15 సెప్టెం, 2012

లైఫ్ ఈజ్ సగం బ్యూటిఫుల్


ఈ రోజు అనుకోకుండా  సినిమాక్స్  లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రత్యేకమైన షో కి వెళ్ళడం జరిగింది .ఏడు గంటల షో అయినా గాని బర్ఫీ హిందీ సినిమా అయ్యేదాకా వొక అరగంట వేచి ఉండాల్సి వచ్చింది . అక్కడేశేఖర్  కమ్ముల కనిపిస్తే గుడ్ లక్ చెబుతూ ఎలా వుంది టాక్ అని అడిగానో లేదో అప్పుడే కరెంట్ పోయింది .ఆ చీకటి లోనే పాపం శేఖర్ కమ్ముల నాట్ బాడ్ అన్నాడు .గొంతులో ఉత్సాహం ఎక్కువ విశ్వాసం తక్కువ కని పించాయి .యింతలో బర్ఫీ సినిమా అవడం తోటే అనుష్క , తాప్సి ,మంచు లక్ష్మి , సానియా మిర్జా  తదితరులు బయటకు వస్తు కని పించారు .

యింక ఈ సినిమా కి వస్తే మొదటి సగం చూడగానే బాబోయి ఈ శేఖర్ కి హ్యాపీ డేస్ ఇన్ఫ్లుయెన్స్ పోలేదని పిస్తుంది .చాలా సీన్లు తిన్నగా అందులోంచి తెచ్చినవే . క్రికెట్  ఆడే సీన్ ,ఆంటీ (అంజలా జవేరి )వెనక టైసన్ పాత్ర లాంటి కుర్రాడు వెంట బడడం  యిలా చాల వున్నాయి . మొదటి సగం గోల్డ్ ఫేజ్  లో వుండే రిచ్ పిల్లలకి బి   బ్లాక్ లో వుండే  మధ్య తరగతి కుర్రాలకి మద్య జరిగే కొట్లాటలే .మిగతా సగం మాతృదేవోభవ తల్లి సెంటి మెంట్ తో సాగే కదా .
అమల తన ముగ్గురు పిల్లలని  హైదరాబాద్ లో వుండే మావయ్య యింటికి పంపిస్తుంది చదువుకుని బాగు పడమని .హీరో కొట్లాటలలో పడితే అతని చెల్లెలు ప్రేమలో పడి గమ్యం పక్కకి వెళుతున్న సందర్భం లో తల్లి కి కాన్సెర్ అని తెలిసి మళ్ళి వాళ్ళ గమ్యం వైపు వెళ్లి సాధించడమే టూకి గా కదా . సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ బాగా దట్టించి కొన్ని సీన్స్ లో ప్రేక్షకుల కళ్ళు చమర్పించ జెయ్యడం లో శేఖర్ విజయం సాధించాడని చెప్పవచ్చు .కాని మొదటి సగం భరించి మళ్ళి లోపలకి వచ్చినప్పుడే కళ్ళు చేమర్చేది .లేకపోతె ప్రచారం లో చేబుతునట్టు గా యిది శేకర్ కి మన సినిమాగానే మిగిలి పోతుంది .కొత్త వాళ్ళలో నాగరాజ్ పాత్రధారి కి మంచి గుర్తింపు వస్తుంది . తెలంగాణా పోరాడు ఆంధ్ర పోరి లవ్ స్టొరీ బానే వుంది .
ఏంది ఈ అండి ముచ్చట మనదంతా తెలంగాణా నీ యమ్మ ఏందే, నీ అయ్యా అంటూ దిల్ ఖులాయించి మాట్లడుడే అంటే ఆమె
కొన్ని రోజులకి నిన్ను పెళ్ళిచేసుకుంటా అని అతను చెప్పగానే వద్దండి నాకు అటువంటి ఉద్దేశం లేదండి , మీరు నువ్వు అనమన్నారని అన్నా గాని ప్రేమ ఎక్కువయ్యి కాదండి అంటే ఏంది నేను తెలంగాణా అని సోచయిస్తున్నవా వంటి డైలాగులు వున్నాయి .
 
రచయిత మనసులో కొన్ని పాత్రలు ఎప్పటికి సజీవం గా వుండి పోయి ఏ కధ రాస్తున్నా మళ్ళి అవే అవే వస్తుంటాయి నా కధలలో సుధా లాగ పాపం కమ్ముల మీద హ్యాపీ డేస్ పాత్రలు కుమ్ముకున్నాయి.రెండేళ్ళు కష్ట పడి తీసినా యిష్ట పడి చూసే జనం కష్టమే .నష్టం నుంచి బయట పడాలంటే మొదటి సగం నిడివి కత్తిరించి , సెకండ్ హాఫ్ సెంటిమెంటు మీద ఆశ పెట్టుకోవడమే .

కామెంట్‌లు లేవు: