రెండేళ్ళ క్రితం వరకు అతనికి ఆమె ఏమీ కాదు .ఈ రెండేళ్ళు మాత్రం అతనికి అన్ని ఆమె .ఆమె కి మాత్రం తన జీవితం లో .అతను కూడా వొకడు .ఆమె ఏదో వొక రోజు తనని వదిలి వెళ్లి పోతుందని తెలుసు గాని అది యింత త్వర గా వచ్చేస్తుందని అతను ఉహించ లేదు .
నడకలో అనుకోకుండా వొక వర్షం కురిసిన పొద్దున్న చిన్న షెల్టర్ కింద మొదలైన వారి పరిచయం , రెండేళ్ళ తర్వాత అనుకోకుండా వొక వర్షం కురిసిన రాత్రి
మాటల పెను తుఫాన్ లో చిక్కి చిలికి చిలి గాలి వాన లా మారి ప్రళయం లా ముగిసి పోతుందని కల లో కూడా అనుకోలేదు .ఆమె వొక స్వేచ్చా జీవి.ప్రతి నిమిషం ఆనందం గ్రోలాలని , తన ప్రేమామృతాన్ని వీలయినంత మందికి పంచాలని ,అడిగిన వాడికి ఆనందం యివ్వక పోవడమే పాపమని ,పరిధులు దాటి విహంగం లా విహరించడమే జీవిత పరమావధి అని ప్రఘాడం గా విశ్వసించే గృహిణి.భార్యని అదుపులో పెట్టడం అంటే ఆమె స్వేచ్చకి భంగం కల్గించడమే అని ,తప్పొప్పులు అన్నవి ఎవరికి వారు నిర్దేసిన్చుకున్నవే తప్ప నిజానికి లోకం లో తప్పొప్పులు రిలటివ్
అని భార్యకి పూర్తీ స్వేచ్చానిచ్చేసిన ఆమె భర్త ,
యిది అతనికి , ఆమెపరిచయం తర్వాత అర్ధమైన వాళ్ళ కుటుంబ వ్యవహారం .ఆమె వ్రిసున్ఖలత్వాన్ని ప్రశ్నించ కుండా ఆమె పంచె ప్రేమ లో తన వాటా తీసేసుకుని టాటా చెప్పేసి మళ్ళి మూడ్ వచ్చినప్పుడు వస్తే వొకే అంతే గాని ఆ ప్రేమకి బానిస అయిపోయి అందులో మునిగి పోయి పోస్సేసివేనేస్స్వల్ల ఆమె కదలికల్ని ప్రశ్నించడం మొదలు పెడితే ప్రళయమే .
ఆమెని వొక నది లా భావించి సరి గంగ స్నానాలు చేసి ఆనందం గ్రోలాలని అతను భావిస్తే , అప్పటికే అక్కడ వల వేసి చేపలు పట్టుకునే వాళ్ళు , నది వడ్డున లఘు శంక , మూలా శంక లు తీర్చుకుని కడుక్కోవడానికి వచ్చే వాళ్ళు ,రక రకాల మనుషులు ఆ నదిని అపవిత్రం చేస్తూ కని పించారు .అదేంటని ఆమెని ప్రశ్నిస్తే నది అందరిది నీ పని నువ్వు చూసుకుని పో ,కట్టుకున్నవాడికి లేని బాధ నీ కెందుకు ?ఆమె సమాధానం .
అయినప్పటికీ ఆమె మీద వున్న అవాజ్యమైన ప్రేమతో ఏదో వొక రోజు తను మారుతుందని ,నది ప్రక్షాళన అవుతుందని చకోర పక్షిలా యిన్నాళ్ళు ఎదురు చూస్తే, అందులో మునిగిన వాడు మురికి అవడమే తప్ప తను మారదని మరో సారి నిరూపించింది .ఆ రోజు ఎప్పటి లాగే అతను ఆమె యింటికి వెళితే గత నేళ్ళలుగా వాళ్ళింట్లోనే తిష్ట వేసిన చుట్టం (ఏం పని మీదో అతనికే తెలిదుట ) బారెడు పోదేక్కినా యింకా నిద్ర పోతూనే వున్నాడు . ఆమె యింట్లో పనులు చేసుకుంటూ తలుపు తీసింది .
ఎవరన్నకొత్త వ్యక్తులు యింట్లో వుంటే ఆమె మాటల్లో తేడా స్పష్టం గా కని పిస్తుంది .ఎప్పుడు పోతాడా అనట్టు ముభావం గా మాట్లాడుతుంది . ఎంటండి విషయాలు అంటె ఏమి లెవ్, మీ చుట్టం ఎప్పుడు వెళ్తున్నాడు అంటె తెలిదు అంటూ కట్టే కొట్టే తెచ్చే టైపు లో సమాధానాలు వస్తుంటాయి .
దాంతో అతను అసహనానికి గురయ్యి నేను ఎప్పుడు పోతాన అనట్టు మాట్లడతారేం ? ఏమన్నా రాచ కార్యాలు ఉన్నాయా నే వెళ్ళాకా ?కొంచెం వ్యంగం గానే అన్నాడు .
