తనని నేను మారమన్న మాట వాస్తవమే కాని ఆ మార్పు నాలో యింత అలజడి రేపుతుందని నేననుకోలేదు .యిదివరకు రోజుల్లో యిద్దరమే వున్నప్పుడు కొంత సాన్నిహిత్యం గా కూర్చుని ముచ్చటించుకునే వాళ్ళం .వోకోసారి ఆ సానిహిత్యం హద్దులు దాటినా సందర్భాలు లేక పోలేదు .ఎప్పుడైనా వాళ్ళింటికి అతిధులు వచ్చినప్పుడు కూడా ఆమె అదే సాన్నిహిత్యం తో మాట్లడుతోందా అనిపించేది .ఈ విషయం లో యిద్దరం చాలా సార్లు గొడవ బడిన సందర్భాలు లేక పోలేదు . నువ్వు అందర్నీ సమ ద్రుష్టి తోనే చూస్తావ్. నీ ప్రేమ అందరిదీను .నేను కూడా అందులో వొకన్ని .నా అమృతాన్ని నే తీసుకుని ఊరుకోవాలి తప్ప దాన్ని యితర్లుకు కూడా పంచె మోహిని చెయ్యి మాత్రం పట్టుకుని ఆపితే మనసులో క్షీర సాగర మధనమే
.అంటే నువ్వు చూసే ద్రుష్టి లోనే లోపం నీకు అవకాశం యిచ్చానని అందరికి యిస్తాననుకోవడం నీ బ్రమ ఆమె సమాధానం .యిల తరచుగా గొడవలు అవుతూ యిద్దరికీ మానసిక ప్రశాంత త కరువు అవడం తో నేనే తనకి సలహా యిచా .యింక అందరితోను హద్దులో వుండే మాట్లాడు ముందుకెళ్ళే అవకాశం యివ్వకు , నిజంగా ప్రేమించిన వాడు ఉంటాడు మోహించినవాడు వాడు పక్కకి పోతాడని .
గత పది రోజులు గా తను దాన్ని గట్టి గానే అమలు పరుస్తోంది .నాకే మింగుడు పడటం లేదు .యిది నా వరకే పరిమితమా ?అందరికినా ?ఉక్రోషం పట్టలేక అడిగేస్తే తను కూడా తగ్గ కుండా కడిగేస్తోన్డి .
అసలు నీ దంతామోహం దానికి ప్రేమ ముసుగుతో ముందుకెళ్ళే ప్రయత్నమే అది దొరకదు అని తేలీ గానే నీలో ఈ ఉక్రోషం తన సమాధానం .
వోహో అలాగా రేపు నీ పాత అతిధులు వచ్చినప్పుడు కూడా కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి తీసుకోమంటవో ,చేతికి అందిస్తూ వేళ్ళు తగిలిస్తావో చూసి అప్పుడు డిసైడ్ చేస్తా నువ్వు మారావో లేదో .
అంటే నువ్వు మారమన్నది వేరే వాళ్ళ దగ్గర కాని నీ దగ్గర కాదన్న మాట ,యిన్నాళ్ళు కళ్ళుమూసుకుని యిప్పుడే కళ్ళు తెరచుకున్నా . మా ఆయన పెట్టిన తిండి తింటూ ఆయనిచ్చిన బట్టలు కట్టుకుంటూ వేరే వాళ్ళకి ఆనందం యివ్వడం ఏమిటి ?అయినా పోరా నేను నీకు సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదు యిష్టమైతే వచ్చి రెండు మాటలు మాట్లాడి వొక కప్పు కాఫీ తగి పో అంతకన్నా మనిద్దరి మద్య ఏమి వుండదు .
మనిద్దరి మద్య వుండదు అంటే వేరే వాళ్లతో ఉంటుందనా ?ఈ మద్య నేను మొహం మొత్తి ఈ వంకన వదిలించు కుందా మనుకుంటున్న వా ?వేరే వాళ్లతో నీ సాన్నిహిత్యం కంటిన్యూ చేస్తే ?
అవునురా కంటిన్యూ చేస్తాను నా యిష్టం నేను నీ లెక్కలో పెద్ద లం ని భోరున ఏడుస్తూ బెడ్ రూం తలుపు తీసుకుని బాల్కనీ పిట్ట గోడ మీద నుంచి రెండు కాళ్ళుఎత్తి దూక బోయింది . వొక్క ఉదుటున వెళ్లి బలం గా రెండు జబ్బలు పట్టుకుని వెనక్కి లాగి ఆమె రెండు కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు నా కోసం క్షనికావేసం లో నీ జీవితం అర్దాంతరం గా ముగించకు . నీ వెనక నీ తల్లిదండ్రులు , భర్త , పిల్లలు వున్నారు .లోపం నాలోనే వుంది అబద్రత భావం తో నిరంతరం నిన్ను మాటలతో వేధించాను .నాది ప్రేమో ?మోహమో నాకే తెలీటం లేదు . అయినా వొక తాగుబోతుని కూడా మందు మాన్పించడానికి డోసు మెల్ల మెల్ల గా తగ్గిస్తారు అటు వంటిది యిన్నాళ్ళ సాన్నిహిత్యాన్ని వొక్క సారి దూరం చేసి పరాయి వాడిలాట్రీట్ చేస్తుంటే ఆ తిరస్కర భావాన్ని తట్టుకోలేక పోతున్నా .నా ప్రేమని అర్ధం చేసుకో .
