6 ఏప్రి, 2012

ఆశించకుండా ఆస్వాదిద్దాం

 

నిన్నటి వరకు  నీతో నడిచిన నా అడుగులు
నేటి తో ఎందుకు మీ యింటిముందు కు  రానని మోరా యిస్తున్నాయి ?
మనసు ముందుకువెళ్ళమంటున్నా  సహకరించాకున్నాయి?
ఎన్నాళ్ళిలా అభిప్రాయ బేధం ?
పిదప ఆమోదం
ఈ మోదం ఖేదం మద్య మన ప్రయాణం ?
మనసుకి గాయం చేసి రెండురోజులు దూరం చేసి
మళ్ళి లేపనం పూసి , మసిపూసి మారేడుకాయ చేసి
లాలించి , మనసుకి మత్తు ని నింపి ,
ప్రేమను పంపి  ,మరిచిపోయిన మమతల్ని తట్టి లేపి
నన్ను నీ ఆట బొమ్మను చేసి ఆడుకుంటావు
కొత్త బొమ్మ రాగానే మళ్లీ మూల  పడేస్తావు
మమతులుడిగిన మనసులాగ
కొమ్మలు విరిగిన మానులాగ
మళ్ళి చిగురులు మోలిచేదాకా ఎన్నాళ్ళి నిరీక్షన ?
ఎన్నాళిలా  మనసు తీగలు సవరిస్తావు ?
మళ్ళి మళ్ళి మురిపిస్తావు
అంతలోనే అశ్రుధారలు కురిపిస్తావు
వద్దు నేస్తం యింతటితో ముగిద్దాం
మనస్పర్ధలకి చరమాంకం పలికిద్దాం
కొత్త భంధాన్ని మొదలెడదాం
ఏమీ ఆశించకుండా ఆస్వాదిద్దాం

7 వ్యాఖ్యలు:

జలతారువెన్నెల చెప్పారు...

మీ కవితకు ఈ పొడిగింపు ఎలా ఉంటుందంటారు?

ఆ ఒక్క మాటతో..
గుండె గదిలో కాలసర్పాలను వదిలి వెళ్ళావు
జీవన వనిలో పెను తుఫాను సౄష్ట్టించావు
అనురాగపు గులాబీని ద్వేషాగ్నులలో మాడ్చావు
చివరకు..
నా ప్రేమలో నిజాయితీని సంకించావు.
మాట జారితే వెనక్కి తీసుకోలేమని తెలిసి కూడా..
అవును ఇంతటితో చరమాంకం పలుకుదాం
పరిచయాలు, స్నేహాలు, జ్ఞాపకాలు, తీపి గురుతులు
కాలం బ్రతుకు పుస్తకం లో చేసె సంతకాలే కదా?

రవిగారు చెప్పారు...

స్వీయ అనుభవం లో విరహ వేదన అనుభవించిన
వారి కలం లోంచి మాత్రమె జాలు వారే జలతారు వెన్నెల యిది
మీ డైరీ లో వొక పేజి గా మిగిలిపోయినా చాలు అన్న మది
కాలాల ఎనకాల నా ఎంకి గా మిగిలిపోమన్నది
నా మొదలు కంటే మీ ముగింపే బావుంది వెన్నెల గారు

జలతారువెన్నెల చెప్పారు...

:))

'Padmarpita' చెప్పారు...

మళ్ళీ మొదలెట్టండి.....:-)
Wish You Good Luck:-)

అజ్ఞాత చెప్పారు...

ఆశించకపోవడం తనవంతు
ఆస్వాదించడం మీవంతు
అంతేనా రవిగారు?

oddula ravisekhar చెప్పారు...

ప్రతి ప్రేమ కథ పెళ్ళికి దారితీస్తుందని అనుకోలేము.నిజం గా ప్రేమిస్తే ఆ ప్రేమ జీవితం లోకి రాకున్న ఆ ప్రేమ ద్వేషాన్ని ప్రదర్శించదు కదా!మీ ముగింపు సరియినదే !

అజ్ఞాత చెప్పారు...

కవి గానో , రవి గానో, భావకుడిగానో, ప్రెమికుడిగానో , లేక రవి గారి లానో మాకు అప్పుడప్పుడు అలా తల్లుక్కుమంటూ , ఇలా అజ్ఞాతవాసం లోకి వెళ్ళిపోవడం భావ్యమేనా??