10 మార్చి, 2012

ఎన్నాళ్ళిలా ?

 

 
 
నీ సావాసం మొదలయ్యి రెండేళ్ళు
నా లో సహనానికి ఆర్నెల్లు
మొదట్లో అంతా నేనే అనుకున్నా
మత్తు వదిలాక చూస్తే అందరి మద్య లో వున్నా .
అందరి లో నేను వోకన్నని తెలుసు కున్నా
స్నేహితుడి నుంచి ప్రేమికుడి గా మారి
నీ కొత్త ప్రియులకి స్వాగతంపలికి
నేను ప్రేమ పిచ్చోడిలా మారి
అప్పుడే రెండు వసంతాలు గడిచి పోయాయా ?
నీ జీవితం లోకి కొత్త గా ప్రవేశించిన వారికే వసంతం
మిగతా వారికి అశాంతే ఆసాంతం 
ఆనందం మాత్రం నీ సొంతం
అదేం అని అడిగితె నీకు వస్తుంది పంతం 
కామం లేకుండా ప్రేమించే ప్రేమికున్ని నే నైతే 
ప్రేమ పేరు తో దగరయ్యి కామం తీర్చుకునే 
నీ కొత్త సరి కొత్త స్నేహితులకి  చరమాంకం 
పలికే రోజు కోసం నేనేన్నాళ్ళు ఎదురు చూడాలి ?
ప్రేమకి అతిదగ్గరి భావ ప్రకటన కామంఅన్న 
నీ అభిప్రాయం మారి పోయి ,దూరం గా వున్నా 
పున్నమి నాటి చంద్రుడు యిచ్చే ఆనందం ,
భోగి మంటల్లో వెచ్చ దనం  దరి నుంచే ఆస్వాదించవచ్చని 
మంటల్లో కాలి బూడిద అవ్వ వలసిన అవసరం లేదని త్వరలో 
నువ్వు తెలుసుకుని పుష్య  మాసాన  మంచు బిందువులా 
పూల  గంధాన గాలి లా పరిమళాలు వెదజల్లుతూ 
ఆనందాలు వేద జల్లే రోజు కోసం మరిన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ 
నన్ను మొత్తం గా మాయ చేసేసిన నిన్ను అభినందిస్తూ 
నీ  నిరంతర ప్రేమ పిపాసి ..

4 వ్యాఖ్యలు:

jalathaaruvennela చెప్పారు...

baagundi ravigaaru.

వనజవనమాలి చెప్పారు...

మీ ప్రేమ పిపాసి కల నెరవేరడం..మీ చేతిలో పనే కదండీ!.. మధ్య మధ్యలో..మాటల్లో, కథలో చెప్పలేక ఇలా చెపుతున్నారన్నమాట. చాలా బాగుంది రవి గారు ..కవిగారు.

అజ్ఞాత చెప్పారు...

రవిగారు,
మీ తర్వాతి పోస్ట్ పేరు 'ఎంతమందితో?'
కరెక్టేనా?

రవిగారు చెప్పారు...

జలతారు వెన్నెల కురిపించి నందుకు ధన్య వాదాలు .
వనమాలి గారు మన పని మనం చేస్తుంటే
తన పని తానూ చేసుకుంటూ పోతుంటారు .
అజ్ఞాత గారు మీరు తన పాత స్నేహితుడు
వెంకట్ అని అర్ధం అయ్యింది లెండి .