఆడు తున్నారు ?తెలుసుకునే దాక నిద్ర పోకూడదు .ఆఫీసు కి వెళుతూనే లక్ష్మి ని తన యూనిట్ నుంచి  ఆఫీసు కి బుక్ చేశా అరగంట లో నా రూం లో వుంది . ప్యూన్ కి చెప్పి అరగంట దాక ఎవర్ని లోపాలకి పంపొద్దని అర్జెంటు ఫైల్ మీద తనతో డిస్కస్స్ చెయ్యాలని  చెప్పి తనతో మాట్లాడడం మొదలు పెట్టా . తను నాకు సెల్ లో నేను పంపినఎస్ ఏం ఎస్ లు అన్ని డిలీట్ చేసానని చూపిస్తుంటే నేను సెల్ తీసుకుని చూస్తున్నా యింతలో తన సెల్ మోగింది పేరు చూడగానే వెయ్యి వోల్త్స్ కరెంటు పాకి నట్టయింది .రమేష్ కాలింగ్ అని వస్తోంది కొంప తీసి ఇతను సుధ కొత్త స్నేహితుడు రమేష్ కాదు కదా అనుకుంటూ  సెల్ నా చేతిలో వుండడం తో కాల్ తీసుకుని స్పీకర్  ఆన్ చేశా , ఆమె మొఖం లో కత్తి వేటుకు నెత్తురు చుక్క లేదు  మాట్లాడమని సైగ చేస్తే గతి లేక కష్టం మీద గొంతు పెగుల్చుకుని హలో అంది ,
 ఏంటి లక్ష్మి యెంత వరకు వచ్చింది నీ ప్రయత్నం ?మనోడు పడ్డాడా లేదా యింకా ?నాకు తెలుసు లే ఈపాటికి పడే ఉంటాడు  తొందర గా పని ముగించు యిదిగో అవతల పక్క  కాన్ఫరెన్సు లో సుధ వుంది మాట్లాడు  అంటున్నాడు . అప్పటికే నా మెదడు మొద్దు బారి పోయింది .  అమ్మాయి లక్ష్మి అసలే ఆయన చాల సెన్సిటివ్ ఎక్కువ ఎమోషనల్ లోకి లాగకు  నన్ను ఫోన్ లో వొకటే నస పెడుతున్నాడని ఈ ప్లాన్ కి వప్పుకున్నా గాని నాకు రమేష్ కంటే తను అంటేనే ఎక్కువ యిది , ఎక్కువ అలోచించి తన ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటాడో అని ముగ్గురం కలిసి పోదాం అంటే సరే అన్నా గాని మనతో కలిసి ఆతను కూడా పోవడం నాకిష్టం లేదు .ఈలోపే లక్ష్మి నా చేతిలోంచి సెల్ తీసుకుని కాల్ కట్ చేసి రూం నుంచి వెళ్లి పోయింది . నా మనసు అచేతనా వస్త కి వెళ్లి పోయింది . ఏవిటి వీళ్ళ ప్లాన్ ?కలిసి పోవడమా? కలిస్తే పోవడమా ?ముగ్గురు కలిసి ఎక్కడకి పోతారు ?యిదేమన్నా అనా రోగపు సమస్యా ? లేక అనారోగపు ఆలోచనా ?నే నింతకీ  పోతానా ? పోనా ? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే  కద  మరింత ముందుకి వెళ్ళే దాక వేచి ఉండక తప్పదు .(యింత చదివాక కూడా యిది నిఝామ్గా కధేనా అంటే వారి తెలివి తేటల్ని భావి తరాల వారు కధలు కధలు గా చెప్పుకున్తరన్న మాట )

4 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

సుధలో కధానాయకుడికి నచ్చినదేంటి?
సుధ ఆడే "మైండ్ గేంస్" కి ఎందుకు బలి అవుతున్నాడు?

Unknown చెప్పారు...

సుధా లో నచ్చిన దేన్టి ?
కదా నాయకుడి పరం గా ?
ఆమె లోని చురుకు దనం ,
ఏది దాచుకోనో నిర్మల మైన మనసు
తప్పు చేసి కూడా దాచుకోకుండా
తప్పు జరిగింది నేను వద్దనుకుంటే కూడా
అని నిర్భయంగా చెప్పి , పోనీ
యింకో సారి జరగదని హామీ యివ్వగలవా అంటే
అది నా వొక్కరి చేతుల్లో ఏమి ఉంటుందని ?
అంటూ మరో తప్పుకు మానసికం గా సిద్ద పడి పోయే
అమాయకపు నేర జాణతనం .
తప్పు చేసి తప్పు జరిగి పోయిన్దన్నకా
తప్పకుండా నచ్చి తీరాలి కదా .

జలతారు వెన్నెల చెప్పారు...

lol@అమాయకపు నెరజాణ...

జలతారు వెన్నెల చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.