ఆమె లో కూడా యిది వరకటి సహనం నశించి పోయింది , అవును వున్నాయి నువ్వు పొతే పని మొదలెట్టుకుంటాం గట్టి గానే అరిచింది .
అలా అడ్డమైన వాళ్ళా తో పనులు మొదలెడితే తెలుగులో లం తో మొదలయ్యి జ తో అంతం అయ్యే పదం అంటారు అతని సమాధానం .
అంతే ఆమె భద్రకాళి లా మారి పోయి అవునురా నువనుకున్తునట్టు నేను అదే నా యిష్టం , నువ్వేవడురా నన్ను అడగ డానికి ?లం అని తెలిసింది గా యింక వదిలెయ్యి .
రెండేళ్ళ క్రితం తెలిసి వుంటే వెంటనీ వదిలేసి వుండే వాణ్ణి . యిప్పుడు చాలా దూరం వచ్చేసి లతలాగా అల్లుకు పోయాక వదిలెయ్యి అంటె, పాదు పందిరి వొకే సారి పోవాలి .
ఈ రెండేళ్లలో నీ దగ్గర నేను ఏమి తీసుకున్నానని లం అంటావురా ?అయినా యిప్పుడు అన్నావు కాబట్టి చెపుతున్నా నేను వచ్చే వారం , నీ కళ్ళాముందే మా యింట్లో సరసాలాడిన రమేష్ వాళ్ళ ఊరుకి పోతున్నా అక్కడ పది రోజులు వాడి తో ఎంజాయ్ చేసి వస్తా ఏం పిక్కున్టవో పిక్కో .
అంత బరి తెగించిన లం ని ఏ మగాడు మాత్రం యేమన గలుగు తాడు కత్తి తీసి పొడి చెయ్యడం తప్ప అతని సమాధానం అయ్యే లోపే ఆమె చేతిలోని గరిటె తో అతని వీపు మీద గట్టి గా రెండు దెబ్బలు వేసింది .అతను సంయమనం పాటించి వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసాడు .వొక గంట కష్టం మీద గడిచిందో లేదో అతనికి ఆమె మీద కోపం పోయి ప్రేమ పెల్లుబికి సెల్ కి చేస్తే ముందు తియ్యలేదు మళ్ళి చేస్తే చుట్టం సెల్ ఎత్తి ఆమె బాత్రూం లో వుందని సమాధానం చెపుతున్నాడు .అతను శబ్దబేది లో నిష్ణాతుడు కాబట్టి చుట్టం తో సంభాషణ పొడిగిస్తూ నా కాగితాలు అక్కడ మర్చి పోయా కొంచెం చూస్తారా అంటె అతను వెదుకుతూ ఆమెని పిల్చి కయతాలంట
అంటున్నాడు దానికామె ఏం కాయతాలు అంటూ చుట్టాన్ని అడుగుతోంది అంటె ఆమె బాత్రూం లో లేదన్నది రుధి అయ్యింది .ఆమెకి ఫోన్ వొక సారి యివ్వండి బాత్రూం లోంచి వచ్చింది కదా అంటె గతి లేని పరిస్తితులలో ఆమె కి ఫోన్ యిచ్చాడు చుట్టం .
ఏంటి అని ఆమె అనేలోపే అతను ఏంటి బాత్రూం నుంచి తుండు గుడ్డతో బయటకు వచ్చేసారా ? చుట్టం వున్న గాని ? యిప్పుడే బాత్రూం అన్నాడు అంతలోనే చెంగున వచ్చేసారు ?అతను మాట్లడదమనుకున్నది వొకటి ఆవేశం లో మాట్లాడుతున్నది వొకటి . భంధం తెగి పో గుడదని ఆఖరి ప్రయత్నం గా మాట్లడదామనుకుంటే అక్కడి పరిస్తితులు అతన్ని మళ్ళి ఆవేశానికి పూరి గోలి పేలా వున్నాయి . తనేదో బాధలో మౌనం గా ఉంటుందనుకుంటే తన సెల్ మళ్ళి బిజీ నే , రమేష్ సెల్ కూడా బిజీ నే .ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎర్రి పీనుగ ఎవరంటే అతనే .
ఆమె ఫోన్ లోనే ఆవేశం గా ఊరే లం కొడకా నా జోలికి వచ్చి సతాయిన్చావంటే నీ ఆఫీసు కి వచ్చి రచ్చ రచ్చ చేస్తా , మీ యింటికొచ్చి మీ ఫ్యామిలీ తో మొత్తం చెప్పేస్తా (ఏ మొత్తం ? అసలు వాళ్ళిద్దరి మద్య ఏం జరిగిందని? )అయినా లం ల తో నీకు పనేన్దిరా ?నన్ను లం అన్నవాడు ఆరు నెలలలో పైకి పోతాడు అంటూ ఆవేశం గా ఆంటోంది.
మరి లం ఎన్ని నెలలలో పోతుంది ? అతను కౌంటర్ వేసాడు .ఆమె సెల్ కట్ చేసింది . అతని మనసు కాకా వికలం అయ్యింది .