లేదు నీది హండ్రడ్ పెర్సెంట్ లస్టు నీకు అది దక్కినంతకాలం ప్రశాంతం గా మాట్లాడతావు , దక్కక పోయినా వేరే వాళ్ళకి దక్కుతోందన్న నీలో ఆవేశం కట్టలు తెంచుకుని పశువులా బిహావ్ చేస్తావ్ ., వొక్క క్షణం కింద నాలో విచక్షణ కోల్పోయి దూక బోయా . వొక వేళ కింద పడి వుంటే నాతొ బాటు నీ జీవితం కూడా కకా వికలం అయి వుండేది .(అంటే ఆ సమయం లో మేమిద్దరమే వుండడం తో ఆమె చావుకి నేనే కారణం అని అందరికి తెలుస్తుందని తద్వారా నేను హత్య నేరం కింద అర్రెస్ట్ అవుతానని తన భావం అయ్యిండొచ్చు )వద్దు యింక చాలు ఎప్పటికైనా ఈ రిలేషన్స్ ముగింపు ఇలానే వుంటుంది .లేదు కాదు నాది ప్రేమే అని నువ్వు యింకా ముసుగు వేసుకుంటే ఆ ముసుగు తోనే వచ్చి ముట్టుకోకుండా ముచ్చటించి వెళ్ళిపో అలా వొక సంవత్సరం ఉండ గలిగితే అప్పుడు నమ్ముతా నీది ప్రేమ అని .
నా మెదడు మొద్దుబారి పోయింది వొక్క క్షణం క్రితం నేను ఆలస్యం చేసి వుంటే ఆమె ఈ పాటికి ? ఆమె యింకా ఏంటో మాట్లాడుతోంది . నా చెవులకి ఏమి వినబడటం లేదు . కాళ్ళు గుమ్మం వైపు లాక్కేలుతుంటే తలుపు తీసుకుని కిందకి వచ్హా . కింద సంత లో జనం వింత గా చూస్తునట్టు అనిపించింది . ఆమె దూక బోవడం నేను వెనక్కి లాగడం ఎవరన్న చుసారేమో తెలిదు .ఆమె మాటలు నాలో ఆలోచనల్ని రేకెత్తించాయి . నాది నిజం గా ప్రేమేనా ? ఏ మనిషి మీదన్నా ఊరికే ఎందుకు ప్రేమ కలుగుతుంది . ఏదో అవసరాలు యిద్దరికీ తీర బట్టే ఏ భంధమన్నా నిలబడుతుందేమో ? ఏ అవసరాలు తీరవు అని తేలినప్పుడు కూడా యివే ఊసులు బాసలు కోన సాగుతాయా ?
యిన్నాళ్ళు నన్ను నేనే మోసం చేసుకున్నానాది ప్రేమ అని భావించుకుని ?నేను ఆమె కోరిన విధం గా ఏమి ఆశించకుండా మాట్లాడేసి రాలేనా ?ఏకాంతపు అవకాశాలని వికారపు క్షణాల్లా మార్చకుండా వుండలేనా ?నాలో వికారపు భావాలకి ప్రేమ పేరు తొడిగి పబ్బం గడుపు కున్ననా ?లేకమోహ భావం నుంచి అది తీరాక ప్రేమ భావం మొగ్గలు తొడిగి ఆ వ్యక్తీ మీద యిష్టం పెరుగుతుందా ?ప్రపంచం లో భార్యాభర్తల్ని కూడా కట్టి పడేసే శక్తి మోహాని దేనా ?అది తీరాక ఆ కృతజ్ఞతా భావమే ప్రేమ గా రూపాంతరం చెంది వాళ్ళని పట్టి వుంచుతోందా ?ప్రేమ నుంచి మోహం పుడుతుందా ? లేక మోహం నుంచి ప్రేమ పుడుతుందా ?
ఏమో అది తెలియాలంటే ఆమె పెట్టిన పరీక్షలో నేను నెగ్గి తీరాలి .మరోచరిత్ర సినిమాలో ప్రేమికులు వొక సంవత్సరం పాటు మాట్లాడుకోకుండా , చూసుకోకుండా ఉండాలనే నిభందన పెట్టుకుంటే మేము వొక సంవత్సరం పాటు సాన్నిహిత్యం లోకూడా వికారపు భావాల్ని దరి చేరనీయకుండా ముట్టుకోకుండా ముచ్చటిన్చుకోవాలనే నిభందన పెట్టుకున్నాం .అప్పుడు కాలమే సమాధానం చెబుతుంది ప్రేమకి దేనితోను లింక్ లేదని .మరి అతిధులు వస్తే ?నా మనసులో ఈ వేదవ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెడుతూ వడి వడి గా యింటి వైపు అడుగులు వేసా రేపటి శుభోదయానికి ఎదురు చూస్తూ .తను నా లైఫ్ లోకి రాకముందు నాకో జీవితం వుంది , , నిష్క్రమించినా కూడా నా కో జీవితం వుంటుంది కాని అందులో జీవం వుంటుందో లేదో చెప్పలేను .నన్ను తను ఈ వంకతో వదిలించు కుందా మను కుంటో న్దో లేక నిజం గానే మారి మల్లెపువ్వులా స్వచం గా వున్డాలను కుంటో న్దో కాలమే తెలియ చెప్పాలి .