వొక భంధం ముగిసి పోయింది . యినుము విరిగితే నిప్పుతో అతికించొచ్చు మనసు నిప్పుల కొలిమి అయి విరిగి పొతే అంటించడం ఎవరి తరం . మళ్ళి వాళ్ళిద్దరూ ఎప్పటికి మాట్లాడుకోలేక పోవచ్చు .వొక వేళ మాట్లాడుకొన్నా ఇదివరకటి ప్రేమ భావం పొంగదు . ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లి వాళ్ళింట్లో వేడి వేడి పొగలు గక్కుతున్న కాఫీ తాగుతూ చెప్పుకున్న ముచట్లు మూగ బారి పోవచ్చు .ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్నో సార్లు సెల్ లో ఆమెని నవ్విస్తూ ఆనంద పరిచిన మధుర క్షణాలు మౌనం గా మారి పోవచ్చు . వొక తెలీని నిశబ్దం మనసంతా ఆవరించి భోరున మౌనం గా రోదిన్చొచ్చు .మనసుని రంజింప చేసిన ఆమె గొంతు జ్ఞాపకాలలో మిగిలి పోవచ్చు .ఈ బాధని కొన్నాళ్ళకి అధిక మించి అతను మళ్ళి జన జీవన స్రవంతి లో కలిసి పోవచ్చు .
ఆమె మాత్రం పీడా విరగాడయ్యిన్దనుకుని మరింతగా తన పాత , కొత్త మిత్రులతో వ్యవహారాలూ కోన సాగిన్చొచ్చు .రెండేళ్ళ తర్వాత నాలో కూడా ఈ కోరికల ఉదృతి తగ్గి పోతుంది గా అని చెప్పే ఆమె ఈ రెండేళ్ళు మరింత విజ్రుభించొచ్చు . కాని ఆ ఉదృతి తగ్గి పోయిన తరవాత అయినా మనసు పొరల లో సమాధి చేసేసిన అతని జ్ఞాపకాలు బయటకు వచ్చి నప్పుడు ఆమె అనుకుంటుంది ''అతన్ని కోల్పోయానని ''.
6 కామెంట్‌లు:
మీ బిందె మీరు ముంచుకుని ఇవతలకి రాక, ఎవరెవరు ఎన్ని బిందెలు ముంచుతున్నారో లెక్క పెడుతూ మనసు పాడు చేసుకోవటం అవసరమా రవిగారు?అది జీవనది అని తెలిసీ మీరుతప్ప ఎవరూ ఏవీ ముంచకుండా ఉండాలని ఆశించడం మీ పొరపాటేమో?
ఆమెకి అతను గుర్తుంటాడంటారా? ఒకవేల అతను వాడిన/తనను ధూషించిన పదజాలం మాత్రం గుర్తుకు పెట్టుకోవచ్చు కూడా..ఎమైతేనేంటి ఎదో రకంగా అతను గుర్తుకు రావొచ్చంటారా?అలోచించండి!అయితే కథ కంచికి మనం ఇంటికి ఆ ఇక?
అజ్ఞాత నది నాది అనుకోవడం వొక వ్యాధి
నది నాదికూడా అనుకోవడం పరమావధి .
వెన్నెల గారు మీరన్నది నిజమే
పదజాలం ఆమెలో జ్వాలని రేపి
యిన్నాళ్ళ ప్రేమని మరిచి పోయేలా చేసి ఉండొచ్చు
అతనే ఆమెని కోల్పోయాడెమో ?
నిదురించే అతని తోటలోకి
వొక పాటలా వచ్చి , కమ్మని కలని
మిగిల్చి ఆమె వెళ్లి పోయిందేమో ?
ఏదైనా పోగొట్టు కునప్పుడే గా విలువ తెలిసేది .
యిక కధ కంచికో లేక వాళ్ళ ఇంటికో కాలమే తెలపాలి .
నది ఒడ్డున అలా వ్యాహ్యాళి కి వెళ్లి సేదదీరినట్లు అనుకుని..సర్ది చెప్పుకోవాలి. దాహార్తి తీరనందుకు విచారం వద్దు. పోనీలెండి.. చెడు జ్ఞాపకాలు ఎందుకు..!? చేదు జీర్ణం చేసుకుని..నడక మొదలెడితే సరి. అతనికి ఒక పీడా పోయింది. గుడ్ లక్!
ఆమె అతన్ని కోల్పోయింది
పీడా విరగడయ్యింది అందామనుకున్నా ! ఆఖరు కొచ్చేసరికి మీరే రాసేసారు , పీడా విరగడయ్యిందని. సో ఏమి కామెంట మంటారు ?
చీర్స్
జిలేబి.
వనజ గారు . అతని దాహం తీరనిది
ఆమె హృదయం కరిగే నిధి
ఈసారి నడక తద బడ నివ్వడు అతను
జిలేబి తింటూ హమయ్య వాడి
పీడ విరగడయ్యింది అనుకుంటుందేమో ఆమె ?
మీ రిరువురికి ధన్య వాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి